8, నవంబర్ 2018, గురువారం

మామ తన ముగ్గురు అల్లుళ్ళు

ఒక మామ తన ముగ్గురు అల్లుళ్లను బాగా కట్నకానుకలిచ్చి ప్రయోజకుల్ని చేశాడు.

 ఒకరోజు వారిని పిలిచి 'నేను చనిపోయినపుడు మీరు ముగ్గురూ తలొక లక్షరూపాయలు నా శవ పేటికలో పెట్టండి' అని కోరితే వారు అంగీకరించారు.

 కొన్నాళ్ళకు మామ చనిపోయాడు.

డాక్టర్ గా ఎంతో గొప్పవాడైన పెద్దల్లుడు మామ కోరిక మేరకు 500 నోట్లు 200 తెచ్చి శవపేటికలో పెట్టాడు.

 ఇంజనీర్ గా పైకొచ్చిన రెండవ అల్లుడు 2000 నోట్లు 50 తెచ్చి మామ శవపేటికలో పెట్టాడు.

 మూడవవాడు లాయర్ గా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతడొచ్చి  తాను రాసిన మూడులక్షల రూపాయల చెక్కును శవపేటికలో పెట్టి , అందులోని రెండులక్షల నగదు తీసేసుకున్నాడు.

🤣😃🤣😃🤣😃🤣😃

13 కామెంట్‌లు:

  1. పరిప్రశ్న - బ్రహ్మర్షి పత్రిజీ��
    ----------------------------------------------------------
    ��ప్రశ్న : “టెన్షన్ అన్నది లేకుండా ఎప్పుడూ శాంతంగా ఎలా వుండవచ్చు?”

    ��పత్రీజీ : ‘టెన్షన్’ అన్నది మీకే కాదు...అందరికీ వుంటుంది!

    మహాభారతయుద్ధం చేయడానికి అస్త్రశస్త్రాలతో బయలుదేరిన అర్జునుడికి కూడా తీరా యుద్ధరంగం మధ్యలోకి రాగానే “టెన్షన్” మొదలైంది! “శత్రుసైన్యంలో వున్న ఆ ద్రోణాచార్యుడిని ఎలా చంపాలి?”, “కురువృద్ధులైన భీష్మపితామహులను ఎలా మట్టుపెట్టాలి?”.. “అసలు ఇప్పుడు యుద్ధం చెయ్యడం అవసరమేనా? అంటూ అనేకానేక ఉద్రేకాలకు గురిఅయిన అర్జునుడి పరిస్థితికి జాలిపడిన శ్రీకృష్ణుడు” అర్జునా! నువ్వు ముందు యోగివి కా!” అని చెప్పాడు.

    మహావీరుడు మరి ఎన్నెన్నో ఆయుధాలను చేతిలో కలిగివుండికూడా అర్జునుడు టెన్షన్ పడ్డాడేకానీ...చేతిలో ఏ ఆయుధం లేకుండా యుద్ధరంగంలో రధాన్ని తోలుతూ కూర్చున్న శ్రీకృష్ణుడు మాత్రం ఏ టెన్షన్ లేకుండా కులాసాగా కూర్చున్నాడు! కారణం అతడు చిన్నతనం నుంచే ధ్యానసాధనలో తన జీవితాన్ని పండించుకున్న గొప్ప యోగీశ్వరుడు!

    ధ్యానవిద్యలో నిష్ణాతులు అయినవారికి శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడూ టెన్షన్ అన్నది ఉండదు.
    ��☘��☘��☘��☘��☘

    రిప్లయితొలగించండి
  2. [2:47 pm, 29/09/2019] +91 99125 13295: "కృష్ణుడంటే ready to meditate.అర్జునుడు అంటే రెడీ టు యాక్షన్ రెడీ టు ఫై ట్ కృష్ణుడు అంటే over self అర్జునుడు అంటే అండర్ సెల్ఫ్ ధ్యానులు రెండింటికీ రెడీగా ఉండాలి. ధ్యానం నేర్పి చెడు మీద యుద్ధం మనసులో చేసి ,మంచి గా మారటం పాసిటివ్ గా అన్నిట్లో ఉండటం ధ్యానం నేర్పిస్తుంది.
    [2:47 pm, 29/09/2019] +91 99125 13295: " ప్రాణాలు విడిచి పెట్టె సమయం వచ్చినా ,జ్ఞానాన్ని విడిచి పెట్ట రాదు.జ్ఞానాన్ని దుర్విని యోగం చేసే వారు బ్రహ్మరాక్షసులుగా పుట్టుతా రూ."
    [3:01 pm, 29/09/2019] +91 99125 13295: "జ్ఞానాన్ని బుద్ధుడు అవడం కోసం ఉపయోగించాలి "
    [3:01 pm, 29/09/2019] +91 99125 13295: "మనం చూసే చూపును బట్టి వుంటుందిమానం ఆలోచించే తీరును బట్టి ఆనందం ఉంటుంది
    పనికి వెళ్లినా , స్కూల్ కు వెళ్లినా ,ఆఫీస్ కు వెల్లినాధ్యానం చేసి వెళ్ళాలి.ఇంటికి వచ్చేటప్పుడు ధ్యానము చేసి ఇంటికి రావాలి".
    [3:05 pm, 29/09/2019] +91 99125 13295: "మన స్వంత 'ఆత్మ 'తో కలిసి ఉండాలి
    పరమ రహస్యాలతో కలిసి ఉండాలి.ఆత్మజ్ఞాన పరాయణులతో కలిసి ఉండాలి
    పిరమిడ్ శక్తి తో కలిసి ఉండాలి."

    రిప్లయితొలగించండి
  3. క్షణకాలం పాటు లభించే సంభోగ అనుభవం కొరకు ఎంతో శక్తిని వ్రుథా చేసుకునే దానికన్న అదే అనుభవాన్ని కోరుకున్నంత సేపు ఏమాత్రం శక్తి వ్యయం కాకుండా ధ్యానం వల్ల పొందవచ్చును అంటారు ఓషో.

    సెక్స్ ప్రకృతి ప్రసాదించిన సహజమార్గం. ఇది మనుషులతో పాటు పశుపక్ష్యాదులకు వృక్షజాలంకి కూడా అందుబాటులో ఉంది. పశుపక్ష్యాదులకు తెరవబడిన ద్వారాన్నే మానవుడు కూడా ఉపయోగించుకునే పక్షంలో మనిషి పశువు కన్నా హీనుడు.

    మతాలు విష ప్రయోగంతో సెక్స్ ను చంపాలని చూస్తే విషపూరితమైన సెక్స్ మరింత బలపడి మనిషిని పీడిస్తుంది. కాముకత్వం నుండి జీవితానికి విముక్తి కలిగించాలంటే సెక్స్ ద్వారం తెరవబడక ముందే ధ్యాన ద్వారం తప్పనిసరిగా తెరవ బడాలి. పిన్న వయసులోనే నిర్బంధంగా ధ్యాన భోథ జరగాలి. చిన్న పిల్లలకు ధ్యాన దీక్షకు బదులు సెక్స్ వ్యతిరేక బోధలు చేస్తున్నామంటే మనం ఎంతో మూర్ఖులన్నమాట.

    సంభోగం ఇరువురు వ్యక్తుల సంగమం. సమాధి ఒక వ్యక్తి అనంతాల సంగమం. క్షణకాలపు సంభోగంలో ఇంతటి ఆనందం లభిస్తే ధ్యానం వల్ల లభించే బ్రహ్మానందాన్ని తెలియ చెప్పటం మాటలకు అసాధ్యం. సమాధి లభ్యమైనప్పుడు సంభోగంతో పని ఏమిటి. అనంత తత్వము లభిస్తే క్షణికత్వాన్ని ఎవరూ కోరుకోరు.

    ప్రస్తుతం భూమ్మీద నన్ను మించిన సెక్స్ శత్రువు ఎవరు ఉండరు అంటారు ఓషో. కానీ చిత్రమేమిటంటే ఓషో అనగానే సెక్స్ గురువా అన్న ముద్ర ప్రపంచవ్యాప్తంగా పడింది.

    ధ్యాన పరంగా చింతన చేస్తే సెక్స్ ను అధిగమించి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకుపోతాయి అంటాడు ఓషో. ఇది ఎలాగో ఆయన మాటలలో వినండి.

    రిప్లయితొలగించండి
  4. "మన.శక్తి "ని గురించి "తమ ఆధ్యాత్మిక గ్రంధం "తులసీ దళం "లో శ్రీ పత్రిజీ చాలా వివరంగా వివరించారు:"మన దగ్గర ఉన్న శక్తి అనంతం "అని తెలుసుకొని దానిని సదా ఉప యోగించుకోవాలి...అలా కరెక్ట్ గా దానిని ఉపయోగించుకుంటే ,మనం ఏది అనుకుంటే ,అది జరిగి తీరుతుంది.తీరాలి! మనసు కు క్రమశిక్షణ లేక పోతే మన జీవితాలను ,సంబంధాలను నాశనం చేస్తుంది.కాబట్టి ,మనసుకు క్రమశిక్షణ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా శిక్షణ నేర్పిస్తాం.మనసు క్రమశిక్షణతో ఉంటే ,అస్తవ్యస్తంగా రాతలు రాయరు మాట్లాడారు అత్యాశ పడరూ నా కులం నా వైశ్య కులం నాది నాది అనే దుర్బుద్ధి పోతుంది.ఇతరులను మెచ్చుకోవడం. అనే మంచి బుద్ధి వస్తుంది.కుల పిచ్చి ,కులగజ్జి వదిలి పోయి అందరిలో భగ వంతుడు వున్నాడు నేను భగ వంతుడినే అయినపుడు వాళ్ళు వేరు నేను వేరు కాదు ముందు మనిషిని మానవత్వంతో మెల గడం నేర్చుకుంటే చాలు అందరిని గౌరంగా చూడటం నేర్చుకుంటావు.పరిపూర్ణమైన బుద్ధి కలవారికి ప్రపంచం లో ఎదురు లేదు.ధ్యానం స్వధ్యాయం సజ్జన సాంగత్యం ,సేవ వల్ల మంచి బుద్ధి వస్తుంది చిత్తశు ద్ధి కలుగుతుంది .మన శక్తి బుద్ధి ని సరైన నిర్ణయాల్ని తీసుకునేలా .చేస్తుంది అహం పెంచే మాటలు చేతలు చెయ్యనివ్వదు.ధ్యానం చేస్తుంటే ,చేస్తుంటే మన శక్తి పొందగలము ధ్యానం ద్వారా దివ్య ప్రకాశం ,దివ్యజ్ఞానం ప్రకాశం ద్వారా క్షణక్షణ జాగ్రత్త స్థితి వస్తుంది.దివ్యజ్ఞానం ప్రకాశం అంటే మనం మాట్లాడే మాటలు పట్ల జాగ్రత్త వహించడం మాట బాణం కన్నా పదును అయినది.మంచిని ఆలోచిస్తాం.మంచిని ఇతరులకు మనకు చేస్తాం.కర్మసిద్ధాంతం కార్య కారణ సిద్ధాంతం ధ్యానం ద్వారా తెలుసుకుంటాం.మరణం తర్వాత కూడా జీవితం ఉంది కోరికలు అప్పులు వితీర్చుకోవడానికి మళ్ళా జన్మించాల్సి వస్తుంది అలాగే లెస్సన్స్ నేర్చుకోవడానికి పునర్జన్మలు ఉపయోగపడతాయని తెలుసుకుంటాముఎంతమందిలో వున్నా మనసు ఆత్మ స్థితి లో ఉండాలని ప్రాక్టికల్ గా తెలుసుకుంటాము ధ్యానికి శత్రువులైనా ఆరు దుర్మార్గ గుణాలు కోపం ,హింస , వ్యామోహం ,పినాసితనం ,పక్షపాతం వహించడం నా కులం వాళ్ళు పనికి మాలిన పనులు ఎన్ని చేసినా శిక్ష వేయకుండా ఉండటం అంతా నా వాళ్లే తినాలి వూరేగాలి "లాంటి పాపపు బుధులు పోతాయి.అవగాహన సక్తి పెరుగుతుంది.ధ్యానం ద్వారా నే ఇవన్నీ సాధ్యం మరే విధంగా సాధ్యతం కాదు దేవుళ్ళబొమ్మలు ,లలిత పారాయణలు ఉత్సవాల ఫోటోలు పెట్టినా లాభం ఉండదు.అంతా క్కటే అనే భావం పుష్కలంగా వస్తుంది బాగా mature అయిన వారు పూర్ణాత్మలు ...Over selves అంటే సహసృష్టికర్తలు contractors ga తయారు అయి కొత్త అంశాత్మలను కొత్త లోకాలను సృష్టించగల శక్తి వస్తుంది అంతగొప్ప మనసక్తి ధ్యానం ద్వారా వస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. " ఆధ్యాత్మిక శాంతి ని పొందడానికి మీ ఇంటిని ధ్యాన మందిరం గా మార్చుకొని ,శివుడిని ప్రాప్తించుకోవడానికి శ్రీ గురుదేవుడు అవసరం. అంతర్ శక్తి జాగృతం కానంత వరకు అంతర్ శక్తి ప్రకాశించనంతవరకు ...అంతరంగం లోని దివ్య జ్ఞాన నేత్రం తెరుచుకోనంతవరకు మన ' దేహదస "నాశనం కాదు దేహదస లో అజ్ఞానం గూడు కట్టుకొని ఉంటుంది 'నేను - నాది ''నా కులం నా వైశ్య కులం నా నాయుడు కులం నా వైశ్య కుల. నా కోమటి కులం గొప్పది నాకులం వారే వినయ విధేయత కలవారు.ఇలా భావాలు ఉంటాయి గురువులు వేదాలు గీత ఏ చెపుతుంది అంటే నేను నాది వదిలేసేయ్ .అజ్ఞానం లో కురుకుపోబోకు.ఎన్నీ జన్మలో తీసుకున్నావు.ఎన్ని కులాల్లో ఎన్ని దేశాల్లో ,ఎన్ని మతాల్లో ,ఎన్ని భాషల్లో పుట్టినావు.ఏది నీ కులం ?పూర్వ జన్మలో ఎవరవు నీవు ?వచ్చే జన్మలో ఎవరవు నీవు ?అహం ఎందుకు?కళ్ళుమూస్తే ఏ కులం నీది ?దేహాదస వున్నంతకాలం ఈ నీ కులం నీ సంతానం నీ వాళ్ళు మీద మమకారం పోదు మమకారం వ్యమిహం గా మారుతుంది.దేహం కులం కులం అని గోప్పలు చెప్పుకున్న నీ కులం ని వదిలి పేటగిన తర్వాత ఏది నీకులం?పైకి వెళ్లలేవు కింది కి వెళ్లలేవు మధ్యలో ప్రేతం లాగా ఉండాలి ధ్యానం చేయకుండా ఆత్మజ్ఞానం .పొందకుండా జ్ఞానం చదవకుండా ఆచరించకుండా కేవలం దేవుడి బొమ్మలు ,ఉత్సవాలు పెట్టితే తరించగలరా ?ధ్యానం నిరంతరం చేయాలి జ్ఞానము పొందగలిగే అన్ని కోణాల్లో నీవు నిష్ణాతుడవు కావాలి అపుడు నా కులం అనే అవణ్ణపు చీకటి మాటలు రావు.అవి ఉన్నంతవరకు దేవుడు నీ దగ్గరకు రాదు దివ్యనుభూతి కలుగదు.సత్యం అనుభూతికి రాదు.అంతరసక్తి వికాసానికి గాను కులం అనే పిచ్చి మాటలు ఆ ధోరణి పోవటానికి గాను ధ్యానం ధ్యానం ధ్యానం నిరంతరం నీ పనులు అయ్యాక నిరంతరం ధ్యానం చేస్తుంటే మాట మీద ధ్యాస వస్తుంది ఏది మాట్లాడాలి?ఏది మాట్లాడకూడదు తెలుస్తుంది. సంపూర్ణ సత్యాన్ని సత్యాన్ని తెలుసుకున్న శక్తి వంతమైన సద్గురువు7 ప్రవచనాలను అసలు చెవికి వేసుకుంటున్నారా ?వేసుకుంటే ఆచరణ లో పెడుతున్నారా ?కులాన్ని పట్టుకు వెళ్లాడలేరు కదా కులాలు మతాలు జు అతీతం ధ్యానమార్గం .గురువు మాట వినకుండా జ్ఞానం కలుగదు గురువు కొత్తజన్మను ఇస్తాడు బాబుల్లారా !ఇంకా దేముడు బొమ్మలతో పారాయణలతో కాలక్షేపం చేయటం పూర్తి అజ్ఞానం లలిత పారాయణలు నామ కోటి లు రాయటం అజ్ఞాన దేహ దశ లు వాటి లోంచి ధ్యాన మార్గం లోకి నిజాయితీగా రండి .సత్యం గురువు పూర్ణుడు గురువు "కులం గురువు కాదు మతం గురువు కాదు సత్యం అసలే కాదు బొమ్మల్లో ఉత్సవాలో లలిత పారాయణలతో ఏమికాదు ధాతనం చేస్తూ భేద భావాలకు తావు ఇవ్వకుండా జీవించమని సద్గురువు చేపలుతున్నారు

    రిప్లయితొలగించండి
  6. " ఆధ్యాత్మిక విజ్ఞాని చైనా దేశపు మహాజ్ఞాని చువాంగ్ చు ను గురించి తమ "తులసీదళం "ఆధ్యాత్మిక గ్రంధం లో విస్తారంగా వివరించారు:చైనా దేశపు అత్యుత్తమ ఋషి...మహోన్నత తత్వ వేత్త "చువాంగ్ ట్ జు "గౌతమ బుద్ధుని కాలం నాటి వాడు.ఆయన సమకాలికుడు.ఆయన చెప్పిన కొన్ని సూక్తులు :"జీవితం ఉంటే చావు ఉంటుంది చావు ఉంటే మరల జీవితం ఉంటుంది .అంటే,మరణించడము ఫుల్ స్టాప్ కాదు.కామా మాత్రమే !మరణించిన వారు మరల పుట్టక తప్పదు.అలాగే పుట్టిన వారు మరణించక తప్పదు. అలాగే ఈ సత్యం ధ్యానం చేసి ,ఆత్మజ్ఞానం పొందిన వారు మాత్రమే బుద్ధుళ్లు అయినవారి మాత్రమే "ఈ వున్నదంతా ఒకటే "అని తెలుసుకొంటారు 'ఉన్నదంతా అంటే ఆత్మ ఒకటే " ఆధ్యాత్మిక విజ్ఞాని ఉత్తమ పురుషుడు అంటే జ్ఞానము ,ప్రజ్ఞానం ,విజ్ఞానం.విజ్ఞాని ఆత్మ సత్యం ,నిత్యము ,శాశ్వతం అహం బ్రహ్మ అంటే నేను బ్రహ్మను నేను ఆ ఆత్మ స్వరూపుడను అందరిలో అన్నిట్లో ఆ బ్రహ్మ వున్నాడు అని తెలుసుకున్నవాడు.అనేక లోకాలు ఉన్నాయి అని తెలుసుకున్నవాడు ప్రపంచం లో వున్నా యి అని తెలుసుకున్నవాడు.జనన మరణ చక్రం గురించి మరిచి పోవాలి ,శుభము ,అశుభము గురించి శ్రద్ధ అనవసరం .ఆనంతతత్వం లో విశ్రాంతి పొందండి.ధ్యానం నిరంతరం చేసే వారికి ఆత్మజ్ఞనము పొందిన వారికి ఇది చేస్తే శుభము ఇది చేస్తే అశుభము ,ఇది మంచిది ఇది చెడ్డది.అనే భావాలు అనవసరం నేను బ్రహ్మను అందరూ బ్రహ్మ స్వరూపులు అని తెలుసుకున్నవారికి అంతా మంచే ప్రతి క్షణము మంచే జరుగుతుంది.మనిషికి నిజమైన జ్ఞానం దొరకాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి నిరంతర ధ్యానం తో త్రికరణ శుద్ధి కలుగుతుంది.ఆలోచించిందే మాట్లాడుతాము.మాట్లాడినదే చేస్తాము ఇవే త్రికరణలు అంటే .జ్ఞానులు శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుకొంటారు జ్ఞానికి శరీర నాశనం తప్ప ఆత్మ నాశనం లేదు అంటే మరణించినా ఆత్మ మరణించ దు అని అర్ధం చైనా దేశపు మహాజ్ఞానులు "లావోట్జూ ,చువాంగ్ చు "ల గ్రంధాలు చదివితే వారి ఆధ్యాత్మిక జ్ఞానం శాస్త్రీయంగా అర్ధం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  7. వైస్యులు అంటే అర్థం కుల మతాలకు అర్ధాలు పరమార్ధాలు పత్రిజీ ఎక్కడా చెప్పినట్లు లేదు.చిన్నపిల్లలకు దేవుని రాజ్యం లో చోటు ఉంది "అన్నారు ధ్యానం చేసే ప్రతి ఒక్కరు వినయంతో విధేయతతో వుంటారు అలా లేరు కులాలు మతాలు మాత్రమే కావాలి అంటే ధ్యానుల ఆత్మ జ్ఞానులు అవునా ?అని ఆలోచించాలి !ఏ కులాలు ,మతాలు ధనికులు ,పేదలు అని భేదభావం లేనిదే ఈ ధ్యాన ప్రపంచం .ఇక్కడ కూడా భేదాలు !?,ఇది ధ్యానుల గ్రూప్ అనుకుంటున్నాను ధ్యానం కు సంబంధించినవి రాస్తే ధ్యానం తెలియని వారికి ,తెలిసిన వారికి బాగుండు.

    రిప్లయితొలగించండి
  8. " మహాలయ అమావాస్య "
    ********

    అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది .

    🌻🌻🌻🌻🌻🌻 🌻
    ------------------------------------

    మీ గోత్రం ..

    మీ పేరు చెప్పుకొని...

    నా జన్మకు మూల కారణమైన నా తల్లి - దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కా
    రములు.అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు , ముత్తాతలకు అనంతకోటి ప్రణామ
    ములు .

    సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారము లు .

    ఎందరో యోగులు ,మహా
    త్ములు ,పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి ,
    నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు
    చున్నాను .మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవే
    శించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి . ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వ
    దించండి .

    నాలోనూ , నా కుటుంబ సభ్యులలందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి , క్షేమ , స్థైర్య , ధైర్య , విజయ ,అభయ , ఆయుః , ఆరోగ్య , ఐశ్వర్య ముల నొసగి , ధర్మార్ద , కామ , మోక్ష ముల నొసగి , అహం పదార్ద రహిత స్తితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చ
    గలరని కోరుతూ

    అష్ట వసువులు , ఏకాదశ రుద్రులు , ద్వాదశ ఆదిత్యులు ,త్రిమూర్తులు ,త్రిమాతలు ,అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు , సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నాయోక్క అనంత కోటి నమస్కారములు సమ
    ర్పించుచూ మనసా ,
    వాచా , కర్మణా , త్రికరణ శుద్ధిగా ,ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను .

    💐🕉
    సర్వం పరమాత్మ పాదార విందార్పణమస్తు..

    రిప్లయితొలగించండి
  9. కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
    వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
    ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
    చీకటి పడితే ఎలా?
    దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
    ( సిగ్నల్స్ లేవు ).
    ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
    అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
    ఏమి చేస్తాడు .?
    ఆందోళన !.
    అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
    టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
    గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
    ఆమె భయపడుతూనే ఉంది .
    " నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
    కారులో పెట్టాడు ..
    ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
    " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
    మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
    అదొక చిన్న హోటల్ .
    కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
    తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
    తేవడానికి వెళ్ళింది .
    తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
    ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
    సహాయపడు . " అని రాసి ఉంది..
    ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
    ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
    భగవంతుడే మనకు సహాయం చేశాడు .
    ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..

    మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!

    మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి..

    రిప్లయితొలగించండి
  10. నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??🕴🏻*_

    _**మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*_

    _*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*_

    _*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_

    _*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_

    _*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_

    _*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో 8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_

    _*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_

    _*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_

    _*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_

    _*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_

    _**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.*_

    _**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_

    _**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*_

    _**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_

    _**సర్వే జనా సుఖినోభవంతు.*_

    రిప్లయితొలగించండి
  11. 02-60-గీతా మకరందము.
    సాంఖ్యయోగము
    -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
    శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

    అ॥ ఆత్మదర్శనము కొఱకు ప్రయత్నము సలుపుచున్నను కొందఱికి అదియేల సిద్ధించుటలేదో కారణము తెలుపుచున్నారు-

    యతతో హ్యపి కౌన్తేయ
    పురుషస్య విపశ్చితః ।
    ఇన్ద్రియాణి ప్రమాథీని
    హరన్తి ప్రసభం మనః ॥

    తాత్పర్యము: ఓ అర్జునా! ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలననిన, ఆత్మావలోకనము కొఱకు యత్నించునట్టి విద్వాంసుడగు మనుజునియొక్క మనస్సునుగూడ నయ్యవి బలాత్కారముగ విషయములపైకి లాగుకొని పోవుచున్నవి.

    వ్యాఖ్య: ఇంద్రియము లెంత బలవత్తరములైనవో ఇచట నిరూపింపబడినది. 'విపశ్చితః' అని చెప్పుటవలన విద్వాంసుడైనవాని యొక్క మనస్సునుగూడ ఇంద్రియములు హరించివేయుచుండ ఇక సామాన్యుని మనస్సునుగూర్చి వేఱుగ చెప్పవలెనా? యని తెలిపినట్లైనది. అట్లే ఇంద్రియములను నిగ్రహింప యత్నించుచున్నవానిని గూడ అవి పడగొట్టుచుండ, అసలు యత్నమే చేయని అజ్ఞానుల నవి యెంతబాధించునో ఊహించు కొనవచ్చును. 'బలవానిన్ద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి' - ఇంద్రియసమూహము బలవత్తరమైనది. అది విద్వాంసునిగూడ 'ఊపివేయును' అని వ్యాసభగవానులు తెలిపియే యున్నారు. 'ప్రసభమ్' బలాత్కారముగ లాగి వేయునని చెప్పుటచే ఆ ఇంద్రియము లెంత శక్తివంతములో తెలిసికొనవచ్చును.

    ప్రతిజీవియందును ఆత్మానాత్మయుద్ధము, ధర్మాధర్మయుద్ధము కొంతపరిమితిలో జరుగుచునే యుండును. సాధకుడు దైవసంబంధబలమొకింత సేకరించుకొనుచుండ, అటు మాయయు, అవిద్యయు తన సైన్యమగు ఇంద్రియములను, విషయాదులను, వాసనలను సమాయత్తపఱచు కొనుచుండును. ఆ యుద్ధమందలి ఒకానొక సన్నివేశమే ఈ శ్లోకమున చిత్రింపబడినది. ముముక్షువునకు దైవీసంపత్తి యొక్క బలము విస్తారముగ నున్ననే ఈ సంగ్రామమున విజయము గాంచగల్గును. ఈ శ్లోకమున విద్వాంసుని మనస్సును ఇంద్రియములు బలాత్కారముగ లాగివేయుచున్నవని చెప్పినంతమాత్రముచే ఎవరును అధైర్యము పొందరాదు. తన సాధనసంపత్తిని (శమదమాదులను), ఇంకను పటుతరమొనర్చుకొని శత్రువును ఎదుర్కొనవలెను. అజాగ్రత పనికిరాదు. ఈ భావమునే రాబోవు శ్లోకమున భగవానుడు తెలుపనున్నారు.

    "విపశ్చితః" - పాండిత్యము కలవానినిగూడ ఇంద్రియములు వేధించుచున్నవని చెప్పినందువలన కేవలము శాస్త్రపరిజ్ఞానము మాత్రము చాలదనియు, అనుభవజ్ఞానము కూడ నుండవలెననియు స్ఫురించుచున్నది.

    ఇంతవరకు శత్రువుయొక్క బలమెట్టిదో సాధకునకు సరియైన అంచనా లేనందువలన ఒకింత మందప్రయత్నము చేయుచు వచ్చియుండవచ్చును. కాని ఇపుడు భగవానుడీ శ్లోకమున శత్రువుయొక్క బలిమియెట్టిదో విస్పష్టముగ ప్రకటించెను. గావున ఇకమీదట ముముక్షువు దానికి రెట్టింపుబలమును (దైవీసంపత్తిని) చేకూర్చుకొని ఆత్మానాత్మసంగ్రామమున విజయము జేపట్టవలయును.

    ప్ర: ఇంద్రియముల యొక్క శక్తి యెట్టిదో నిరూపింపుము?
    ఉ: అయ్యది మోక్షమార్గమున యత్నించుచున్న విద్వాంసుని మనస్సునుగూడ బలాత్కారముగ లాగి విషయములవైపునకు బడద్రోయుచున్నది.

    రిప్లయితొలగించండి
  12. "సత్సంగం -సజ్జన సాంగత్యం"గురించి పత్రిజీ "తులసీ దళం "ఆధ్యాత్మిక గ్రంధం లో విస్తారంగా ప్రస్తావించారు.గురువుగారి కి నమస్కారాలు తో... సత్ సంగం అంటే సత్యం తో కలయిక అంటే ధ్యానం ధ్యానం చేస్తే సత్యం తెలుసుకుంటాము.మన శరీరం లో 'ఆత్మ'ఉంది ఆత్మ నిత్యముఅయినది.సత్యం ,శాశ్వతం అయినది. ఆత్మ ను ధ్యానం లో డైరెక్ట్ గా కలుసుకుంటాం.ఆత్మ తో కలయిక జరుగుతుంది.ఆత్మ ను ఎలా కలుస్తాం?ధ్యానం లోనే ఆత్మ తో కనెక్ట్ అవుతాము నేరుగా ధ్యానం లో మాత్రమే ఆత్మ తో కలిసివుండటం జరుగుతుంది ఇదే సత్సంగము.ధ్యానం లో మనతో మనం కలిసి ఉంటాం.;ధ్యానం లో ఉండటమే సత్సంగం.అన్నమాట."సత్యం తెలుసుకున్న జనులను"'సజ్జనులు 'అంటారు."సజ్జన సాంగత్యం"అంటే సత్యం తెలుసుకున్న వారితో కలవడం ,ఆ చక్కని ధ్యానానుభవాల్ని వినడం అన్నమాట .ధ్యాన యోగుల ద్వారా ఆ అనుభవాలు ,ఆ సత్యాన్ని వినడం. అది శంకరా చార్యుల వారు "భజగోవిందం" లో "త్రిజగతి సజ్జన సంగతి రేకా భవతి ,భావార్నవ తరనే నౌకా"అన్నారు."మూడు లోకాల్లో కూడా ఏ లోకానికి వెళ్లినా ఆయా జ్ఞానులు ఆక్కడి మహాత్ములు,అక్కడి యోగులు ద్వారా జ్ఞానం మనం పొందాల్సిందే.!ఆ జ్ఞాన సాగరమే మనల్ని తరింప జేస్తుంది."సత్సంగం "అంటే "ధ్యానం"సజ్జన సాంగత్యం " అంటే , ఆత్మ జ్ఞానం తెలిసిన యోగులతో ,మహాత్ములతో కలవడం సజ్జన సాంగత్యం. అన్ని లోకాలలో మనం తరించాలంటే విస్తారంగా జ్ఞాన సాగరం లో విహరించాలి.మోక్ష ప్రాప్తి కావాలంటే జ్ఞాన ప్రాప్తి విస్తారంగా కావాలి అందుకు మార్గం "ధ్యానం"జ్ఞానుల తో స్నేహం జ్ఞానులతో సంగం

    రిప్లయితొలగించండి
  13. కథ చాలా బాగుందండి.
    // "మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు" // ... బాగా చెప్పారు.

    (Brian ను బ్రయాన్ అంటారు)

    రిప్లయితొలగించండి