24, ఫిబ్రవరి 2024, శనివారం

స్తోత్రాలు

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

హంస

*హంస రాజస లక్షణాలున్న నీటి పక్షి. అందువల్ల రాజహంస అనీ పిలుస్తారు. సంస్కృతంలో మరాళం అంటారు. తెలుగులో తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు అనే పేర్లున్నాయి. భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్నిచ్చి గౌరవించింది.* వేదకాలం నుంచి హంస గొప్పతనం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి వైదిక సాహిత్యంలోను, పురాణ కథల్లోనూ హంస ప్రస్తావన ఉంటుంది. దేవతల్లో ఒక్కొక్కరికీ ఒక్కో వాహనం ఉంది. భార్యాభర్తలైన బ్రహ్మదేవుడు, సరస్వతి ఇద్దరికీ- హంసే వాహనం.

భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల్లో హంస గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందింది. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న 31 ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తు ఒకటి. వేదాలు, శాస్త్రాల్లో అత్యున్నత స్థాయికి చేరినవారిని *'పరమహంస'* అని ప్రస్తుతిస్తారు.

వేదాంత బోధనపరంగా *హంసకు విశేష స్థానం ఉంది. నీళ్లలో విహరిస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవంటారు. అలాగే సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ, మనిషి ఏ మమకారానికీ లోనుకాకుండా జీవించాలని చెబుతారు.* హంసకు పాలను, నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. నిజానికి పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుంచి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో వదిలేస్తుందట. అలాగే మంచిచెడుల మిశ్రమమైన జీవన గమనంలో మంచిని స్వీకరించి, చెడును విడిచిపెడితే జీవితం సుసంపన్నం అవుతుందని పెద్దలు చెబుతారు. పై రెండు ఉదాహరణలకు సంకేతంగా హంసలా జీవించాలని చెబుతారు. *యోగశాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీక. లోనకు పీల్చే గాలిని (ఉచ్ఛ్వాసాన్ని) 'హం' అని, బయటకు విడిచిపెట్టే ఊపిరిని (నిశ్వాసాన్ని) ‘స’ అనీ అంటారు. అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు 'హంస ఎగిరిపోయింది' అంటారు....🙏

21, ఫిబ్రవరి 2024, బుధవారం

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

https://www.youtube.com/watch?v=Pvcp1_cAYic

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. 

అవిసె గింజలు LDL (చెడు కొలెస్ట్రాల్)ను కరిగించి, HDL (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. 

🌷అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దిని వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను నిర్వహించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మెరుగ్గా పనిచేస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తినే వ్యక్తుల్లో గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

🌷బీపీ కంట్రోల్లో ఉంటుంది..

అవిసె గింజలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.

🌷క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది..!

మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజల్లో ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్నాన్స్ ఉంటాయి. ఈ గింజల్లోని ఒమెగా-3 యాసిడ్కు రొమ్ముక్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

🌷ప్రోటిన్ స్టోర్ హౌస్..
మీరు వెజిటేరియన్స్ అయితే.. మీకు అవిసె గింజలు సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. వీటిలో ప్రోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజూ మీ డైట్లో చేర్చుకుంటే.. ప్రోటిన్ లోపం దూరమవుతుంది.

🌷జుట్టు బలంగా..
దీనిలో ఉండే.. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచే కొలాజెన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. అవిసె గింజలు జుట్టు ఆరోగ్యంగా ,మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో విటమిన్-బి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టుకు బలం చేకూర్చడంతో పాటు జుట్టు పొడిబారకుండా చేసి సిల్కీగా ,మెరిసేలా చేస్తుంది.

ఎలా తీసుకోవాలి..❓
వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్ చేసి, పొడిచేసుకుని తింటే మంచిది. వీటిని వేయిస్తే.. దీనిలోని హానికారక ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి, జెల్లీలా మారతాయి . అంటే ఇవి నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే చెంచా తిన్నా, అరచెంచా తిన్నా తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసెగింజల ప్రయోజనాల్ని సంపూర్ణంగా పొందవచ్చు . వీటిని పొడి రూపంలో తినాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రిజ్లో దాచిపెట్టాల్సిందే. లేదంటే పోషకాలు త్వరగా పోతాయి.

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

 జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

         ✍️ Dr. M. N. చార్య

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


🪷 మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడిపోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము"  అని అంటారు. అవి... 

1. పుట్టుట, 2. ఉండుట, 

3. పెరుగుట, 4. మారుట, 

5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.


✳️ మనిషికి ఎన్ని అవస్థలు కలవు  


శ్లో: 

"దేహినో౬స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా! 

తథాదేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి!! 


🪷 జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్నవి, సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది. 


✳️ మృత్యు భయం వీడకపోవటానికి కారణం..! 


🪷 భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం'. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు...  ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! 


🪷 మృత్యువును గురించి నచికేతుడు యమధర్మరాజును అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం - ఏది అభౌతికమైనది అంటే......, ‘ఆత్మే' అభౌతికమైనది.  దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ' అవుతుంది. ‘జీవాత్మ' దేహత్యాగం చేస్తే ‘ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం-భూమిలోను,  అగ్నితత్వం-అగ్నిలోను, జలతత్వం-జలములోను,  వాయుతత్వం-వాయువులోను శబ్దతత్వం-ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది. 


✳️ పుట్టడం గిట్టడం అంటే ఏమిటి..?  


🪷 అసలు పుట్టటం గురించి తెలుసుకుందాం. 


🪷 సాధారణంగా మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం. గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. క్రియలో రెండు వేరు వేరుగా కనపడుతున్నా.. కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే! ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ ( అంటే ఇంతకు ముందున్న స్థితి )ని వదిలి ఉత్తరావస్థ ( అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి )ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు. 


🪷 ఉదాహరణకు..  ఒక విత్తనం తన బీజావస్థని వదిలి వృక్షావస్థకి వస్తే దానినే మనం చెట్టు మొలిచింది అంటున్నాము. అంటే .. దాని పూర్వావస్థ అయిన విత్తనస్థితి నుంచి అది చెట్టు రూపంలోకి వచ్చింది. అంటే విత్తనం "పోయింది" చెట్టు "పుట్టింది". మనం ఆ చెట్టుని కట్టెల రూపంలోకి మార్చాము అనుకోండి ఆ ఉన్నచెట్టు కాస్తా పోయింది దాని నుంచి "కట్టెలు" పుట్టాయి. ఆ కట్టెలనే మనం కాల్చాము అనుకోండి, కట్టెలు పోతాయి దాని నుంచి బొగ్గులు పుడతాయి. ఆ బొగ్గులనే మళ్ళీ కాల్చాము అనుకోండి. ఆ బొగ్గులు పోతాయి అందులోంచి బూడిద పుడుతుంది. అలా భూమిలో నుంచి పుట్టిన చెట్టు బూడిదగా మారి చివరకి మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది. ఇలా ఈ భూమి మీద ఏదైనా సరే మట్టిలోనుంచి వచ్చి చివరికి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే! విత్తనంపోయి చెట్టుపుట్టింది! చెట్టుపోయి కట్టెలు పుట్టాయి, కట్టెలు పోయి బొగ్గులు పుట్టాయి, బొగ్గులు పోయి బూడిద పుట్టింది, బూడిద తిరిగి మట్టిలోనే కలిసింది.  


✳️ గతం అనేది ఒక మృత వస్తువు 


🪷 ఈ రకంగా పుట్టడం అంటే ఒక వస్తువు తన పూర్వావస్థని వదిలి ఉత్తరావస్థని (అంటే తరువాత స్థితిని) పొందడం. ఇక్కడ అవస్థ అంటే అర్ధం స్థితి అని. అంటే వస్తువు (మెటీరియల్) అదే, కాని దాని రూపం మారింది. ‘గతం' అనేది ఒక సెకండ్ క్రితం వెళ్ళిపోయింది. దాన్ని తిరిగి తీసుకోనిరావటం అంబానీ, బిల్ గేట్స్ ల వల్ల కూడా కాదు. ‘గతం' అనేది ఒక మృత వస్తువు. దానికి ప్రాణంపోసి సజీవురాలిని చేయటం అసంభవం. ఇంతవరకూ జరగలేదు, ఇక ముందర కూడా జరగదు. మరణాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా తెలుసుకోవాలి. దీన్ని గురించి తెలుసుకుందామనే తొందరపాటు ఉండకూడదు.

మృత్యువును అతి సహజంగా, హుందాగా, అంతరంగ గౌరవమర్యాదలతో చేరుకోవాలి. జననం మాదిరిగానే మృత్యువు కూడా అద్భుతమైన విషయం. మృత్యువులో కూడా సృష్టి ఉంది. సృష్టి... ఆది-అంతం లేకుండా నిరంతరం జరుగుతుండే ప్రక్రియే మృత్యువు సృష్టికి ఒక అర్ధాన్నిస్తుంది. 


✳️ గతం నుండి విముక్తే మృత్యువు 


🪷 మళ్ళీ జన్మ ఎత్తటం కావలసినవన్నీ పొందటం మృత్యువుకేమీ సంబంధం లేదు. ఆది, మధ్య, అంతం అనే స్థితులు లేని ఒక మహత్తర సృష్టి మృత్యువు.  అంటే, ఇంకా సులభంగా చెప్పాలంటే మృత్యువు మనల్ని సమీపించిన వేళ మన దగ్గర ఉన్నవన్నీ తొలగించబడుతాయి. అనుబంధాలు, డబ్బు, భార్య, పిల్లలు, దేశం, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, గురువులు, శిష్యులు, దేవుళ్ళు నిజానికి వీటన్నిటినీ గురించిన భావాలను మనతో వస్తాయనుకుంటాం కానీ అది అసాధ్యం అవన్నీ మృత్యువు తెంచేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే గతం నుండి విముక్తే (Freedom from the Known) మృత్యువు అంటే! 


🪷 అయితే,  ఇంత సహజమైన మృత్యువుని చూసి భయమెందుకంటే...  గతాన్ని మరచి పోవటానికి మనం సిద్ధంగా ఉండం. ఇంత చెబుతున్నా ఎవరైనా తమ మత విశ్వాసాలను మార్చుకుంటారా? గతం నుండి విముక్తి చెందారా? అంటే సమాధానం లేదనే చెప్పాలి. గతం నుండి విముక్తి చెందటమంటే వర్తమానంలో జీవించటం, అట్టివారికి మృత్యు భయం ఉండదు. వారు మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు. భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తతగా ఉండండి (Be Totally Detached) ఎందుకంటే,  మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే.  చనిపోవటమంటే అన్నిటినీ వదులుకోవటం (To give up everything) మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే,  స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మనం శ్వాస, నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం, కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం. పునర్జన్మ అంటే ఇదే (So, Living is Dying) ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం.  దీన్ని గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. 


✳️ నాకు అన్నీ తెలుసు అనుకుంటే పొరపాటే...


🪷 నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు అనే ఒక నానుడిని మీరు కూడా వినే ఉంటారు. 'నేను భగవదానుభూతిని పొందాను, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు' - అని ఎవరైనా అంటే దాని అర్ధం,  స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా అని, స్టేషన్ ఒక స్థిర ప్రదేశం దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్న, 'నాకు తెలుసు, నేను చూసాను' అంటే, వాళ్ళు 'ఏదో చూసారు ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళంతా గతంలోనే ఉన్నారు.' 


🪷 గతం,  కాలంలో కరిగిపోతుంది. అది సజీవమైంది. స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు. మృత వస్తువు అంతకన్నా కాదు. విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో. కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు. ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికతలుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం. మరి ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది? నిజం తెలుసుకోవాలంటే మనసు స్వేచ్ఛగా ఉండాలి. విశ్వాసం, అవిశ్వాసం ఈ రెండింటిలోను దానికి తావులేదు. నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి. ఆ మార్గం తప్పైతే మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది. ఇన్ని గ్రహించిన తర్వాత మనిషి ఎదుటి వారి మనస్సును, అంతరాత్మ పరమార్దాన్ని తెలుసుకోగాలుగుతున్నాడా!!

కర్మ - జన్మ

 శాపం సత్వర ఫలాన్ని ఇస్తుంది


కర్మ - జన్మ  మల్లాది వెంకట కృష్ణమూర్తి.


శాపం తగలడం అనేది నిజం అని ఈ కింది సంఘటన ఋజువు చేస్తోంది. ఇది మాతృవాణి ఇంగ్లీష్ పత్రికలో షామ్ భట్ అనే అతను తన స్వానుభవాన్ని ఇలా రాసాడు.


షామ్ భట్ అనే బి.ఏ విద్యార్ధి పుత్తూరు వివేకానంద కాలేజ్లో చదువుతూండగా ఆ కాలేజి ప్రిన్సిపాల్  అయిన ప్రొఫెసర్ యం. ఎస్.అప్పాతో కాలేజీ మేగజైన్ విషయంలో పోట్లాట వచ్చింది. ఆవేశంలో అప్పా ముందే ఆ మేగజైన్ని ముక్కలు ముక్కలుగా చింపిపారేసాడు. అతను కాలేజీ చదువు పూర్తయ్యాక ఏ పని ఆరంభించినా దాన్నించి సరైన ఫలాలు అందడం లేదు. ఓరోజు షామ్ భట్ మాతా అమృతానందమయి దగ్గరకి తనకి కలిగే అపజయాల గురించి చెప్పుకోడానికి వెళ్ళాడు. ఆవిడ అతనేం మాట్లాడకుండానే కాలేజీలో జరిగిన సంఘటనని గుర్తు చేసి, అతనికి గురు శాపం తగిలిందని, ఆయన్ని కలిసి తను చేసిన అపరాధానికి క్షమాపణ వేడుకోమని సలహా చెప్పింది. రెండు రోజుల తర్వాత షామ్ భట్ తన ప్రొఫెసర్ యం. ఎస్. అప్పా ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఇతన్ని చూడగానే గుర్తు పట్టాడు. షామ్ భట్ తను ఆనాడు చేసిన పనికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి వచ్చానని చెప్పగానే అప్పాకి అతని మీద కోపం పోయింది. "ఇన్ని రోజులు నిన్ను తలచుకుని తిట్టుకోని రోజు లేదు. ఇప్పుడు నీ మీద నాకు కోపం పోయింది." చెప్పాడు ప్రొఫెసర్. ఆ తర్వాత షామ్ భట్ కు సంపాదనలో లోపం లేకుండా పోయింది.


వారిలో మన మీద కోపం నిలిచిపోయేంత లోతుగా మనం ఎవర్నయినా బాధించి ఉంటే, వారి మనసులోని బాధ ప్రకంపనలు మనల్ని వచ్చే జన్మలో వెంటాడి తాకుతాయి. ఒకోసారి ఈ జన్మలోనే అవి వచ్చి తాకచ్చు. కాబట్టి మనం అందులోంచి విడుదలవాలి అని అనుకుంటే మాత్రం, అవకాశం ఉంటే మనం మనస్థాపం కలిగించిన వారందరి దగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పడం విజ్ఞత అవుతుంది.

*నవ గ్రహదేవతల జననము - వారి తల్లితండ్రులు*.....

*నవ గ్రహదేవతల జననము - వారి తల్లితండ్రులు*.....

*1) సూర్యుడు :*
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని  "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను

*(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)*

కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని 
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను

*సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను*,
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను

యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు.....V 🙏

🦚 కృష్ణ నామం🦚

 🦚 కృష్ణ నామం🦚

                  


కృష్ణనామం పరమ ఔషధం. కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం.


శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది.


‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు.


కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది.


మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.


కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.


కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా…


*సత్య యుగంలో ధ్యానం వల్ల,


*త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల,


*ద్వాపర యుగంలో పూజలు, వ్రతాల వల్ల,


పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని,


‘హరే రామ హరే రామ రామరామ హరేహరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’

అనే నామ మంత్రం ఉపదేశించాడు.


ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.


‘కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు.


‘కృష్ణః’ అన్న పదంలోని.. ‘క’కారం బ్రహ్మవాచకం,

‘ఋ‘కారం అనంత వాచకం.

‘ష’ కారం శివ సూచకం,

‘ణ’ కారం ధర్మబోధకం.

చివర ఉన్న ఆ కారం శ్వేత ద్వీప వాసియైన విష్ణు వాచకం.

విసర్గం నర నారాయణార్ధకం.


కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.


‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే.. పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని,


‘కృష్ణ’ అంటూ కీర్తించే వారి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది.


శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది.


‘కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంత ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.


నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు.


కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది.


‘భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.


మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు.


చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది.


కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు.  కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది.  అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు.


కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది.


కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.


పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం.


జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి.

ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు.


అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది.


ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం..!!.


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు  తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

 గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్, కూర, స్వీట్ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే.. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఎక్కువగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉంటుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే.. జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది.

గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్టెన్షన్ కంట్లోల్లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి.

గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి∙ గుమ్మడి గింజల్లో çపనాగమిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే సెల్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

షుగర్ పేషెంట్స్కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.

రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.