8, నవంబర్ 2018, గురువారం

శ్రీ కృష్ణ ఉవాచ – ధ్యానయోగ ఉవాచ:

🕉“ *శ్రీ కృష్ణ ఉవాచ – ధ్యానయోగ ఉవాచ ”🕉*





🔺“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః”
(భగవద్గీత, 7-19)🔺

🕉“ఎన్నో జన్మల క్రమంలో ఒకానొక జ్ఞాని
‘ఆత్మయే సర్వస్వం’ అని గ్రహిస్తూ .. ‘నన్ను’ అంటే
‘ధ్యానయోగాన్ని’ పూర్ణంగా తెలుసుకుంటూ
నాకే దాసోహమంటూ ఉంటారు; అలాంటి మహాత్ములు మహా అరుదుగా ఉంటారు.”
*


🕉కనుక ఎన్నెన్నో జన్మలు .. మరి ప్రతి జన్మలోనూ ఎన్నెన్నో అనుభవాలు

🕉జన్మల పరంపర .. అంతులేని అనుభవాల పరంపర!

🕉ప్రతి అనుభవమూ సరిక్రొత్త జ్ఞానాన్ని ఇచ్చేదే!
ప్రతి అనుభవమూ సరిక్రొత్త అవగాహనను కలిగించేదే!
అయితే, తెలుసుకోవలసింది ఏమిటంటే

🕉జన్మ జన్మల అనుభవాలలో నిజానికి “మంచి”వి .. “చెడు”వి అన్నవి లేవు ..

🕉“శుభ అశుభ పరిత్యాగీ” అని భగవద్గీతలో వుంది కదా!
“Therefore, Everything is ‘OK’ and ‘Perfect'”
“All is Well”
“Everything happens for a valid Evolutaionary Reason”
“हर किसीको हमेशा अच्छे दिन ही मिल रहे है”
*
🕉ప్రతి అనుభవమూ .. మన మానవ జీవితాన్ని మనకు ఒకానొక ప్రత్యేక కోణంలో చూపిస్తుంది


🕉ఎన్ని రకాల అనుభవాలు సంపాదిస్తే .. అంతటి “సుసంపన్న ఆత్మ” అవుతుంది!
ఏ అనుభవానికీ భయపడనవసరం లేదు
ఏ అనుభవానికీ వెన్ను చూపించనవసరం లేదు


🕉మానానికీ ఆహ్వానం .. అవమానానికీ ఆహ్వానం

🕉తీపికీ ఆహ్వానం .. చేదుకీ ఆహ్వానం

🕉పుట్టుకకూ ఆహ్వానం .. మరణానికీ ఆహ్వానం

🕉కలిమికీ ఆహ్వానం .. లేమికీ ఆహ్వానం

🕉సామూహికతకూ ఆహ్వానం .. ఒంటరితనానికీ ఆహ్వానం

🕉విజయానికి ఆహ్వానం .. అపజయానికీ ఆహ్వానం

🕉అన్నింటికన్నా ముఖ్యం .. ధ్యాన అభ్యాసానికి ఆహ్వానం

🕉ఎందుకంటే పై వాటికి ఆహ్వానం పలుకగలగడం అన్నది కేవలం ఒకానొక ధ్యానవిద్యార్థికే సాధ్యం
*
🕉మానవ జీవితానికి కేవలం “మూడు వందల అరవై కోణాలు” కాదు ..
మరి “మూడు వేల ఆరు వందల కోణాలు” ఉంటాయి.
అయితే


🕉ఒకే జన్మలో అన్ని కోణాలనూ ఏ ఆత్మ కూడా స్పృశించలేదు
కొన్ని వందల జన్మలలో అయితేనే ఇన్ని వేల కోణాలను దగ్గరగా స్పృశించగలుగుతుంది
*
🕉మానవ జీవితచక్రంలో ప్రవేశించే ప్రతి ఆత్మ కూడా
మానవజీవితాన్ని .. అనేకానేక జన్మల భిన్న విభిన్న అనుభవాల ద్వారా
తనను తాను
“సమగ్రం” మరి “పరిపూర్ణం” చేసుకోవల్సి ఉంటుంది

🕉ఆ విధంగా ఒకానొక “సుసంపన్న పరిపూర్ణ ఆత్మ”గా మనం తయారయి తీరాలి
ఆ తదుపరి
“పరిపూర్ణ ఆత్మలు”.. తమ తమ ఆత్మలలో నుంచి క్రొత్త క్రొత్త విభాగాలను సృష్టిస్తాయి ..
అలా సృష్టించబడిన “నూతన శైశవ ఆత్మలను” కూడా
వాటి వాటి భౌతిక జన్మలలోకి ప్రవేశింపజేసి
వాటి ఎదుగుదలలనూ మరి బాగోగులనూ ఎంచక్కా చూసుకుంటూ ఉంటాయి ..
ఇదీ ఆత్మ యొక్క “వింత కథ” .. “అంతులేని వింత కథ”
*


🕉“ప్రతి ఆత్మకూ ప్రణామాలు” .. “ఆత్మ యొక్క ప్రతి జన్మకూ ప్రణామాలు”
“ప్రతి జన్మ యొక్క ప్రతి అనుభవానికీ ప్రణామాలు” ..
“ప్రతి అనుభవం యొక్క ప్రతి ప్రయోజనానికీ ప్రణామాలు”
“శ్రీ కృష్ణ ఉవాచ” అంటే “ధ్యానయోగ పరాకాష్ఠ యొక్క ఉవాచ”
ఈ విషయం అర్థం అయితే “గీతా సారం” అంతా అర్థం అయినట్లే
ఓ తత్ సత్!🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి