8, నవంబర్ 2018, గురువారం

బ్రహ్మర్షి పత్రీజీ సందేశాలు

బ్రహ్మర్షి పత్రీజీ గారి సందేశాలు* 🔺


 🌸గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మప్రభోదాలే- 1 🌸”

🌹జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతిఒక్క సమస్యకూ తగిన పరిష్కారం తప్పకుండా వుంటుంది ! 🌹

🌹ఆ పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే .. మన అంతరంగంలోనే నిక్షిప్తమై వుంటుందే కానీ బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు ! 🌹

🌹నిజానికి బయటివాళ్ళెవ్వరూ అసలు మన సమస్యను పరిష్కరించజాలరు.🌹

🌹తరచిచూస్తే మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా .. మనలోంచి ఒకానొక ప్రశ్నను ఉదయింపజేస్తుంది ! 🌹

🌹ఆ ప్రశ్నే .. మన సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికిపెడుతుంది !

🌹అందుకే .. సమస్యలు వచ్చినప్పుడల్లా మన మనస్సులోంచి ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ వుంటాయి.🌹

🌹ఎప్పుడైతే వాటన్నింటికీ మన అంతరంగంలోంచే మనకు సరియైన సమాధానాలు లభిస్తాయో .. అప్పుడు మన చిత్తం శాంతించి .. మనం మానసిక కల్లోలం నుంచి బయటపడి .. ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలుపెడతాం.🌹

🌹 ఇలా సమాధానపడిన మనస్సుతో భౌతికపరమైన చర్యలను సమర్ధవంతంగా చేపట్టినప్పుడు ఆ సమస్యకు సంపూర్ణమైన మరి అద్భుతమైన పరిష్కారం తప్పకుండా లభ్యమవుతుంది.🌹

🌹చిన్ని చిన్ని సమస్యలకు చిన్ని చిన్ని పరిష్కారాలూ ..

🌹మరి పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద పరిష్కారాలూ అవసరమవుతాయి.🌹

 🌹చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధైర్యం అవసరం లేకపోయినా .. పెద్ద పెద్ద సమస్యలను మాత్రం తగిన ధైర్యస్థైర్యాలతో ఎదుర్కోవాలి. 🌹

🌹చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు కానీ .. పెద్ద సమస్యల పరిష్కారానికి మాత్రం ” ఆత్మశక్తి ” చాలా, చాలా అవసరం.🌹

🌹ఒకవేళ మనకంటే ఎక్కువ ఆత్మశక్తిని కలిగివున్న సరియైన గురువు కనుక మనకు దొరికితే .. పెద్ద సమస్యలకే కాకుండా అతి చిన్న సమస్యల పరిష్కారానికి కూడా వారి నుంచి మనం సహకారాన్ని కోరవచ్చు.🌹

🌹అయితే .. ఇక్కడ అసలు “సమస్య” ఏమిటంటే .. ఎవ్వరికీ సరియైన గురువు దొరకకపోవడం. 🌹

🌹ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనం బయట ఎవరిని పడితే వాళ్ళనే “గురువులు” అని నమ్మకుండా .. ధ్యానం ద్వారా

🌹శాస్త్రీయ పద్ధతిలో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ మన “ అంతరాత్మ ” నే మనకు గురువుగా ఎంచుకోవాలి. 🌹

🌹నిరంతర ధ్యానసాధన ద్వారా ఆ “అంతరాత్మ” తోనే అనుసంధానం చెందుతూ .. ఆ “అంతరాత్మ” నుంచే సందేశాలు అందుకోవాలి. 🌹

🌹ఒకవేళ అదృష్టం బాగుండి మన అంతరాత్మకు ప్రతిరూపమైన గురువు కనుక బాహ్యప్రపంచంలో లభిస్తే .. ఇక మనకు మన అంతరాత్మతో ఎక్కువుగా పనిలేదు.🌹

🌹ఇలా లభించిన అంతరాత్మకు ప్రతిరూపమైన అసలు గురువు మన అంతరాత్మ యొక్క బాహ్యరూపమే కాబట్టి అలాంటి గురువు బోధనలను మనకు అర్థం అయినా, కాకపోయినా సరే మారు పలుకకుండా అమలు పరచాల్సిందే !! 🌹

🌹 ఎందుకంటే గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రబోధాలే 🌹

🌹కనుక ఇలాంటి గురువు బోధనలు మనకు .. మన సత్వర జ్ఞానోదయానికీ, మన సత్వర సమాధానాలకూ .. మరి మన సత్వర పరిష్కారాలకూ .. దగ్గరి దారిగా నిలుస్తాయి.🌹

”🌹 ధ్యానం ” మనలో వున్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్ధ్యాన్నీ, మరి బుద్ధికుశలతతో మన సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిరచిత్తాన్ని ఇస్తుంది.

🌹 తద్వారా మనం మనకు అందుబాటులో వున్న భౌతికపరమైన వనరులతో పాటుగా మన ఆత్మకు వున్నటువంటి అనంత శక్తులను కూడా కూడగలుపుకుని .. సమస్యను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాం.🌹
🔺🔺🔺🔺🔺🔺🔺

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి