10, ఏప్రిల్ 2020, శుక్రవారం

గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టి

క్రైస్తవ ముష్కరుల పాలిటి సింహం -గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి 
--------------------------------------------------------------------------

భారతీయ సంస్కృతీ మీద విషపు దాడులు చేస్తున్న ఆనాటి మద్రాస్ ప్రభుత్వం మీద , క్రైస్తవాన్ని  పెంచి పోషిస్తూ మతం మారిన వారికి ఉద్యోగాల ఆశ చూపిస్తూ.. ఒకవేళ మతం మారినా వారి పూర్వీకుల ఆస్తులు వారికి చెందేట్టు చర్యలు తీసుకున్న ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాడి తన యావదాస్తిని పోగొట్టుకుని చివరకు బికారిగా జీవించి చనిపోయిన వ్యక్తి గూర్చి చెప్పుకుందామా ? ఆయనే గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి గారు . అచ్చ తెలుగు అంధ్రుడే. 

మద్రాస్ లో తెలుగు వైశ్య వ్యాపార కుటుంబములో చేతి రుమాళ్ల వర్తకం చేసే కుటుంబం లో  సిద్ధులు శెట్టి దంపతులకు జన్మించిన అయన ఉన్నత చదువులు కాగానే కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాడు. తండ్రి మరణం తర్వాత తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు . అమెరికా విప్లవం తర్వాత పెరిగిన పత్తి ధరల సమయములో  అత్యంత లాభాలు ఆర్జించిన లక్ష్మీనరసయ్య శెట్టి కేవలం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో కృషి చేయలేదు. అంగ్ల ప్రభుత్వ హయాములో కిరస్తానీ మిషనరీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి తమ మతాన్ని భారతీయ హైందవుల మీద రుద్దడానికి ప్రయత్నించాయి. ఆంగ్ల ప్రభుత్వం కూడా దీనికి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది .  లక్ష్మీ నరసయ్య శెట్టి  క్రైస్తవాన్ని రుద్దుతున్న ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకున్నారు ప్రథమ స్వతంత్ర పోరాట సమయానికి మునుపు 1840  లలో .

మద్రాస్ కళాశాలల్లో బైబిల్ ని ప్రవేశ పెట్టారు. దీనికి వ్యతిరేకంగా లక్ష్మీ నరసయ్య శెట్టి ఆధ్వర్యములో జరిగిన నిరసనల్లో ఆంగ్ల ప్రభుత్వం వెనుకంజ వేయక తప్పలేదు. మతం మారిన  తర్వాత హిందువులు తమ  పూర్వీకుల ఆస్తుల మీద హక్కులు  కోల్పోకుండా ఉండేందుకు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది . దీని మీద ఆనాటి హైందవ భారతీయుల్లో నిరసన ధోరణి మొదలు అయింది. దీనికి లక్ష్మీ నరసయ్య శెట్టి గారే నాయకత్వం వహించారు. ఆంగ్ల ప్రభుత్వానికి  మన భారతీయుల వాదనలు  వినిపించేందుకు ఒక పత్రికను కూడా ఆరంభించారు. రైతుల మీద జరుగుతున్న దాడులను ఆ పత్రికల్లో తీవ్రంగా ఎండగట్టారు . అదే మొట్టమొదటి భారతీయ పత్రిక కూడా . అది 1844   అక్టోబర్ రెండున ఆరంభమయింది. ఆ పత్రిక మీద ఆంగ్ల ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. అనేక వ్యయప్రయాసలకోర్చి పత్రికను నడిపించి భారతీయ హైందవ  వాణిని వినిపించారు. 

1853  లో మళ్ళీ ఆంగ్ల ప్రభుత్వం బైబిల్ ని పాఠ్య పుస్తకనాగ్ ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. దీని మీద లక్ష్మీ నరసయ్య శెట్టి తీవ్రంగా గళమెత్తి ఉద్యమాన్నే లేవదీశారు. శిస్తులు కట్టలేని రైతుల మీద అంగ్లప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేది. ఆ రైతుల వీపు మీద బరువులు పెట్టి వీధులలో త్రిప్పేది . దీనిని తీవ్రంగా గర్హిస్తూ లక్ష్మీ  నరసయ్య శెట్టి  ఆంగ్ల ప్రభుత్వముతో వాదనలకు దిగారు. ఆంగ్లేయుల మీద పోరాటం సలుపుతూ మొట్ట మొదటి రాజకీయ పార్టీని కూడా మొదలు పెట్టింది గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టిని అని ఎందరికి తెలుసు . ఆంగ్లేయుల కిరాతాకాలు, దోపిడీలు, క్రైస్తవుల ఆగడాలను ఎదుర్కొనడానికి తన  మిత్రుడు , సహాయకుడు అయిన సోమసుందరం శెట్టి గారితో కలసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసారు. వీరి కృషి వలన క్రైస్తవ మిషనరీల  మతమార్పిడి   ఆగడాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేట్టు చేసారు.  పూర్తిగా భారత దేశం ఆంగ్లేయుల హస్తగతమైంది పిమ్మట హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆగాలంటూ అంటాయి ఆంగ్ల ప్రభుత్వానికి  తాము ఆరంభించిన మద్రాస్ నేటివ్ అసోసియేషన్  పార్టీ తరపున వ్రాసిన  లేఖలు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వములో కలకలం సృష్టించాయి. 

ప్రభుత్వ ము మీద జరుపుతున్న పోరాటాలలో మరియు హిందువుల ఆస్త్యుల మరియు హక్కుల రక్షణ కోసం జరిపిన పోరాటాల్లో అనేకమార్లు విజయం సాధించిన లక్ష్మీనరసయ్య శెట్టి మెల్లగా తన ఆస్తులన్నీ ఈ పోరాటాల ఫలితంగా కరిగిపోయాయి. శఠగోపాచార్లు తరువాత మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నిక అయిన లక్ష్మీ నరసయ్య శెట్టి  అక్కడ బలంగా భారతీయ వాణిని ఆంగ్ల ప్రభుత్వానికి వినిపించారు. దానధర్మాలు, రాజకీయ పోరాటాలకు , హిందూ మత ఉద్ధరణకు తన సంపాదననంతా సద్వినియోగం చేసిన శ్రీమాన్ లక్ష్మీ నరసయ్య శెట్టి తన చివరి రోజులలో ఆకలితో తన కుటుంబముతో గడిపిన రోజూ ఉన్నాయి. అప్పట్లోనే లసుఖాల రూపాయ వ్యాపారం చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి చివరకు దారిద్ర్యముతో పోరాడుతూ  1868  లో మరణించారు. 

ఇన్ని త్యాగాలు చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి గారిని ఏ ఒక్క హిందూ సంఘం అయినా గుర్తు పెట్టుకున్నాడా ? లేదే ? కనీసం ఆయన విగ్రహాలు వీధి వీధినా పెట్టకున్నా సరే ఆయన్ని తమ స్మృతిలో ఉంచుకున్నదా ?  ఇలాంటి హైందవ ధర్మ వీరులు కదా మనం ఎన్నడూ గుర్తు పెట్టుకుని స్మరించవలసినది . రాజకీయనాయకులు, డబ్బులకోసం సినిమాల్లో కేవలం నటన చూపే వారి మీద  మూర్ఖంగా ఎందుకు అంతులేని  అభిమానం చూపిస్తారో నేటి యువతలో కనీస  మార్పు రావాలి అన్ని ఆశిస్తూ - హిందువులకై, హిందువుల రక్షణకై  పోరాడిన తెలుగు తేజం లక్ష్మీనరసయ్య శెట్టి గారిని స్మరిస్తూ ముగిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి