8, నవంబర్ 2018, గురువారం

ధ్యాన నీతి

బుద్ధం  శరణం  గచ్ఛామి
సంఘం  శరణం  గచ్ఛామి
ధమ్మం శరణం   గచ్ఛామి
ధ్యానం  శరణం  గచ్ఛామ

 " ఐకమత్యమొక్కటే  ప్రస్తుతింపదగినది." అన్న సూక్తిని అశోకుడు రాతి స్తంభాలపై చెక్కించడాన్ని మనం గుర్తుకుతెచ్చుకోవాలి. ఎదుటివారి గూర్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా అలోచించి మాట్లాడాలి. సరిగ్గా తెలియకుండా ఎదుటివాళ్ళ గూర్చి చెడుగా మాట్లాడితే అది ఎదుటి మనిషి సౌశీల్యాన్ని భంగపరచడమే కాకుండా అతని కున్న పేరు ప్రతిష్టలకు కూడా దెబ్బ తగలవచ్చు. మనిషి మాట్లాడే మాటలు తన గుణగణాలకు సౌశీల్యతకు అద్దం పడుతుంది.

ఈ సధ్బషణలో నాలుగు అంళాలున్నాయి.. అవి
1)  అబద్దమాడకుండుట
2)  చాడీలు చప్పకంండుట
3)  కఠినమైన మాట్లాడకుండుట.
4)  వ్యర్ధంగా మాట్లాడకుండుట .

1) అబద్ద మాడకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే వానిని సత్యవాదిగా, నిజాయితీ గల వ్యక్తిగా గుర్తిస్తారు. నిష్కపటిగా, నమ్మకస్తునిగా , నీతిమంతునిగా గుర్తిస్తారు. కీర్తి గురించికాని , ఇతరుల ఆనందింపచేసేందుకు కానీ తాను సత్యం నుండి దూరం కాజాలడు.
అబద్దాలాడే వారికి ప్రాముఖ్యతను, ఈయవలసిన అవసరం లేదని బుద్ధుడు రాహుల్ కి చెప్పిన ప్రవచనాన్నిచ్చట గుర్తు చేసుకుందాం.

∆  కుండ అడుగున ఉన్న కొద్దిపాటి నీళ్ళకు ఏవిధంగా అయితే విలువ నీయమో అబద్ధాలాడే వానికూడా విలువనీయవద్దని చెప్పాడు బుద్ధుడు.

∆ కుండ అడుగున ఉన్న కొద్దిపాటి నీళ్ళను పనికిరానివి గా భావించి ఎలా పారబోదుమో అలా అబద్దాలాడే వానిని కూడా తిరస్కరించాలనీ ,

∆ వట్టి కుంకుమ బోర్లించి పెడతాం. అలాగే అబద్ధాలాడే వానిని ఉపయోగం లేని వానిగా గుర్తించి ఒక ప్రక్కన బెట్టాలనిన్నీ

∆ ఖాళీ కుండలో శూన్యత వున్నట్లే అబద్ధాలాడే వాని మాటల్లో కూడా శూన్యతే వుంటుంది. అతని మాటలో కూడా విశ్వసింప దిగినదేది వుండదు.
కావున అతనిని వదిలి వేయాలనిన్నీ బోధించాడు బుద్ధుడు. కావున అబద్ధాలాడే వారికి విలువనీయాల్సిన అవసరం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి