8, నవంబర్ 2018, గురువారం

ధ్యానంలో మెదడు స్థితి గురించి శాస్త్రజ్ఞుల పరిశోదన:


ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది . ధ్యానం మన మనసును స్వాధీనంలోకి తెస్తుంది. మనసును స్వాధీనం చేసుకున్న తరవాత మన మనసులోని ఆలోచనలోనే తరంగాలన్నీ ఆగిపోవడమే కాక, మనలోని చేతనా స్పృహ విస్తరిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడల్లా మానసికంగా పెరుగుదలను పొందుతుంటాం. ప్రారంభంలో కాస్త కష్టమైనప్పటికీ, రాను రాను తీవ్రతరం చేస్తే ధ్యానం కుదురుతుంది. అప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచనే ఉండదు. ఆ సమయంలో మన మనసుకు, తద్వారా మన శరీరానికి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది . ఈ విషయం గురించే శాస్త్రజ్ఞులు మెదడుపై పరిశోధనలు జరిపి, ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాన్ని విపులీకరించారు .
మెదడులో ఫ్రంటల్ లోబ్ , పెరైటల్ లోబ్ , థాలమస్, రెటిక్యులార్ ఫార్మేషన్ అంటూ నాలుగు భాగాలున్నాయి . ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాలుగు భాగాలలో నాలుగు విధాలైన మార్పులు జరుగుతుంటాయనీ, ఫలితంగా మెదడు పూర్తి విశ్రాంతి పొందుతుంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
🌷. ఫ్రంటల్ లోబ్ : మనం వేసే పక్కా ప్రణాళికలకు మెదడులోని ఈ భాగమే కారణం. మనలోని చైతన్యానికి, భావోద్వేగాలకు ఈ భాగమే ప్రధాన కారణం. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం నిశ్చలమవుతుంది. ఫలితంగా మన మనసు తేలికపడినట్లవుతుందన్న మాట .
🌷. పెరైటల్ లోబ్ : ఈ భాగం మన చుట్టు ప్రక్కలనున్న విషయాలను మెదడుకు చేరవేస్తుంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం కూడా నిశ్చలమవుతుంది . మనసులోని భారం తగ్గుతుంది.
🌷. థాలమస్: ఒకే విషయం పై దృష్టిని పెట్టేలా చేస్తుంది. ఇతరత్రా ఆలోచనలు లేకుండా చూసుకుంటుంది. ధ్యానం చేసేటప్పుడు థాలమస్ లోని ఆలోచనల పరంపరల వేగం తగ్గి ప్రశాంతత నెలకొంటుంది.
🌷. రెటిక్యులార్ ఫార్మేషన్ : శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చే సమాచారంతో మెదడుకు హెచ్చరికలు చేస్తుంటుంది . ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సంకేతాలు నిలిపివేయబడి , మెదడు విశ్రాంతిని పొందుతుంది. మొత్తంగా ఇవాళ్టి యువతరం భాషలో ధ్యానం గురించి చెప్పాలంటే, మన శరీరమనే హార్డ్ వేర్ లో మనసనే సాఫ్ట్ వేర్ ఉంది. దాంట్లోకి యాంటీ వైరస్ ను ఎక్కించడమే ధ్యానం. 👍

ప్రకృతి యొక్క కర్మసిద్ధాంతం ప్రకారం .. కంప్లైంట్స్ చేసే వారి స్వభావం .. వారిలోని హృదయ కమలాన్ని వాడిపోయేట్లు చేసి, వారి శారీరక, మానసిక మరి ఆత్మపరమైన ఆరోగ్యాలను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. దాంతో వారిలోని శక్తినిల్వలు పూర్తిగా హరించిపోయి వారికి ఉన్నత తలాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో పాటు .. వారు నకారాత్మక పరిస్థితులనూ, అనవసర కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

అంతేకాదు .. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనా తరంగాలు కూడా అసహ్యకరమైన రూపాలు సంతరించుకుని చివరికి అతడినే చుట్టిముట్టి వేస్తాయి. ఇలాంటి ధైన్యస్థితి నుంచి బయటపడటానికి అతడు మరెంతో శక్తిని కూడగట్టుకోవలసి వస్తుంది.

కాబట్టి .. ప్రతిఒక్క సాధకుడు కూడా .. ఒక "మాస్టర్" గా ఎదగాలంటే .. ఇతరులలోని తప్పులను ఎంచుతూ తనను తాను దిగజార్చుకోకూడదు. జరిగేవి అన్నీ కూడా దివ్యత్వపు ప్రణాళికలోని పాఠాలుగా గ్రహించి .. ఆత్మ ఆరోహణాదిశగా తన కార్యకలాపాలను సాగించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి