8, నవంబర్ 2018, గురువారం

ప్రశ్న : “ధర్మబద్ధంగా ఎలా జీవించాలి ?”



💁‍♀ పత్రీజీ :మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మౌలికంగా మూడు ధర్మాలను తప్పక పాటించాలి ..  మొదటిది : “దేహం పట్ల ధర్మం” : ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ .. దేహం ఒక ‘ వాహనం ’ !

🧘‍♂ ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శ్రుతిబద్ధంగా, లయబద్ధంగా చుసుకుంటేనే అది మనకు సరి అయిన విధంగా సహకరిస్తూ వుంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎప్పటికైనా ప్రయాణం చెయ్యగలం .. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం !

🍎 కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరి అయిన పోషణను అందిస్తూ, ధ్యానంతో దానిని శక్తివంతం చేయాలి.
మన శరీరంలో కోటానుకోట్ల కణాలు వున్నాయి.🍪 వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు కానీ .. మనకే వాటి గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురిచేస్తున్నాం. పెట్రోలు కారులో డీజెల్ పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు .. మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మనం అభాసుపాలు అవుతున్నాం !

ఈ కోటానుకోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది ! మన కణజాలం అంతా కూడా ప్రతిక్షణం ఒకదానిని ఒకటి సమన్వయ పరచుకుంటూ క్రమక్రమంగా ఆత్మ ఉద్దీపన దిశగా సాగుతూంతుంది. కనుక వాటితో మనం సరియైన విధంగా ప్రవర్తించాలి అంటే .. మనకు నిరంతర ధ్యానసాధన మరి అహింసా ధర్మాచరణయే మార్గం !రెండవది

💁‍♀ “సమాజం పట్ల ధర్మం” :
సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక అందరూ సుఖంగా సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం ! అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థిక సంపదనూ ఆధ్యాత్మిక సంపదనూ అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యానప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే .. మిగతా అన్ని దానాలు కూడా వ్యర్థమైపోతాయి. మూడవది
  💁‍♀ “ఆత్మ పట్ల ధర్మం” : మనం ఏ పని కోసం ఈ భూమ్మీద జన్మ తీసుకున్నామో .. విశేషంగా ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ .. మరి ఇతర దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వుండాలి. వచ్చిన పనిని సజావుగా పూర్తిచేసుకోకపోతే .. ఇక్కడ గడిపిన మన జన్మకాలం తో పాటు మనం సంపాదించిన సంపదలన్నీ వ్యర్థమైపోతాయి !

💐 ఆ తరువాత చనిపోయి పై లోకాల్లోకి వెళ్ళాక .. జరిగిన అనర్ధానికి చింతించినా లాభం వుండదు .. మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేచి ఉండాల్సి ఉంటుంది.

🕑  కనుక సమయాన్ని అనవసరమైన కాలక్షేపాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా .. ఇతోధికంగా ధ్యాన సాధనలో🧘‍♂ ఆత్మను పరిపుష్టం  చెయ్యాలి !

 విశేషంగా స్వాధ్యాయ సాధన📖 చేస్తూండాలి .. విస్తృతంగా సజ్జన సాంగత్యం 👨‍👨‍👦👩‍👩‍👧 చేయాలి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి