25, ఏప్రిల్ 2020, శనివారం

పరందామానికి నిచ్చెన

"అనంత కోటి లోకాలకు నిచ్చేన వేయ బడి ఉంది.సహనం ధర్మంగా జీవిస్తే కొన్ని మెట్లు ఎక్కగల్గుతాము.శాంత ము అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా ఎలాంటి వారితో నైనా శాంత ము తో వుండగలిగితే ఇంకా కొన్ని మెట్లు అభివృద్ధి సాధిస్తాము.స్వాధ్యాయం ధర్మంగా జీవిస్తే పై లోకాలకు కొన్ని మెట్లు ఎక్క గలుగు తాము.అహింస పాటిస్తే అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ చూపిస్తూ ఉంటే,అన్ని కులాలు ,మతాలు వారి పట్ల అభిమానం ,ఇంట్లో బయట ఇలా హింస లేకుండా మాటల్లో ,చేతల్లో ,ఆలోచనల్లో హింస లేకుండా చేసుకుంటుంటే ఇంకా కొన్ని మెట్లు ఆటోమాటిక్ గా ఎక్కగల్గుతాము.కరుణా ఇతరుల పట్ల మన పట్ల కరుణ .మాట,చేత సహాయం.వినయం ధర్మంగా అనుసరిస్తే ఎంత ధ్యాని గాని ఎంత పండితుడు గా ని ,ఎంత ధన వంతుడు అయినా వినయం తో ఉంది తీరాలి.విర్రవీగటం మానుకోవాలి మనకంటే మహాత్ములు గోప్పవారు ఎందరో ఉన్నారు అని గుర్తు పెట్టుకొని మసలుతూ ఉంటే పై మెట్లు ఎక్కగలము.సత్యం తెలుసుకుంటాం'ఆత్మే సత్యం అని జీవితం ఒక నాటకం అందులో పాత్రధారులం అని జీవితాన్నీ రసవత్తరంగా జీవించాలి .అని మరణాంతర జీవితం ఉంది ఇలాంటి నాటకాలు ఎన్నో వేయాల్సి ఉంది 'అని సత్యం తెలుసుకొని సత్యం లో జీవిస్తుంటే ఏ బాధలు,ఆందోళనలు7 లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటే ఇంకా ఉన్నతి ని సాధిస్తాము.దానం.మనకు ఉంచుకోవాల్సింది ఉంచుకొని మిగతా ఇతరులకు ఇవ్వగలిగితే .మన దగ్గర ఉన్నది ఏదయినా విద్య,సంగీతం,భాష,జ్ఞానం డబ్బు ,ఏ సహాయం చేయడానికి వీలున్నదో అది చేయడమే దానం పై మెట్టుకు చేరు తుంటాం.అలాగే ధ్యానం చేయడమే మన ధర్మం
లోకాలన్నింటి జ్ఞానం,సృష్టి రహస్యాల జ్ఞానము ,పునర్జన్మ ,మరణం పుట్టుక ల జ్ఞాన్స్మ్,కార్య కారణాల జ్ఞానం సమస్త జ్ఞానాలు ధ్యానం చేస్తే నే తెలుస్తాయి ప్రపంచ జీవితం ఆధ్యాత్మిక జీవితం బాలెన్స్డ్ గా వుండగలుగుతుంటే స్వర్గానికి నిచ్చేన లు వేయకుండానే ఆటోమాటిక్ గా ఆ నిచ్చెన ఏర్పడి పరందామానికి మార్గం చూపుతుంది."

🙏“ధ్యాన శాస్త్రం”- బ్రహ్మర్షి పత్రీజీ 🙏*


🔸శ్వాసశక్తే మన మనుగడకు జీవనాధారం! మరి ఈ శ్వాస శక్తే మనల్ని మన మూలాల్లోకి తీసుకునివెళ్తుంది.ఎప్పుడైతే మనం శ్వాసానుసంధానం చేస్తామో అప్పుడు శ్వాస సూక్ష్మమై..మనస్సు శూన్యమై..పరిశూన్యమై విస్తారంగా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహించి, మన దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది..మనం సూక్ష్మశరీరయానాలు చేస్తాం ! 

🔸విశేష ధ్యానాభ్యాసం ద్వారా “నేను శరీరాన్ని కాదు”... “అయమాత్మా బ్రహ్మ” ..“నేను అందరిలో ఉన్నాను”, .. “అహం బ్రహ్మాస్మి” .. “నేను ఆత్మను” అంటూ ..ఆత్మను గురించి ఖచ్చితంగా సంపూర్ణంగా తెలుసుకుంటాం.  

🔸మనలో ఇలాంటి ఆత్మజ్ఞానం వల్లనే “ఎలా మాట్లాడాలి ?” .. “ఏ భావాన్ని వ్యక్తపరచాలి ?” .. “ఎలా నడుచుకోవాలి?” .. అన్న విషయాల్లో కూడా ఎంతో పరిపక్వత వస్తుంది! 

🔸జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు ఎదురవుతూ .. వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ,“ఆత్మ ఎదుగుదల కోసమే ఈ శరీరాన్ని ధరించి జన్మ తీసుకున్నాము” అనే ఆత్మసాక్షాత్కారాన్ని క్రమక్రమంగా పొందుతూ ఉంటాం.

🔸క్రమంగా శరీరానికి వున్న అవుధులు ఆత్మకు లేవని అర్థం చేసుకుని, ఆనందంగా ఒకేసారి బహుముఖతలాల్లో విహరిస్తూ అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అపారంగా గ్రోలుతూ ఉంటాం.
🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂

23, ఏప్రిల్ 2020, గురువారం

🙏శ్రద్ధ - సబూరి🙏

*🙏శ్రద్ధ - సబూరి🙏* 

🔸“ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం.
ఒకటి : ‘శరీరవత్ ప్రాపంచిక జీవితం’ 
రెండు: ‘ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం’

🔸“శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు .. భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి.  

🔸“సముద్రపు అలల వంటి మానావమానాలతో .. మరి సుఖదుఃఖాలతో .. కూడిన మన దైనందిన ప్రాపంచిక జీవితాన్ని జీవించడానికి మనం ఎంతో సహనాన్ని అలవరచుకోవాలి.

🔸“కుటుంబంలో ఉన్న అందరితో కలిసి మెలిసి ఉంటూ .. ఉద్యోగ వ్యాపారాదులను నిర్వహించుకోవడంలో అపారమైన సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం .. వాటి నుంచి అనుభవజ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుగలుగుతాం!

🔸“అలాగే ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవించేటప్పుడు మనం ఎనలేని ‘శ్రద్ధ’ను కలిగి ఉండాలి.“‘శ్రద్ధ’ అంటే ఏకాగ్రత! ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జనలో, ధ్యానసాధనలో, శ్రవణంలో, స్వాధ్యాయంలో, సజ్జనసాంగత్యంలో మరి సేవలో అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి.”

🔸“ఇదే మరి యోగేశ్వరులైన షిరిడీసాయి నాధులు మనకు ఇచ్చిన ‘శ్రద్ధ – సబూరి’ అన్న రెండు గొప్ప వరాలు! ” 

🔸‘ A Master of Meditation is a Master of Patience’ కనుక .. మనం ప్రాపంచిక జీవితం పట్ల సహనంతో మరి ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధతో   మన రెండు జీవితాలనూ సరిసమానంగా జీవించాలి!

       - *బ్రహ్మర్షి పత్రీజీ* 
🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂🧘‍♀🧘‍♂

21, ఏప్రిల్ 2020, మంగళవారం

పిల్లవాడి సందేహం

*ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు...?” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు*.

 *ఆరోజు పాఠం*
 “ _ఓం పూర్ణమద: పూర్ణమిదం 
పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం._ 

*పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి    తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి "నేర్చుకున్నావా...?" అని అడిగారు. "నేర్చుకున్నాను" అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.* 

*దానికి ప్రతిగా శిష్యుడు, "కావాలంటే పుస్తకం చూడండి..!" అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.* 

*"శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది...?" అని అడిగారు గురువు గారు.* 

*శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ ఇలా అన్నారు*

*"పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం...!" అని వివరణ చేశారు.*

ఉత్తమ ధ్యాన పద్దతి

ధ్యానం అన్నది మన మనసుని శాంతపరచుకోవటం, కుదుట పరచుకోవటం, నిర్ములిన్యం చేసుకోవటం, ఎలా అయితే మన ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరచుకుంటామో అలాగా మన మనసుని కూడా శుబ్రపరచుకోవాలి, గుడికి వెళ్ళినపుడు ప్రదర్శినాలు చేసేటపుడు లోపలకి పోయేటపుడు అంత బాగుంటునే కదా గర్భగుడికి పోయి నమస్కారం చేస్తాం, లోపల బాగుంది బయట మాత్రం చెత్త ఉంది, మరి ఆ గుడికి వెళ్లగలమా!..          

అలాగే ఈ మనసు అనే గర్భగుడి లో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు, కనుక మనసులో చెత్త చెదారం ఉండరాదు, నిన్నటి విషయాలు ఈరోజు చెత్తనే కదా, కనుక మనసుని ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి, మనసు అనేది గర్భగుడి, ఆత్మ అనేది దేదీప్యమైనది ఆ దైవం, మనసు లోపలకి వెళ్లి అక్కడ నుంచి ఆత్మ దర్శనం చేసుకుంటాము, కనుక ప్రతిరోజూ మన మనసుని clean చేసుకునే కార్యక్రమమే ధ్యానము.                          

గొప్ప గొప్ప అందగత్తెల యొక్క competetions చూస్తూ ఉంటాము, Miss Universe అని, Miss India అని, ఆ పోటీల్లో గొప్ప శిఖరాగ్రమైన అందాన్ని చూస్తాము, అలాగే ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి అన్ని మంచివే అన్ని చక్కటివే, కానీ శిఖరాగ్రమైన ధ్యాన పద్ధతి పేరు ఆనాపానసతి, ఇది ఉత్తమోత్తమ, ఉన్నతోన్నత ధ్యాన పధ్ధతి అని నేను నా ధ్యాన జీవితం లో తెలుసుకున్నాను. - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ