10, ఫిబ్రవరి 2024, శనివారం

బ్రహ్మముహూర్తం

హరిఓం , - *బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం*.... 

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
తంత్ర మరియు క్రియాయోగ రహస్యం.....🙏

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

ఏది మాట్లాడినా, వింటున్న మనసు యొక్క సూక్ష్మ తలంలో అలల రేఖల రూపంలో ముద్రింపబడుతుంది. శక్తి ప్రవాహాల రూపంలో మేల్కొంటుంది. దాని ముద్రలు ఏర్పడతాయి. ధ్వని తరంగాలు మరొక భాగాన్ని దాటినప్పుడు, అక్కడ త్రిభుజాలు, చతుర్బుజాలు, వృత్తాలు, పంచబుజి, బిందువులు మొదలైనవి ఏర్పడతాయి. మెదడు యొక్క సూక్ష్మ కేంద్రాలను ప్రబావితం చేసే సమాధి యొక్క ఉన్నత స్థితిలో అనేక మంత్రాలు స్వీకరించడబతాయి. ఇది సైన్స్. ఇది కొత్త విషయం కాదు. ఉదాహరణకు గాయత్రీ మంత్రం ఉంది... ఇందులో 24 అక్షరాలు ఉన్నాయి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.. ఈ అక్షరాలలో చాలా శబ్దాలు ఉన్నాయి. వీటి నుంచి అనేక రకాల ప్రీక్వెన్సీ వేగ ప్రవాహాలు ఉద్భవిస్తాయి అవి అన్ని పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.. మనుషుల మనస్సు, శరీరం, భావోద్వేగాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రబావితం చేస్తాయి. చెరువులోకి ఒక రాయి విసిరినప్పుడు నీటిలో అలలు ఎగసిపడటం వల్ల కంపనం ఏర్పడి క్రమంగా విస్తరిస్తుంది. ఈ కంపనం నీటిలోని ప్రతి అణువును కంపించేలా చేస్తుంది. అదే విధంగా, మాట్లాడే మాటలు, మంత్రాలు వాతావరణంలో ఒక కంపనం సృష్టిస్తాయి ఆ కంపనం చాలా మంది వ్యక్తుల మనసులలో అల రూపంలో సూక్ష్మంగా ప్రతిబింబిస్తుంది. మంత్రం యొక్క శక్తివంతమైన శబ్దం మన అంతర్గత మనసు యొక్క పాత్రపై చెరగని ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తుంది !!!

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు :- 

వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి .. గురుముఖతః తెలుసుకుని ఆచరించి సత్ఫలితాలు పొందగలరు .

👉 దుష్టగ్రహ , దుష్టశక్తులు తొలగాలంటే ..

ప్రతీ నిత్యం మహాంకాళీమాతను ఉపాసించండి . దంత మాలను ధరించవచ్చు .. దంతమాలతో జపం చేయాలి .

👉 ప్రయోగభాధలు , చేతబడి , చిల్లంగి మొదలైన క్షుద్ర ప్రయోగాలు తొలగాలంటే 

తారాదేవిని ఉపదేశం తీసుకుని సాధన చేయాలి . ఎముకల మాలను మెడలో ధరించండి .

👉 రోగభాధలు , విషపీడలు నుండి బయటపడాలంటే 
చిన్నమస్తా దేవిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి . 

👉 అధికారం , రాజ్యం గ్రహం అనుకూలతలకు .. త్రిపుర సుందరి దేవిని ఆరాధించండి . రక్తచంధన మాలను మెడలో ధరించండి. రక్త చందనమాలతో జపం చేయాలి.

👉 దుష్టపీడల నుంచి బయటకు రావాలంటే .. భైరవి దేవిని ఆరాధించాలి . గులకరాళ్ళను మాలన చేసి మెడలో ధరించండి జపం చేయాలి.

 👉 ఋతుబాధలు , కుటుంబ క్లేశాలు , దైవశాపాలు తొలగాలంటే.. మాతంగి దేవిని ఆరాధించండి .. గురువింద గింజలను ధరించండి .. జపం చేయాలి .. 

👉 కోర్టు వ్యవహారాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే .. భగళాముఖిని ఆరాధించండి .. హరిద్రమాలను మెడలో ధరించండి.. అదే విధంగా జపం చేయాలి .. 

👉 అధిక సంపన్నులు కావాలంటే .. కమలాత్మికా దేవిని గురుముఖతః తెలుసుకుని సాధన చేయాలి .. తామరగింజల మాలతో జపం చేయాలి ..

👉 రాజకీయ వ్యవహారాల విషయం లో , ఐశ్వర్య అంతస్తులు పెరగాలంటే .. భువనేశ్వరి దేవి ఉపాసన గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. స్పటిక మాలతో జపం చేయాలి .. 

👉 శతృభాధలు అధికంగా ఉన్నా .. నిరంతరం గొడవలు కోట్లాటలు ఉంటే .. శరభశాలవను తాంత్రిక పద్ధతిలో గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. భద్రాక్ష మాలతో జపం చేయాలి .. 

👉 ప్రతీ విషయం లో విఘాతం, విఘ్నాలు , ఏ పని ముందుకు సాగకపోతే .. గణపతిని ఉపాసన మొదలుపెట్టండి .. ఏనుగు దంత మాలను ఉపయోగించి జపం చేయాలి .. 

👉 దాంపత్య సుఖం కోసం , ప్రేమ ఫలించాలంటే .. శ్రీ కృష్ణుడిని ఆరాధించండి .. ప్రావళమాలను మెడలో ధరించండి .. అదే విధంగా జపం చేయాలి .. 

👉 వశీకరణ ప్రయోగాలు సిద్ధించాలంటే .. పగడ మాలను ధరించండి.. జపం చేయాలి..