5, జులై 2025, శనివారం

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1

సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2

సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3

వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4

మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5

భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6

బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7

ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8

పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9

మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10

భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11

ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12

భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13

ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14

మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15

ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16

మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17

వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18

వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19

వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20

మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21

మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22

మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23

మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24

మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25

మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26

కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27

ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28

శకుని www.freegurukul.org/g/Bharatham-29

భీముడు www.freegurukul.org/g/Bharatham-30

దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31

మహారధి www.freegurukul.org/g/Bharatham-32

బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33

మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34

ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35

మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36

తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37

ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38

ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39

తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40

మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41
భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42

ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43

ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44

మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45

భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46

వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47

ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48

మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49

విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50
సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51

ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52

ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53

మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా నిజంగా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.ఇంకా మా దరిద్రం ,రోగాలు పోలేదేమిటి అని అడిగితే దేవుడు పరీక్ష పెడుతున్నాడు కర్రు కాలితే గదా తుప్పు వదిలేది అంటారు.మీరు ఎంతోమంది  పాస్టర్ల గురించి ఎంక్వయిరీ చేయండి.షుగర్,బీపీ కాన్సర్ లు ఉంటాయి. 


వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . వీరు ముఖ్యానంగా హిందూ స్త్రీలు ,పిల్లలను మతం మార్చడానికి అదేపనిగా ప్రయత్నిస్తుంటారు.కొంతమంది ఆడవారిని గూడా తీసుకువచ్చి మాకు ఇలా అద్భుతాలు జరిగాయి,జబ్బులు పోయాయి,దరిద్రం పోయింది అని మెస్మరిజం తో వారిలో ఆశ పుట్టించి కుటుంబం లో ఒకరిని ఎలాగోలా మార్చేస్తారు.ఆడవారిని మార్చేస్తే ఆమె భర్తను మరియు పిల్లలను మార్చేస్తుందని వారి నమ్మకం.ఇలా ఎంతమందిని మార్చగలిగితే వారికి వారి మినిస్ట్రీస్ నుండి  అంత ప్రొమోషన్ లు ఉంటాయి . ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.మన దేశాన్ని  పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి విదేశాల కుట్రతో  వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .


కరోనా సెకండ్ వేవ్ లో అధికారిక లెక్కల ప్రకారం  తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి.ఎన్నో క్రిష్టియన్ కుటుంబాలు జీవితాంతం గుండెలు బాదుకొంటూ కన్నీటి ప్రార్ధన చేస్తూ వారికొచ్చే ఆదాయంలో 10 వ వంతు పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికి వారి దారిద్య బాధలు తొలగవు. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.జాగ్రత్త : వారు మన ఇంటివైపు వస్తున్నారు అంటే శవాల నుండి ప్రేతాత్మలు మనఇంటివైపు వస్తున్నట్టే.


  గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి


భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్పమో  లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు


మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.


ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.

తోమాల సేవ :-

 

తోమాల సేవ :-


ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్ లక్కీడిప్ లో,ఆఫ్‌లైన్ CRO ఆఫీసు లక్కీడిప్ కౌంటర్ ద్వారా సామాన్య భక్తులు పొందవచ్చు. పలుకుబడి కలిగిన వారు టీటీడీ బోర్డు చైర్మన్ లేదా CMO పేషీ ద్వారా..


ఈ సేవ ఖరీదు 220/- మాత్రమే. కాని గర్భగుడిలో షుమారుగా నలబై నిమిషాల పాటు స్వామి వారి ముందు కూర్చుని ఆ మూలవిరాట్టుకు పుష్ప మాలలతో అర్చక స్వాములు అలంకరించి హరతులు ఇవ్వడం చూస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. దర్శనం చేసుకుని బయటకు వచ్చినా మనం మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. 


సుప్రభాతం జరుగుతున్నంత సేపు ఈ తోమాల సేవకు వచ్చిన భక్తులను ధ్వజస్తంభం దగ్గర ఆపి తరువాత గర్భగుడిలోకి( ఆనంద నిలయం) మగ వారిని ఎడమ వైపు ఆడ వారిని కుడి వైపుగా లోపలకు పంపుతారు.ముందు ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కలిగిన భక్తులను కూర్చోబెట్టి తర్వాత ముందుగా లైన్లో వచ్చిన వారిని కూర్చోబెడతారు. మీకు అవకాశం ఉంటే స్వామి వారి ముందు గదిలో ఓ మూల నిలబడి చూస్తుంటే...ఎందుకంటే కూర్చుని చూస్తుంటే మనకు పూర్తిగా భోగ శ్రీనివాసమూర్తికి జరిగే కార్యక్రమం కనపడదు.


మగవారు పంచె తప్పనిసరి.. షర్టు మరియు బనియన్ వేసుకోకూడదు. ఆడవారు సాంప్రదాయిక దుస్తులు దరించాలి.


మంగళ,బుధ,గురువారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏకాంతంగా నిర్వహిస్తారు. 


* ఇదే విధంగా అర్చన కూడా ఉంటుంది. కాకపోతే ఈ సేవలో స్వామి వారి సహస్ర నామార్చన చదువుతారు.చివరకు హరతులు..


ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఓ ఇరవై సార్లకు పైగా సేవ చేసుకునే భాగ్యం స్వామి వారు కల్పించారు. మీరు నిరుత్సాహ పడకుండా నిరంతరం లక్కీడిప్ వేస్తునే ఉండండి.


ఒక్కటి మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను మీరు తన నిజమైన, ప్రియమైన భక్తుడు అని స్వామి వారు భావిస్తే మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దగ్గరగా కూర్చోపెట్టుకుని  మీతో అన్ని సేవలూ చేయించుకుంటారు.ఇది మాత్రం నిజం.


సుప్రభాతం తర్వాత..


తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు... ఇంకా ఇతర విగ్రహాలకు పుష్పమాలలతోను, తులసి మాలలతోను అలంకరించే కార్యక్రమాన్నే 'తోమాలసేవ' అంటారు. భుజాల మీదినుంచి వేలాడేట్లుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని “తోళ్మలై" అంటారు. అదే “తోమాల"గా మారిందంటారు. తోళ్ అనగా భుజమని అర్థం.

ఆర్జితం చెల్లించిన భక్తులు కూడ ఈ సేవలో పాల్గొని దర్శించవచ్చు. అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొన వీలులేదు.


ఏకాంగి కాని లేదా జియ్యంగారులు పూల అరనుంచి సిద్ధంచేసిన పూలమాలను తీసికొనివచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు అర గంటసేపు జరుగుతుంది. ఈ అరగంట మనం స్వామి వారి ముందు కూర్చోవచ్చు.


సేవ చివర కర్పూర హారతి నక్షత్ర హారతి తో తోమాల సేవ పూర్తవుతుంది..

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🍂🥥💐🥭🍉🍁🍍🥀🍒🌹🍎

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🍂🥥💐🥭🍉🍁🍍🥀🍒🌹🍎

మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి. కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన 
మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.🙏

తులాభారం:-

 

తులాభారం:-


తమ కష్టాలు తీరి నప్పుడు, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు తులాభారం ఇస్తామని మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.


తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైనవి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.


గతంలో బరువుకు తగ్గ వస్తువును మోసుకుని వెళ్ళి సమర్పించేవారు. ఇప్పుడు తులాభారంలో కూర్చోబెట్టి కిలో చొప్పున ఆ వస్తువు రేటు చెల్లిస్తే మీకు రసీదు ఇస్తారు.అది హుండీలో వేస్తారు.


ఇప్పుడు రేట్లు :-

రూపాలు నాణేలు kg 202/-

రెండు రూపాయల నాణేలు kg 332/-

ఐదు రూపాయల నాణేలు kg 555/-

పంచదార kg 40/-

పటికబెల్లం kg 30/-

బెల్లం kg 38/-

బియ్యం kg 41/-(చివరి నాలుగు రేట్లు మార్కెట్ ని బట్టి మారుతుంటాయి)

ఉదాహరణకు మీరు 58 kgలు ఉంటే..మీరు ఐదు రూపాయల నాణేలు మొక్కుకుంటే 58*555=32,190/


**ఈ తులాభారం మహాద్వారం నుండి లోపలకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఎడమ చేతి వైపు ఉంటుంది. దీనిని ఎటువంటి టిక్కెట్ అవసరం లేదు.తులాభారం తరువాత మీరు దర్శనానికి వెళ్ళడమే..

*కృష్ణార్పణం..!* ➖➖➖✍️


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                   *కృష్ణార్పణం..!*
                   ➖➖➖✍️

```ఒక పేద, అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది.

ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ ‘కృష్ణార్పణం‘ అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ ‘కృష్ణార్పణం’ అనడం మొదలుపెట్టింది.

ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకొనేముందు కృష్ణార్పణం, భుజించేముందు, భోజనం తరువాత, బయట కెళ్ళేముందు, ఇంటికొచ్చిన తరువాత.. కృష్ణార్పణమే..! చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ ‘కృష్ణార్పణం’ అనటమే!

ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.

ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతీరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. ఎవరికీ అర్ధం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరిమీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆదేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.

రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.

ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ ‘కృష్ణార్పణం’ అంది.

మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... 

ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు.

ఆమె కటికనేల పై పడుకొనే ముందు ‘కృష్ణార్పణం’ అనుకుంది.

రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.

ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు.

ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది.

అప్రయత్నంగా “కృష్ణార్పణం”అనగానే గాయం మాయమయ్యింది. 

అదిచూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.

అదేసమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు... “మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వట్లేదు” అని వాపోయారు.

రాజు గారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. “నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిం”దని.

“నాకు తెలియదు” అంది.

సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె ‘కృష్ణార్పణం’ అనే అన్నాను అని బదులిచ్చింది.

సభలోని వారందరూ హతాశులయ్యారు.

ఆమెని ‘నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?’ అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.

సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. 

ఆమెకు ‘కృష్ణార్పణం’ అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీద పడ్డారు.

ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. ‘అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్తపోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది’ అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.

చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు ‘కృష్ణార్పణం’అనడం మొదలుపెట్టింది. 

శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.

సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్నితండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.

ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా?!✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖