8, నవంబర్ 2018, గురువారం

ధ్యాన శక్తి

ధ్యానం లో మాస్టర్స్(పరమ గురువులు)లతో మాట్లాడుతున్నాం,నాకు ధ్యానం లో మూడవ కన్ను తెరుచుకున్నది,నా శరీరంలో సమస్యకు ఆస్ట్రల్ సర్జరీ (ధ్యానంలో మాస్టర్స్ చే సర్జరీ ) జరిగింది,నాకు ఇంతకు ముందున్నదీర్ఘ కాలిక అనారోగ్యాలు పోయి ధ్యానం తో పూర్తి ఆరోగ్యం చేకూరింది,నేను ధ్యానం లో ఆస్ట్రల్ ట్రావెల్  (సూక్ష్మ శరీర ప్రయాణం ) చేసాను,  నేను నా పూర్వ జన్మలను ధ్యానం లో చూసుకొన్నాను, చనిపోయిన మా ఆత్మీయులతో మాట్లాడాను, నాకు ఆత్మ దర్శనం జరిగింది,నా చెడు కర్మలన్నీ ధ్యానం తో తీసివేయబడ్డాయి,నాకు ధ్యానం తో కుండలిని జాగృతం అయ్యింది మరియు నాకు అష్ట సిద్దులు లభించాయి కాని వాటిని దుర్వినియోగం చేయవద్దని ధ్యానం లో ఇన్నర్ వాయిస్  నన్ను హెచ్చరించింది మరియు ధ్యానం లో సంకల్పం చెప్పుకోవడం ద్వారా నా చిరకాల కోరికలన్నీ సిద్ధిస్తున్నాయి అని వేలు,లక్షల మంది ధ్యానులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలియజేస్తున్నారు. మరి మీకు పైన పేర్కొన్న వాటిలో ఏదైనా జరిగిందా,ఎందుకు జరగదు. పట్టుదలగా ధ్యానం మీద ధ్యాస పెడితే (ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస) మీకు గూడ సిద్దిస్తాయి. మరెందుకు ఆలస్యం,పట్టుదలగా ధ్యానం చేయండి.మీ పనులు ఆపేసి చేయమనడం లేదు.మీరు వృధా చేస్తున్న సమయం లోనే ధ్యానం చేయండి. ప్రతి సీరియల్ లో కుట్ర మీద కుట్ర చేసే లేడీ విలన్ లను పెట్టి వందలాది ఎపిసోడ్లతో మనకు బీపీ లు షుగర్ లు తెచ్చిపెడుతు కుటుంబ సభ్యల మధ్య ఆప్యాయతలు లు దూరం చేస్తున్న సీరియల్ లకు దూరంగా వుండండి.ఆ సమయం లో ధ్యానం చేయండి.మీకు వీలు దొరికినప్పుడు సమయం వృధా చేయకుండా ధ్యానం చేయండి. తెల్లవారుఝామున పడుకోబోయే ముందు కనీసం మీ వయసెంతో అన్ని నిముషాలు ధ్యానం చేయండి. ఆ తర్వాతా ఎన్ని గంటలైనా ధ్యానం చేయవచ్చు. ధ్యానం తో మీ సంసార జీవితం ఆనందమయం అవుతుంది.ఒక్క విషయం గుర్తించుకోండి. అతిమాట మతి హాని. ఒకరిని విమర్శిస్తే వారి చెడ్డ కర్మ ను అనవసరంగా మీరు తీసుకొన్న వాళ్ళు అవుతారు. ధ్యానం తో మొదట ఎనర్జీ ని తీసుకోండి. ధ్యానం తో మీ చెడ్డ కర్మ అంత దహనం అయ్యిన తర్వాత అనుభవాలు వాటికవే వస్తాయి. ధ్యానం తో నాదీ మండల శుద్ధి జరుగుతుంది.అందువల్ల ధ్యాన సమయం లో మాత్రం తాత్కాలికంగా నొప్పులు రావచ్చు. కాని ధ్యానాన్ని వాయిదా వేయకండి. ఎప్పుడైతే వాయిదా వేస్తారో ఆ వాయిదాలు కొనసాగుతూనే వుంటాయి.  ధ్యానం చేసే పద్దతి: ప్రశాంతంగా సుఖాసనం లో కూర్చొని రెండు కళ్ళు మూసుకొని,రెండు చేతులు కలిపి వేళ్ళల్లో వెళ్ళు పెట్టుకొని ఒకవేళ కుర్చీ లో కూర్చొంటే రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. వచ్చే ఆలోచనలను కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ వయసెంతో కనీసం అన్ని నిముషాలు ధ్యానం చేయండి. ఒక్క గంట సేపు ధ్యానం నాలుగు గంటల నిద్ర తో సమానం.
  కోటి పూజలుకన్నా ఒక జపం; కోటి జపాలుకన్నా ఒక మంత్రం; కోటి మంత్రాలుకన్నా ధ్యానం  అత్యున్నతమైనది అని పెద్దలు చెప్పారు.🙏

👏గురుగీత👏

పార్వతీ మాత...పరమేశ్వరుడిని ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తుంది...
🕉✝☪🕉✝☪
👉ఈశ్వరా! సృష్టికి కారణమైన మీరు నిరంతరం ధ్యాన సాధన చేస్తున్నారు....మీరు నిరంతరం ఎవరిని ధ్యానిస్తారు? 💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀
👉పార్వతీ!బాగా అర్థం చేసుకో..
👏అగోచరం తధాగమ్యం నామరూపాది వర్జితం
నిశ్శబ్దం తం విజానీయేత్ స్వభావం బ్రహ్మ పార్వతీ!👏
🌷🌷🌷🌷🌷🌷
👸పార్వతీ! కంటికి కనిపించని,ఎంత సాధన చేసినా గమ్యం లేనటువంటి,రూపము మరియు పేరు లేనటువంటి....🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నిశ్శబ్దం రూపమై నాలో వెలుగుతున్న పరబ్రహ్మాన్ని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను.కావున నీవు కూడా నీలో వెలుగుతున్న పరబ్రహ్మాన్ని ధ్యానించు అని సాక్షాత్తు పరమేశ్వరుడు....పార్వతీ మాతకు తెలిపారు.
❤💕❤💕❤💕
👉అందుకే...మనిషిగా జన్మ తీసుకున్న తరువాత ప్రతీ ఒక్కరూ తమ లోని పరబ్రహ్మమును ధ్యానించాలి.
🌷🌷🌷🌷🌷🌷
శ్వాస మీద ద్యాస ...ధ్యారా మనం అఖండ మైన నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాము.అందుకే ప్రతీ ఒక్కరూ విధిగా ద్యానం చేయాల్సిందే....☪✝🕉☪✝🕉
🕉సర్వే జనా సుఖినో భవంతు🕉
🕉🌷☪🕉✝☪

🌹 విత్తనంలోని ఫలాలు🌹



       🌹ఓ ఫలంలోని విత్తనాల్ని ఎవరైనా చూడగలరు, కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలాలున్నాయో చూడగలిగేవారే వివేకవంతులు.🌹

       🌹నిజాయితీ అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు.🌹
      🌹మంచితనం అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు.🌹
      🌹వినయం అనే ఇత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు.🌹
       🌹పట్టుదల అనే విత్తనాన్ని నాటితే, దానికి  విజయాన్ని ఫలంగా పొందవచ్చు.🌹
      🌹దయ అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా ఇతరులతో సమన్వయాన్ని పొందవచ్చు.🌹
       🌹నిరహంకారం అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా సుహృద్భావాన్ని పొందవచ్చు.🌹
      🌹నిష్కపటం అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా ఆత్మీయతను ఫలంగా పొందవచ్చు.🌹
      🌹ఓర్పు అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా అభివృద్ధని పొందవచ్చు.🌹
      🌹విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే, దానికి ఫలంగా అద్భుతాలనే పొందవచ్చు.🌹

🙏 నా చేతిని సద్గురువు పట్టుకున్నాడు 🤝

ఒకసారి ఒక సాధువు తన శిష్యుడితో కలిసి తన/కుటీరానికి తిరిగి వెళుతున్నాడు. ఒక్కసారిగా బాగా వర్షం కురిసింది. నదిలో నీరు (మట్టం) పెరిగింది. తిరిగి వెళ్ళటానికి ఒకే మార్గం ఉన్నది. ఆ ఒక చిన్న వంతెన కూడా నీటిలో మునిగింది. గురువు శిష్యుడితో- “నీవు నా చేతిని పట్టుకో. దాటుదాము." అన్నాడు. కానీ శిష్యుడు పట్టుకోలేదు. గురువు మాటిమాటికీ చెప్పినా శిష్యుడు ఆ విధంగా చేయలేదు. అప్పుడు గురువే శిష్యుని చేతిని పట్టుకుని లాగుతూ నదిని ఆవలికి తీసుకొని వెళ్ళాడు. గురువు - “నా చేతిని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను! ఎందుకు పట్టుకోలేదు నువ్వు?” అని అన్నాడు. అప్పుడు శిష్యుడు- “ఓ గురుదేవా, నేను శక్తిహీనుడిని. దుర్బలుడిని. నాపై నాకు విశ్వాసం లేదు. ఒకవేళ నేను నీ చేతిని పట్టుకుంటే వదిలేసేవాడిని. కానీ నాకు నీ పై పూర్తి విశ్వాసం ఉంది. నీవు పట్టుకుంటే ఎప్పుడూ వదిలిపెట్టవు. అందువల్లే నేను నీ చేతిని పట్టుకోలేదు.” అన్నాడు.

గురువు ఒకసారి చేతిని పట్టుకుంటే గమ్యాన్ని చేరిన తర్వాత వదిలిపెడతాడు.

ధ్యాన నీతి

బుద్ధం  శరణం  గచ్ఛామి
సంఘం  శరణం  గచ్ఛామి
ధమ్మం శరణం   గచ్ఛామి
ధ్యానం  శరణం  గచ్ఛామ

 " ఐకమత్యమొక్కటే  ప్రస్తుతింపదగినది." అన్న సూక్తిని అశోకుడు రాతి స్తంభాలపై చెక్కించడాన్ని మనం గుర్తుకుతెచ్చుకోవాలి. ఎదుటివారి గూర్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా అలోచించి మాట్లాడాలి. సరిగ్గా తెలియకుండా ఎదుటివాళ్ళ గూర్చి చెడుగా మాట్లాడితే అది ఎదుటి మనిషి సౌశీల్యాన్ని భంగపరచడమే కాకుండా అతని కున్న పేరు ప్రతిష్టలకు కూడా దెబ్బ తగలవచ్చు. మనిషి మాట్లాడే మాటలు తన గుణగణాలకు సౌశీల్యతకు అద్దం పడుతుంది.

ఈ సధ్బషణలో నాలుగు అంళాలున్నాయి.. అవి
1)  అబద్దమాడకుండుట
2)  చాడీలు చప్పకంండుట
3)  కఠినమైన మాట్లాడకుండుట.
4)  వ్యర్ధంగా మాట్లాడకుండుట .

1) అబద్ద మాడకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే వానిని సత్యవాదిగా, నిజాయితీ గల వ్యక్తిగా గుర్తిస్తారు. నిష్కపటిగా, నమ్మకస్తునిగా , నీతిమంతునిగా గుర్తిస్తారు. కీర్తి గురించికాని , ఇతరుల ఆనందింపచేసేందుకు కానీ తాను సత్యం నుండి దూరం కాజాలడు.
అబద్దాలాడే వారికి ప్రాముఖ్యతను, ఈయవలసిన అవసరం లేదని బుద్ధుడు రాహుల్ కి చెప్పిన ప్రవచనాన్నిచ్చట గుర్తు చేసుకుందాం.

∆  కుండ అడుగున ఉన్న కొద్దిపాటి నీళ్ళకు ఏవిధంగా అయితే విలువ నీయమో అబద్ధాలాడే వానికూడా విలువనీయవద్దని చెప్పాడు బుద్ధుడు.

∆ కుండ అడుగున ఉన్న కొద్దిపాటి నీళ్ళను పనికిరానివి గా భావించి ఎలా పారబోదుమో అలా అబద్దాలాడే వానిని కూడా తిరస్కరించాలనీ ,

∆ వట్టి కుంకుమ బోర్లించి పెడతాం. అలాగే అబద్ధాలాడే వానిని ఉపయోగం లేని వానిగా గుర్తించి ఒక ప్రక్కన బెట్టాలనిన్నీ

∆ ఖాళీ కుండలో శూన్యత వున్నట్లే అబద్ధాలాడే వాని మాటల్లో కూడా శూన్యతే వుంటుంది. అతని మాటలో కూడా విశ్వసింప దిగినదేది వుండదు.
కావున అతనిని వదిలి వేయాలనిన్నీ బోధించాడు బుద్ధుడు. కావున అబద్ధాలాడే వారికి విలువనీయాల్సిన అవసరం లేదు.

శ్రీ కృష్ణ ఉవాచ – ధ్యానయోగ ఉవాచ:

🕉“ *శ్రీ కృష్ణ ఉవాచ – ధ్యానయోగ ఉవాచ ”🕉*





🔺“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః”
(భగవద్గీత, 7-19)🔺

🕉“ఎన్నో జన్మల క్రమంలో ఒకానొక జ్ఞాని
‘ఆత్మయే సర్వస్వం’ అని గ్రహిస్తూ .. ‘నన్ను’ అంటే
‘ధ్యానయోగాన్ని’ పూర్ణంగా తెలుసుకుంటూ
నాకే దాసోహమంటూ ఉంటారు; అలాంటి మహాత్ములు మహా అరుదుగా ఉంటారు.”
*


🕉కనుక ఎన్నెన్నో జన్మలు .. మరి ప్రతి జన్మలోనూ ఎన్నెన్నో అనుభవాలు

🕉జన్మల పరంపర .. అంతులేని అనుభవాల పరంపర!

🕉ప్రతి అనుభవమూ సరిక్రొత్త జ్ఞానాన్ని ఇచ్చేదే!
ప్రతి అనుభవమూ సరిక్రొత్త అవగాహనను కలిగించేదే!
అయితే, తెలుసుకోవలసింది ఏమిటంటే

🕉జన్మ జన్మల అనుభవాలలో నిజానికి “మంచి”వి .. “చెడు”వి అన్నవి లేవు ..

🕉“శుభ అశుభ పరిత్యాగీ” అని భగవద్గీతలో వుంది కదా!
“Therefore, Everything is ‘OK’ and ‘Perfect'”
“All is Well”
“Everything happens for a valid Evolutaionary Reason”
“हर किसीको हमेशा अच्छे दिन ही मिल रहे है”
*
🕉ప్రతి అనుభవమూ .. మన మానవ జీవితాన్ని మనకు ఒకానొక ప్రత్యేక కోణంలో చూపిస్తుంది


🕉ఎన్ని రకాల అనుభవాలు సంపాదిస్తే .. అంతటి “సుసంపన్న ఆత్మ” అవుతుంది!
ఏ అనుభవానికీ భయపడనవసరం లేదు
ఏ అనుభవానికీ వెన్ను చూపించనవసరం లేదు


🕉మానానికీ ఆహ్వానం .. అవమానానికీ ఆహ్వానం

🕉తీపికీ ఆహ్వానం .. చేదుకీ ఆహ్వానం

🕉పుట్టుకకూ ఆహ్వానం .. మరణానికీ ఆహ్వానం

🕉కలిమికీ ఆహ్వానం .. లేమికీ ఆహ్వానం

🕉సామూహికతకూ ఆహ్వానం .. ఒంటరితనానికీ ఆహ్వానం

🕉విజయానికి ఆహ్వానం .. అపజయానికీ ఆహ్వానం

🕉అన్నింటికన్నా ముఖ్యం .. ధ్యాన అభ్యాసానికి ఆహ్వానం

🕉ఎందుకంటే పై వాటికి ఆహ్వానం పలుకగలగడం అన్నది కేవలం ఒకానొక ధ్యానవిద్యార్థికే సాధ్యం
*
🕉మానవ జీవితానికి కేవలం “మూడు వందల అరవై కోణాలు” కాదు ..
మరి “మూడు వేల ఆరు వందల కోణాలు” ఉంటాయి.
అయితే


🕉ఒకే జన్మలో అన్ని కోణాలనూ ఏ ఆత్మ కూడా స్పృశించలేదు
కొన్ని వందల జన్మలలో అయితేనే ఇన్ని వేల కోణాలను దగ్గరగా స్పృశించగలుగుతుంది
*
🕉మానవ జీవితచక్రంలో ప్రవేశించే ప్రతి ఆత్మ కూడా
మానవజీవితాన్ని .. అనేకానేక జన్మల భిన్న విభిన్న అనుభవాల ద్వారా
తనను తాను
“సమగ్రం” మరి “పరిపూర్ణం” చేసుకోవల్సి ఉంటుంది

🕉ఆ విధంగా ఒకానొక “సుసంపన్న పరిపూర్ణ ఆత్మ”గా మనం తయారయి తీరాలి
ఆ తదుపరి
“పరిపూర్ణ ఆత్మలు”.. తమ తమ ఆత్మలలో నుంచి క్రొత్త క్రొత్త విభాగాలను సృష్టిస్తాయి ..
అలా సృష్టించబడిన “నూతన శైశవ ఆత్మలను” కూడా
వాటి వాటి భౌతిక జన్మలలోకి ప్రవేశింపజేసి
వాటి ఎదుగుదలలనూ మరి బాగోగులనూ ఎంచక్కా చూసుకుంటూ ఉంటాయి ..
ఇదీ ఆత్మ యొక్క “వింత కథ” .. “అంతులేని వింత కథ”
*


🕉“ప్రతి ఆత్మకూ ప్రణామాలు” .. “ఆత్మ యొక్క ప్రతి జన్మకూ ప్రణామాలు”
“ప్రతి జన్మ యొక్క ప్రతి అనుభవానికీ ప్రణామాలు” ..
“ప్రతి అనుభవం యొక్క ప్రతి ప్రయోజనానికీ ప్రణామాలు”
“శ్రీ కృష్ణ ఉవాచ” అంటే “ధ్యానయోగ పరాకాష్ఠ యొక్క ఉవాచ”
ఈ విషయం అర్థం అయితే “గీతా సారం” అంతా అర్థం అయినట్లే
ఓ తత్ సత్!🕉🕉🕉🕉🕉

🕴🏻నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??🕴🏻

😍😍😍😍😍😍😍😍😍



        *మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..

(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.

(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.

(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.

(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,  ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.

(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.

(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !

(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.

(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.

(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.

        *ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.

        *ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని ధ్యానం తో తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీ తోటి వారికి ధ్యానమును పరిచయం చేసి సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...

       *అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం    ధ్యాన జీవితం లో  ఆనందంగా బ్రతుకుదాం !!!

       *మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......

     *సర్వే జనా సుఖినోభవంతు."అప్పో దీపోభవా"

 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏