23, జూన్ 2024, ఆదివారం

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1

సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2

సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3

వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4

మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5

భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6

బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7

ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8

పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9

మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10

భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11

ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12

భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13

ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14

మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15

ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16

మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17

వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18

వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19

వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20

మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21

మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22

మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23

మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24

మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25

మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26

కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27

ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28

శకుని www.freegurukul.org/g/Bharatham-29

భీముడు www.freegurukul.org/g/Bharatham-30

దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31

మహారధి www.freegurukul.org/g/Bharatham-32

బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33

మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34

ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35

మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36

తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37

ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38

ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39

తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40

మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41
భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42

ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43

ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44

మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45

భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46

వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47

ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48

మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49

విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50
సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51

ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52

ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53

మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నవగ్రహాల అనుగ్రహం కోసం..??

నవగ్రహాల అనుగ్రహం కోసం..?? 

సూర్యడు 
🌞 ఆదివారానికి అధిపతి సూర్యడు. సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి, ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిచ్చుట శుభము.

చంద్రుడు 
🌞 సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేయుట మంచిది. అన్యోన్య దాయకమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజ, అభిషేకములు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజ చేసి ఉపవాసం ఉండటం శుభము. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి. చంద్ర హోర లో దానము శుభము.

కుజుడు 
🌞మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేకంగా తమలపాకు మరియు సింధూర పూజ చేయాలి. ఎర్రటి దుస్తులు, ఎర్రటి పూలు ఉపయోగించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువుకోవాలి. కందులు దానమివ్వాలి.

బుధుడు 
🌞 బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజ చేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు పెసలు, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

బృహస్పతి 
🌞 గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞాన సముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, శనగలు వంటివాటిని దానమివ్వాలి.

శుక్రుడు 
🌞శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. 

శనిశ్వరుడు 
🌞 శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. నూనెతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి.

రాహువు 
🌞నీలం మరియు నలుపు రంగుల దుస్తులను దానం చేయడం మంచిది. ఈ చర్య రాహువును ప్రసన్నం చేస్తుందని మరియు ప్రయోజనకరమైన ఫలితాలను తెస్తుందని భావిస్తారు. ఆదివారం రోజున గోధుమలు, బెల్లం లేదా రాగిని దానం చేయడం మంచిది.

కేతువు 
🌞 గణేశుడిని రోజూ పూజించడం వల్ల, కేతువు యొక్క దుష్ప్రభావాల నుండి దూరంగా ఉండవచ్చని నమ్ముతారు. కేతు మహాదశ సమయంలో స్థానికులు ఎదుర్కొనే సమస్యలను గణేశుడు మాత్రమే పరిష్కరించగలడని చెబుతారు.

🌹🌹👉🌹🌹👉

*శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం*

ఓం ఆంజనేయాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం హనుమతే నమః |
ఓం మారుతాత్మజాయ నమః |
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః |
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః |
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః |
ఓం సర్వమాయావిభంజనాయ నమః |
ఓం సర్వబంధవిమోక్త్రే నమః |
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః ౧౦ 

ఓం పరవిద్యాపరీహారాయ నమః |
ఓం పరశౌర్యవినాశనాయ నమః |
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః |
ఓం పరయంత్రప్రభేదకాయ నమః |
ఓం సర్వగ్రహవినాశినే నమః |
ఓం భీమసేనసహాయకృతే నమః |
ఓం సర్వదుఃఖహరాయ నమః |
ఓం సర్వలోకచారిణే నమః |
ఓం మనోజవాయ నమః |
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః ౨౦ 

ఓం సర్వమంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వయంత్రాత్మకాయ నమః |
ఓం కపీశ్వరాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం సర్వరోగహరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం బలసిద్ధికరాయ నమః |
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః |
ఓం కపిసేనానాయకాయ నమః ౩౦ 

ఓం భవిష్యచ్చతురాననాయ నమః |
ఓం కుమారబ్రహ్మచారిణే నమః |
ఓం రత్నకుండలదీప్తిమతే నమః |
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః |
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః |
ఓం కారాగృహవిమోక్త్రే నమః |
ఓం శృంఖలాబంధమోచకాయ నమః |
ఓం సాగరోత్తారకాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః ౪౦ 

ఓం రామదూతాయ నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం వానరాయ నమః |
ఓం కేసరిసుతాయ నమః |
ఓం సీతాశోకనివారకాయ నమః |
ఓం అంజనాగర్భసంభూతాయ నమః |
ఓం బాలార్కసదృశాననాయ నమః |
ఓం విభీషణప్రియకరాయ నమః |
ఓం దశగ్రీవకులాంతకాయ నమః |
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః ౫౦ 

ఓం వజ్రకాయాయ నమః |
ఓం మహాద్యుతయే నమః |
ఓం చిరంజీవినే నమః |
ఓం రామభక్తాయ నమః |
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః |
ఓం అక్షహంత్రే నమః |
ఓం కాంచనాభాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం మహాతపసే నమః |
ఓం లంకిణీభంజనాయ నమః ౬౦ 

ఓం శ్రీమతే నమః |
ఓం సింహికాప్రాణభంజనాయ నమః |
ఓం గంధమాదనశైలస్థాయ నమః |
ఓం లంకాపురవిదాహకాయ నమః |
ఓం సుగ్రీవసచివాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం దైత్యకులాంతకాయ నమః |
ఓం సురార్చితాయ నమః |
ఓం మహాతేజసే నమః ౭౦ 

ఓం రామచూడామణిప్రదాయ నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం పింగళాక్షాయ నమః |
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః |
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః |
ఓం విజితేంద్రియాయ నమః |
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః |
ఓం మహిరావణమర్దనాయ నమః |
ఓం స్ఫటికాభాయ నమః |
ఓం వాగధీశాయ నమః ౮౦ 

ఓం నవవ్యాకృతిపండితాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సంజీవననగాహర్త్రే నమః |
ఓం శుచయే నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం దృఢవ్రతాయ నమః |
ఓం కాలనేమిప్రమథనాయ నమః ౯౦ 

ఓం హరిమర్కటమర్కటాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం శతకంఠమదాపహృతే నమః |
ఓం యోగినే నమః |
ఓం రామకథాలోలాయ నమః |
ఓం సీతాన్వేషణపండితాయ నమః |
ఓం వజ్రదంష్ట్రాయ నమః |
ఓం వజ్రనఖాయ నమః ౧౦౦ 

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః |
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః |
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః |
ఓం శరపంజరభేదకాయ నమః |
ఓం దశబాహవే నమః |
ఓం లోకపూజ్యాయ నమః |
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః |
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః ౧౦౮ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏

నవగ్రహాల ప్రదక్షిణం ఎలా చేయాలి..??

నవగ్రహాల ప్రదక్షిణం ఎలా చేయాలి..?? 


🙏నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. నవగ్రహ ప్రదక్షిణలకు కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మనిషి మనుగడ, వారి జీవన విధానం, మానసిక స్థితిగతులు అన్నీ ఈ నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి. 

🙏జీవితంలోని అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. ఈ ప్రదక్షిణలు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

🙏 నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళతాం కదా.. లోపలికి వెళ్లాక ఎడమ వైపు నుంచి.. అంటే క్లాక్ వైజ్ కుడి వైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. కుడి భాగం సూర్యుడికి, ఎడమ భాగం చంద్రుడికి సంబంధించినవిగా భావించాలి.

🙏 అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహాల ప్రతిమలను తాకుతుంటారు. అలా తాకకూడదు. తాకకుండానే ప్రదక్షిణలు పూర్తి చేయాలి.

🙏 తొమ్మిది ప్రదక్షిణలూ పూర్తయ్యాక కుడి వైపు నుంచి ఎడమ వైపు.. అంటే బుధుడి వైపు నుంచి రాహు, కేతువులను ధ్యానిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

🙏 మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణలలోనూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో గ్రహాన్ని స్మరించుకోండి.

🙏 ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక నవగ్రహాలకు మీ వీపును చూపించకుండా మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. చాలా మంది ఇలా చేయరు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

🙏 శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన మండపం ఉంటుంది. మనం గుడిలోకి వెళ్లగానే ముందు మూల విరాట్టును దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే నవ గ్రహః దర్శనానికి వెళ్లాలి.

🙏నవగ్రహాల ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ '
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: ''

🙏అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేయాలి. 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు.. అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 

🙏రాహుకేతువులకు ప్రత్యేకంగా ఎందుకంటే అవి ఛాయా గ్రహాలు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాలు. రాహుకేతువులను సంతృప్తి పరచడం వల్ల మన జీవితంలో ఒడుదొడుకులు ఉండవు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా రాశ్యాధిపతులైన నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది. 

🙏తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అపసవ్యంగా అంటే ఇంతకుముందు మీరు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడంవల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. 

🕉️🕉️🕉️🕉️🌹🌹🕉️🕉️🕉️🕉️

గంగావతరణం

గంగావతరణం

శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.

సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు.ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.ఆదిత్యయోగీ..

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.ఆదిత్యయోగీ..
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్ర మయినది.....🙏🙏🙏🙏*
.

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం: ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు,j పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య"
" న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా "
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
       ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.
ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.
ఇరవైనాలుగు అక్షరములు - దేవతలు
1. తత్ – గణేశ్వరుడు- వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. స - నృసింహ భగవానుడు: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. వి - విష్ణుదేవుడు: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
4. తుః - శివదేవుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. వ - కృష్ణ భగవానుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
6. దే - రాథా దేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
7. ణ్యం - లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
8. భ - అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
9. ర్గః – ఇంద్రదేవుడు- మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. దే - సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. వ - దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. స్య - హనుమంతుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. ధీ – పృధ్వీదేవి-భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. మ - సూర్యదేవుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. హి - శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. ధి - సీతామాత: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. యో - చంద్రదేవుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యో - యమదేవుడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. నః - బ్రహ్మదేవుడు: సకల సృష్టికి అధిష్ఠాత.
20. ప్ర - వరుణదేవుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. చో - నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. ద - హయగ్రీవ భగవానుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. యా - హంసదేవత: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. త్ - తులసీదేవి: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
       ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.
      గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.
       వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.

త్రిశంకు స్వర్గం*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
       
               *త్రిశంకు స్వర్గం*
                 ➖➖➖✍️
```
విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలా సేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్టుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేసాడు.

విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక “మహారాజా! మీరు, మీ పరివారమూ బాగా డస్సినట్టున్నారు. త్వరగా స్నానాదికాలు కానివ్వండి. భోజనం చేద్దురుగాని"  అన్నాడు వశిష్టుడు.

మహారాజు,ఆయన సేవకులు స్నానాలు పూర్తిచేసి వచ్చేసరికి రకరకాల పిండివంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో యిన్ని వంటకాలు యీ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్టుడి దగ్గరకు వెళ్ళి “స్వామీ షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు?" అని అడిగాడు.

తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని "నందిని" అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు.

విశ్వామిత్రుడికి పేరాశ కలిగింది.

ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. "విరాగీ! నీ కామధేనువును నాకివ్వు. బదులుగా నీకు శ్రేష్ఠమైన కోటి పాడి ఆవుల్ని ఇస్తాను" అన్నాడు విశ్వామిత్రుడు.

వశిష్టుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు.

విశ్వామిత్రుడికి కోపం వచ్చి... "రాజ్యంలోని సమస్త వస్తువులూ సకల సంపదలూ మహారాజుకే చెందుతాయి. రాజే అన్నిటికీ అధిపతి" అన్నాడు.

వశిష్టుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళెర్రజేసి బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళబోయాడు.

వశిష్టుణ్ణి వదలి వెళ్ళటం ఇష్టంలేని నందిని తోక ఝుళిపిస్తూ, కొమ్ములు విసురుతూ, ముంగాళ్ళపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోరయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది. ఓడిపోయారు.

ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్టుడితో యుద్ధానికి తలపడ్డాడు.

విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్టుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం, అధికారం, అంగబలం, ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి.

విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై, ఖిన్నుడై రాజనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు.

అయితే అప్పటినుంచీ ఆయనలో వశిష్టుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కాని లేశమైనా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన, అన్వేషించని మార్గాలూ లేవు.

రాజుకన్నా, రాజ్యాధికారంకన్నా తపశ్శక్తి గొప్పదని, తాపసులు దైవసమానులనీ, మహర్షులు తలచుకుంటే యీ పృథ్వి మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు.

రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు.

నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్నీ, అద్భుతశక్తుల్నీ సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్నకొద్దీ వశిష్టుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది.
*************

సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్టుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు.

ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్టుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ                ఆ యాగంలో పాల్గొనలేదు.

విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తిచేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్ళాడు.

తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు.

ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని , కోపగించి, త్రిశంకుణ్ణి కిందకు ఒక్కతోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేలమీదకు వచ్చిపడుతూ "విశ్వామిత్రా రక్షించు" అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు.

విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపివుంచి, అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. (దీనినే త్రిశంకు స్వర్గం అంటారు)కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణీ, దేవతలనూ సృష్టించ బోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు.

ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

ఇంద్రుడు తక్షణమే బంగరు విమానాన్ని తీసుకు వచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
🕉️🕉️🕉️🌹🕉️🕉️🕉️🌹🕉️🕉️🕉️

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 1 ॥

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 2 ॥

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 3 ॥

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 4 ॥

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 5 ॥

దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 6 ॥

పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 7 ॥

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 8 ॥

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 9 ॥

తిరుమల - నడకదారులు

తిరుమల - నడకదారులు

తిరుమల శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఉన్న నడకదారులు వాటి వివరాలు తెలుసుకుందాం

ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు.

తాళ్ళపాక అన్నమాచార్యులు అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు . అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి.

మొదటి మెట్టు

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. దూరం 11- 12 కి.మీ లు ఉంటుంది.

రెండవ దారి

తిరుపతి కి 10 కి.మీ ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.

చంద్రగిరికి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు. కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి ఎక్కువగా తెలీదు.

మూడవ దారి

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

నాల్గవ దారి

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ఉంది... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం నుండి వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి

కల్యాణి డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 కి.మీ.

ఐదవ దారి

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 కి.మీ.

ఆరవ దారి

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

తలకోన

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేట దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

తిరుమల గురించి మరికొన్ని విషయాలు

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద విజయనగర రాజులు మెట్లు నిర్మించారు. ఆ తర్వాత అలిపిరి నుండి- గాలి గోపురం వరకు మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..
అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

ఆంజనేయస్వామి

గాలిగోపురం లోపలికి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి,అక్కడినుండి అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట 

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య జగజ్జనని పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.. 🙏🙏🙏🙏🙏🙏

ఆత్మలతో మాట్లాడుతాను

https://youtu.be/9D33Q_78d9g?si=7Fo2-5kHCSg7dcxr

హనుమాన్ చాలీసా (తెలుగు)*_గానం : శ్రీ M. S. రామారావుగారు.

_*హనుమాన్ చాలీసా (తెలుగు)*_
గానం : శ్రీ M. S. రామారావుగారు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*శ్రీరామ జయరామ జయజయరామ*
*శ్రీరామ జయరామ జయజయరామ*
*శ్రీరామ జయరామ జయజయరామ*

*ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం*
*లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహమ్*

*హనుమాన్ అంజనాసూనుః వాయు పుత్రో మహాబలః*
*రామేష్ఠః ఫల్గుణసఖః, పింగాక్షో అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్య మృత్యుభయంనాస్తి సర్వత్ర విజయీభవేత్*

శ్రీ హనుమాను గురుదేవు చరణములు!
ఇహపర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు ॥ శ్రీ ॥

జయ హనుమంత జ్ఞానగుణ వందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మండిత కుంచిత కేశ ॥ శ్రీ ॥

రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలము జేసిన ॥శ్రీ॥

సీతజాడగని వచ్చిన నినుగని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్త్ర రీతుల నిను కొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ

వానర సేనతో వారధి దాటి
లంకేసునితో తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసన గూల్చిన ॥ శ్రీ ॥

లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీ రామబాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురులేని ఆ లంకాపురమున
ఏలికగా విభిషను జేసిన ॥ శ్రీ ॥

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగి పొరలె 

సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతు పదం నీ హృదయం
రామచరిత కర్ణామృత గాన
రామనామ రసామృత పానా ॥ శ్రీ ॥

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీకృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న

రామద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీనామ జపము విని ॥ శ్రీ ॥

ధ్వజాది రాజా వజ్ర శరీరా
భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీకీర్తి గానముల ॥ శ్రీ ॥
   
సోదర భరత సమానా యని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడ వన్నా
అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ది నవనిధులకు దాతగ
జానకీ మాత దీవించెనుగా
రామరసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసిన  శ్రీ

నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దు:ఖ భంజన
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ॥ శ్రీ ॥

శ్రద్ధగ దీనిని అలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగ గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న 
ఓ హనుమన్నా!

 *మంగళహారతి* 

మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలువో అనంత
నీవే అంతా శ్రీ హనుమంతా!!!!!

     *ఓం శాంతి: శాంతి: శాంతి:*

*శ్రీరామ జయరామ జయజయరామ*
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

చాలీసా*. అంటే ఏమిటి?

*చాలీసా*.     అంటే ఏమిటి? 
జ. ఈస్తోత్రంలో  40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)

2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.* 

3. ఆంజనేయ - అర్థం?
జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.

4. తులసీదాస్ అస్సలు పేరు ?
జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.

5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?
జ. దేవుళ్ళ భార్యలను,  మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య  వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.

6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?
జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.

7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?
జ.  తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా  అర్ధం  చేసుకోవాలి.

8. హనుమంతుని పంచముఖములు ఏవి?
జ.  హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....
తూర్పున వానర ముఖం  జన్మతః  వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం  గరుడ ముఖం  అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం  వరాహ ముఖం  అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు  వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది🙏🙏🙏🙏

9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం  అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.

10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.

11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం  వచ్చినపుడు, ఎవరైనా  గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.

12. రాక్షస సంహారానికై  హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం  చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి  నారదుని ద్వారా  హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ  ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.

13 . రామకార్యం  చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం  స్వీకరించకుండా వెళ్ళడంలో.

14 . సీతారాములు పట్టాభిషేక  అనంతరం  హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన  అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని  బహుమతిగా  ఇచ్చాడు.

15.  కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ  అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం)  పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా  తేజస్వరూపుడు అని అర్థం.

16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏

17. హనుమ రామదూత ఎలా అయ్యాడు  ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా  వెళ్ళి  సీతమ్మ కు ఇచ్చాడు. వేదం  అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  
అగ్ని ముఖావై దేవాః. 
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు  దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం  అంటే  సృష్టి  క్రమంలో  ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి  వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో  పోల్చారు. అగ్ని ఏవిధంగా  అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను  పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు  హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.

18 . అతులిత బలధామా  అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో  పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే  సీతాన్వేషణ కై హనుమని  ఎంచుకోవడం.

19 . ఇంతకూ  హనుమ కేసరి నందనుడా?  వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు  సూర్య  నాడి ద్వారా  వాయుదేవుడు  సర్వ దేవతా తేజస్సు  ప్రవేశ  పెట్టాడు కాబట్టి  ఇద్దరికీ.

20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో  తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.

21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని  తానే  నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 

22 . ఆ రోజులలో ఉన్న వానరుల  ప్రత్యేకత ఏమిటి? 
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.

23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.

24 . విక్రమ  అంటే  అర్థం  ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.

25. సూక్ష్మరూపం  ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా  ప్రవేశ సమయంలో  పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ  ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .

26. వికటరూపం  అంటే  ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో  చూపుతాడు.

27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో  హనుమ  తత్వాన్ని చూస్తాము.

28. భీమరూపధారిగా  ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .

29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో  దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని  రావణుడు భయపడాలి అని  భావించి లంకా దహనం చేసాడు.

30. అశోకవన నాశనానికి ప్రతిగా  రావణుడు హనుమకి  ఇచ్చిన దండన ఏది? 
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక  తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని  చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .

31. రఘువీరుడు ఎందుకు  సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం  వల్ల  లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.

32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.

33. భీముడు హనుమని  కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం  చూపమని  అడుగుతాడు.

34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం  నేర్చుకున్నపుడు,  అశోకవనంలో సీతమ్మ దగ్గర  మొత్తం మూడు సార్లు తనమహత్  రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏

35. హనుమంతుని జన్మదినం  రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ  బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో  చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.

36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.

 37. భజరంగీ అంటుంటాం - ఎందుకు? 
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.

38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో  రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం  లేక  వినడు కానీ అక్కడే ఉండి  విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహ రచన.
39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు  రాళ్లతో  కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని  సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం  వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు  నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి  అలా కారణమై నాడు.

యుద్ధసమయంలో  అర్జునుడు కృష్ణునితో  అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని  ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం  వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏

40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.

41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని  గురించి చెప్పేదే సుందరాకాండ.

పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.

హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. 

పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* . 

42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే  హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని  చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.

43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?

జ.  *బ్రహ్మ పదవి.* 

పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ  నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది  బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా  బ్రహ్మ లోకం వెళ్లి  బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ  దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో  మన గా  చూస్తే  అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక  ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.

 బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.

తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు  రాబోయే  కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.

*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.* 
20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు .

.అటువంటి హనుమకు బ్రహ్మతో సహా  మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.🙏🙏

 *రామ లక్ష్మణ జానకి జై బోలో* *హనుమాన్ 🍊🪻🪷🌺🌸🍓🍒🌻🍌🍋🥥🍎🍅* ,

*అంత్యక్రియలు అంటే ఏమిటి??*

*అంత్యక్రియలు అంటే ఏమిటి??*

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. 
కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.

పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని
(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.

హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.

దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.🙏🙏🙏🙏🙏

పెళ్లిలో ఏడడుగులు...బ్రహ్మముడి అర్ధం..!!

ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః..!!🙏🙏
పెళ్లిలో ఏడడుగులు...
బ్రహ్మముడి అర్ధం..!!

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, 
నూరేళ్ల సాన్నిహిత్యం.
వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే 
ఆ సంసారం స్వర్గం. 
ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. 

మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. 
ఆ సందర్భంలో వధూవరులతో చేయించే 
ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.

జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 
ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. 
వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.
ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.

ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను 
ఒకటిగా చేసేదే వివాహ బంధం.
హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ 
ఓ ప్రత్యేకత ఉంది. 

కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, 
ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. 
ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. 
వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. 

దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. 
భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, 
అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.

అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. 
ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

మొదటి అడుగు:..!!
ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’                       
ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!

రెండో అడుగు:..!!
ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’
ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!

మూడో అడుగు..!!
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’
వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!

నాలుగో అడుగు:..!!
చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’
మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!

అయిదో అడుగు:..!!
‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’
మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!

ఆరో అడుగు:..!!
షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’
ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!

ఏడో అడుగు:..!!
సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’
గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!

ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. 
ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. 
ప్రేమగా ఉందాం. 
మంచి మనసుతో జీవిద్దాం. 
మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.

అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. 
నేనూ ఏ పొరపాటు చేయక నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి.
నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని.
నువ్వు మనసైతే నేను మాట.
నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి.
మనిద్దరిలో వ్యత్యాసం లేదు. 
కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.

‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, 
మనకు ఉత్తమస్థితి కలగడానికి, 
మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే 
ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని 
పురుషుడు చెబుతాడు.

భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. 
భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. 
ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. 

భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు 
ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. 
భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, 
అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి 
వీలు లేకుండా ఉండాలని, 
అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా 
ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని  వథువుకి,     
భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" 
అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏
🍒🍓🌸🌻🍌🪻🪷🌺🍅🍎

శివుడు శ్మశానంలో కొలువై వుండటానికి కారణమేంటి?

శివుడు శ్మశానంలో కొలువై వుండటానికి కారణమేంటి?
శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది......ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే.......
పార్వతీ........శ్మశానంలో నేనేమీ ప్రయత్న పూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువైవున్న ప్రాంతం శ్మశానం.....ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మ......స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు......
లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి......
పైగా, ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా..అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా.......మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానం లోనే కొలువై వుండాలని ప్రార్థించాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువై వున్నాను అని చెప్పాడు.
ఇది మొదటి కారణం కాగా, మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి...... 
జీవించి వున్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకలితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే... అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే.....ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు.....జీవించి వున్నంతకాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు...... అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు........
అసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా.. గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే........ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా, ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు..
ఓం నమఃశివాయ.. హర హర మహాదేవ శంభో శంకర..🙏🙏
.......🌹🌹🌼🌼🌼🌹🌹

*తిథి అంటే ఏమిటి?* *అధిష్టాన దేవతలెవరు?*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

   *తిథి అంటే ఏమిటి?*
         *అధిష్టాన దేవతలెవరు?*
                  ➖➖➖✍️

*తిథి అంటే…  వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు.* 

*ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది.* 
*శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.* 

*తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది.* 

*ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.*

*(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. పాడ్యానికి అధిదేవత అగ్ని.*
*(2) విధియ > బ్రహ్మ*
*(3) తదియ > గౌరి*
*(4) చవితి > వినాయకుడు*
*(5) పంచమి > నాగరాజు*

*(6) షష్టి > షణ్ముఖుడు*
*(7) సప్తమి > సూర్యుడు*
*(8) అష్టమి > రుద్రుడు*
*(9) నవమి > దుర్గ*
*(10) దశమి > ఆదిశేషుడు*

*(11) ఏకాదశి > యమధర్మరాజు*
*(12) ద్వాదశి > విష్ణు*
*(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు*
*(14) చతుర్థశి >  కాళికామాత*
*(15) పౌర్ణమి > చంద్రుడు*
*(16) అమావాస్య > లక్ష్మి*

*ఏదైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

నవగ్రహ శ్లోకాలు

నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

చంద్రః
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

కేతుః
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥

*శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్*🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏

*శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్*
🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏

*దేవ్యువాచ :* 🙏

దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

*ఈశ్వర ఉవాచ:* 🙏

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |

అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

*ధ్యానమ్:* 🙏

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం 
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదాం |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ 

వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధాం |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ 

అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీం |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ 

అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభాం |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ 

నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరం |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ 

పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమాం |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ 

పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభాం |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ 

చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలాం |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ 

విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీం |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ 

భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీం |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ 

ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదాం |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ 

శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయాం |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ 

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ 

నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికాం |
త్రికాలజ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ 

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరాం |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ 

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే 

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్

🙏 *ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్..* 🙏

🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏