22, మే 2021, శనివారం

*శిక్ష* *( ఇది ప్రతి తల్లి తండ్రి చదవాల్సిందే)*


🎊💦🌈🏵️💥


ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు  

15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు 

ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 

అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు. 

దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.

20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.

అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.


దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...ఒకరోజు దొరికిపోయాడు.

మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షకైనా  రోజును చెప్పేసారు


చివరగా  అతని కోరిక ఏమని అడగగా తన తల్లిదండ్రులను వారిని చూడాలని కోరాడు  

అతని కోరిక మేరకు వారిని పిలిపించారు  


కన్నవాళ్ళు కదా  కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు  

పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు 

అప్పుడు అతను వారు కాదు నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు 


ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు  కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.

అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు 


ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు  


చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..


సేకరణ. మానస సరోవరం


చెప్పండి పెద్దాయన ... మీరు దేవుడిని చూసారా ??!


🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸


ఎన్నిసార్లు చదివినా ఈ పోస్ట్ మళ్లీ మళ్లీ చదవాలి అనిపిస్తుంది...


ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్  వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక. 

అక్కడే ఉన్న ఒక  భక్తుడిని ఇలా అడిగింది. 


జర్నలిస్ట్ :మీ  వయసు ఎంతుంటుందండి? 

భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి 


జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు? 

భక్తుడు : నాకు  బుద్ది వచ్చినప్పటి నుండి 


జర్నలిస్ట్ : మరి దేవున్ని  చూసారా? 

భక్తుడు : లేదండి 


జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు? 

భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు? 


జర్నలిస్ట్ :సిటీ నుండి 

భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా? 


జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు 

భక్తుడు :మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు, 


🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸

పిబరే రామ రసం - చాగంటి వారి అద్భుత ప్రవచనం.

https://youtu.be/jHSq50YnEoQ

🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸


జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 


భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర  ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 

అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు  యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !


తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 


జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా  మాట్లాడిన  జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.


సేకరణ...


🌷🌷🌷🔸🔸🔸🌷🌷🌷


ఓం నమశ్శివాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః



సుదర్శనాష్టకం మహిమ:


అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.


సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.


శ్రీ సుదర్శనాష్టకం


ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,

జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,

నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,

శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,

ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత

జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll


స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,

పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,

ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,

నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,

హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,

దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,

అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,

వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,

స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,

షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,

వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,

జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,

నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,

అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


శ్రీ గణపతి యే నమః ఓం శ్రీ రామ రామ రామ నారాయణ నారాయణ నారాయణ

*దేవునికి తలనీలాలుఎందుకివ్వాలి*

 


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది.


నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.


 శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం.


గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి.


అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు.


భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం.


తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడుసిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు.


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం లో వినిపించే ఓం నమో వేంకటేశాయ మహా మంత్రం 


https://youtu.be/Y4R80dL8cwg


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు.


తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు.


 అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.


కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు.


కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱