10, మార్చి 2012, శనివారం

ధ్యానంలో విశ్వ చైతన్య శక్తి అనుభవం

విశ్వ చైతన్య శక్తి అనేది విశ్వమంతా వ్యాపించి వున్న శక్తి .విశ్వ కేంద్రం నుండి విశ్వానికి లభిస్తున్న శక్తి.అయితే మనం నిద్రలో కొద్దిగా ఆ చైన్తన్య శక్తి ని తీసుకొంటాము.దైవ నామ స్మరణతో చాలా వరకు ఆ శక్తి లభిస్తుంది.అయినా గూడ మనం పూర్తిగా ఆ శక్తి ని స్వీకరించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఈ విశ్వ చైతన్య శక్తి మన శరీరములో ప్రవేశిస్తే  చెడ్డ ప్రాణ శక్తిన తొలగి దివ్యమైన మంచి ప్రాణ శక్తి లభిస్తుంది.మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు గోపురముపై కలశాన్ని గమనించవచ్చు.నేరుగా ఆ కలశం క్రిందనే గర్భాలయములో  విగ్రహం ఏర్పాటు చేసివుంటారు.ఎందుకు అలా వుంటుందంటే కలశం ఒక యాంటెన్నా లాగ పనిచేసి విశ్వ చైతన్య శక్తి ని  గ్రహిస్తుంది.మనం విగ్రహం వద్దకు పోయినప్పుడు నమస్కరించి మనకు తెలియకుండానే తలవంచి కళ్ళు మూసుకొంటాము.అక్కడ అర్ధం ఏమిటంటే నిజమైన దేవుడు అక్కడ లేడు అని మనలో వున్న దేవుడిని చూడడానికి కళ్ళు మూసుకొని  ప్రయత్నిస్తున్నాము.
అదేవిధంగా మన శరీర నిర్మాణములో గూడ దేవాలయానికి పోలిక వుంది.మన శిరస్సు గోపురము అయితే తలపై వున్నా బ్రహ్మరంధ్రము కలశం.మన హృదయం పవిత్ర గర్భాలయం.అందులో వున్న ఆత్మ విగ్రహం.అయితే ఆ జీవాత్మ ను పరమాత్మ గా మారడానికి ధ్యానం ఒక్కటే మంచి మార్గం. ధ్యానంలో విశ్వా చైతన్య శక్తి ప్రసరించి ఆ ఆత్మకు దివ్యత్వాన్ని ఇస్తుంది.అదే విధంగా మన శరీరమంతా చైతన్య శక్తి (Energy) ప్రవహించి శరీములో గల బ్లాక్స్ ను తొలగించి ఆ స్థానంలో ప్రవేశిస్తుంది.క్యాన్సర్ లేదా మరేదైనా వ్యాధుల కారణంగా  బ్లాక్స్  అనగా చెడ్డ ప్రాణశక్తి వున్న ప్రాంతములో  చైతన్య శక్తి ప్రవేశించి వాటిని తొలగిస్తుంది.అందువల్ల ధ్యానం చేస్తే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి.
ధ్యానం వలన ఉపయోగాలు.

  1.శరీరం కొత్త దివ్య శక్తి ని తీసుకొని ఆరోగ్యంగా వుంటుంది.
  2.గంట సేపు ధ్యానం అయిదు  గంటల నిద్రతో సమానం.
  3. ధ్యానం తో దేర్ఘకాలిక వ్యాధులు మటుమాయం.ధ్యానం చేస్తే మందులు వాడవలసిన అవసరం ఉండదు.
  4.ధ్యానం తో ఏకాగ్రత పెరిగి విద్యార్ధులు ర్యాంకులు సాధించగలరు.
  5. సాధారణ మనుషులు చేయలేని పనిని ధ్యానం చేయువారు విజయవంతంగా  చేయగలరు.
  6. ధ్యానంతో అష్ట సిద్ధులు సాధించి  సాధారణ మనిషిలాగా కనిపించవచ్చు.
  7. ధ్యానంతో వేల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని అయినా స్పష్టంగా చూడవచ్చు.
  8. ధ్యానంతో మరణ భయం తొలగి మరణం తర్వాత మనం చేరుకోబోయే ప్రాంతాన్ని ఇప్పుడే దర్శించవచ్చు.
  9. ధ్యానం తో ఆర్ధిక విజయాన్ని గూడ సాధించవచ్చు.

3 కామెంట్‌లు:

  1. ఈ విశ్వంలో మీ జ్ఞానణ చైతన్యం అజరామరం

    రిప్లయితొలగించండి
  2. gnanam gurinchi baga chepparandi
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    రిప్లయితొలగించండి
  3. మన శరీర నిర్మాణములో గూడ దేవాలయానికి పోలిక వుంది.మన శిరస్సు గోపురము అయితే తలపై వున్నా బ్రహ్మరంధ్రము కలశం.మన హృదయం పవిత్ర గర్భాలయం.అందులో వున్న ఆత్మ విగ్రహం.అయితే ఆ జీవాత్మ ను పరమాత్మ గా మారడానికి ధ్యానం ఒక్కటే మంచి మార్గం.👌👌🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి