8, నవంబర్ 2018, గురువారం

ధ్యానం చేసే పద్దతి


👌హాయిగా సుఖాసనం లో కూర్చొని ...చేతులు రెండూ కలిపి, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని, కళ్ళు రెండూ మూసుకొని ....ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్చ్వాస,నిశ్వాసలను గమనిస్తూ వుండాలి. ఏ మంత్రాన్ని జపించారాదు. ఏ దైవ రూపాన్ని ఊహించరాదు,మధ్య మధ్యలో వచ్చే ఆలోచనలు విడిచిపెట్టి అనగా కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస ను గమనిస్తూ వుంటే నెమ్మది, నెమ్మదిగా “ఆలోచనలు లేని స్థితి” కలుగుతుంది.ఇదే ధ్యానం.👍
“ధ్యానం వల్ల లాభాలు”

1. ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
2. మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
3. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
4. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
5. మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
6. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి