8, నవంబర్ 2018, గురువారం

ధ్యాన శక్తి

ధ్యానం లో మాస్టర్స్(పరమ గురువులు)లతో మాట్లాడుతున్నాం,నాకు ధ్యానం లో మూడవ కన్ను తెరుచుకున్నది,నా శరీరంలో సమస్యకు ఆస్ట్రల్ సర్జరీ (ధ్యానంలో మాస్టర్స్ చే సర్జరీ ) జరిగింది,నాకు ఇంతకు ముందున్నదీర్ఘ కాలిక అనారోగ్యాలు పోయి ధ్యానం తో పూర్తి ఆరోగ్యం చేకూరింది,నేను ధ్యానం లో ఆస్ట్రల్ ట్రావెల్  (సూక్ష్మ శరీర ప్రయాణం ) చేసాను,  నేను నా పూర్వ జన్మలను ధ్యానం లో చూసుకొన్నాను, చనిపోయిన మా ఆత్మీయులతో మాట్లాడాను, నాకు ఆత్మ దర్శనం జరిగింది,నా చెడు కర్మలన్నీ ధ్యానం తో తీసివేయబడ్డాయి,నాకు ధ్యానం తో కుండలిని జాగృతం అయ్యింది మరియు నాకు అష్ట సిద్దులు లభించాయి కాని వాటిని దుర్వినియోగం చేయవద్దని ధ్యానం లో ఇన్నర్ వాయిస్  నన్ను హెచ్చరించింది మరియు ధ్యానం లో సంకల్పం చెప్పుకోవడం ద్వారా నా చిరకాల కోరికలన్నీ సిద్ధిస్తున్నాయి అని వేలు,లక్షల మంది ధ్యానులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలియజేస్తున్నారు. మరి మీకు పైన పేర్కొన్న వాటిలో ఏదైనా జరిగిందా,ఎందుకు జరగదు. పట్టుదలగా ధ్యానం మీద ధ్యాస పెడితే (ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస) మీకు గూడ సిద్దిస్తాయి. మరెందుకు ఆలస్యం,పట్టుదలగా ధ్యానం చేయండి.మీ పనులు ఆపేసి చేయమనడం లేదు.మీరు వృధా చేస్తున్న సమయం లోనే ధ్యానం చేయండి. ప్రతి సీరియల్ లో కుట్ర మీద కుట్ర చేసే లేడీ విలన్ లను పెట్టి వందలాది ఎపిసోడ్లతో మనకు బీపీ లు షుగర్ లు తెచ్చిపెడుతు కుటుంబ సభ్యల మధ్య ఆప్యాయతలు లు దూరం చేస్తున్న సీరియల్ లకు దూరంగా వుండండి.ఆ సమయం లో ధ్యానం చేయండి.మీకు వీలు దొరికినప్పుడు సమయం వృధా చేయకుండా ధ్యానం చేయండి. తెల్లవారుఝామున పడుకోబోయే ముందు కనీసం మీ వయసెంతో అన్ని నిముషాలు ధ్యానం చేయండి. ఆ తర్వాతా ఎన్ని గంటలైనా ధ్యానం చేయవచ్చు. ధ్యానం తో మీ సంసార జీవితం ఆనందమయం అవుతుంది.ఒక్క విషయం గుర్తించుకోండి. అతిమాట మతి హాని. ఒకరిని విమర్శిస్తే వారి చెడ్డ కర్మ ను అనవసరంగా మీరు తీసుకొన్న వాళ్ళు అవుతారు. ధ్యానం తో మొదట ఎనర్జీ ని తీసుకోండి. ధ్యానం తో మీ చెడ్డ కర్మ అంత దహనం అయ్యిన తర్వాత అనుభవాలు వాటికవే వస్తాయి. ధ్యానం తో నాదీ మండల శుద్ధి జరుగుతుంది.అందువల్ల ధ్యాన సమయం లో మాత్రం తాత్కాలికంగా నొప్పులు రావచ్చు. కాని ధ్యానాన్ని వాయిదా వేయకండి. ఎప్పుడైతే వాయిదా వేస్తారో ఆ వాయిదాలు కొనసాగుతూనే వుంటాయి.  ధ్యానం చేసే పద్దతి: ప్రశాంతంగా సుఖాసనం లో కూర్చొని రెండు కళ్ళు మూసుకొని,రెండు చేతులు కలిపి వేళ్ళల్లో వెళ్ళు పెట్టుకొని ఒకవేళ కుర్చీ లో కూర్చొంటే రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. వచ్చే ఆలోచనలను కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ వయసెంతో కనీసం అన్ని నిముషాలు ధ్యానం చేయండి. ఒక్క గంట సేపు ధ్యానం నాలుగు గంటల నిద్ర తో సమానం.
  కోటి పూజలుకన్నా ఒక జపం; కోటి జపాలుకన్నా ఒక మంత్రం; కోటి మంత్రాలుకన్నా ధ్యానం  అత్యున్నతమైనది అని పెద్దలు చెప్పారు.🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి