22, మే 2021, శనివారం

ఓం నమశ్శివాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః



సుదర్శనాష్టకం మహిమ:


అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.


సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.


శ్రీ సుదర్శనాష్టకం


ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,

జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,

నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,

శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,

ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత

జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll


స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,

పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,

ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,

నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,

హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,

దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,

అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,

వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,

స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,

షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,

వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,

జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,

నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,

అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ

జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll


శ్రీ గణపతి యే నమః ఓం శ్రీ రామ రామ రామ నారాయణ నారాయణ నారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి