8, నవంబర్ 2018, గురువారం

గాఢ ధ్యాన అనుభవాలు.🌹🔥



🔥గాఢ ధ్యాన అనుభవాలను మన అంతర,అభౌతిక ఇంద్రియాలతో గ్రహిస్తాం కనుక వీటిని అతీంద్రియ జ్ఞానం అంటాము, మన ప్రాణమయకోశంలో అపరిమితమైన విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించిన ఫలితంగా ఈ గాఢ ధ్యానానుభవాలు పొందుతాము.

🔥ప్రతి ఒక్కరూ ప్రాణశక్తిని విభిన్నంగా అనుభూతి చెందుతారు కనుక, ఈ అనుభవాలు కూడా వారి దృక్కోణాలు, పరిధులను బట్టి వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ అనుభవాలన్నీ అధికంగా మేధస్సు కన్నా, అనుభూతిక స్థాయికి చెందినవే. ఈ అనుభవాలన్నీ ఇక్కడ ఈ క్షణంలో సంభవిస్తాయి. మరి ఆత్మ మాత్రమే అక్కడికి ప్రయాణించగలదు. కొంతమందికి వారి శరీరం చాలా బరువుగా మారినట్లు అనిపిస్తుంది. కొంతమందికి వారి శరీరం చాలా తేలికగా అయినట్లు అనిపిస్తుంది. కొంతమందికి శరీరం ఆకస్మిక కదలికలు కలుగుతాయి.

🔥కొందరికి శరీరంలో వేడిమి తీవ్రమైనట్లు అన్పించి, విపరీతంగా చెమటలు పడతాయి. కొందరిలో ఉన్నత ప్రకంపనాస్థాయి శక్తి శరీరంలోకి ప్రవహిస్తున్నప్పుడు, చలి , వణుకు రావటం జరుగుతుంది. కొంతమంది మార్మిక శబ్దతరంగాలకు అనుసంధానమై  దివ్య శ్రవణానుభూతులు పొందుతారు. కొంతమందికి తేనెటీగ ఝంకార నాదం, లేక పాము బుస కొట్టినట్లు వినిపిస్తుంది.

🔥కొన్ని సార్లు మనకు ధ్యానంలో చల్లగా, వణుకు పుట్టించేలా ఒళ్ళంతా ఏదో పాకినట్లు అన్పిస్తుంది. కొంతమంది ధ్యానం చేస్తున్నప్పుడు, పూలవాసనలు, ధూపం లేక కొన్ని అపరిచితమైన, గుర్తించలేని పరిమళాలు కూడా ఆఘ్రాణిస్తారు.  కొన్నిసార్లు శ్వాసప్రక్రియ దానంతట అదే మారుతుంది. వేగవంతం కానీ నెమ్మదించటం కానీ జరుగుతుంది. అలాంటపుడు కొందరు తమ శ్వాస ఆగిపోయినట్లు భావించి ఉలిక్కిపడతారు. గాఢ ధ్యానస్థితిలో ఆలోచనల పట్ల ఎరుకను పూర్తిగా కోల్పోతాము. కొంతమందికి నుదుటి భాగంలో ఒత్తిడి, నొప్పి, చక్కిలిగింతలు, దురద,లాగేయడం, కొట్టుకోవటం ఇంకా మరెన్నో స్పందనలు కలుగుతాయి. కొంతమందికి ప్రకాశవంతమైన రంగులు వివిధ శ్రేణుల్లో పెరుగుతాయి, తరుగుతూ, వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తాయి. ఎరుపు, నారింజ, పసుపు ఆకుపచ్చ, నీలం,తెలుపు మొదలైన అనేక వర్ణాల్లో శ్రేణుల్లో వివిధ జ్యామితీయ ఆకారాలు నమూనాలను చూడటం అనేది ఒక సాధారణమైన ధ్యానానుభవం.

🔥కొంతమంది దేవతామూర్తులను, మార్గదర్శకులను, గురురూపాలను దర్శిస్తారు. కొందరు భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలన్నింటినీ చిత్రాల్లా చూడగలరు. కొంతమందికి యాదృచ్చికంగా తమ పూర్వజన్మ జ్ఞాపకాలు స్ఫురిస్తాయి. కొందరికి తమ శరీరం సంకోచించినట్లు అన్పిస్తే, మరికొందరికి వ్యాకోచించినట్లు అన్పిస్తుంది. కొందరు తమ భౌతిక శరీరంలో లేమినీ, వేరే ప్రపంచంలో ఉన్నామని అనుభూతి  చెందుతారు. కొనదిరికి సూక్ష్మతలాల్లో శత్రచికిత్స జరిగినట్లు ఆనుభవమౌతుంది.

🔥మూలంతో కలిసి ఉన్నప్పుడు, కాలం గురించిన ఎరుకను కోల్పోతాము. కేవలం మన ఆత్మ గురించి మాత్రమే ఎరుకతో ఉంటాము. మనస్సు పరిపూర్ణంగా విశ్రమించినపుడు, అంతః ప్రేరణ, దివ్యజ్ఞానం పోనడటానికి అవకాశం ఉంటుంది. గాఢ ధ్యాన స్థితిలో మన స్పిరిట్ గైడ్స్ ను కలుకోవటం సులభంగా జరుగుతుంది.

🔥ధ్యానంలో మన ఇష్టాఇష్టాలకు అతీతంగా బంధారాహిత్యాంలో ఉండిపోతాము. మన మనో స్థితులను గమనిస్తూ, వాటిని అవగాహన చేసుకోవటమే ధ్యానం. గాఢ ధ్యానానుభవాలు శరీరం, మనస్సును అధిగమించి ఉన్నత చైతన్యస్థితికి చేరటానికి దోహదం చేస్తాయి. ధ్యానంలో పరిణితి సాధించాక, ధ్యానం చేస్తున్నప్పుడే కాక, చేయకుండా ఉన్నప్పుడు కూడా శక్తి ప్రవాహ కదలికలను మన శరీరంలో గమనించగలం.

1 కామెంట్‌: