20, ఆగస్టు 2020, గురువారం

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి - అభ్యాసయోగం అంటే?
ఉన్నత విషయాలను ధ్యానించటానికి ప్రయత్నించినప్పుడు మనస్సు దానిపై ఏకాగ్రంగానిలవదు. అల్పవిషయాల వైపుకే పరుగులు తీస్తుంది. ఒక పండితుడు భగవద్గీతకు అంతరార్థాన్ని వ్రాస్తూ ఒక కథను ఇలా చెప్పాడు. - 
సృష్టికి ముందు నిరాకార నిర్గుణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకు మాయ అనే భార్య ఉన్నది. వారికొక కుమారుడు. అతడే మనస్సు. అయితే కుమారుడికి అంతా తల్లి పోలికే. తండ్రి అంటేనే దరి చేరడు. ఎప్పుడూ తల్లికొంగు పట్టుకొని తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మనస్సనే వాడికి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రవృత్తి, మరొకరు నివృత్తి. వీడికెప్పుడూ ప్రవృత్తి అంటేనే ఇష్టం. నివృత్తి అంటే అస్సలు గిట్టదు. ప్రాపంచిక వ్యామోహాలే ప్రవృత్తి. అవి పట్టక పరమాత్మపై అనురాగమే నివృత్తి. ప్రవృత్తి సంతానం అసురులు (ఆసురీగుణాలు). నివృత్తి సంతానం దేవతలు (దైవీగుణాలు) ఈ రెండూ శరీరమనే ఈ కురుక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంటాయి. 
  మనస్సుకెప్పుడూ ప్రవృత్తి యందే (ప్రాపంచిక విషయభోగాల యందే) పక్షపాతం. దానిని మెల్లమెల్లగా 'శనైః శనైః రుపరమేత్' అన్నట్లుగ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోవాలి తప్ప మరొక ఉపాయం లేదు. మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం అవుతుంది. ("మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః") కనుక తెలివిగా మనస్సును మచ్చిక చేసుకోవాలి. దానికే అభ్యాసయోగం. అనేక ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. తొందర పనికిరాదు. ఎలా?
  నీ ఇంట్లో దొంగగొడ్డు ఉన్నది. ఏమాత్రం ఏమారినా చాలు కట్లుతెంచుకొని పరుగెడుతుంది. ఇతరుల పొలాల్లో పడిమేస్తుంది. దానిని ఎలా దారికి తేవాలి? మూర్ఖులు దానిని కొడుతూ బలవంతంగా తెచ్చి, గొలుసులతో స్తంభానికి కట్టివేసి కసిదీరా కొడతారు. తప్పించుకొని పోవటానికి వీలులేక వెళ్ళకుండా ఉంటుందేగాని, వీలు కుదిరితే మళ్ళీ చిక్కకుండా పారిపోతుంది. ఎప్పుడో సమయం వస్తుంది. అప్పుడది తప్పించుకొని పోతుంది, దొంగగడ్డి మేస్తుంది. ఎప్పటికీ కనిపించకుండా తప్పించుకొని ఎక్కడకో పోతుంది. ఇక ఎప్పటికీ దాని గతి అంతే.
అదే తెలివిగల వాళ్ళు ఏంచేస్తారు? అది పొలాల్లో మేసే మేతకన్న ఎక్కువ నాణ్యమైన, రుచికరమైన, దానికి ఇష్టమైన మేతను సప్లై చేస్తారు. ఇక ఫరవాలేదని ఊరుకోకుండా అలా దానికి మంచి మేత ఇస్తూ ఉండాల్సిందే. ఈ మేతను తినటం దానికి అలవాటై పోతుంది. అప్పుడు దానిని వదిలినా అది ఇక దొంగ తిండికోసం వెళ్ళదు. హాయిగా ఇంట్లోనే మేస్తుంది; దారికి వస్తుంది. 
మన మనస్సు కూడా దొంగ గొడ్డు లాంటిదే. దానికి వైరాగ్యమనే కళ్ళెం బిగించి అభ్యాసమనే మంచిమేత వేయాలి. ఇందులో రుచి మరిగిందా ఇక నెట్టినా ఎక్కడికీ పోదు. రుచి మరిగేంత వరకే కష్టం. కనుక అభ్యాసం చేస్తూనే ఉండాలి.
అభ్యాసంలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవాలయంలో క్రొత్తగా వచ్చిన పూజారి మంత్రం చదువుతూ, హారతి ఇస్తూ గంట మ్రోగించాలి. గంట మ్రోగిందా! హారతి తిరగదు. హారతి తిరిగిందా! గంట ఆగిపోతుంది. ఆయన క్రొత్త పూజారిగదా! ఈ రెంటి విషయంలో జాగ్రత్తపడితే మంత్రం తడబడుతుంది లేదా ఆగిపోతుంది. ఐతే నిరాశపడకుండా అభ్యాసం చేస్తే హారతి తిరుగుతుంది, గంట మ్రోగుతుంది, మంత్రం కొనసాగుతుంది. ఎవరెంత దక్షిణ వేస్తున్నారో కూడా గమనిస్తూ ఉంటాడు. ఇదే అభ్యాసం మహిమ. 
  అభ్యాసం వల్లనే సర్కస్ లో ఏనుగు సైకిలు త్రొక్కుతుంది. అమ్మాయిలు తీగమీద నడుస్తారు. అభ్యాసం వల్లనే సముద్రాన్ని ఈదవచ్చు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కవచ్చు. అభ్యాసం వల్లనే జీవుడు దేవుడవుతాడు. అందుకే 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్నారు.
  కనుక ఎవరైతే మనోబుద్ధులను భగవంతుని యందే నిలిపి, ఏకాగ్రచిత్తంతో ధ్యానించలేరో, సమాధిలో నిలువలేరో అట్టి వారు అభ్యాసం చేయాలి. మనోబుద్ధులు భగవంతుని యందు నిలవటానికి వీలుగా మనోబుద్ధులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అభ్యాసం చేయాలి.

*నీ జీవిత సహచరి ఎవరు?*

*నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
*శ్రీశ్రీ.రవిశంకర్.*
*సుప్రసిద్ధ ఆద్యాత్మికవేత్త.* 
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.యధావిధిగా.
బొడ్డు సురేందర్.
ఇందూరు.

7, జూన్ 2020, ఆదివారం

పితృదేవతల కోసం మొక్కలు🌸 🌱 🌸🌲🌸🌳🌸🌴🌸🌿🌸☘️🌸



🌸 మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. 

🌸ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం. 

🌸వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. 

🌸ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. 

🌸మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది.

🌸 సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. 

🌸కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది.

🌸 అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. 

మన వంశం ఆశీర్వదించబడుతుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
స్వస్తి.........

👉 **సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః **

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా ?


దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు. 
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.
" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము".

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *- *మాస్టర్ E.K*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪  *1* 

జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది. ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి.

భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ, మనోమయ శరీరంలోనూ, ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది.

పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు.

పౌర్ణమి రోజే కాకుండా, పౌర్ణమికి ముందు రెండు రోజులు కూడా ధ్యానానికి విశిష్టమైన రోజులుగా థియోసాఫికల్ సొసైటీ పరమగురువులు మేడమ్ H.P. బ్లావెట్ స్కీ సూచించారు.

ముఖ్యంగా పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది. ఈ విషయం పై ప్రతి ధ్యానసాధకుడూ దృష్టి
సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అలాగే పౌర్ణమి రోజుల్లో ధ్యానసాధకుడు తాను సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని ధ్యానాభిలాషులందరికీ ప్రబోధించాలని బ్లావెట్ స్కీ అన్నారు. *పౌర్ణమి - అమావాస్య* రోజులలో ధ్యానం చేయడం వలన *"దివ్యశక్తులు", "దివ్య సూక్తులు"* సాధకులు ఊర్థ్వలోకాల మాస్టర్స్ నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది. ఈ రెండురోజుల్లో భూలోకంలోని  ధ్యానసాధకుల - ఊర్ధ్వలోకాలలోని మాస్టర్స్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి.🔺

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *-మాస్టర్ E.K.*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪2
                  
పౌర్ణమి రోజుల్లో మనస్సు వికలం కాకుండా ప్రశాంత స్థితిని పొందేలా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య రెండూ కూడా ధ్యాన సాధకులకు విశేషంగా శక్తి సమీకరణ సమయాలు ! నిర్మలమైన సమస్థితినీ, నిశ్చలధ్యానస్థితిలో స్థితమైనప్పుడు లోపల ఉండేది *"నేను"* మాత్రమే ! అదే ధ్యానం అంటే ! దీనినే *"ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి"* అంటారు.

పౌర్ణమి రోజుల్లో అల్పమైన పనులలో నిమగ్నం అవ్వడం అంటే .. అది మృత్యువు కన్నా హేయమైనది అని గ్రహించాలి. పౌర్ణమిరోజున ఉబుసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం వివేకవంతుల లక్షణం కాదు. ముఖ్యంగా పౌర్ణమిరోజునే అంతర్యామి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మస్వరూపం మనలోనూ, అందరిలోనూ పౌర్ణమి రోజు విశేషంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇతరులతో మనకు మనోహరమైన, లయ బద్ధమైన ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది.

పౌర్ణమి ధ్యానప్రభావం వల్ల నిత్యజీవితంలోని తొందరపాటు, గజిబిజి, గందరగోళం వంటి వాటిని అవలీలగా అధిగమించగలం.

పౌర్ణమి రోజున మీతో మీరు కూడీ వుండగలరు. మీతో మీరు కూడి వుండాలన్న ఆలోచనలతో అప్రయత్నంగా అవలీలగా సూక్ష్మశరీరయానం చెయ్యగలం. దివ్యలోకాలను సందర్శించగలం. విజ్ఞానమయకోశం పైనా, ఆనందమయకోశం పైన పూర్తిస్థాయి ప్రజ్ఞను సంపాదిచగలుగుతాం.

పౌర్ణమి ధ్యానసాధన వల్ల ముఖ్యంగా నాడీమండల శుద్ధీ, కుండలినీ జాగృతి అవలీలగా జరుగుతుంది. పౌర్ణమి రోజున మౌనం పాటించడం వల్ల *"టెలీపతీ"* పురోగతి సాధిస్తుంది.

ముఖ్యంగా ప్రతి ఒక్క ధ్యానసాధకుడు గుర్తించుకోవలసిన విషయం పౌర్ణమి రోజు రాత్రి ద్రవాహారం మాత్రమే తీసుకుంటే భౌతిక శరీరం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.🔺

24, మే 2020, ఆదివారం

#అన్ని_మతాలూ_సమానమేనా?




మనలో చాలా మంది దేవుళ్ళు అందరూ ఒకటే, అన్ని మత గ్రంధాలూ సారం తెలిపేది ఒకటే, అన్ని మతాలు ఒకటే అని అనే ఒక మానసిక స్థితి లో ఉంటారు..

నిజానికి ఇది మానసిక స్థితి కాదు ఒక మానసిక రోగం..
ఈ వైరస్ ముఖ్యంగా హిందువుల లోకి కొంతమంది మతస్తుల ఎక్కించారు, అన్ని మతాలు సమానమే అనే వైరస్ హిందువులు ఎంతగా నాశనం చేస్తున్న ఈ రోజు మీకు వివరిస్తాను..!!

అన్ని మతాలు సమానమే అనే ఈ జబ్బు హిందువుల్లో ఎక్కువ. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి షాపుల్లో, ఇంట్లో, నెలవంక, ఓం, సిలువ మిక్సీ లో వేసి రీమిక్స్ చేసి వచ్చిన సింబల్ ని గోడకి తగిలిస్తారు..!

అన్ని మతాలు సమానం అనేది నిజమా?? కాదా?? మనం ఎవరో చెప్పిన దాన్ని విని నమ్మేద్దామా!! లేదా మనం ఆ గ్రంథాలు చూసి తెలుసుకుందామా?? నాతో రండి, నిజాన్ని తెలుసుకుందాం... ఈ వ్యాసం చదవండి!!

#ఏ_మతం_ఎప్పుడు_పుట్టింది..??
***************************

చరిత్ర ప్రకారంగా క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, ఈ మతం ఏసుక్రీస్తు తర్వాత ప్రారంభమైంది, యేసు కూడా క్రైస్తవుడు కాడు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం అనేది లేదు.

1400 సంవత్సరాల క్రితం ఇస్లాం అనే మతం పుట్టింది, మహ్మద్ ప్రవక్త  వల్ల ఈ మతం ప్రారంభమైంది 1400 సంవత్సరాల క్రితం ఈ మతం లేదు.

హిందూ ధర్మం (హిందూమతం) అనేది ఫలానా సమయంలో పుట్టింది కాదు, ఎవరో ఫలానా వ్యక్తి వచ్చి స్థాపించింది కాదు. హిందూమతం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. హిందూ మతం లో దేవుళ్లుగా పూజించబడుతున్న రాముడు, కృష్ణుడు కూడా హిందువులే.

ఒక మతమేమో 2000 సం. క్రితం పుడితే, ఇంకో మతం 1400 సం. క్రితం పుట్టింది.. హిందూ మతం ఫలానా సమయంలో, ఫలానా సమయం లో, ఫలానా వ్యక్తి స్థాపించింది కాదు..

మరి అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాల సారం ఒకటే ఎలా అవ్వుద్ది..??

#అన్ని_మత_గ్రంధాలూ_సారం_ఒకటేనా..?
*********************************

బైబిల్ :- బైబిల్ లో ఉన్న దేవుణ్ణి (యహోవా) కాకుండా  వేరే దేవున్ని పూజిద్దాం రా అన్న వాడిని రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ ఉపదేశ కాండం 13: 6,7,8,9) ఇది బైబిల్ దేవుని ఆజ్ఞ

ఖురాన్ :- ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపండి (బహుదేవతారాధాన చేసేవాళ్ళని నరకండి) (ఖురాన్ 9:5)

భగవత్ గీత :- దేవుణ్ణి ఏ రూపం లో పూజించిన పర్లేదు, నువ్వు పూజించిన రూపం లోనే నిన్ను కరుణిస్తాడు..
(4 అధ్యాయం, 13 శ్లోకం)

ఇది మీకు చదవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం.  ఇది చదివాక అన్ని మతాల సారం ఒకటే అన్న వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.!!
మరి మీకు..??

బైబిల్, ఖురాన్ అల్లాని, యహోవా ని మాత్రమే పూజించాలి లేకపోతె చంపేయండి, అని చెప్తుంది,
భగవత్ గీత నువ్వు పూజించే దేవుడు ఎవరైనా సరే భక్తీ ప్రధానం అంటున్నది... మరి అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే ఎలా అవ్వుద్ది..?? ఆలోచించండి హిందువులారా..!!

#ఎవరికీ_స్వర్గం??#ఎవరికీ_నరకం ??
*************************

బైబిల్ :- 

యెహోవానీ, యేసుని నమ్మినవారికి మాత్రమే స్వర్గము, లేనివారికి నరకం. ఈ లెక్కన ప్రపంచంలోని 750 కోట్ల మందిలో కేవలం క్రైస్తవులకి మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం కలిగి ఉన్నారు, మిగతా అందరి నరకానికి వేళతారు ఎందుకంటే వాళ్ల ఏసుని, యహోవా ని నమ్మ లేదు కాబట్టి..

ఖురాన్ :-   అల్లాన్ని, మహ్మద్ ని చివరి ప్రవక్త గా నమ్మిన వారికి స్వర్గం, లేనివారికి నరకం... కాబట్టి కేవలం ముస్లిం లు మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం, అయితే మిగతా ప్రపంచ జనాభా అందరూ నరకానికి వెళ్తారు..!!

హిందు గ్రంథాల ప్రకారం మనం ఏ దేవుడిన నమ్మాము? ఏ దేవుని పూజించాము అనేది కాకుండా నువ్వు చేసిన మంచి, చెడులు పాప, పుణ్యాలు బట్టి నీకు స్వర్గం, నరకం అనేది నిర్ణయింపబడుతుంది.. దీని ద్వారా ప్రపంచంలో అందరూ స్వర్గానికి వెళ్ళే అవకాశం కలిగింది..!!

ఈ ప్రశ్నను బట్టి చూసినా సరే అన్ని మతాలను సమానం కాదు అని తెలుస్తోంది..!!  నన్ను పూజించినవారికి  మాత్రం స్వర్గం, నన్ను పూజించని వారికి నరకం అన్న దేవుడెక్కడ ??

భగవంతుని ఏ రూపంలో పూజించిన మీకు ఫలితం తప్పకుండా ఉంటుంది అన్న దేవుడెక్కడ..!!

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

#ఏ_దేవుణ్ణి_పూజించాలి??
*********************

బైబిల్ :-

బైబిల్ దేవుడు యహోవా ని మాత్రమే పూజించాలి, ఆయన్ని కాకుండా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని పూజిస్తే వాళ్ళని ఊరి బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ 17: 2,3,4)

బైబిల్ దేవుడు యహోవా ఇలా చెబుతున్నాడు నెను తప్ప నీకు వేరే దేవుడు ఉండ కూడదు, నీవు విగ్రహాలకి పూజించకూడదు. నా మాట కాదని వేరే దేవుళ్లను పూజిస్తే నీతో పాటు, నీ కుటుంబాన్ని 7 తరాలపాటు శిక్షిస్తాను (నిర్గమ కాండం 20: 3,4,5,6)

ఖురాన్ :- అల్లా ని కాకుండా వేరే దేవున్నీ పూజించటం, పాపం, ఆయనకి సమానంగా వేరొక దేవుణ్ణి పెట్టడమ్ షిర్క్ లోకి వస్తాయ్.. షిర్క్ అంటే ఎప్పటికి అల్లా కూడా క్షమించని పాపం..!!

భగవత్ గీత :- (శ్రీ కృష్ణుడు) ఎవరైనా ఒక దేవత ని పూజించాలి అని అనుకున్నప్పుడు వారి మనసు ని ఆ దేవత పై ఉండేలా, వాళ్ళ భక్తి ఆ దేవత మీద నిలిచేలా నేను చేస్తాను.. ( ఆ. 7, శ్లో. 21)

భైబిల్ యహోవా, ఖురాన్ అల్లా ఏమో వారిని కాకుండా వేరే దేవుల్లని పూజిస్తే తాట తీస్తాం, అని అంటున్నారు
భగవత్ గీత లో శ్రీకృష్ణుడు దీనికి భిన్నంగా నువ్వు ఏ దేవున్ని పూజిస్తే ఆ దేవుడు మీద నీ దృస్థి ఉండేలా చేస్తా అంటున్నాడు..

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

#కర్మ_సిద్ధాంతం:-
************

మనిషి యొక్క కష్టసుఖాలు,సుఖ దుఃఖాలు అతడు గత జన్మల్లో అతడు చేసుకున్న పాపపుణ్యాల బట్టి అతనికి ఈ జన్మలో కష్టాలు సుఖాలు రావడం జరుగుతాయి..!!

ఉదాహరణకి ఒక మనిషి పుట్టుక తోనే అంగవైకల్యంతో పుట్టారు అనుకుందాం,

దానికి సమాధానం

ఖురాన్ :
అతను ఎందుకలా పుట్టాడు దానికి సమాధానం లేదు

బైబిల్ : ఒక మనిషిని వికాలంగుడిగా ఏందుకు పుడుతున్నాడంటే అది దేవుడి ఇష్టం, ఆయనకి నచ్చినట్టు పుట్టిస్తాడు..

మళ్లీ వికలాంగుల మాత్రం అపవిత్రులు, వాళ్ళు దేవునికి ఏ ప్రసాదం పెట్టకూడదు, వాళ్లు దేవుడు దగ్గరకి వెళ్ళి దేవుడి స్థలాన్ని అపవిత్రం చేయకూడదు (లేవియా కాండం 21: 17-23)

హిందూ గ్రంధాల ప్రకారం ఒక మనిషి పుట్టుకతో వికలాంగుడు అయితే అతనికి గత జన్మలో చేసిన పాప కర్మలు కారణంగా ఆ సమస్య వచ్చిందని చెబుతారు వికలాంగులు అపవిత్రం ఏమి కాదు,  వాళ్లు దేవుడి దగ్గరకి వెళ్లిరావచ్చు ప్రసాదం పెట్టవచ్చు..!!

ఎవడ్రా అందరు దేవుళ్ళు చెప్పేది ఒకటే, అన్నీ మతాలు ఒకటే అన్నది..!!!

#దేవుడి_దృష్టిలో_మిగతా_జీవుల_సంగతేంటి..?
***********************************

బైబిల్, ఖురాన్ ప్రకారం మనిషి కాకుండా మిగతా జీవులలో ఆత్మ ఉండదు వాటికి స్వర్గమా, నరకమా అన్న ప్రస్తావన ఉండదు.

మనుషుల కోసమే మిగతా జంతువులు సృష్టించబడ్డాయి మనుషులు వాటిని వాడుకోవచ్చు, చంపితినొచ్చు, వాటి మీద అధికారం చలాయిస్తారు అంతే.. జంతువులు దేవున్ని గురించి ఆలోచించడమ్, దేవున్నీ చేరుకోవడం లాంటివి ఏమి ఉండవు..!

హిందూ గ్రంధాల ప్రకారం అన్ని జీవులు దేవుని బిడ్డలే మనిషి తో పాటు, మిగతా జీవులులో కూడా పరమాత్మ తత్వం ఉంటుంది కాకపోతే అవి చేసుకున్న పాపపుణ్యాల బట్టే గత జన్మల్లో చేసుకున్న కర్మల బట్టే ప్రస్తుతం ఆ జంతు జన్మలు ఉన్నాయి.

కొన్నిసార్లు జంతువులుకి కూడా దేవుడు దర్శనమిచ్చినట్లు వాటికి కూడా స్వర్గము, మోక్షము ఇచ్చినట్టు హిందూ గ్రంధాలు చెబుతున్నాయి

ఉదాహరణకు గజేంద్ర మోక్షం లో సరస్సులో మొసలి చేత పట్టబడిన ఏనుగు, ఏనుగు పిలిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చే ఏనుగుని కాపాడతాడు.

అలాగే శివుడు తనను పూజించిన ఏనుగు,పాము, సాలిపురుగు, లకు కూడా మోక్షం ప్రసాదిస్తాడు అని హిందూ గ్రంధాలు చెప్తున్నాయి.

ఇప్పడు చెప్పండి అన్ని మతాలు సమనమా???

#మనిషి_పుట్టుకతో_పాపి_అనే_సిద్ధాంతం.!!
**********************************

క్రైస్తవులు ఎక్కువగా విశ్వసించి సిద్ధాంత మిదే మనిషి పుట్టుక తోనే పాపి అని, మనిషి రక్తం  పాపమ్ తో నిండింది అని విశ్వాసం, మనుషుల కోసం యేసు తన రక్తాన్ని చిందించాడు అని, యేసు ని నమ్ముకోవాలి
అని చెప్తరు..

మనిషికి ఈ పాపం ఎలా వచ్చింది అంటే సమాధానం అవ్వ ఆదాం ఇద్దరూ కూడా దేవుడు తినవద్దన్న పండును తిన్నారు కాబట్టి వాళ్లు పాపులు, వాళ్ల వల్ల వచ్చిన మనం, మానవజాతి అంతా పాపులం, ఆ పాపం వారసత్వంగా వచ్చేస్తుంది అని చెప్తారు..

ఈ సిద్ధాంతం తప్పు ఎలా అంటే..?!

బైబిలు దేవుడు యహోవా ఆదాం పక్కటేముక ఒకటి తీసి అవ్వని తయారుచేశాడు కాబట్టి మగవాళ్ళకి ఒక పక్క టెముక తక్కువుంటుంది స్త్రీల కంటే (అని క్రైస్తవులు నమ్మే వారు, ఇది సైన్స్ తప్పు అని నిరూపించింది పురుషులకే స్త్రీలకే పక్కటెముకల సంఖ్య లో ఎలాంటి తేడా ఉండదని చెప్పింది)

ఆదాం కి ఒక పక్కటెముకు దేవుడు తీసేస్తే మానవజాతి అందరికి మగవాళ్లకు ఒక పక్కటెముకు తక్కువ ఉండాలి కదా..! మీ పాపి సిద్ధాంతం ప్రకారం.. కానీ అలా ఎందుకు లేదు??

అప్పుడెప్పుడో అవ్వ ఆదాం  పాపం చేస్తే  మానవ జాతంతా పాపాత్ములు  అని చెప్పిన మీ సిద్ధాంతం పక్కటెముక సంఘటన కి అన్వయించి చూడండి..!! మీకే అర్థమవుతుంది మీ మూర్ఖత్వం..!!

హిందూ ధర్మం ప్రకారం మనిషి జన్మ అన్ని జన్మలలోకి చాలా గొప్పది, ఈ జన్మలో మనం మంచి గొప్ప కార్యక్రమాలు, పుణ్యాలు చేస్తే దేవతల స్వర్గాన్నీ పొందవచ్చు, ఇక్కడ పుట్టుకతోనే  నేను పాపి అనే దౌర్భగ్యం లేదు. అమృతస్య పుత్రః అనే భావన ఉంది.. ఎన్నో పుణ్యాలు చేస్తేనే మానవజన్మ, అందునా ఈ భారతదేశంలో పుట్టడం ఎంతో అదృష్టం అనే చెప్పాలి..!!

ఎవడ్రా అన్ని మతాలు ఒకటే అన్నది..!! ఇంత తేడాలు ఉంటె..!!

మనిషి పుట్టుక మూలం ఏంటి కారణం ఏంటి ?
మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ?
**************************************

బైబిల్, ఖురాన్ :-

మనిషి పుట్టుక పరమార్థం ఏమిటి అనేది ఈ  ఈ గ్రంథాలలో కనబడ లేదు, అసలు మనిషి ఎందుకు పుడతాడు అనేది బైబిల్ ఖురాన్ అని స్పష్టంగా తెలియలేదు. క్రైస్తవుల ఇంకో అడుగు ముందుకేసి అసలు సెక్స్ అనేది పాపంగా చేప్తరు. మనుష్యులు కలయిక అనేది సెక్స్ అనేది పాపంగా భావిస్తారు.

హిందూ గ్రంధాలూ:

మనిషి పుట్టుకకు పరమార్థమని అతని లక్ష్యం నాలుగింటి గా చెప్పింది ధర్మము, అర్థము, కామము, మోక్షము

ధర్మము అంటే మనం ఆ క్షణంలో చేయవలసిన మన కర్తవ్యం,
అర్ధం అంటే మన సంపాదించుకోవాల్సినవి (పుణ్యం, డబ్బు...)
కామము అంటే మనం అనుభవించవలసినవి (సుఖాలు, భోగాలు)  మోక్షమంటే వీటన్నింటి నుంచి విడివడి పరమాత్మ చేరుకోవడం, ఇది మన జన్మ యొక్క లక్ష్యం

#విగ్రహారాధన (#విగ్రహాలను_పూజించటం)..!!
************************************

బైబిల్ ఖురాన్ ప్రకారం విగ్రహాలను ఎవరైనా పూజిస్తే వారికి నరకం, అది ఘోరమైన పాపం.

బైబిల్ దేవుడు యహోవా ఏకంగా విగ్రహాలను, గుడి, దేవాలయాలను నాశనం చేసేయాలి, దేవాలయాల నామరూపాలు లేకుండ ధ్వంసం చేయలి అని బైబిల్ లో ఆజ్ఞ కూడా ఇచ్చాడు..! (ద్వితీయ ఉపదేశ 12: 1,2,3)

హిందూ గ్రంధాల ప్రకారం విగ్రహాన్ని పూజించటం వల్ల మనలో నిగ్రహం పెరిగి, దేవుని మీద ఏకాగ్రత పెరుగుతుంది.. మన కంటికి కనిపించని దేవుణ్ణి విగ్రహాన్ని మన ఎదుట పెట్టి భక్తికి మొదట అడుగు వేయటమే విగ్రహారాధన లక్ష్యం..

ఆ మతాలేమో విగ్రహాన్ని పూజిస్తే నరకం అంటున్నాయి విగ్రహాల్ని దేవాలయాలను నాశనం చేయమంటున్నాయ్

హిందూ మతమ్ విగ్రహారాధన దేవుని చేరుకోడానికి మార్గముంటుంది
                     
                        ******************

ఎవడ్రా అన్ని మతాలు సమానమ్ అన్నది..!!

చూసారా..
మిత్రులారా ఇన్ని తేడాలు మతాల మధ్య ఉంటే వచ్చిన ప్రతివాడు అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాలు సారం ఒకటే, అని చెప్తారు

అలా హిందువులకు చెప్పడం వల్ల లాభమేమిటి??  ఎందుకంటే ఒకసారి హిందువుల మనస్సులలో అన్ని మతాలు సమానమే,అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే అనే భావన తీసుకురాగలిగితే....

పాపం ఆ పిచ్చి హిందువు అన్ని మతాలు సమానమే అనుకోవడమే గాకుండా తాను హిందువుని అనే విషయం కూడా మర్చిపోతాడు... ఎందుకంటే అన్ని మతాలు సమానమైనప్పుడు, అన్ని మత గ్రంధాలూ ఒకటే అయినప్పుడు, అందరిదీ ఒకటే అయినప్పుడు

ప్రత్యేకంగా ఆయనకు నేను హిందువుని అని చెప్పుకోవడం ప్రత్యేకంగా అతని గ్రంథాలు చదవడం వృధా అనుకుంటాడు..!!

బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు..!
గుడికి వెళ్లడానికి మొహమాట పడతాడు..!
తాను నమ్మిన దేవుడు ఉన్నాడా అని అనుమాన పడతాడు..!!

చివరగా  తాను హిందువుని అనే
విషయం మరిచిపోతాడు..!!

ఆ ప్రాంత నేత మతస్థులను హిందువులను అమయుకుల్ని చేసి హాయిగా మత మార్పిడి చేసుకుంటారు..!!

చూశారా.......ఇది "అన్ని మతాలు సమానం" అనే ఒక వైరస్ వెనక ఉన్న అసలైన నిజం ఈ విషయం తెలుసుకోవాలి... ప్రతి హిందువు తెలుసుకోవాలి..!!!

8, మే 2020, శుక్రవారం

*ధ్యానం అంటే ఏమిటి..? ఎలా చేయాలి..?*


                 🔺ధ్యానం🔺
*నిద్ర ఎరుకలేని ధ్యానం*. 
*ధ్యానం ఎరుకతో నిద్ర.* 
*నిద్రలో మరిమిత శక్తిని పొందుతాం.* 
*ధ్యానంలొ అపరిమితంగ శక్తిని పొందుతాం.* 
*ఈ శక్తి మన శరీరిక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది.* 
*ఇది మన అతీంద్రియ శక్తిలిని కూడా ప్రభావితం చేస్తుంది.* 
*ధ్యానం ద్వార మనం పోందె శక్తివల్ల శారీరిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పోందుతాము.*
*మహద్భుత జ్ఞానాన్ని పోందడానికి ఏకైక మార్గం ధ్యానం*. 
*దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి* *ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది.* 
*ధ్యానం అంటె మరేమి కాదు. ఎరుకతో మనలోకి మనం చేసె ప్రయాణం.* 
*ధ్యానంలొ మన చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది.*

*ఇప్పుడు ధ్యానం ఎలా చేయ్యాలో తేలుసుకుందాము.*

*ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని మనసును నిలువరింపచేయాలి*. 
*అంటే శారీరిక కదలికలును, చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలి. ధ్యాననికి ముఖ్యమైనది ఆసనం.  స్థిరమైన, సుఖమైన ఏదైన ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి.*

*నేలమీదగాని మరే ఇతర కుర్చీలు బల్లలులాంటి వాటిమీద కుచొని కూడా చేయ్యవొచ్చు.* 
*ధ్యానం ఏ సమయములోనైన చేయ్యవొచ్చు*. 
ముఖ్యమైనది *అనుకూలంగవుండగలిగే స్థలం అయ్యి ఉండాలి.*

*హాయిగ కూచొని కాళ్ళు రెండూ ఒకదానితొ ఒకటి చేర్చి చేతివేళల్లొ వేళుంచి కళ్ళుమూసుకొని లోపలగానీ బైటగాని ఏ శబ్ధము చేయ్యకుండా ఏ మంత్రము జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చెయ్యాలి*.

*మనం కాళ్ళను కలిపి చేతివేళల్లో వేళ్ళు కలపడం ద్వార మన చుట్టూ శక్తివలయం ఏర్పడుతుంది.  మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.* 
*కళ్ళు మనోద్వారాలు.  కాబట్టి కళ్ళురెండూ మూసికొవాలి.*

*మంత్రోచ్ఛారణగాని మరే ఇతర శబ్ధముగానీ చేయడం మనసు చేసె పని.* 
*కాబట్టి దాన్ని సంపూర్ణంగ నిలిపి వెయ్యాలి.* 
*ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమౌతుందో అప్పుడు చైతన్యము శరీర పదార్థంనుంచి మనో బుద్ధి పదార్థాలవైపు ప్రాయాణం చేస్తుంది.* 
*మనస్సు మరేమీ కాదు, ఆలొచనల పుట్ట.* 
*అనుక్షణం ఎన్నొ ఆలొచనలు మొదలౌతునే ఉంటాయి. వాటివెనుక మరెన్నో ప్రశ్నలు … తేలిసినవి, తేలియనివి.* 
*చైతన్య పదార్థాన్ని మనో బుద్ధి పదర్థాలనుంచి ఆత్మవైపు ప్రాయాణింప చేయాడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం.* 
*గమనించడం అనేది ఆత్మయోక్క ప్రక్రియ.* 
*సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్థూ ఉందాలి.* 
*ప్రయత్నపూర్వకంగా శ్వాసప్రక్రియను చేయ్యరాదు.*

*తనకు తానుగా శ్వాసప్రక్రియ జరుగుతూఉండాలి.  సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి.* 
*ఇదే ధ్యాననికి మూలము.  ఇదే ధ్యాననికి మార్గము.*

*ఆలొచనలవెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు. ఆలొచనలవెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు.*

*ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాసవైపు మరల్చాలి.*

*సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి.* 
*అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలౌతుంది.  క్రమంగా శ్వాసపరిమాణం కూడా పలుచుబొడుతూ చిన్నదౌతూ వస్తుంది.* 
*చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమమ్ముల మధ్య చిన్న వెలుగుగా వుండి పోతుంది.* 
*ఈ స్థితిలో ఆలోచనలు వుండవు. శ్వాస కూడా వుండదు.* 
*ఇదే ఆలోచనారహిత స్థితి.* 
*ఇదే నిర్మల స్థితి.* 
*ఇదే ధ్యాన స్థితి.* 
*ఈ స్థితిలోనే విశ్వ శక్తి మనలోకి ప్రవహించడం మొదలౌతుంది. ఎప్పుదైతె మనం అధికంగా ధ్యానం చేస్తామో  అధికంగా విశ్వ శక్తిని పొందడం జరుగుతుంది.  అలా పొందిన విశ్వ శక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది.................*

*మూలం:- spiritual reality*
*సేకరణ: ........................*

7, మే 2020, గురువారం

*🙏ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత🙏*


*పూజకోటి సమం స్తోత్రం,*     
 *స్తోత్రకోటి సమో జపః* 
 *జపకోటి సమం ధ్యానం ,*          
 *ధ్యానకోటి సమో లయః* 
 
*భావం:* 

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,
కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,
కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

 *నాస్తి ధ్యాన సమం తీర్థం;*     
 *నాస్తి ధ్యాన సమం తపః|*   
 *నాస్తి ధ్యాన సమో యజ్ఞః*  
 *తస్మాద్యానం సమాచరేత్* 
 
*భావం:* 

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి.        
           
                 - *వ్యాసమహర్షి*

*🧘‍♀ధ్యాన పద్ధతి🧘‍♀* 

🔸ఒకచోట కూర్చుని 
 శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి, కళ్లు రెండూ మూసుకొని,మీ లో జరుగుతున్న సహజమైన
ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమ నించాలి. 
🔸మధ్యమధ్యలో ఆలోచనలు  వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్లీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. 
🔸ఏ మంత్రమూ చెప్పరాదు. ఏ రూపాన్ని ఊహించుకో రాదు.
 🔸ఇలా చేయగా చేయగా   మీ పమనస్సులోని ఆలోచనలు  తగ్గి, ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటారు. 
🔸ఇలాగ కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అని నిమిషాలు సాధన చేయాలి. అదే కనీస సమయం. ఆపైన మీ ఇష్టం. 
🔸మీ అంతరాత్మ ప్రబోధం బట్టి ఎంత సేపైనా చేయవచ్చు

4, మే 2020, సోమవారం

మనసు అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది.


మనసు అనే పదం దాదాపు ప్రతి రోజు ఎదో ఒక విషయంలో మనం అందరం అనుకుంటూ ఉంటాము. మనిషి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా! వాని మనసు బాగుండాలి అని కూడ అంటూ ఉంటారు. కాని ఈ మనసు ఎక్కడ వుంది అంటే మాత్రం ఎవరికీ తెలియదు. దీనినే చాల మంది అంతరం అని కూడ అంటారు. ఇది అన్నిటికంటే చాల వేగమైనది కూడ. అది ఎలా అంటే నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే వున్నావు, నీ మనస్సు ఎక్కడో వుంది అని అంటుంటారు.
ఈ మనసు చాల చాల సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి react అవుతుంది. మనసుకు ఓపిక చాల తక్కువ మరియు సహనం కూడ తక్కువే. కాని ఇంతటి ఓపిక, సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వార ఓపిక, సహనం, అన్నిటికి మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇక్కడ ఆనందం అంటే చాల మంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకేమి ఆనందంగానే వున్నాను కదా అని. కాని ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా తాత్కాలిక ఆనందం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పొందే ఆనందం వేరే ఏదైనా ఇంకొక విషయానికి మరల అది బాధపడుతుంది. ఈ ఆనందం చాలా రకాలుగా వుంది. ఈ ఆనందం ఎన్ని రకాలు అనేది బృహదారణ్యకోపనిషత్ లో చాల బాగా విశదీకరించి చెప్పారు, అది “మనుజులలో ఎవడు సకల భోగములు అనుభవించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును ఆజానదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము”. దీనిని బట్టి మనకు అర్ధమైనది ఏమిటంటే మనం ఇప్పుడు పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. శాశ్వతమైన పరమానందమైన ఆనందాన్ని పొందినపుడు మాత్రమే మనం అసలు సిసలైన ఆనందాన్ని పొందిన వాళ్ళమవుతాము.

సరే కాని ఈ మనస్సు అంటే ఏమిటి, అది ఎలా వుంటుంది అంటే మాత్రం, ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరకదు కాని అది ఒకేఒక అధాత్మికలో మాత్రమె దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే అసలు మనస్సే లేదు అని తెలుస్తుంది. ఎలా అంటే వున్నది ఒక ఈ శరీరం మరియు ఆత్మ. నిజానికి ఉండేవి ఈ రెండే, కాని ఏమైంది అంటే మనం కలిగిన భావనలను ఆ ఆత్మ (శక్తికి) కు ఒక తెరగా ఏర్పరచాము అదేలాగు అంటే మనం గుడికి వెళితే హారతికి ముందు దేవుని ప్రతిమ కనబడకుండా ముందర ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా వేస్తారు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ప్రక్కకు తీస్తారో అప్పుడు దేవుని ప్రతిమ మనకు కనిపిస్తుంది అదేలాగు మనం కూడ ఇక్కడ ఒక తెరను ఏర్పరచాము, అదియే మనస్సు. ఈ మనసు ఎలా ఏర్పడింది అంటే ప్రతి రోజు ఈ శరీరం చేసే ప్రతి పనిని మరియు క్రియను మనం, నేను అనే అహంకార భావనతో చేయడం వలన ఇది ఏర్పడింది. ఈ విధంగా మనకై మనం అజ్ఞానంలో అశాశ్వతమైన మరియు నశ్వరమైన ఈ ప్రపంచంలో నావి అనే ఒకే ఒక భావనతో ఏర్పడిన తెరయే ఈ మనస్సు. ఈ విధంగా మనకై మనం ఏర్పరచిన ఈ మనస్సే ఇప్పుడు మనలను శాశించే స్థాయిలో వుంది.దీనిని మనం ఏ విధంగా అజ్ఞానంతో ఏర్పరచామో, అదే విధంగా జ్ఞానంతో నియంత్రించి మన నిర్దిష్టమైన, లక్ష్యమైన మరియు మన ధ్యేయమైన ఆ పరమాత్మునిని హృదయంలో దర్శించుకోవచ్చు. ఈ మనస్సును మనం నియంత్రించగలిగితే అదియే మనకు అసలు సిసలైన మిత్రువు లేకపోతే నీ పతనానికి అదియే మొదటి శత్రువు. చాల మంది అనుకుంటారు శత్రువులు బయట వుండారు అని, కాని అసలు శత్రువు నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న తెరయైన నీ మనస్సే నీ శత్రువు. ఇది అందరు గుర్తుంచుకోవలసిన విషయం.
ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనసు అంతఃకరణ శుద్ది అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు automatic గా నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకురుతాయి. వీటి అన్నిటికి మించి పరమానందం పొందాలంటే మాత్రం జ్ఞానం ఒకటి సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానంతో ఆ దేవదేవుడైన పరమాత్మ స్వరూపుణ్ణి నీ హృదయంలో దర్శించడం వలన మాత్రమె సాధ్యం.

నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు. అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.

ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :
- వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
- మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
- ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
- మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
- వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
- లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
- ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.
👏👏👏

1, మే 2020, శుక్రవారం

*🙏"ధ్యానం"తో ఒత్తిడి దూరం🙏*

*🔹నేడు మారిన కాలంతో జీవన విధానం మారింది. అర్థం లేని మానసిక ఒత్తిడులను పెంచుకోని  జీవితాన్ని భారం చేసుకుంటున్నారు.*

*🔹అటువంటి ఒత్తిడిని వదిలించుకునేందుకు మన సంస్కృతిలో భాగమైన "ధ్యానం"ఉంది.*

*🔹ప్రస్తుత జీవన విధానంలో విద్యార్థులు , గృహిణిలు, ఉద్యోగులు, మేధావులు ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురి అయిన శరీరం  ఒత్తిడి సంబంధించిన హార్మోన్లు విడుదల చేస్తుంది.ఆ హార్మోన్లు రక్తంలో పేరుకుపోవడంతో  శరీరం జబ్బున బారిన పడుతుంది.*

*🔹ఇన్నిరకాల అనర్థాలను తెచ్చిపెడుతున్న ఒత్తిడిని వదిలించుకునేందుకు అద్భుతమైన మార్గం "ధ్యానం".*

*🔹ధ్యానాన్ని ఒక దీక్షగా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా సాధన చేసినట్లు అయితే ఆరోగ్యం , ఆనందం మీ సొంతమవుతాయి.*

 *🧚‍♂ధ్యానం చేయు విధానం:🧚‍♂* 

 ♦ *సుఖమైన పద్మాసనం లో కూర్చుని, కళ్ళు రెండూ* *మూసుకుని మనస్సు తో* 
“ *శ్వాస మీద ధ్యాస”పెట్టడం.* 

♦అంటే “ *మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం”.* 

♦ *సరళమైన, స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం.* 

♦ *మధ్యలో ఎన్ని ఆలోచనలు వస్తున్నా,కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి.* 

 ♦ *ఆలోచనలు లేని స్థితి యే అసలైన ధ్యాన స్థితి.*

 👉 *ధ్యానం సర్వ రోగ నివారణి.*
   
🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂

25, ఏప్రిల్ 2020, శనివారం

పరందామానికి నిచ్చెన

"అనంత కోటి లోకాలకు నిచ్చేన వేయ బడి ఉంది.సహనం ధర్మంగా జీవిస్తే కొన్ని మెట్లు ఎక్కగల్గుతాము.శాంత ము అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఎలాంటి వారితో నైనా శాంత ము తో వుండగలిగితే ఇంకా కొన్ని మెట్లు అభివృద్ధి సాధిస్తాము.స్వాధ్యాయం ధర్మంగా జీవిస్తే పై లోకాలకు కొన్ని మెట్లు ఎక్క గలుగు తాము.అహింస పాటిస్తే అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ చూపిస్తూ ఉంటే,అన్ని కులాలు ,మతాలు వారి పట్ల అభిమానం ,ఇంట్లో బయట ఇలా హింస లేకుండా మాటల్లో ,చేతల్లో ,ఆలోచనల్లో హింస లేకుండా చేసుకుంటుంటే ఇంకా కొన్ని మెట్లు ఆటోమాటిక్ గా ఎక్కగల్గుతాము.కరుణా ఇతరుల పట్ల మన పట్ల కరుణ .మాట,చేత సహాయం.వినయం ధర్మంగా అనుసరిస్తే ఎంత ధ్యాని గాని ఎంత పండితుడు గా ని ,ఎంత ధన వంతుడు అయినా వినయం తో ఉంది తీరాలి.విర్రవీగటం మానుకోవాలి మనకంటే మహాత్ములు గోప్పవారు ఎందరో ఉన్నారు అని గుర్తు పెట్టుకొని మసలుతూ ఉంటే పై మెట్లు ఎక్కగలము.సత్యం తెలుసుకుంటాం'ఆత్మే సత్యం అని జీవితం ఒక నాటకం అందులో పాత్రధారులం అని జీవితాన్నీ రసవత్తరంగా జీవించాలి .అని మరణాంతర జీవితం ఉంది ఇలాంటి నాటకాలు ఎన్నో వేయాల్సి ఉంది 'అని సత్యం తెలుసుకొని సత్యం లో జీవిస్తుంటే ఏ బాధలు,ఆందోళనలు7 లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటే ఇంకా ఉన్నతి ని సాధిస్తాము.దానం.మనకు ఉంచుకోవాల్సింది ఉంచుకొని మిగతా ఇతరులకు ఇవ్వగలిగితే .మన దగ్గర ఉన్నది ఏదయినా విద్య,సంగీతం,భాష,జ్ఞానం డబ్బు ,ఏ సహాయం చేయడానికి వీలున్నదో అది చేయడమే దానం పై మెట్టుకు చేరు తుంటాం.అలాగే ధ్యానం చేయడమే మన ధర్మం
లోకాలన్నింటి జ్ఞానం,సృష్టి రహస్యాల జ్ఞానము ,పునర్జన్మ ,మరణం పుట్టుక ల జ్ఞాన్స్మ్,కార్య కారణాల జ్ఞానం సమస్త జ్ఞానాలు ధ్యానం చేస్తే నే తెలుస్తాయి ప్రపంచ జీవితం ఆధ్యాత్మిక జీవితం బాలెన్స్డ్ గా వుండగలుగుతుంటే స్వర్గానికి నిచ్చేన లు వేయకుండానే ఆటోమాటిక్ గా ఆ నిచ్చెన ఏర్పడి పరందామానికి మార్గం చూపుతుంది."

🙏“ధ్యాన శాస్త్రం”- బ్రహ్మర్షి పత్రీజీ 🙏*


🔸శ్వాసశక్తే మన మనుగడకు జీవనాధారం! మరి ఈ శ్వాస శక్తే మనల్ని మన మూలాల్లోకి తీసుకునివెళ్తుంది.ఎప్పుడైతే మనం శ్వాసానుసంధానం చేస్తామో అప్పుడు శ్వాస సూక్ష్మమై..మనస్సు శూన్యమై..పరిశూన్యమై విస్తారంగా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహించి, మన దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది..మనం సూక్ష్మశరీరయానాలు చేస్తాం ! 

🔸విశేష ధ్యానాభ్యాసం ద్వారా “నేను శరీరాన్ని కాదు”... “అయమాత్మా బ్రహ్మ” ..“నేను అందరిలో ఉన్నాను”, .. “అహం బ్రహ్మాస్మి” .. “నేను ఆత్మను” అంటూ ..ఆత్మను గురించి ఖచ్చితంగా సంపూర్ణంగా తెలుసుకుంటాం.  

🔸మనలో ఇలాంటి ఆత్మజ్ఞానం వల్లనే “ఎలా మాట్లాడాలి ?” .. “ఏ భావాన్ని వ్యక్తపరచాలి ?” .. “ఎలా నడుచుకోవాలి?” .. అన్న విషయాల్లో కూడా ఎంతో పరిపక్వత వస్తుంది! 

🔸జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు ఎదురవుతూ .. వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ,“ఆత్మ ఎదుగుదల కోసమే ఈ శరీరాన్ని ధరించి జన్మ తీసుకున్నాము” అనే ఆత్మసాక్షాత్కారాన్ని క్రమక్రమంగా పొందుతూ ఉంటాం.

🔸క్రమంగా శరీరానికి వున్న అవుధులు ఆత్మకు లేవని అర్థం చేసుకుని, ఆనందంగా ఒకేసారి బహుముఖతలాల్లో విహరిస్తూ అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అపారంగా గ్రోలుతూ ఉంటాం.
🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂

23, ఏప్రిల్ 2020, గురువారం

🙏శ్రద్ధ - సబూరి🙏

*🙏శ్రద్ధ - సబూరి🙏* 

🔸“ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం.
ఒకటి : ‘శరీరవత్ ప్రాపంచిక జీవితం’ 
రెండు: ‘ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం’

🔸“శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు .. భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి.  

🔸“సముద్రపు అలల వంటి మానావమానాలతో .. మరి సుఖదుఃఖాలతో .. కూడిన మన దైనందిన ప్రాపంచిక జీవితాన్ని జీవించడానికి మనం ఎంతో సహనాన్ని అలవరచుకోవాలి.

🔸“కుటుంబంలో ఉన్న అందరితో కలిసి మెలిసి ఉంటూ .. ఉద్యోగ వ్యాపారాదులను నిర్వహించుకోవడంలో అపారమైన సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం .. వాటి నుంచి అనుభవజ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుగలుగుతాం!

🔸“అలాగే ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవించేటప్పుడు మనం ఎనలేని ‘శ్రద్ధ’ను కలిగి ఉండాలి.“‘శ్రద్ధ’ అంటే ఏకాగ్రత! ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జనలో, ధ్యానసాధనలో, శ్రవణంలో, స్వాధ్యాయంలో, సజ్జనసాంగత్యంలో మరి సేవలో అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి.”

🔸“ఇదే మరి యోగేశ్వరులైన షిరిడీసాయి నాధులు మనకు ఇచ్చిన ‘శ్రద్ధ – సబూరి’ అన్న రెండు గొప్ప వరాలు! ” 

🔸‘ A Master of Meditation is a Master of Patience’ కనుక .. మనం ప్రాపంచిక జీవితం పట్ల సహనంతో మరి ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధతో   మన రెండు జీవితాలనూ సరిసమానంగా జీవించాలి!

       - *బ్రహ్మర్షి పత్రీజీ* 
🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂

21, ఏప్రిల్ 2020, మంగళవారం

పిల్లవాడి సందేహం

*ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు...?” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు*.

 *ఆరోజు పాఠం*
 “ _ఓం పూర్ణమద: పూర్ణమిదం 
పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం._ 

*పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి    తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి "నేర్చుకున్నావా...?" అని అడిగారు. "నేర్చుకున్నాను" అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.* 

*దానికి ప్రతిగా శిష్యుడు, "కావాలంటే పుస్తకం చూడండి..!" అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.* 

*"శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది...?" అని అడిగారు గురువు గారు.* 

*శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ ఇలా అన్నారు*

*"పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం...!" అని వివరణ చేశారు.*

ఉత్తమ ధ్యాన పద్దతి

ధ్యానం అన్నది మన మనసుని శాంతపరచుకోవటం, కుదుట పరచుకోవటం, నిర్ములిన్యం చేసుకోవటం, ఎలా అయితే మన ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరచుకుంటామో అలాగా మన మనసుని కూడా శుబ్రపరచుకోవాలి, గుడికి వెళ్ళినపుడు ప్రదర్శినాలు చేసేటపుడు లోపలకి పోయేటపుడు అంత బాగుంటునే కదా గర్భగుడికి పోయి నమస్కారం చేస్తాం, లోపల బాగుంది బయట మాత్రం చెత్త ఉంది, మరి ఆ గుడికి వెళ్లగలమా!..          

అలాగే ఈ మనసు అనే గర్భగుడి లో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు, కనుక మనసులో చెత్త చెదారం ఉండరాదు, నిన్నటి విషయాలు ఈరోజు చెత్తనే కదా, కనుక మనసుని ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి, మనసు అనేది గర్భగుడి, ఆత్మ అనేది దేదీప్యమైనది ఆ దైవం, మనసు లోపలకి వెళ్లి అక్కడ నుంచి ఆత్మ దర్శనం చేసుకుంటాము, కనుక ప్రతిరోజూ మన మనసుని clean చేసుకునే కార్యక్రమమే ధ్యానము.                          

గొప్ప గొప్ప అందగత్తెల యొక్క competetions చూస్తూ ఉంటాము, Miss Universe అని, Miss India అని, ఆ పోటీల్లో గొప్ప శిఖరాగ్రమైన అందాన్ని చూస్తాము, అలాగే ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి అన్ని మంచివే అన్ని చక్కటివే, కానీ శిఖరాగ్రమైన ధ్యాన పద్ధతి పేరు ఆనాపానసతి, ఇది ఉత్తమోత్తమ, ఉన్నతోన్నత ధ్యాన పధ్ధతి అని నేను నా ధ్యాన జీవితం లో తెలుసుకున్నాను. - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

15, ఏప్రిల్ 2020, బుధవారం

ధ్యానం-ద్వైతం అద్వైతం

" ద్వైతం అంటే అజ్ఞానం లో ఉన్నపుడు ఆత్మ మన శరీరం లో రంగ ప్రవేశం చేసింది
మనసు ,బుద్ధి ,చిత్తం ,అహంకారం  కలిమీ లేములు ,కస్ట సుఖాలు ,వెలుగు నీడలు లాంటి ద్వంద్వ లకు చలించి బాధలకు గురి కావటానికి ఈ నాలుగు పనిచేస్తుంటాయి.మనము మహాత్ముల ఉపదేశాలతో ధ్యానము,ఆధ్యాత్మిక గ్రందాలు చదవటం చేస్తుంటే హృదయ గ్రంధి లో మూసుకొని ఉన్న ద్వారాలు తెరవబడుతాయి.అద్వైత స్థితి ని ధ్యానం ద్వారా అందుకొని ధ్యానం చేసేటపుడు .మాత్రమే తెరుచుకోబడే దైవ ద్వారం బ్రహ్మ రంధ్రం ఓపెన్ అవుతుంది 
కుండ లి లోని సుషుమ్నా  నాడి మూలదారం నుండి సహస్రానికి ప్రయాణిస్తుంది.అంతులేని సృష్టి రహస్యాలు తెలుసుకొనే జ్ఞానం గురువుల చే ఇవ్వబడుతుంది.అజ్ఞానం లో ఉన్న మానవుడికి ధ్యాన వైభవం వల్ల ఆత్మ అనేది మనలో ఉంది అం8 ఆత్మను గురించిన జ్ఞానం అందివ్వ బడుతుంది
ఆత్మ జ్ఞానం మనలను సమీపించగానే బ్రహ్మానందం అనుభూ తి కలుగుతుంది.బ్రంగాజ్ఞాననికి దారి  ఏర్పడుతుంది "నువ్వు వేరు ,నేను వేరు అనే హ ని న8భావాలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది.ఎన్నో జన్మల ధ్యాన ఫలం గా మమాత్మా సర్వ భూతాత్మ ,అహం బ్రహ్మాస్మి ,అనుభవం పొందగలము.ఏకత్వ స్థితి లో జన్మ రహిత్య స్థితి కలగడానికి అర్హత కలుగు తుంది.శివ స్థితి

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కృష్ణుడు ఎవరు

కృష్ణుడికి ఆలయాలు నిర్మించాము. పూజలు చేస్తున్నాము. భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాము. "హరే రామ హరే కృష్ణ" మహామంత్రాన్ని నిరంతరం జపించుకొనే వాళ్ళమూ ఉన్నాము. అంటే అనుక్షణం ఆ మాహాత్ముడిని మన స్మృతి పథంలో నిలిపి ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నాం.

“కృష్ణుడు” అనే శబ్దం వినగానే స్ఫురించేది ఏమిటి?

భగవద్గీత, పదహారువేల మంది గోపికలతో బృందావన రాసలీలలు, యశోదమ్మ వద్ద చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు, రాధమ్మతో ప్రణయలహరి, సత్యభామాది అష్టసఖులు ఇంకా ఎన్నో... కానీ, ఒక్క క్షణం యోచించండి.
🦚🦚🦚🌺🦚🦚
కృష్ణుని గురించి మనకున్న అవగాహనతో కృష్ణుడిలాంటి ఒక వ్యక్తి దేహధారిగా మనతో సహజీవనం చేయడానికి వస్తే, అంగీకరించి, ఆదరించి, అభిమానించే వాళ్ళం ఎంతమందిమి? పైకి అంగీకరించినా, అంతరాంతరాల్లో మింగుడు పడని ప్రశ్నే అవుతాడు కృష్ణుడు.

ఎప్పుడో ఐదు వేల సంవత్సరాలనాడు ఉండి, పోయిన కృష్ణుణ్ణి, మన తాత, తండ్రులు చెప్పారని పూజించటం, కృష్ణ తత్వం పట్ల ఎట్టి అవగాహన పెంచుకోకుండా, గొర్రెదాటు మనస్తత్వంతో తరాలు సాగిపోవటం సమర్ధనీయమా? ఒక వ్యక్తిగా కూడా అంగీకరించగలమో, లేదో తెలియని కృష్ణుడికి మనం చేస్తున్న ఈ పూజలు, స్మరణలు, జపాలు అబద్దాలు, మనల్ని మనం మోసం చేసుకొనే చర్యలు కావా?!!

మరి కృష్ణుడు అంటే ఏమిటి?🦚🙏

అధికశాతం మందికి కృష్ణుడు గీతచార్యుడుగానో, బృందావన రాసలీలా విహారిగానో స్ఫురణకు వస్తాడు.

“కృష్ణ” అంటే,🙏

నీ గుండె లోతుల్లోకి చూచుకొన్నపుడు గుబులు, గుబులుగా, వెలితిగా దేన్నైతే అనుభూతి చెందుతావో ఆ వ్యధ, వెలితిల సమాహార స్వరూపమే కృష్ణుడు. ఒకానొక తీరని కాంక్షతో, దేన్ని పొందలేక అసంపూర్ణంగా మిగిలి ఉన్నామని అనిపిస్తుందో, దేని సంయోగంతో పరిపూర్ణం కాగలమని ఆర్తిగా ఎదురుచూస్తామో ఆ నిండుతనమే కృష్ణుడు.
🦚🦚🦚🌺🦚🦚
ఎట్టి జీవికైనా, ఏ పరిస్థితిలోనైనా బాసటగా నిలిచి చేయి పట్టి నడిపించించగల తోడు కృష్ణుడు.

'కన్నయ్యా!' అన్న యశోదమ్మకు సమస్త విశ్వమూ తనలోనే దర్శింపజేసినాడు.

'అన్నా!' అన్న ద్రౌపదీ దేవి ఆర్తనాదానికి కరిగిపోయి, ఆమె అభిమానాన్ని నిలబెట్టినాడు.

'కృష్ణా!' అంటూ, ఆ పిలుపులోనే కరిగిపోయి, నామమాత్రంతో, దర్శనమాత్రంతో, స్పర్శామాత్రంతో తన్మయురాలై, సర్వం విస్మరించి, ఆ భావంలోనే లయించిపోయిన రాధమ్మ, వియోగానికి తనను తాను సమర్పించుకున్నాడు.
🦚🦚🦚🌺🦚🦚
'బావా!' అని పిలిచినా, 'నువ్వే తల్లి, తండ్రి, సఖుడు , ఫ్రియుడు, గురువు, దేవుడు అని నమ్మి, నడయాడిన అర్జునునికి భగవానుడైన అమృత బోధ చేసి, విశ్వమంతా తానే నిండి ఉన్నానని మహదానుభవంతో అక్కున చేర్చుకున్నాడు.

'మిత్రమా!' అని చేరవచ్చిన కుచేలుని ఒడి నిండా సమస్త సంపదలూ నింపివేసినాడు.

ఇది, అది అననేల! వారేది చేసినా దాని వెనుక భావమొక్కటే.

ప్రతివారిలోని అసంపూర్ణతకు పరిపూర్ణత చేకూర్చడమే కృష్ణ తత్వం.

"కృష్ణం వందే జగద్గురుం" అన్నదానికర్థమదే.

కృష్ణుడు అనగానే కామవికారాలతో కూడిన శృంగార భావనను ఏర్పరచుకున్న వారికిదే సమధానం.
🦚🦚🌺🦚🦚🌺
'కృష్ణస్య హృదయం రాధా, రాధాయాః హృదయో హరిః' అన్నప్పుడు, రాధమ్మ హృదయం ఎలా ఉండి ఉంటుందనుకొన్నారు?!!

సర్వదా కృష్ణుని సుఖాన్నే కోరుతూ, అతడు సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆ సుఖంలో ఏదైనా బాధ కలుగుతుందేమో అని భయం చెందుతూ, ఆ భయంతో క్షణమైనా స్థిమితంగా ఉండలేక, అనుక్షణం ఆ శ్రీకృష్ణుని దివ్యదర్శనం కోసం పరితపిస్తూ, ఒక్కసారిగా కృష్ణుడు కనుల ముందు నిలవగానే, సమస్తాన్నీ మరచిపోయి, వారి దివ్యమోహన రూపలావణ్యంతో, సౌందర్యంలో మైమరచిపోయి, కోటి కోటి బ్రహ్మాండాలలోని సుఖం యావత్తూ ఒక కోట్యంశానికి కూడా సమం కాని, ఆ కృష్ణ సంయోగానుభవంలో సంలీనమౌతూ, కృష్ణుడు కానరాని కాలాల్లో, వర్ణనాతీతమైన వియోగ దుఃఖాన్ని దిగమింగుకోలేక, వెర్రిదానిలా బృందావనంలోని ప్రతి చెట్టుని, పుట్టనీ, యమునా తీరంలోని ప్రతి ఇసుక రేణువునూ కృష్ణుని జాడ తెలుపమని కలవరిస్తూ, కరిగిపోయి, కన్నీరు మున్నీరు అవుతుంది.
అదీ రాధమ్మంటే!!
🦚🦚🦚🌺🦚🦚🦚🌺🦚🦚🌺
మధుర భావ సాధనలో ఉండగా శ్రీ రామకృష్ణ పరమహంస, రాధమ్మ, గోపికల అనుభవాన్ని ఇలా వివరించారు,
"పూర్తిగా కామహీనులు కాకపోతే మహాభావమైన రాధాదేవి ప్రేమభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని చూడగానే గొపికల మనస్సులు కోటానుకోట్ల రత్యానందం కంటే అధికానందంతో పొంగిపొరలేవి. అలాంటప్పుడు పరమ తుఛ్ఛమైన ఈ దైహిక సుఖాన్ని గురించి వారి మనస్సులు ఎలా యోచిస్తాయి? శ్రీ కృష్ణుని దేహం నుండి వెలువడే దివ్యజ్యోతి వారి శరీరాలను స్పృశించి, ప్రతి ఒక్క రోమ కూపం ద్వారా అనంతమైన ఆనందాన్ని అనుభవింపజేసేది."

ఇంద్రియ మనోనిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమైన, మహానుభావుడు రామకృష్ణుడు చెప్పిన మాటలివి.

అటువంటి శ్రీ కృష్ణుని చల్లని తోడు, సర్వులకూ సదా నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ                                           మీ కృష్ణసందేశం
     . 🦚కృష్ణం వందే జగద్గురు మ్🦚

11, ఏప్రిల్ 2020, శనివారం

చిన్మయానంద మరియు విదేశీయుడు

*విదేశీయుడు*: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: జీసస్
*విదేశీయుడు*: ఇస్లాం స్థాపకుడు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: మహమ్మద్

*విదేశీయుడు*: హిందూ మత స్థాపకులు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.
*విదేశీయుడు*: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

*స్వామి చిన్మయానంద*: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

*విదేశీయుడు*: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

*స్వామి చిన్మయానంద*: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…
*హైందవం ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం*
*హిందూ ధర్మం సనాతనమైనది*💪🏼💪🏼💪🏼💪🏼

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

మరణంలో స్మరణ మహిమ

మరణంలో స్మరణ మహిమ

పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.

ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు.

వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,
దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.

ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.

ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.

ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.

ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!

రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
 జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః." 

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు. 

మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: 
“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, 

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.

మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.

తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.   నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.

ఇలా కొంతకాలం గడిచింది.

దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”

బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే:

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!

ధ్యానం అనుభవాలు

ధ్యానుల అద్భుత అనుభవాలు వినండి      https://www.youtube.com/results?search_query=pmc+meditation+experiences

చంపాలాల్

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

      _*🤔*నీవెన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించినా, ఎన్నో కోట్లు కూడ బెట్టినా, అవేవీ నీ చావును ఒక్కక్షణం ఆపగలవా? లేదా ఒక్క నిమిషం నీ చావును వాయిదా వేయగలవా? అదేమిటో చూద్దామా..*_

        _**అది మద్రాసు నగరంలోని ప్యారీస్ కార్నర్ కు మరోవైపు ఉన్న గోవిందప్ప నాయకన్ స్ట్రీట్, ఆ వీధిలో నివాసముంటూ ధనలక్ష్మీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు చంపాలాల్. ఇతని దృష్టిలో ఈ ప్రపంచంలో అతి విలువైనది డబ్బే అంటూ ఇప్పటివరకు తన జీవితంలో సమయాన్ని మొత్తం కేవలం డబ్బు సంపాదనకే కేటాయించిన వాడు చంపాలాల్. అయితే కొద్దిరోజుల క్రితం అతడు హటాత్తుగా మరణించాడు. ఆయన చనిపోయే ముందు ఒక సందేశాత్మక ఉత్తరం వ్రాసి అందులోని సారాంశాన్ని తన తోటి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందించ వలసినదిగా తన కొడుకులను కోరాడు. చంపాలాల్ కొడుకు చందులాల్, తన తండ్రి మరణానంతరం వారి నిర్వహణలోనే ఉన్న జైన్ మెమోరియల్ హాల్ నందు, తన తండ్రి మరణానంతర సంతాప సభను ఏర్పాటు చేశాడు. తన తండ్రి చివరి కోరికగా తన తండ్రి తాను చివరి సారిగా రాసిన ఉత్తరం యొక్క సారాంశాన్ని తమ తోటి వ్యాపారులకు తెలియచేయడం కోసం సభను ఏర్పాటు చేయడం జరిగింది.*_ 

         _**ఇంతకూ ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే, అది సుమారు అరవై సంవత్సరాల క్రితం మాట, అప్పుడు చంపాలాల్ వయసు పది సంవత్సరాలు. గుజరాత్ లో ఓ కుగ్రామంలో ఉండే చంపాలాల్ కుటుంబం చాలా బీదది మరియు పెద్దది. చంపాలాల్ తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం సరైన భోజనం చేయడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో మద్రాసు నగరంలో ఉండే మహావీర్ జైన్ ఇంట్లో పనిచేయడానికి అక్కడకు పంపబడినాడు చంపాలాల్. తన జీతం డబ్బులు తన తండ్రికి చేరేవి తప్ప ఇతడికి మాత్రం ఇంటికి వెళ్ళడం కుదిరేది కాదు. చాలా అరుదుగా వెళ్ళేవాడు. పని వత్తిడి అలా తీవ్రంగా ఉండేది. అలా పని చేస్తూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు. బాగా డబ్బు సంపాదించాలన్న కసితో మద్రాసులోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూనే మెల్లగా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ, రేయింబవళ్ళు కష్టపడి వందలనుండి వేలు, వేలనుండి లక్షలు, లక్షలనుండి కోట్లు సంపాదించాడు. ఎన్నో ఆస్తిపాస్తులను కూడగట్టేందుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వివాహం జరిగి పిల్లలు కలిగి వారూ పెద్దవారై పెళ్ళిళ్ళు అయినా సరే చంపాలాల్ వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించక ఇప్పటికీ వ్యాపారాన్ని తన చేతుల మీదుగానే నడిపిస్తున్నాడు.*_ 

       _**అలా క్షణం తీరికలేకుండా ఎప్పుడూ వ్యాపారం, సంపాదన అంటూ బిజీగా గడుపుతున్న చంపాలాల్ కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా గడపడానికి సమయం అస్సలు ఉండేది కాదు. తోటి బంధుమిత్రులు ఇంకా ఎంతకాలం సంపాదిస్తావు, ఉన్నది చాలు కదా ఇక వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించి కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా మనుమలు మనుమరాల్లతో హాయిగా గడిప వచ్చుగదా అనేవారు. కానీ నేను వారితో గడిపే సమయాన్ని నా వ్యాపారానికి కేటాయిస్తే మరో లక్ష రూపాయలు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నా కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆనందంగా జీవిస్తారని అనేవాడు. మనిషి జీవితంలో డబ్బే విలువైనది. ఎందుకంటే చిన్న తనంలో తాను పడ్డ కష్టాలు తనవారు పడకూడదు అనుకుంటూనే ఓపిక ఉన్నంతవరకు తన పిల్లలు, వారి పిల్లలు, వారివారి పిల్లలు సుఖంగా, హాయిగా జీవించడానికి అవసరమైన డబ్బును సంపాదించి వారిని ఆనందంగా ఉంచడమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేవాడు. కాలం గడుస్తున్నది, ఒకరోజు వ్యాపార పనులు ముగించుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్న చంపాలాల్ ను ఎవరో తట్టి తట్టి "లే పోదాం పద ఇక్కడ ఇక నీ టైం అయిపోయింది " అంటూ ఎవరో గంభీర స్వరంతో పిలుస్తూ లేపుతున్నారు.*_

         _**కళ్ళు తెరిచి చూసాడు చంపాలాల్, ఎదురుగా వజ్ర ఖచిత మణి మాణిక్య ఆభరణాలతో అలంకరించబడి ఉన్న ఆజానుబాహుడైన ఒక దేవతామూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అని అడగబోయి పక్కనే ఉన్న దున్నపోతును చూసిన అతనికి అర్థం అయ్యింది ఆయన యమధర్మరాజు అని. అయినా ఏమిటి ఎందుకొచ్చారు అని అడిగాడు. ఇక్కడ నీ టైం అయిపోయింది. ఇక నాతో యమపురికి బయలుదేరు అన్నాడు. లేదు లేదు నేను నా కుటుంబంతో ఇంకా సంతోషంగా, ఆనందంగా ఒక్కపూట కూడా గడపనేలేదు. వారి ఆనందం కోసం నేను ఇక్కడ డబ్బు సంపాదించ వలసినది చాలా ఉంది. దానికే నాకు టైం సరిపోవడం లేదు, కాబట్టి నేను ఇప్పుడే వచ్చే ప్రసక్తే లేదని అన్నాడు. అందుకు యమధర్మరాజు కోపంతో చెప్పేది నీకే, ఇక్కడ నీ సమయం అయిపోయింది. పోదాంపదా అంటూ హుంకరించాడు.*_

         _**ఇక లాభం లేదని తను లంచాలిచ్చి అధికారులను లోబరుచు కొన్నట్లుగా యముడిని కూడా కొనేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ, సరే నీకు నేను రెండు కోట్లు ఇస్తాను నన్ను రెండు నెలలు వదిలై, ఈ లోపు నేను సంపాదించిన డబ్బును, నా ఆస్తి పాస్తులను, నా వ్యాపారాన్ని నా కొడుకులకు అప్పగించి వారితో ఆనందంగా ఈ కొన్ని రోజులైనా గడిపి వస్తాను అన్నాడు. అందుకు కుదరనే కుదరదు అన్న యముడితో సరే నీకు పది కోట్లు ఇస్తాను నన్ను ఒక్కరోజైనా నా నావారితో ఆనందంగా ఉండనివ్వండి. నేను సంపాదించినవి అన్ని అందరికీ అప్పగించి వస్తాను అన్నాడు. అందుకూ వొప్పుకోనన్న యముడిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్న చంపాలాల్ చివరికి నా యావదాస్తినీ నీకు ఇస్తాను నాకు "ఒక్క గంటైనా నా కుటుంబంతో గడపడానికి సమయమివ్వండి, నా వాళ్ళతో ఆనందంగా గడిపి వస్తానంటూ " ప్రాధేయపడ్డాడు. నీవు ఎన్ని కోట్లను ఇచ్చినా నాతో ఒక్క క్షణాన్ని కూడా కొనలేవు, ఇక నీకు టైం లేదు. ఇంక నీకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండే అర్హత లేదు, నాతో బయలుదేరిరా అన్నాడు.*_

          _**అప్పుడు అర్ధం అయ్యింది చంపాలాల్ కి ఇంతకాలం తన జీవితంలో అతి విలువైనది డబ్బు అనుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా గడపలేక పోయాను. అందుకు ఒకపూట కూడా సమయాన్ని కేటాయించలేదు. ఇప్పుడు నేను జీవితాంతం ఏంతో కష్టపడి సంపాదించినది, అతి విలువైనది అని భావించిన డబ్బును అంతా పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేక పోయాను. కనీసం ఈ సందేశాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పే సమయం కూడా లేకపోయిందంటూ యమధర్మరాజు పాదాలు పట్టుకొని ఏడ్చి, చివరికి తన వారికి ఒక ఉత్తరం వ్రాయడానికి అవకాశం కల్పించాలంటూ ప్రాధేయపడ్డాడు. చంపాలాల్ బాధను చూసి కరిగిపోయిన యముడు అందుకు అవకాశం ఇచ్చాడు. ఆ కొంత సమయంలో అతడు తన కుటుంబ సభ్యులకు ఈ ఉత్తరం ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే "మనిషికి డబ్బు అవసరమే కానీ జీవితాంతం వరకు డబ్బు సంపాదనే ధ్యేయం కాకూడదు. డబ్బును సంపాదించడం వల్ల వచ్చే ఆనందం కన్నా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే కొంత కాలమైనా విలువైనది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తమ కుటుంబ సభ్యులతో కొంత సేపైనా గడపండి. అదే డబ్బు కన్నా విలువైనది". నేను తప్పుచేశాను. అదే తప్పును మీరూ చేయకండి. "ప్రతిరోజూ మీ కుటుంబం కోసం ఒక గంట సమయాన్ని కేటాయించి వారితో ఆనందంగా గడపండి". అనే సందేశాన్ని ఆ ఉత్తరం ద్వారా అందరికీ అందించాడు.*_

        _**కాబట్టి మిత్రులారా ! మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో గానీ ప్రస్తుతం ఈ కరోనా వైరస్ పుణ్యమా అంటూ కొన్ని రోజులు, ఇరవైనాలుగు గంటలూ మనం మన కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీమీ ఇండ్లలోనే ఉంటూ, ఎవ్వరూ బయటకు రాకుండా, ఇంట్లో ఉన్నవాటిని వండుకొని తింటూ, నీ తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో ఆడిపాడుతూ, గడిచిపోయిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ, ఇలాంటి మంచి మెసేజ్ లను అందరికీ పంపించుకొంటూ, మీ జీవితాలను ఆనందమయం, సుఖమయం, సంతోషమయం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..*_

     _**సర్వే జనా సుఖినోభవంతు.**_

హిందువులారా మేలుకోండి

మిత్రులారా! కన్నులుండి చూడలేని బుర్రుండి ఆలోచన లేని  హిందువులారా ఇది కాస్త చదవండి!

1378 లో భారతదేశం నుంచి ఒక భాగం వేరు పడి ఇస్లామిక రాజ్యం అయింది - దాని పేరు ఇరాన్. 
1761లో భారతదేశం నుంచి మరో భాగం వేరు పడి మరో ఇస్లామిక్  రాజ్యం ఏర్పడింది – దాని  పేరు అఫ్ఘనిస్థాన్.
1947లో భారత్ నుంచి మరోభాగం వేరుపడి మరో ఇస్లామిక్ రాజ్యం ఆవిర్భవించింది – దాని పేరు పాకిస్థాన్ 
1971లో అదే పాకిస్థాన్ నుంచి మరో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది – దాని పేరు బంగ్లాదేశ్.
1952 నుంచి 1990 మధ్య భారత్ లో మరో భాగం ఇస్లాం మయం అయింది – దాని పేరు కాశ్మీర్.. 
ఇపుడు ఉత్తర ప్రదేశ్, అస్సామ్ మరియు కేరళలను.బెంగాల్ లను ఇస్లామిక్ రాజ్యాలుగా తయారు చేయాలనే పనిలో పడ్డారు ఈ జిహాదీలు. 
ఎపుడైన మనం మన తోటి హిందువులను, హిందూ సంస్కృతిని జాగృతం చేద్దామనుకున్నవాళ్లను...RSS, VHP మరియు శివసేన, BJP తొత్తులు అంటూ మన మీద ఒక రకమైన ముద్ర వేస్తున్నారు. 
 ఇప్పటి వరకు చదివిన వారు...మరికాస్త ఓపికగా కింది పోస్ట్ ను దయచేసి చివరి వరకు చదవగలరు...
ధర్మం పేరు మీద భారత్ ను ముక్కలు చేసిన జిన్నా ముస్లిము.
కోట్లాది హిందువుల రక్తాన్ని పారించిన ప్రతి సుల్తాను ముస్లిమే. 
ఎంతో మంది హిందువులను ఇస్లామ్ లో మారేటట్టు చేసిన (తబ్లీక్)ను ప్రవేశపెట్టిన అరబ్బులు ముస్లిమ్ లే. 
అయోధ్యలో రామ మందిరాన్నికూల్చిన బాబరు కూడా ముస్లిమే. 
హిందూ ధర్మ కోసం పోరాడిన గురు తేగ్ బహదూర్ తల నరికిన ఔరంగజేబు ముస్లిమే. 
కాశ్మీర్ లో పండిత్ లను నరసంహారం చేసిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే.
1993లో ముంబాయి బాంబ్ బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం కూడా ముస్లిమే. 
భారత్ లో అక్రమంగా ప్రవేశించిన 5 కోట్ల బంగ్లా దేశీయులు కూడా ముస్లిములే. 
బుద్దుడు, మహావీరుడు వంటి మూర్తులను విరగ్గొట్టిన ప్రతి ఆతంకవాది ముస్లిమే.
పవిత్రమైన భారత  పార్లమెంటుపై దాడిచేయించిన అఫ్జల్ గురు కూడా ముస్లిమే. 
గోద్రాలో కరసేవకులను రైళ్ల పెట్టెలో సజీవ దహనం చేసిన జిహాదీలు ముస్లిములే. 

26/11 లో ఎంతోమంది అమాయకులను బలిగొన్న కసబ్ ముస్లిమే. 
అమర్ నాథ్ యాత్ర పై ఆంక్షలు విధించాలని చెప్పిన గిలానీ ముస్లిమే. 
కాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై జిజియా పన్నులాంటిది...
 వసూళు చేయాలని చెప్పిన ఒక కాశ్మీరీ మంత్రి కూడా ముస్లిమే. 
100 కోట్లకు పైగా హిందూవులను నరుకుతా అని ప్రతిజ్ఞ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిమే. 
దానితో పాటు...ఆవులను నరికి తినే ప్రతివాడు ముస్లిమే.
మనదేశంలో వుంటూ వందేమాతరం, భారత్ మాతాకీ జై అనిని వాడు కూడా ముస్లిమే. 
కాశ్మీర్ లో భారత్ ముర్ధాబాద్ అనే ప్రతివాడు ముస్లిమే. 
హైదరాబాద్ లో భారత జాతీయ పతాకాన్ని కాల్చివాడు ముస్లిమే. 
లవ్ జిహాద్ చేసిన షారుఖ్, అమీర్, సైఫ్ లు కూడా ముస్లిములే. 
ఎవడైతే ఈ మెసేజ్ చదివి ఫార్వడ్ చేయడో వాడుకూడా ముస్లిమే. 
ఎవరైతే జిహాది ముస్లిమ్ లున్నరో వారందరికి గట్టి జవాబు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. 
ఈ రోజు తెలుస్తుంది మన హిందువుల ఐక్యత ఏ పాటిదో...!
 వందేమాతరం 
మీ భరతమాత ముద్దుబిడ్డ.
   మొత్తానికి
జాగో హిందూ జాగో ...!🚩🚩🚩

గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టి

క్రైస్తవ ముష్కరుల పాలిటి సింహం -గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి 
--------------------------------------------------------------------------

భారతీయ సంస్కృతీ మీద విషపు దాడులు చేస్తున్న ఆనాటి మద్రాస్ ప్రభుత్వం మీద , క్రైస్తవాన్ని  పెంచి పోషిస్తూ మతం మారిన వారికి ఉద్యోగాల ఆశ చూపిస్తూ.. ఒకవేళ మతం మారినా వారి పూర్వీకుల ఆస్తులు వారికి చెందేట్టు చర్యలు తీసుకున్న ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాడి తన యావదాస్తిని పోగొట్టుకుని చివరకు బికారిగా జీవించి చనిపోయిన వ్యక్తి గూర్చి చెప్పుకుందామా ? ఆయనే గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి గారు . అచ్చ తెలుగు అంధ్రుడే. 

మద్రాస్ లో తెలుగు వైశ్య వ్యాపార కుటుంబములో చేతి రుమాళ్ల వర్తకం చేసే కుటుంబం లో  సిద్ధులు శెట్టి దంపతులకు జన్మించిన అయన ఉన్నత చదువులు కాగానే కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాడు. తండ్రి మరణం తర్వాత తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు . అమెరికా విప్లవం తర్వాత పెరిగిన పత్తి ధరల సమయములో  అత్యంత లాభాలు ఆర్జించిన లక్ష్మీనరసయ్య శెట్టి కేవలం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో కృషి చేయలేదు. అంగ్ల ప్రభుత్వ హయాములో కిరస్తానీ మిషనరీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి తమ మతాన్ని భారతీయ హైందవుల మీద రుద్దడానికి ప్రయత్నించాయి. ఆంగ్ల ప్రభుత్వం కూడా దీనికి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది .  లక్ష్మీ నరసయ్య శెట్టి  క్రైస్తవాన్ని రుద్దుతున్న ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకున్నారు ప్రథమ స్వతంత్ర పోరాట సమయానికి మునుపు 1840  లలో .

మద్రాస్ కళాశాలల్లో బైబిల్ ని ప్రవేశ పెట్టారు. దీనికి వ్యతిరేకంగా లక్ష్మీ నరసయ్య శెట్టి ఆధ్వర్యములో జరిగిన నిరసనల్లో ఆంగ్ల ప్రభుత్వం వెనుకంజ వేయక తప్పలేదు. మతం మారిన  తర్వాత హిందువులు తమ  పూర్వీకుల ఆస్తుల మీద హక్కులు  కోల్పోకుండా ఉండేందుకు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది . దీని మీద ఆనాటి హైందవ భారతీయుల్లో నిరసన ధోరణి మొదలు అయింది. దీనికి లక్ష్మీ నరసయ్య శెట్టి గారే నాయకత్వం వహించారు. ఆంగ్ల ప్రభుత్వానికి  మన భారతీయుల వాదనలు  వినిపించేందుకు ఒక పత్రికను కూడా ఆరంభించారు. రైతుల మీద జరుగుతున్న దాడులను ఆ పత్రికల్లో తీవ్రంగా ఎండగట్టారు . అదే మొట్టమొదటి భారతీయ పత్రిక కూడా . అది 1844   అక్టోబర్ రెండున ఆరంభమయింది. ఆ పత్రిక మీద ఆంగ్ల ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. అనేక వ్యయప్రయాసలకోర్చి పత్రికను నడిపించి భారతీయ హైందవ  వాణిని వినిపించారు. 

1853  లో మళ్ళీ ఆంగ్ల ప్రభుత్వం బైబిల్ ని పాఠ్య పుస్తకనాగ్ ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. దీని మీద లక్ష్మీ నరసయ్య శెట్టి తీవ్రంగా గళమెత్తి ఉద్యమాన్నే లేవదీశారు. శిస్తులు కట్టలేని రైతుల మీద అంగ్లప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేది. ఆ రైతుల వీపు మీద బరువులు పెట్టి వీధులలో త్రిప్పేది . దీనిని తీవ్రంగా గర్హిస్తూ లక్ష్మీ  నరసయ్య శెట్టి  ఆంగ్ల ప్రభుత్వముతో వాదనలకు దిగారు. ఆంగ్లేయుల మీద పోరాటం సలుపుతూ మొట్ట మొదటి రాజకీయ పార్టీని కూడా మొదలు పెట్టింది గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టిని అని ఎందరికి తెలుసు . ఆంగ్లేయుల కిరాతాకాలు, దోపిడీలు, క్రైస్తవుల ఆగడాలను ఎదుర్కొనడానికి తన  మిత్రుడు , సహాయకుడు అయిన సోమసుందరం శెట్టి గారితో కలసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసారు. వీరి కృషి వలన క్రైస్తవ మిషనరీల  మతమార్పిడి   ఆగడాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేట్టు చేసారు.  పూర్తిగా భారత దేశం ఆంగ్లేయుల హస్తగతమైంది పిమ్మట హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆగాలంటూ అంటాయి ఆంగ్ల ప్రభుత్వానికి  తాము ఆరంభించిన మద్రాస్ నేటివ్ అసోసియేషన్  పార్టీ తరపున వ్రాసిన  లేఖలు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వములో కలకలం సృష్టించాయి. 

ప్రభుత్వ ము మీద జరుపుతున్న పోరాటాలలో మరియు హిందువుల ఆస్త్యుల మరియు హక్కుల రక్షణ కోసం జరిపిన పోరాటాల్లో అనేకమార్లు విజయం సాధించిన లక్ష్మీనరసయ్య శెట్టి మెల్లగా తన ఆస్తులన్నీ ఈ పోరాటాల ఫలితంగా కరిగిపోయాయి. శఠగోపాచార్లు తరువాత మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నిక అయిన లక్ష్మీ నరసయ్య శెట్టి  అక్కడ బలంగా భారతీయ వాణిని ఆంగ్ల ప్రభుత్వానికి వినిపించారు. దానధర్మాలు, రాజకీయ పోరాటాలకు , హిందూ మత ఉద్ధరణకు తన సంపాదననంతా సద్వినియోగం చేసిన శ్రీమాన్ లక్ష్మీ నరసయ్య శెట్టి తన చివరి రోజులలో ఆకలితో తన కుటుంబముతో గడిపిన రోజూ ఉన్నాయి. అప్పట్లోనే లసుఖాల రూపాయ వ్యాపారం చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి చివరకు దారిద్ర్యముతో పోరాడుతూ  1868  లో మరణించారు. 

ఇన్ని త్యాగాలు చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి గారిని ఏ ఒక్క హిందూ సంఘం అయినా గుర్తు పెట్టుకున్నాడా ? లేదే ? కనీసం ఆయన విగ్రహాలు వీధి వీధినా పెట్టకున్నా సరే ఆయన్ని తమ స్మృతిలో ఉంచుకున్నదా ?  ఇలాంటి హైందవ ధర్మ వీరులు కదా మనం ఎన్నడూ గుర్తు పెట్టుకుని స్మరించవలసినది . రాజకీయనాయకులు, డబ్బులకోసం సినిమాల్లో కేవలం నటన చూపే వారి మీద  మూర్ఖంగా ఎందుకు అంతులేని  అభిమానం చూపిస్తారో నేటి యువతలో కనీస  మార్పు రావాలి అన్ని ఆశిస్తూ - హిందువులకై, హిందువుల రక్షణకై  పోరాడిన తెలుగు తేజం లక్ష్మీనరసయ్య శెట్టి గారిని స్మరిస్తూ ముగిస్తున్నాను.

నిజమైన పూజ

నిజమైన పూజఅంటే ఏమిటీ

దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 

దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.

అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.

అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.

సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.

సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.

భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. 

చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదు.

నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు.

చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.

దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. 

 దేహాత్మబుద్ధి వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 

అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

పరోపకారం

"పెరు ప్రఖ్యాతులు కల ఒకానొక డాక్టర్ తీవ్రమైన కడుపునొప్పి తో బాధపడుతూ డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగా మరణిస్తాడు.అధోలోకం కు వెళ్లి నరకయాతన పడతాడు.హృదయపూర్వకంగా ఉన్నత లోక మాస్టర్లను సహాయం చేయమని,కోరుకుంటాడు.వారు వెంటనే అతనిని ఉన్నత సూక్ష్మ లోకానికి తీసుకు  వెళ్లు  తా రూ."నువ్వు ఆత్మహత్య తో మరణించావు !"అంటారు మాస్టర్స్."నో ,నేను తీవ్రమైన జబ్బు తో మరణించ్చాను
  అంటాడు."నువ్వు పెంచి పోషించుకున్న నీ అహంకారం,ఇతరుల అభివృద్ధిని చూసి నువ్వు  ఓర్వలేక పోవడం,కోపం ,ద్వేషం,అసూయ ఈర్ష్య లాంటి అవలక్షణాలు నిన్ను తీవ్రమైన అనారోగ్యం  పాలు చేసి ,నిన్ను చంపేసాయి.ఆ అవలక్షణాల వల్ల నువ్వు మరణించావు.కాబట్టి ,దీనిని 'ఆత్మహత్య 'అంటారు.అని డాక్టర్కు తెలియ జేశారు.తర్వాత ,అక్కడి మాస్టర్ల సహాయం తో ఆత్మజ్ఞానం,ప్రేమ,దయ,కరుణ,జాలి ,లాంటి దైవ గుణాలను అలవాటు చేసుకొని అందరికి ఉన్నత జ్ఞానం అందించి గొప్ప మాస్టర్ గా ఏదుగు తాడు. కాబట్టి,ఏ వైరస్ ,ఏ ఆటం బాంబ్ మనలను.ఏమీ చేయదు మనలో దైవ గుణాలు పెంపొందించుకుంటే !" ఎందుకంటే మన ఈ లోక జీవితం తాత్కాలికం .మరణం తర్వాత జీవితం చాలా ఉంటుంది.అక్కడ సుఖంగా జీవించాలి ఒంటరిగా వెళ్లి ,ఒంటరి గానే .!మంచి లక్షణాలు కలిగి పరోపకారం చేస్తూ ఇక్కడ జీవిస్తే అక్కడ శాంతి తో వుండకలుగుతాము మరల మంచి జన్మ పొందకలుగుతాము.ఏ పదవీ,ఏ హోదా,సంపద కుల పిచ్జి ,ఏ దేవుడు కరుణించి  కాపాడదు.మనమే పోరాడాలి మనమే జయించాలి అంటే ఈ భూలోక జీవితం పర్ఫెక్ట్ గా ధ్యానం తో జీవించాలి.

భగవంతుడు

💐భగవంతుడు💐

 ఒక స్త్రీ కాదు ఒక పురుషుడు కాదు ఒక నపుంసక మూర్తి కాదు ఒక వస్తువు కాదు ఒక వ్యక్తి కాదు అనునిత్యం నిన్ను వెంట ఉండి కాపాడే సమ్మోహన శక్తి 

ఏక్కడున్నాడు భగవంతుడని అడుగుతావ్ ఏమో నీలో నే ప్రాణ,అపాన , వ్యాన ఉదాన సమాన క్రుకర ధనుంజయ దేవధత్తము అనేది వివిధ వాయు రూపాలలో నీలోనే నిక్షిప్తమై నీవు తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తూ శక్తి రూపం లో సేవ చేస్తున్నాడు అయినా నీకు నమ్మకం లేదా ప్రపంచం లో ఏన్నో కంపెనీ లు ఇండస్ట్రీ లు పెట్టాను నా అంత ప్రజ్ఞా వంతుడు లేడుఅంటావేమో మరి నీ ప్రజ్ఞ తో రక్తాన్ని సరఫరా చేసే ఫ్యాక్టరీ తేగలవా?
ఈ శరీరం నాదే 
ఈ వస్తువులు నావే అని బ్రాంతి తో విర్రవీగుతారు కొందరు 
మీరనుకునేల ఈ శరీరం మీదే ఐతే కాసేపు మీ శరీరం లో వున్నభాగాల ఎదుగుదలను కాసేపు ఆపండి చుద్దాం మీ హృదయాన్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరండి శరీరం మీదే కదా విశ్రాంతి తిసుకుంటుందేమోచుద్దాం దానికి కావాల్సింది నీ ఆజ్ఞ కాదు భగవాన్ శాసనం
నాది నాది అనుకునే 
ఏది నిన్ను రక్షించదు భార్య వాకిలి వరకు, బిడ్డలు ఇంటి వరకు, కొడుకు అంత్యేస్తి వరకు స్నేహితులు స్మశానం వరకు 
ఇదే నీ జీవిత గమనం 

నిన్ను ఆపద లో రక్షించ గలవారు ఎవరినా వుంటే అది మన భగవాన్ ఒక్కడే అని గుర్తుంచుకో వయసై పోయాక పూజ పునస్కారం అని తప్పించుకోకుండా నీ వున్నతి కొరకు నీవు ఆలోచిస్తే మనుష్య ఉపాది లోకి ఒచ్హావు కనుక ఇప్పడి నుండే భగవంతుడికి కనీసం ఒక పువ్వైన సమర్పించి సర్వస్య శరణాగతి చెప్పుకో ఆ పుణ్యం ఒక్కటే నిన్ను కాపాడుతుంది మనసారా భగవాన్ నామం పలికి ధన్యుడివి కా
జీవితానికి ఒక సార్ధకత సిద్దిస్తుంది🌸🌸🙏🙏

ధ్యానం చేయుటకు సమయం లేదా

🧘‍♀ధ్యానం చేయుటకు మాకు అస్సలు సమయం ఉండదు అనుకునే వారు ఇప్పుడున్న ఈ పరిస్థితులను చక్కగా ధ్యానం చేయుటకు ఉపయోగించు కోవచ్చును.

🧘‍♀ధ్యానం చేయుట ద్వారా పొందే లాభాలను విశేషంగా పొందవచ్చును.

 *ధ్యానసాధన చేసే పద్ధతి:*
 
*ధ్యానమంటే "శ్వాస మీద ధ్యాస"*
రెండు కళ్ళుమూసుకుని స్థిరసుఖ ఆసనములో (ఆసనం  సుఖంగా ఉండాలి) ధ్యానము చేద్దాం మిత్రులారా...

'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస' 
(లోపలికి పీల్చుకునే గాలి)... 'అపాన' అంటే 'నిశ్వాస' (బయటికి వదిలే గాలి)
*'సతి' అంటే శ్వాసతో కలిసి ఉండటం*
 
*సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి*

అనేక ఆలోచనలు వస్తున్నా...వాటిని కట్ చేసి శ్వాస మీదనే ధ్యాసను ఉంచాలి.

ధ్యానం సర్వ రోగ నివారణి. 

 *మన ఆత్మ దీపాలను మనమే వెలిగించుకోవాలి.* 

 *సర్వేజనా ముక్తినో భవంతు*🤘

సరియైన అవగాహన కొరకు క్రింది వీడియో చూడండి...
https://youtu.be/a7g8tnU9tuY
ధ్యానం గురించి ప్రాధమిక అవగాహన కొరకు...

అపరాధ భావనలే రోగం

"కాన్సర్ పేషేంట్ అయిన లూయిస్ చిన్న ప్పటి నుండి తనలో అణిచి పెట్టుకున్న కోపం,ద్వేషం,అపరాధ భావన లే తన కాన్సర్ రోగా నికి కారణం అని తెలుసుకుంటుంది.అప్పటి నుండి తన ఆలోచనలను జాగ్రత్తగా గమనిస్తూ ,ఆ గుణాలను.సారి చేసుకోసాగింది.ఎలాగంటే,తనకు కోపం ,ద్వేషం ఇలా నెగెటివ్ భావాలు కలిగించిన వారిని గుర్తు చేసుకోసాగింది
వారిని అందరిని క్షమించి వేసింది
వారి మాటలకు బాధ పడిన ఆమె వారి మాయలను అంగీకరించడం అంటే,accept చేయటం మొదలు పెట్టింది. అలా తన మనసు ను కూడా ప్రేమించడం సాగిచ్చింది.ఇలా తనను తాను ప్రేమించుకోవడం మొదలు పెటీ నాక,తన తో తను స్నేహం చేసుకున్నాక,ఆశ్చర్య కరంగా చాలా తక్కువ కాలం లో ఆమె కాన్సర్ నుంచి బయట పడి,ఆరోగ్యవంతురాలిగా మారిపోయింది.!అన్నీ రోగాలకు మూలకారణం నెగెటివ్ ఆలోచనలు ,నెగెటివ్ భావాలు మాత్రమే !అని స్పష్టంగా తెలుస్తుంది."

ఆత్మ పరమాత్మ కావాలి

💐💐ఆత్మ..పరమాత్మ కావాలి💐💐

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

మీదైన ప్రపంచం

*మీ ప్రపంచంలో మీదైన ప్రపంచం లో ఉండండి* 
 

🌹ఈ ప్రపంచంలో మీరు ఉండండి. కానీ లోపల మీ ప్రపంచంలో విహరించండి. 

🌹స్వేచ్ఛగా మీదైన ప్రపంచాన్ని ఏర్పరచుకోండి. 

🌹మీ శరీరం ఈ ప్రపంచంలో బయట ఉండవచ్చు కానీ మీరు మీ లోపల  మీదైన ప్రపంచంలో
స్వేచ్ఛగా ,హాయిగా ,ఆనందంగా, సౌకర్యవంతంగా, మీరు ఉండండి.

🌹అప్పుడు మాత్రమే బాహ్య విషయాల మీద ఏ మాత్రం ప్రభావితం చేయలేవు బాహ్య సంఘటనలు, బాహ్య అనుభవాలు ,బాహ్య పరిస్థితులు, మిమ్మల్ని ఏ మాత్రం బాధ పెట్టలేదు అందుకే మీరు ఉండాలి మీ ప్రపంచంలో.

🌹మీ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించాలంటే అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ,మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, మీరు తప్పనిసరిగా ప్రతి రోజూ ధ్యానం చేయండి. 

🌹అప్పుడు మాత్రమే మీ ప్రపంచంలో మీరు ఉండగలరు లేకపోతే ఈ బాహ్య ప్రపంచం మిమ్మల్ని లాగేస్తుంది.

🌹ఇప్పుడున్న పరిస్థితులలో మనిషి తప్ప ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. వాటిని చూసి ఎంతో నేర్చుకోండి. గతం లేదు భవిష్యత్తు లేదు ప్రతి జీవి ఎంత హాయిగా ఉన్నాయో జీవించడం అలా వాటిని చూసి నేర్చుకోవాలి. 

🌹అదే సహజసిద్ధమైన జీవితం .ఆనందమైన జీవితం. నిశ్చింత జీవితం .నిర్భయమైన జీవితం.

🌹 ఇంకెందుకు ఆలస్యం ధ్యానం చేద్దాం ఆనందంగా జీవిద్దాం

13, మార్చి 2020, శుక్రవారం

💐🌷🌷మౌనమ్ 🌷🌷💐



మౌనం నిశ్శబ్దం మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంథకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. ''గొంతు మౌనంగా ఉన్నప్పుడు...మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'' అంటారు మెహర్‌ బాబా. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు, నమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీ.వీ. చూస్తూ కూర్చోవడం మౌనం కాదు. అది కొన్ని పాత్రలతోనో, వార్తలతోనో చేసే సంభాషణ. కంప్యూటర్‌ ముందు కూర్చోవడం మౌనం కాదు, అది వేయి గొంతుకల కబుర్లతో సమానం. మౌనంలో మాటలుండవు ఆలోచనలుండవు, అదో తపన్సు.మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణకాదు. మాటలు నేర్పే సంస్థలున్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు...అయితే ఒక్కమాట...మౌనాన్ని మించిన కమ్యూనికేషన్‌ లేదు. మౌనం అర్థ అంగీకారం మాత్రమే కాదు. ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు ముసుగులో బుర్రలోని సామా నంతా పక్కనపెట్టి, నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మసాక్షాత్కారమే. గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో, అనవసరంగా తూలనాడినం దుకో పశ్ఛాత్తాపపడే వారెంతో మందిని చూస్తుంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మనుషులందరూ మాటలకు అలవాడి పడిపోయారు. మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే, వారి మీద వారికే అనుమానమోచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు. కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలల మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలను కునేవారు. ముందుగా మాటల మత్తునుంచి బయట పడాలి ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి. పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతించడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. రోగాల మనసు మౌనంగా ఉండలేదు. బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉం చుకోవాలి. మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని పదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. మాటతూలడం వల్ల పుట్టికొచ్చే విపరీత పరిణామాలుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తి గత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ...మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం, మాటలకు, ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు. సాఫీగా తనపని తాను చేసుకు పోతుంది. నిండుకుండ తొణకదు. స్థిరంగా ఉంటుంది. సమర్థులు కూడా అంతే. మౌనంగా తమపని తాము చేసుకు పోతుంటారు. 'మౌనం' మనలోంచి పుటుకొచ్చే అపారశక్తిని వృధాగా పోనివ్వదు. ఎందుకంటే -వృధా ఆలోచనలుండవు. వృధా మాటలుండవు. ప్రతి ఆలోచనా లక్ష్యంవైపే, ప్రతిమాటా అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉం డగలం. అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాం తానికి, జనసంద్రానికీ తేడా ఉండదు.ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా..మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది.

ధర్మసందేహం-సమాధానం



సందేహం;- అరుంధతి నక్షత్రం కనిపించదు కద ,  అయినా పెళ్లిలో  ఈ నక్షత్రం చూడమంటారు ఎందుకు?

సమాధానం;-  వివాహం జరిగిన తర్వాత వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు)
తూర్పునకు గానీ, ఉత్తరానికి గానీ తీసుకుని వెళ్ళి, మొదట ధ్రువ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు.

ధ్ర్రువ నక్షత్రం లాగ వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతి లాగా మహాపతివ్రతగా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది.

అరుంధతి యొక్క పాతివ్రత్య మహిమను వివాహ సందర్భంలో ఒక్కసారి నవ వధూవరులు మననం చేసుకునేందుకు.

పగటి కాలంలో నక్షత్రాలు సూర్యుని కాంతి కారణంగా కన్పడవు కాని ఉంటాయి. కావున ఆ భావనతో దర్శించి నమస్కరించాలి.

భర్తను వీడక నక్షత్రమండలంలో కూడా భర్తతో నిల్వగల్గిన పవిత్రతను అదృష్టంగా పొందాలని అర్థం.

**********

🌷నిత్య సత్యాలు🌷

🐸🐒🐸🐒🐸🐒🐸🐒🐸🐒






🏕నాకేమీ తెలియదు అన్న
విషయం తెలుసు కోవడమే జ్ఞానానికి తొలి మెట్టు...!!

🏕పోటీ పడడం ఒకానొక అజ్ఞానం.. నీవు చేయగలిగినది సంపూర్తిగా చేయడమే జ్ఞానం... !!

🏕దారితెలిసిన వాడు కాదు .దారిలో వెళ్లే వాడే అసలైన జ్ఞాని...!!

🏕సత్యం తో జీవించడం కష్టం కాదు. సత్యం తో జీవించక పోవడం వల్లే కష్టాలు.. బాధలు...!!

🏕అనుభవం లేని జ్ఞానం ,సమాచారం అవుతుంది.. జ్ఞానం లేని అనుభవం అంధకారం అవుతుంది...!!

🏕మన అజ్ఞానమే  మన అసలైన శత్రువు.. మన జ్ఞానమే మన అసలైన ఆత్మ బంధువు...!!

🏕తెలివైన వాళ్లంతా జ్ఞానులు కాదు. తెలివితక్కువగా కనిపించే వాళ్లంతా అజ్ఞానులు కాదు...!!

🏕జ్ఞాని సర్వ స్వతంత్రుడు.ప్రేమ.. గౌరవాలకోసం ఎవరిపై ఆధార పడడు.. ఎదురు చూడడు. వస్తే కాదనడు...

🐸🐒🐸🐒🐸🐒🐸🐒🐸

అతీంద్రియ శక్తులు



1. ఎథిరిక్ :-
    శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని  "ఎథిరిక్" అని పిలుస్తారు. మానవుని అణువుల పరిభ్రమణం వల్ల ఓ విధమైన విద్యుత్ ఏర్పడుతుంది. ఇది దేహమంతటా పుడుతూనే ఉంటుంది. దేహంలోని నీళ్ళు, లోహపు అణువులూ ఒక దానితో మరొకటి కలగలసి రసాయనిక చర్యల ద్వారా ఈ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన శరీరం మొత్తం ఈ విద్యుత్తు తో నింపబడి ఉంటుంది.
    ఎథిరిక్ శరీరాన్ని ఆనుకుని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళం లో ఎనిమిదో వంతు నుంచి ఒక్కోసారి ఆరు అంగుళాల దూరం వరకు ఈ ఎథిరిక్ వ్యాపించి ఉండవచ్చు. ఈ ఎథిరిక్ వల్ల ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తినీ, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఉత్సాహంగా ఉంటే ఈ ఎథిరిక్ ఎక్కువ దూరం వ్యాపించును. నీరసంగా వుంటే ఇది శరీరానికి అంటుకుపోయి కనిపించును.


2. ఆరా:-
     శరీరాన్ని చుట్టూ ఎథిరిక్ ఆవరించి ఉన్నట్టే 'ఎథిరిక్' చుట్టూ 'ఆరా' మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. ఆరా కూడా ఎథిరిక్ లాగానే ఎలక్ట్రిక్, మాగ్నటిక్ శక్తితోనే ఏర్పడి ఉంటుంది.
     ఎథిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి.  స్థూల శరీరానికి ఎథిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అదే విధంగా ఎథిరిక్ శరీరాన్ని ఆవరించి ఉన్న 'ఆరా' అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. కానీ ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగ్రుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది.  ఈ ఆరా సుమారు 7 అడుగుల ఎత్తు 4 అడుగుల వైశాల్యం ఉంటుంది.  'ఆరా' పై భాగంలో 'హేలో' ఉంటుంది. ఈ హేలో తల మీద పైకి చిమ్మే నీటి ధారలాగా ఉండే ఓ కాంతి పుంజం. ఇది కలువ ఆకారం లో విచ్చుకుంటున్నట్లు ఉండును. ఆరాకు వెలుపల ఓ పొర ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లు
ఈ అమరిక ఉంటుంది. దీనినే 'ఆరాసంచి' (Auric Sheath) అని పిలుస్తారు.
    ఈ ఆరా లు ఏదో ఒక వర్ణంలో కనబడవచ్చు. ఆరా వర్ణాన్ని బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం చెప్పవచ్చు.

➡ ఎరుపు - బలమైన జీవితానికి ఓ సంకేతం.
➡ ఆరెంజ్ - మానవతావాదులు, ఇతరుల యెడల సానుభూతిని కలిగి ఉంటారు.
➡ పసుపు - ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవారు.
➡ ఆకుపచ్చ - సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం.
➡ ఇండిగో - మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళు.
➡ ఊదా ( గ్రే) - అధోగతి పాలయిన వ్యక్తిని ఈ వర్ణం సూచిస్తుంది.

హేలో వర్ణం - మనస్తత్వం
➡ పసుపు లేదా కాషాయం - ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవారు.
➡ బురద - పిచ్చి ఆలోచనలు, వికారమైన ఆలోచనలు కలిగిన వారు.


3. సూక్ష్మ శరీరం:-
    కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి ఉండగలవు. ఉదాహరణకు నీటిలో ఉప్పు వేస్తే కాసేపటికి రెండూ కలిసిపోయినట్లుగానే.  అట్లాగే మన శరీరంలోని అణువులు, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు సులువుగా సర్దుకొని ఉంటున్నాయి. ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో - చాలా పలుచగా - దూరం దూరంగా ఉంటున్న అణువులతో నిర్మింపబడి ఉంటాయి. వీటిని మనం 'సూక్ష్మ శరీరాలు' అని అంటాము.  ఈ సూక్ష్మ శరీరాలలోని అణువుల సాంద్రత స్థూల శరీరంలో అణువుల సాంద్రత కన్నా చాలా రెట్లు తక్కువగా ఉంటుంది. అంచేత ఈ స్థూల, సూక్ష్మ శరీరం రెండు ఒకే స్థలంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండగలుగుతున్నాయి.

సూక్ష్మ దేహాన్ని,  స్థూల దేహాన్ని కలుపుతూ 'వెండి తీగప్రోగు' (సిల్వర్ కార్డ్) ఉంటుంది. ఈ వెండి తీగలోని అణువులు దూర దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయి. అణువులు దూరదూరంగా ఉన్నా బలంగా నిలువగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది. ఈ సిల్వర్ కార్డ్ సహాయంతో సూక్ష్మ-శరీరం ప్రయాణం చేయగలుగుతుంది.
     ఈ సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలలో కూడా విహరించవచ్చును. మనం కనురెప్ప పాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పయనమై వెళ్ళవచ్చు. చనిపోయిన మన పాత స్నేహితులు, బంధువులు కలవవచ్చు.  ఏ సిటీలోని, ఏ లైబ్రరీలోని, ఏ పేజీనైనా క్షణ మాత్ర కాలంలో చదవవచ్చు. మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడ ఉండదు. ఎంత దూరం లో ఉన్న ప్రదేశం అయినా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకోవచ్చు. ఈ సూక్ష్మ శరీరంతో గాలిలో తేలవచ్చు, నీటిలో మునగవచ్చు, అగ్నిలో దూకవచ్చు, భూమి మీద నడవవచ్చు. ఆకాశంలోని వేరే గ్రహాలకు వెళ్ళవచ్చు. విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు. మళ్ళీ తిరిగి మీ స్థూల శరీరానికి సిల్వర్ కార్డ్ ద్వారా కనురెప్ప పాటులో చేరవచ్చు.

4. ఆకాషిక్ రికార్డు:-
     దీనినే విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారం లేక సూక్ష్మ విజ్ఞానకోశం అని పిలుస్తారు. ఆకాషిక్ రికార్డు అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన. ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు, శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకుని
ఉంటుంది. ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోని, అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞాన తరంగాలను రికార్డు చేస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు అనేవి ఎప్పటికీ నాశనం కావు. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాక సమస్తవిశ్వాల్లోనూ, ఎక్కడైనా సరే, గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. స్థూల శరీరంలో మనం ఉన్నంతవరకూ ఇలా 'కాల-ప్రయాణం' చెయ్యడం కుదరదు.  కాబట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో, మన పూర్తి ఎరుకతో చెయ్యగలిగినట్లయితే ఈ కాల ప్రయాణం చేయవచ్చు. ఈ 'విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారాన్ని' తెలుసుకోవచ్చు.

5. టెలీపతీ:-
    దీనినే భావగ్రాహక ప్రసారణ విద్య అని కూడా అంటారు. ఇది కూడా ఒక విధమైన ప్రకంపనే. (Vibration)
టెలీపతి అనగా భాష, వ్రాత అన్నది లేకుండా ఎదుటి వారి భావాల్ని మనం అర్ధం చేసుకోవడం లేదా మన భావాల్ని ఇతరులకు అందించడం.  జంతు సామ్రాజ్యంలోనూ, వృక్ష సామ్రాజ్యంలోనూ, దేవ సామ్రాజ్యంలోనూ ఈ విధమైన మార్గమే సహజంగా నెలకొని ఉంది.

6. టెలిపోర్టేషన్ :-
    వస్తువులను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వాహనాల ద్వారా చేర్చడాన్ని 'ట్రాన్స్పోర్టేషన్' (Transportation) అంటారు.  అలాగే వస్తువులను ఏ వాహనం లేకుండా కేవలం భావనా శక్తి ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు పంపించడాన్ని 'టెలిపోర్టేషన్' అంటారు.

 7. క్లెయిర్ ఆడియన్స్ (Clair Audience) :
   దీనినే మనం ఆకాశవాణి అని పిలుస్తాము. టెలీపతికి దీనికి కొంచెం వ్యత్యాసం వుంది.  టెలీపతిలో మన భావాలు ఇతరులకు, లేదా ఇతరుల భావాలు మనకు మాత్రమే అందుతాయి. భావాలే కాదు., శబ్దాలు-మాటలు అన్నీ రిసీవ్ చేసుకోవడమే 'క్లెయిర్ ఆడియన్స్'.  మనిషి అంతర్ముఖుడైతే ఈ స్థితి లభిస్తుంది. ఈ స్థితిలో దివ్య సందేశాలనూ, దివ్యమైన జ్ఞానాన్ని పొందవచ్చు.

8. క్లెయిర్ వయెన్స్(Clair Voyance):-
     దీనినే మనం దివ్యదృష్టి (యోగ దృష్టి) అని పిలుస్తాము. ఏదైనా దృశ్యాన్ని కానీ, వస్తువును కానీ, మాస్టర్స్ ని కానీ, చనిపోయిన వారిని కానీ, దివ్య చక్షువుతో (మూడో కన్నుతో) చూడటమే 'క్లెయిర్ వయెన్స్' అంటే.  అలాగే జరుగబోయే సంఘటనలను కూడా చూడడం సంభవిస్తుంది. బ్రహ్మంగారు 'కాలజ్ఞానం' రచించింది ఈ స్థితిలోనే.

9. ఆటో రైటింగ్:-
      ఆటో రైటింగ్ అంటే ఆటోమేటిక్ రైటింగ్. ఎవరైనా కాస్త స్వాంత చిత్తంతో కాగితం మీద పెన్నును 15-20 నిమిషాల పాటు కదలకుండా పెట్టి ఉంచితే,  కొంతసేపటికి ఆ పెన్ను తనంతట తానే కదలడం మొదలు పెడుతుంది.
 అంటే ఇతర లోకంలోని మాస్టర్లు, ఆటో రైటింగ్ సాధన చేసే వారి చేతులను తమ స్వాధీనం చేసుకొని, చక్కటి సందేశాలను అందిస్తారు.  ఈ ప్రక్రియను అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు.

10. సైకోమెట్రీ (Psychometry) :-
    ఒక వస్తువును తీసి చేత్తో పట్టుకుని, ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏయే మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్యనే 'సైకో మెట్రీ' అంటారు. రహస్య జ్ఞాన విద్యల్లో కుడిచేతిని ఇహానికి, ఎడమ చేతిని పరానికి (ఆధ్యాత్మికతకు) ఉపయోగిస్తారు.

11. హీలింగ్ పవర్ (Healing Power):-
    హీలింగ్ పవర్ అంటే వ్యాధుల్ని నయం చేసే శక్తి.  ఈ పద్ధతిలో రోగం నయం చేసే వారిని 'హీలర్స్' అంటారు.
 వీరు విశ్వ శక్తిని గ్రహించి, దానిని రోగికి అందించి వారి యొక్క రోగాలను నయం చేస్తారు.


    పైన పేర్కొన్నవే కాక
12. ఆకాశ గమనం
13. పరకాయ ప్రవేశం
14. కావలసిన రూపం ధరించడం
15.అదృశ్యమవడం
మొదలైన అతీంద్రియ శక్తులు...  ఆధ్యాత్మికతలో ఎదిగిన కొద్ది కలుగును. వీటిని ఆధ్యాత్మిక పురోగమనం (జ్ఞాన సముపార్జన) కోసమే ఉపయోగించాలి. వీటిని  స్వలాభం కోసం వినియోగిస్తే పతనం తప్పదు.  ఇంతటి "శక్తి" మనలో ఉందని చెప్పడానికే ఈ వివరణ.

🕉🔔 భగవద్గీత ఎందుకు చదవాలి? 🔔🕉


* సంతోషంగా ఉన్నవా... భగవద్గీత చదువు.
* బాధలో ఉన్నావా... భగవద్గీత చదువు.
* ఏమి తోచని స్థితి లో ఉన్నావా... భగవద్గీత చదువు.
* ఏదో గెలిచినావా... భగవద్గీత చదువు.
* ఏదో ఓడిపోయినావా... భగవద్గీత చదువు.
* నువ్వు మంచి చేసినావా... భగవద్గీత చదువు.
* నువ్వు చెడు చేసినావా...భగవద్గీత చదువు.
* నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.
* నువ్వు చాలా బీద వాడివా... భగవద్గీత విను.
* నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు మోసం చేసినావా... భగవద్గీత చదువు.
* నువ్వు మోసపోయినావా... భగవద్గీత చదువు.
* నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.
* నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.
* నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.
* నీవు వ్యాధిగ్రస్తుడవా... భగవద్గీత చదువు.
* నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు.
* నీవు విధ్యాహీనుడవా... భగవద్గీత చదువు.
* నీవు పురుషుడవా... భగవద్గీత చదువు.
* నీవు మహిళవా... భగవద్గీత చదువు.
* నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.
* నీవు యవ్వనస్తుడివా... భగవద్గీత చదువు.
* దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.
* దేవుడు లేడు అని అనుకుంటున్నావా.... భగవద్గీత చదువు.
* ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.
* ఈ శృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* నీలో కామం, క్రోధం, లోభం, మొహం,  మధం, మాత్సర్యము వంటి అర్షడ్ వర్గాలు ఉన్నాయా... భగవద్గీత చదువు.
* నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.
* నీవు ధ్వేశిస్తున్నవా... భగవద్గీత చదువు.
* నీలో వైరాగ్యం ఉందా... భగవద్గీత చదువు.
* జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.
* పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు.
* ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.
* ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే....
భగవద్గీత చదువు.
✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍
భగవధ్గీతలో ఏముంది?:
🕉 ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?🕉

గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!
యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంరాలు
జీవించి యున్నాడు!!
భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెల్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!
మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!!
కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం

ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం
చేసి పదవరోజున నేలకొరిగాడు!!
11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో దృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా
మొదటి సారి హస్తినాపురములోని సభలో
వున్నవారందరూ దృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!

కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన
కురు - పాండవ సేనావాహినుల మధ్యన
రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో
విషాధముతోబాధపడుతున్న అర్జునుని నిమిత్త మాతృనిగా చేసుకుని శ్రీకృష్ణుడు భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!
లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!
మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం
జరుపుకుంటున్నాము జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అధ్భుతమైన విషయం!!
లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే "భగవద్గీత"!!
కలియుగం ప్రారంభమై 5118 సంరాలు
గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5154 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5155 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!

కృష్ణం వందే జగద్గురుమ్.
భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.
శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్
1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.
2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?
జ. గీతలో 700 శ్లోకములు కలవు.
3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?
జ. గీతలో 18 అధ్యాయములు కలవు.
4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?
జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.
5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.
6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.
7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?
జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.
8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.
9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.
10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.
11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?
జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము
12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?
జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు
13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?
జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
4) అనసూయ - అసూయ లేనివాడు.
5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .
14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పిం��
15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?
జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధ
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.
17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?
జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.
2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
ప్రార్దించువారు అర్దార్దులు.
3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,
సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.
18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ
17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును
వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.
19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము
20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.
21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.
22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.
23. "యోగం" అంటే అర్థం ఏమిటి?
జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .
24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర��