7, ఆగస్టు 2026, శుక్రవారం

🔴బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద వస్తుంది?

🔴బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద వస్తుంది?

🔴బొట్టు.. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు . ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు.

🔴బొట్టు పెట్టుకోవటం వెనుక అనేక కారణాలు అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే ... పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహిత లో నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది.


🔴బ్రహ్మస్తానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని, ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు చెప్తారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి.


🔴బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది.

🔴ఈ పనులు చేసేటప్పుడు బొట్టు లేకుంటే ప్రయోజనం ఉండదు ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.


🔴బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి .. ఎలా పెట్టాలంటే ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ, ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చిపడతాయి. అందుకే చూపుడువేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు.


🔴బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఇదే ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్యవేలుతో పెట్టకూడదు. మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు, సంపద రెండూ వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు. మొత్తంగా చూస్తే కచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం ఎంతో మంచిది.

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

_*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం*

🙏🌹🌴🪔🪔🪔🪔🌴🌹🙏

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‖ 1 ‖

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ‖ 2 ‖

🪷 _*పూర్వ పీఠికా*_

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ‖ 3 ‖

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ‖ 4 ‖

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ‖ 5 ‖

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ‖ 6 ‖

_*ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |*_

👌 _*శ్రీ వైశంపాయన ఉవాచ:*_

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ‖ 7 ‖

👌 _*యుధిష్ఠిర ఉవాచ:*_

కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణమ్
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ ‖ 8 ‖

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ ‖ 9 ‖


👌 _*శ్రీ భీష్మ ఉవాచ:*_ 

జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం |
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః ‖ 10 ‖

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ‖ 11 ‖

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ‖ 12 ‖

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం |
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్‖ 13 ‖

ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ‖ 14 ‖

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ | 15 ‖

పవిత్రాణాం పవిత్రం యో మంగలానాం చ మంగలమ్ |
దైవతం దేవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా ‖ 16 ‖

యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే ‖ 17 ‖

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్ ‖ 18 ‖

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ‖ 19 ‖

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ‖
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ‖ 20 ‖

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ‖ 21 ‖

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం ‖
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ‖ 22 ‖

🪷 _**పూర్వన్యాసః*_ 

అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ‖
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజం |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ఙ్గధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం |
త్రిసామాసామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ‖
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం |
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే (పారాయణే) వినియోగః |

🙏 _*ధ్యానమ్:*_

క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్ సైకతేమౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితై ర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాత్ అరినలినగదా శంఖపాణిర్ముకుందః ‖ 1 ‖

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రంరంరమ్యతేతంత్రిభువనవపుషంవిష్ణుమీశంనమామి ‖ 2 ‖

_*ఓం నమో భగవతే వాసుదేవాయ !*_

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ‖ 3 ‖

మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ‖ 4 ‖

నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే |
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ‖ 5‖

సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణం |
సహార వక్షఃస్థలశోభికౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ | 6‖

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ ‖ 7 ‖

చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ‖ 8 ‖

🙏 _*స్తోత్రమ్*_

🕉️ _*హరిః ఓమ్*_

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ‖ 1 ‖

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ‖ 2 ‖

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ‖ 3 ‖

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ‖ 4 ‖

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ‖ 5 ‖

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ‖ 7 ‖

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ‖ 8 ‖

ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ‖ 11 ‖

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ‖ 12 ‖

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ‖ 13 ‖

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ‖ 14 ‖

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ‖ 15 ‖

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః |
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః ‖ 16 ‖

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ‖ 17 ‖

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ‖ 18 ‖

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్ ‖ 19 ‖

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ‖ 20 ‖

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ‖ 21 ‖

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ‖ 22 ‖

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ‖ 23 ‖

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వన్హిరనిలో ధరణీధరః ‖ 25 ‖

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ‖ 26 ‖

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ‖ 27 ‖

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ‖ 28 ‖

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ‖ 29 ‖

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ‖ 30 ‖

అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ‖ 31 ‖

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ‖ 32 ‖

యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ‖ 33 ‖

ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ‖ 34 ‖

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ‖ 35 ‖

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ‖ 36 ‖

అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ‖ 37 ‖

పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ‖ 38 ‖

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ‖ 39 ‖

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ‖ 40 ‖

ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ‖ 41 ‖

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ‖ 42 ‖

రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ‖ 43 ‖

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ‖ 44 ‖

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ‖ 45 ‖

విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం |
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ‖ 46 ‖

అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ‖ 47 ‖

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ‖ 48 ‖

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ‖ 49 ‖

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్| |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ‖ 50 ‖

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్‌ క్షరమక్షరమ్‖
అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ‖ 51 ‖

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ‖ 52 ‖

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ‖ 53 ‖

సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
వినయో జయ సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ‖ 54 ‖

జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ‖ 55 ‖

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ‖ 56 ‖

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ‖ 57 ‖

మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ‖ 58 ‖

వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ‖ 59 ‖

భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ‖ 60 ‖

సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ‖ 61 ‖

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్| 62 ‖

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ‖ 63 ‖

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ‖ 64 ‖

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్‌ లోకత్రయాశ్రయః ‖ 65 ‖

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ‖ 66 ‖

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ‖ 67 ‖

అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ‖ 68 ‖

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ‖ 69 ‖

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ‖ 70 ‖

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ‖ 72 ‖

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ‖ 73 ‖

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ‖ 74 ‖

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ‖ 75 ‖

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ‖ 76 ‖

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ‖ 77 ‖

ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం |
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ‖ 78 ‖

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ‖ 79 ‖

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ‖ 80 ‖

తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ‖ 81 ‖

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ‖ 82 ‖

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ‖ 83 ‖

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ‖ 84 ‖

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ‖ 85 ‖

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ‖ 86 ‖

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః |
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ‖ 87 ‖

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ‖ 88 ‖

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ‖ 89 ‖

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ‖ 90 ‖

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ‖ 91 ‖

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ‖ 92 ‖

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ‖ 93 ‖

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ‖ 94 ‖

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ‖ 95 ‖

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ‖ 96 ‖

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ‖ 97 ‖

అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ‖ 98 ‖

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ‖ 99 ‖

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ‖ 101 ‖

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ‖ 102 ‖

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ‖ 103 ‖

భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ‖ 104 ‖

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః |
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ‖ 105 ‖

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ‖ 106 ‖

*శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః |*
*రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః* ‖ 107 ‖

_*శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |*_

_*వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ |*_
_*శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు*_ ‖ 108 ‖

🙏 _*శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి |*_

🪷 _*ఉత్తర పీఠికా*_

👌 _*ఫలశ్రుతిః:*_

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్| ‖ 1 ‖

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‖
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోఽముత్రేహ చ మానవః ‖ 2 ‖

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ‖ 3 ‖

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్| ‖ 4 ‖

భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ‖ 5 ‖

యశః ప్రాప్నోతి విపులం ఙ్ఞాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్| ‖ 6 ‖

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ‖ 7 ‖

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ‖ 8 ‖

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః
  ‖ 9 ‖

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| 
  ‖ 10 ‖

న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే
  ‖ 11 ‖

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః 
 ‖ 12 ‖

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే
  ‖ 13 ‖

ద్యౌః సచంద్రార్కనక్షత్ర ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ‖ 14 ‖

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసం |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరమ్
 ‖ 15 ‖

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ 
 ‖ 16 ‖

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే |
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః 
 ‖ 17 ‖

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం ‖ 18 ‖

యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ |
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ‖ 19 ‖

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీల్లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః 
 ‖ 20 ‖

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం |
పఠేద్య ఇచ్చేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ‖ 21 ‖

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవం ‖ 22 ‖

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి |

👌 _*అర్జున ఉవాచ:*_ 

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ‖ 23 ‖

👌 _*శ్రీభగవానువాచ:*_ 

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ‖ 24 ‖

స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |

👌 _*వ్యాస ఉవాచ:*_ 

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే  ‖ 25 ‖

_*శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి |*_

👌 _*పార్వత్యువాచ:*_

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ‖ 26 ‖

👌 _*ఈశ్వర ఉవాచ:*_

_*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |*_
_*సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే*_ ‖ 27 ‖

_*శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |*_

👌 _*బ్రహ్మోవాచ:*_

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ‖ 28 ‖

_*శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి |*_

👌 _*సంజయ ఉవాచ:*_

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ 
 ‖ 29 ‖

👌 _*శ్రీ భగవాన్ ఉవాచ:*_ 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
  ‖ 30 ‖

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 
 ‖ 31 ‖

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి
  ‖ 32 ‖

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి     ‖ 33 ‖

_*శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి*_

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే |
విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ‖

_*||ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామ్ అనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి, మోక్షధర్మే, భీష్మ యుధిష్ఠిర సంవాదే, శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచశతాధిక శతతమోధ్యాయః*_

🙏 _*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపుర్ణమ్*_

🙏🌹🌴🪔🪔🪔🪔🌴🌹🙏

🌹🙏లలితా సహస్త్రనామ పారాయణ

🌹🙏లలితా సహస్త్రనామ పారాయణ సంకల్పం, ధ్యానం, సహస్త్రనామం, ఫలస్తుతి..🙏🌹

 లలితాసహస్రనామ స్త్రోత్ర పారాయణ ప్రతి ఒక్కరూ చేయవచ్చు.. స్త్రోత్రం ఎక్కడ ఆపాలి ఎలా చదవాలి వివరంగా స్త్రోత్రం ఇక్కడ ఇచ్చాను. ప్రతి సారి ఫల స్తుతి అవసరం లేదు ప్రతి రోజు మొదలు పెట్టే మొదటిసారి సంకల్పం ఆ రోజు ముగించే టప్పుడు ఫలస్తుతి ఒక 10 శ్లోకాలు చదివితే చాలు. 

👉 శుచిగా ఉండాలి, స్త్రీలు మైలు సమయం లో ఆపి శుభ్రంగా 6 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించాలి. రోజు చేసే పారాయనఁ మనకు అలవాటు అయిన స్త్రోత్రం కనుక ఇబ్బంది ఉండదు. అలా అని చాలా ఫాస్ట్ గా చదివితే ప్రయోజనం లేదు, ఆ పదాలు స్పష్టంగా పలకాలి శబ్ద దోషం ఉండకూడదు. ఆ వైబ్రేషన్స్ మీ గృహంలో మీలో గొప్ప మార్పుని ఇస్తుంది.ఆ తల్లి అనుగ్రహము సంపూర్ణంగా దక్కుతుంది. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన చాలు రోజూ తల స్నానం అవసరం లేదు, ఆహారనియమం లేదు, వివాహితుల కు బ్రహ్మచర్యం నియమం లేదు, శుచిగా ఉండాలి భక్తిగా చేయాలి.

🌺శ్రీ మాత్రేనమః🌺

🙏సంకల్పమ్🙏

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం, సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి అనుగ్రహ అస్మిన్ సమస్త లోక(కుటుంబ) క్షేమ సంరక్షణార్థం ,సకల పాపహరణం, ఆయు ఆరోగ్య మనోభీష్ట ఫల సిద్ధ్యర్ధం , సకల రోగ,గ్రహ దోష నివారణం, అపమృత్యు హరణం( వివాహ, సంతాన , వ్యాపార వృద్ధి, ఉపాధి సిద్ధ్యర్ధం ఇలా ఈ బ్రాకెట్ లో ఉన్నది మీకు అవసరం అనది మటుకే చెప్పుకోండి) శ్రీ మాన్ (పేరు ) నామధేయస్య (గోత్రం) గోత్రస్య ...శ్రీ లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా దేవి అనుగ్రహ ప్రీత్యర్థం యధాశక్తి సహస్త్రనామ పారాయణ జపం కరిష్యే. 

🌹🙏ధ్యానం🙏🌹

 అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ || 1 ||

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ || 2 ||

సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |
అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ || 3 ||
సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ || 4 ||

👉సహస్ర నామం ఎక్కడ అపాలి ఎలా చదవాలి "కామ" ,పెట్టి పోస్ట్ చేసారు.ఇది గమనించి మీ బుక్ లో సరి చేసుకోండి. (కామ పెట్టలేదు అంటే ఆ వాక్యం పూర్తిగా చదవాలి అని అర్థం).
హరిః ఓం

శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ , శ్రీమత్-సింహాసనేశ్వరీ |
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 ||

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా , క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||
మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా || 3 ||

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా || 4 ||

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా || 5 ||

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా || 6 ||

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా || 7 ||

కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |
తాటంక యుగళీభూత తపనోడుప మండలా || 8 ||

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా || 10 ||

నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ |
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా || 11 ||

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా || 12 ||

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా || 13 ||

కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ || 14 ||

లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా |
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా || 15 ||

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ |
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా || 16 ||

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా |
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా || 17 ||

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా |
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా || 18 ||

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా || 19 ||

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా |
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః || 20 ||

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా |
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా || 21 ||

సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా |
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా || 22 ||

మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ || 23 ||

దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా || 24 ||

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా || 25 ||

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా || 26 ||

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా || 30 ||

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ || 31 ||

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా || 32 ||

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా || 33 ||

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా || 34 ||

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ || 35 ||

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ || 36 ||

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా || 37 ||

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ || 38 ||

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ || 39 ||

తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ || 40 ||

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ || 41 ||

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ || 42 ||

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా || 43 ||

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా || 44 ||

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా || 45 ||

నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ || 46 ||

నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ || 47 ||

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ || 48 ||

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా || 49 ||

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా || 50 ||

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా || 51 ||

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ || 52 ||

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా || 53 ||

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః || 54 ||

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ || 55 ||

మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా |
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా || 56 ||

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ || 57 ||

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా || 58 ||

మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా |
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా || 59 ||

చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా |
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా || 60 ||

పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ |
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ || 61 ||

ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా |
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా || 62 ||

సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా |
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ || 63 ||

సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ |
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా || 64 ||

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ |
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ || 65 ||

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః |
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ || 66 ||

ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా || 67 ||

శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా |
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా || 68 ||

పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ |
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా || 69 ||

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా |
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా || 70 ||

రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా |
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా || 71 ||

రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా |
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా || 72 ||

కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా |
కల్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా || 73 ||

కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా |
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా || 74 ||

విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ |
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ || 75 ||

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ |
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా || 76 ||

విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా |
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ || 77 ||

భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ |
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా || 78 ||

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా || 79 ||

చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ |
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః || 80 ||

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా || 81 ||

కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా |
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా || 82 ||

ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ |
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా || 83 ||

సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా |
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా || 84 ||

నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ |
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ || 85 ||

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ |
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ || 86 ||

వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ |
మహాకామేశ నయనా, కుముదాహ్లాద కౌముదీ || 87 ||

భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః |
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ || 88 ||

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా |
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా || 89 ||

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా |
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా || 90 ||

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ || 91 ||

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః |
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా || 92 ||

కుశలా, కోమలాకారా, కురుకుల్లా, కులేశ్వరీ |
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా || 93 ||

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః |
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ || 94 ||

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ |
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ || 95 ||

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా |
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ || 96 ||

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా |
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ || 97 ||

విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||

పాయసాన్నప్రియా, త్వక్/స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||

కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ || 101 ||

మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||

రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||

స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా || 104 ||

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, డాకినీ రూపధారిణీ || 105 ||

మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||

ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||

మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||

సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||

పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా || 111 ||

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ || 112 ||

అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ |
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా || 113 ||

తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ || 114 ||

నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ || 115 ||

పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ |
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ || 116 ||

మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||

ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా |
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా || 118 ||

కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా |
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా || 119 ||

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ || 120 ||

దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః || 121 ||

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా || 122 ||

కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా || 123 ||

ఆదిశక్తి, అమేయా, ఆత్మా, పరమా, పావనాకృతిః |
అనేకకోటి బ్రహ్మాండ జననీ , దివ్యవిగ్రహా || 124 ||

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ || 125 ||

త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా || 126 ||

విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా || 127 ||

సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |
లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా || 128 ||

అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా |
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా || 129 ||

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |
సర్వధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ || 130 ||

అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ |
ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా || 131 ||

అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ |
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా || 132 ||

భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా |
సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః || 133 ||

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||

రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా || 135 ||

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ |
సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ || 136 ||

దేశకాలాఽపరిచ్ఛిన్నా, సర్వగా, సర్వమోహినీ |
సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ || 137 ||

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా |
సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ || 138 ||

కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ |
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా || 139 ||

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ |
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ || 140 ||

చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ |
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ || 141 ||

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ |
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా || 142 ||

భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా |
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా || 143 ||

భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా |
రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా || 144 ||

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా |
అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ || 145 ||

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా || 146 ||

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః |
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా || 147 ||

దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా |
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా || 148 ||

వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ || 149 ||

మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా || 150 ||

సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా |
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ || 151 ||

కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః |
పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా || 152 ||

పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా |
పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ || 153 ||

మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా |
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ || 154 ||

బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా |
ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః || 155 ||

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ |
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః || 156 ||

ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ |
భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ || 157 ||

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ |
ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ || 158 ||

జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ |
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా || 159 ||

గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా |
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా || 160 ||

కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా |
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ || 161 ||

అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా || 162 ||

త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ |
నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః || 163 ||

సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా |
యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ || 164 ||

ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ |
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ || 165 ||

విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ |
అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ || 166 ||

వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ |
విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా || 167 ||

తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ |
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ || 168 ||

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ |
స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా || 169 ||

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా |
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా || 170 ||

దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా |
కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ || 171 ||

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ|
ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ || 173 ||

వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ |
లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా || 176 ||

బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ |
సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ || 177 ||

సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా |
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా || 178 ||

దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ |
జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ || 179 ||

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా |
అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ || 180 ||

అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ |
అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా || 181 ||

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా |
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ || 182 ||

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః || 183 ||

|| ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః ||

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

🙏అథోత్తరభాగే ఫలశ్రుతిః 🌹

ఇత్యేతన్నామసాహస్రం కథితం తే ఘటోద్భవ |
రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్ || 1 ||

అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి |
సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్ || 2 ||

సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్ |
సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్ || 3 ||

పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్ |
ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్ || 4 ||

జపేన్నిత్యం

గరుడ పురాణం

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు.. 

గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభపురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – ” మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః” అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.

ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే.
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

గరుడ పురాణం:
⚜🔱⚜🔱⚜

గరుడుని పుట్టుక:
 ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు , బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను . ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి . అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను . అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను ,మరొకటి ఆకాశముగాను అయ్యెను.ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను . అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా “తప తప “అను మాటలు విన వచ్చెను . అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను .
బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని , దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి , వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి , మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు
 కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత ,కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె ,గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను.ఆమె సంతోష భరితురాలయ్యేను .
ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ , వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ “గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న ” దనెను. వినత ” అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?” అనెను. కద్రువ ,”కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను .తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను ” అనెను .వినత ” అయినచో పోయి చూతము రమ్మ “నెను. కద్రువ ” ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.
రేపు ప్రొద్దున చూత ” మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి ,”మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు ” డనెను . “విషయమే” మని వారడుగగా ,జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి .ఆమె వారిని సర్పయాగాములో నశింపు చసేను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది .తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని
 త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు.
ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి,” మనకీ దురవస్థయే” మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి ” ఏమిచ్చినచో నీవు నా
 తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద ” నని యడిగెను. ఆమె ” దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు ” ననెను.
గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి , తన తల్లి దాస్యమును ,దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి ,ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను.
కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి ,అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి .వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో ” దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు
” మనెను. దానికి గరుడుడు ” నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును.” అనెను . ” ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె ,నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే , అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను .దీనికి నీవంగీకరింపుము” అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి , ” మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !” అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి ,” కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు.” అని చెప్పెను.
తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై “గరుడా ! నీ భక్తికి మెచ్చినాను .నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము.” అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
 ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట ,అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ,” ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా


లవకుశులు తర్వాత రాముని వంశం

చాలామంది కి లవకుశల తరువాత రాముడి వంశం గురించి పెద్దగా తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘనుల సంతానం వారి భార్యలు, గురించి విపులంగా తెలుసుకుందాం... ఆ తరువాత వారి వంశం ఎలా సాగిందో కూడా వివరిస్తాను. పోతనగారి భాగవతం లో నవమస్కందంలో కుశలవుల అనంతర రఘువంశం వివరంగా లిఖించారు. వాల్మీకి రాసిన ఆనంద రామాయణం అనే కావ్యంలో వివాహకాండలో రామలక్ష్మణభరతశత్రుఘ్నుల కుమారుల వివాహల గురించి వివరంగా చెప్పబడింది.

శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు అయినప్పటికి తన కుమారులకు, తన తమ్ముళ్ల కుమారులకు ఇద్దరేసి భార్యలు ఉన్నారు.

1). శ్రీరాముడు...సీతాదేవి వీరి కుమారులలో పెద్ద కుమారుడు కుశుడు మరియు చిన్న కుమారుడు లవుడు. కుశుడు కి ఇద్దరు భార్యలు...చంపిక మరియు కుముద్వతి ఈమె నాగకన్య ఈమెకు మరో పేరు కంజాననా. వీరి కుమారుడు అతిధి ద్వారా రఘువంశం వృద్ధి చెందింది. లవుడు భార్య పేరు సుమతి. వీరి సంతానం వివరాలు తెలియరాలేదు.

2). భరతుడు ... మాండవిల పుత్రులు పుష్కరుడు, తక్షుడు.
పుష్కరుని భార్యలు కళావతి(నాగకన్య) మరియు చంచల (గంధర్వ కన్య)
తక్షుడు భార్యలు కాళిక (నాగకన్య ) మరియు చపల (గంధర్వ కన్య).

3). లక్ష్మణ... ఊర్మిళల పుత్రులు
అంగదుడు, చంద్రకేతుడు 
అంగదుని భార్యలు కంజాక్షి (నాగకన్య ),
చంద్రిక (గంధర్వకన్య )
చంద్రకేతుడు భార్యలు కంజాగ్రీ (నాగకన్య), చంద్రాసన (గంధర్వకన్య).

4). శత్రుఘ్నుడు... శృతకీర్తిల పుత్రులు సుబాహుడు మరియు శృతసేనుడు 
సుబాహుని భార్యలు కమల (నాగకన్య),
అచల (గంధర్వకన్య).
శృతసేనుడు భార్యలు మాలతి (నాగకన్య), మదనసుందరి (గంధర్వకన్య).

మొత్తం 16 మంది కోడళ్ళుకు, 120 మంది మనుమళ్లు, 24 మంది మనుమరాళ్లు కలిగారు.
వీరంతా వివిధ రాజ్యాలు స్థాపించుకుని అప్పటి భూమాండలామంతటా విస్తరించారు.

వీరందరి వివాహాలు శ్రీరాముని ఆధ్వర్యంలోనే జరిగినవి. సీతానిర్యాణానంతరం నిత్య యోగాలు యజ్ఞాలు జరిపిస్తూ కఠోర బ్రహ్మ చర్యంతో 11,000 అహోరేవ వత్సరాలు పరిపాలించాడు. అహోరేవ వత్సరాలంటే ఎమిటో తెలుసుకుందాం " ఒక రాజు ధర్మనిష్ఠతో చేసే పాలనలో ఒకరోజు.. ఒక సంవత్సరానికి సమానం". ("for a Maharaja, a person who lives in accordance with dharma, a day is equivalent to a year") అనే సూత్రం ప్రకారం రాజులు చేసిన రాజ్యపాలనని అహోరేవ వత్సరాలతో చెప్తారు. అహోరేవ వత్సరాలని 360 చేత భాగిస్తే సౌరమాన వత్సరాలు వస్తాయి. 11,000/360=30.55
అనగా శ్రీరాముడు ముప్పై సూర్యమాన సంవత్సరాలు పరిపాలించాడు.

ఇకపోతే శ్రీరాముని ప్రధమ పుత్రుడు కుశుడు ద్వారా రఘువంశం ఏవిధంగా వృధి చెందినదో పోతన భాగవతం ఆధారంగా తెలుసుకుందాం. వీరి వంశం కురుక్షేత్ర సంగ్రామం వరకు మనుగడలో ఉంది.

శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు.....🙏

పిల్లలు భగవద్గీత

ప్రస్తుతం పిల్లలు అనగా భావి భారత పౌరులు నిరాశ,నిస్పృహ మానసిక కుంగుబాటుతో మానసిక బలహీనులైపోతున్నారు. మీ పిల్లలు భవిష్యత్తులో మీరు కోరుకొన్నవిధంగా ప్రయోజకులుగా హీరోలుగా మారాలంటే ప్రతిరోజూ కనీసం ఒక్క భగవద్గీత శ్లోకం తాత్పర్యం తో చదివించండి. పరమాత్మ వాక్కును పలికే మీ పిల్లలు పాజిటివ్ ఎనర్జీ తో తేజస్సుతో గొప్పవారిగా మార్పు చెందడం మీరు గమనించవచ్చు. 🙏

స్వామినారాయణ్ జీవిత చరిత్ర

 స్వామినారాయణ్ జీవిత చరిత్ర

స్వామి నారాయణ్ లేదా సహజానంద్ స్వామి గా పిలవబడే ఈయన ఒక యోగి మరియు సన్యాసిగా తన జీవితాన్ని గడిపారు. తన జీవిత కాలంలో హిందూ ధర్మం యొక్క భోదననాలను బోధించేవారు. ధర్మం, అహింస, బ్రహ్మఅచర్యం అనే అంశాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు.      

స్వామి నారాయణ్ఉద్ధవ్ సంప్రదాయకి నాయకత్వం కూడా  వహించారు. నాయకత్వం తన గురువు స్వామి రామానంద్ చనిపోయిన తర్వాత అందచేయటం జరిగింది.   బ్రిటిష్ రాజ్ తో కూడా స్వామి నారాయణ్ గారి చాలా మంచి సంభందాలు ఉండేవి. హిందువులు అని కాకుండా ఇస్లాం మరియు జోరాస్ట్రియన్ మతం వారు కూడా వీరిని అనుసరించే వారు

బాల్యం

స్వామినారాయణ్ 3 April 1781 సంవత్సరంలో chhapaiya అనే ఉత్తరప్రదేశ్ లోని గ్రామంలో హరిప్రసాద్ పాండే, ప్రేమవతి పాండే అనే దంపతులకు జన్మించారు. సమయంలో స్వామినారాయణ్ పేరు ఘనశ్యామ్ పాండే గా పెట్టడం జరిగింది. స్వామి నారాయణ్ జన్మించిన రోజే రామ నవమి కావటం కూడా చాలా మంచిది అని అనుకుంటారు.     

స్వామి నారాయణ్ కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రంధాలూ, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లను నేర్చుకోవటం జరిగింది.స్వామినారాయణ్ తల్లి తండ్రులు చనిపోయిన తరవాత 1792 సంవత్సరంలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు  ఇల్లు వదిలినీలకంఠ్ వార్నిపేరుతో బయలుదేరారు.  

ఇంటి నుంచి బయలు దేరిన స్వామి నారాయణ తన మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక ఆశ్రమం ను వెతకటం ప్రారంభించారు.

వేదాంతం, సమాఖ్య, యోగ, మరియు పాంచరాత్ర లాంటి తత్వ శాస్త్రాలను  వివరించే మంచి గురువును వెతకటం ప్రారంభించారు.

జీవా అంటే ఏమిటి?

ఈశ్వర అంటే ఏమిటి?

మాయ అంటే ఏమిటి?

బ్రాహ్మణ అంటే ఏమిటి?

పరబ్రహ్మణ అంటే ఏమిటి?

5 ప్రశ్నలకు కూడా సమాధానం వెతకటం ప్రారంభించారు.  

రామానంద స్వామి ను కలవటం

సంవత్సరాల సుధీర్గ ప్రయాణం తరవాత గుజరాత్ లోని ఝనాగఢ్ జిల్లా కి చేరుకున్నారు, అక్కడ ముక్తనంద స్వామి ని కలుసుకున్నారు. ముక్తనంద స్వామి స్వామినారాయణ్ మనసులో ఉన్న 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ముక్తనంద స్వామి యొక్క గురువు అయిన రామానంద్ స్వామి ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారుస్వామి నారాయణ్ వయస్సు 21 సంవత్సరాలు అయినప్పుడు రామానంద్ స్వామి తన పేరు ను నీలకంఠ పేరు నుంచి సహజానంద్ స్వామి అని పేరు పెట్టారు. రామానంద్ స్వామి తాను మొదలుపెట్టిన ఉద్దవ్ సంప్రదాయ కి స్వామి నారాయణ్ ను కూడా నాయకునిగా నియంనుంచారు.   

రామానంద్ స్వామి చనిపోయిన తరవాత ఉద్దవ్ సంప్రదాయ ను స్వామినారాయణ్ సంప్రదాయ గా మార్చటం జరిగింది. స్వామి నారాయణ్ చేసే చమత్కారాలు చూసి ప్రజలు తాను ఒక భగవంతుడి రూపం అనుకునేవారు.   

గుజరాత్ లో స్వామి నారాయణ్ చేసిన మంచి మార్పులు

స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చి నప్పుడు దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. సమయంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం రకమైన నేరాలను అదుపు చేయలేక పోయింది. స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చిన తరవాత తన బోధనలను విని చాలా మంది నేరస్తులు తమ నేర జీవితం వదిలి మంచి జీవితాన్ని ప్రారంభించారు మార్పుని చూసి ప్రభుత్వం స్వామి నారాయణ్ ను చాలా మెచ్చుకుంది.  

స్వామి నారాయణ్ మహిళలకు విద్య చాలా ముఖ్యమని చెప్పేవారు. రోజుల్లో చాలా మంది మహిళలకు చదువు ఎందుకని ప్రశ్నించిన స్వామి నారాయణ్ మాత్రం మహిళలకు చదువు ముఖ్యమని చెప్పేవారు. స్వామి నారాయణ్ సమయంలో అక్షరాస్యత చాలా బాగా పెరిగింది.      

స్వామి నారాయణ్ కుల వ్యవస్థ ను కూడా రద్దు చేయాలనీ అనుకున్నారు. కరువు సమయాలలో పేద మరియు తక్కువ కులాల వారిని ఆదుకునే వారు, వారికి భోజన వసతి కలిపించేవారు. సమాజం లోని వివిధ రకాల ప్రజలతో డబ్బుని సమకూర్చి పేదలలో పంచేవారు.       

స్వామి నారాయణ్ వేరే మతస్తులైన షియా ముస్లిం లను కూడా తమ తో పటు ఉండటానికి ప్రోత్త్సహించే వారు

స్వామి నారాయణ్ బ్రాహ్మణులు యజ్ఞాలు చేసే సమయంలో ఇచ్చే జంతువుల బలి ను కూడా నిందించే వారు. అహింస మార్గాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని జంతు హింస మానుకోవాలని అని చేప్పేవారు. తన అనుచరులను శాఖాహారం మాత్రమే తినాలని మాంసాహారం మానుకోవాలి అని సలహా ఇచ్చే వారు.     

స్వామి నారాయణ్ చేసే మంచి పనులను మరియు సమాజంలో తెచ్చే మార్పులను మహ్మత్మా గాంధి సైతం మెచ్చుకున్నారు. చట్టం ద్వారా కూడా వీలుకాని మార్పులను స్వామి నారాయణ్ గారు చేసారని పొగిడారు.   

మరణం

1830 సంవత్సరంలో తాను ఇక చనిపోతాడని తన అనుచరులను పిలిచి చెప్పారు  ఇలా చెప్పిన తరవాత 1 జూన్ 1830 లో మరణించడం జరిగింది.  

తాను చనిపోవటానికి ముందు తన తర్వాత ఎవరు తన స్థానాన్ని కోనసాగించాలన్న విషయాలను స్పష్టంగా చెప్పారు. చాలా వరకు బాధ్యతలు తన భందువులకే ఇచ్చారు

స్వామి నారాయణ్ మొదటి సారి నిర్మించిన మందిరం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాలలో నిర్మిచడం జరిగింది. స్వామి నారాయణ్ తన జీవిత కాలంలో 6 అతి పెద్ద మందిర నిర్మాణాలు కూడా చేసారు. స్వామి నారాయణ్ అనుచరులు తనను అనుసరించే వారు క్రమ క్రమంగా పెరుగుతూ పోయారు. చాలా మంది తాను నారాయణ స్వామి అవతారం అని అనుకునే వారు, మరికొంత మంది మాత్రం తాను కృష్ణ భగవంతుడి అవతారం అని అనుకునేవారు.      

 

🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

 🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

ఎంతో పవిత్రమైన సాలగ్రామం గురించి మీకు తెలుసా? అవి ఎన్ని రకాలు? ఎటువంటి సాలగ్రామాలని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం


సాలగ్రామము విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుకే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామాలని పూజకు ఉపయోగిస్తారు. త్రిమతాచార్యులు తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది.

సాలగ్రామం విశిష్టత.. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్ధం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్ధం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు, మూడవది మోక్షం పొందడానికి. తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం, స్పృశించడం, అర్చన చేయడం వల్ల అంతులేని పుణ్యం లఖిస్తుంది.


సాలగ్రామాలు శిలాజాలు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్యులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు వీటి గురించి వివరిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సాలగ్రామం ఎలా వచ్చాయంటే.. 

పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్టుగా చేశారు. వారికి తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నట్టుగా కథ ఉంటుంది. సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

సాలగ్రామాన్ని భక్తిశద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో చేసే పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే నూరురెట్లు అధిక ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాలను నశింపజేస్తుంది.


సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం ఇదే.. 

సర్వరోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు కలుగుతాయి. సర్వశుభాలను కలిగించడంతో పాటి మోక్షం ప్రాప్తిస్తుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకున్న, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒక్కసారి భక్తిశద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది.

సాల గ్రామ తీర్ధం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృతం సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్త్రములయందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాలు తెలియకపోయినప్పటికీ శక్తిననుసరించి పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు.

సాలగ్రామ ప్రాముఖ్యత 

అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి కానీ ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరి పడేటువంటి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో “నిత్యాగ్ని హోమం” చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారని చిలకమర్తి తెలిపారు.


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి రేశవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుంది. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత  కలిగి ఉంటాయి. 

కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి. అందుకే ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామాల గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్మరమని చిలకమర్తి తెలియచేసారు.

సాలగ్రామం చక్రాల పేర్లు 

1 చక్రం ఉంటే - సుదర్శనం, 2 చక్రాలు ఉంటే - లక్ష్మీనారాయణ , 3 చక్రాలు ఉంటే - అచ్యుతుడు, 4 చక్రాలు ఉంటే -జనార్ధనడు, 5 చక్రాలు ఉంటే - వాసుదేవుడు, 6 చక్రాలు ఉంటే - ప్రద్యుమ్నుడు, 7 చక్రాలు ఉంటే - సంకర్షణుడు, 8 చక్రాలు ఉంటే - పురుషోత్తముడు, 9 చక్రాలు ఉంటే - నవ వ్యూహము, 10 చక్రాలు ఉంటే - దశావతారము, 11 చక్రాలు ఉంటే - అనిరుద్ధుడు, 12 చక్రాలు ఉంటే - ద్వాదశాత్ముడు, 12 చక్రాల కన్నా ఎక్కువ ఉంటే “అనంతమూర్తి అంటారు.


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపు పచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణం అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండి రేఖపాడవుగా ఉంటే దానిని “ఆదినారాయణ సాలగ్రామం” అని అంటారు. తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే దానిని “వాసు దేవ సాలగ్రామం” అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమైనది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

రంగుల సాలగ్రామల అర్థాలు 

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండి రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, “పద్మ చిహ్నం” పైముఖంగా ఉంటే దానిని “అనిరుద్ధ సాలగ్రామము” అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్దం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని 'నరసింహ సాలగ్రామం” అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా ఉండి మూడు బిందువులతో ఉన్నదానిని “'మత్యృమూర్తి సాలగ్రామం” అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ ఎడమవైపున గద చక్రాలు, కుడి వైపున రేఖ ఉన్న దానిని “'సుదర్శనమూర్తి సాలగ్రామం” అని అంటారు. శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. వివిధ రంగుల్లో ఉండి అనేక చక్రాలు, అనేక రేఖలు ఉన్నదానిని “అనంతమూర్తి సాలగ్రామము” అని అంటారు. ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది.


3౩ ముఖాలు 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని “'షట్బక్రసీతారామ సాల గ్రామం” అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అఫ్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు. 

సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది సర్వో తృష్టమైనది, సర్వాంతర్యామి ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జీవతాన్ని ధన్యం చేసుకోవడం శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.

సాలగ్రామ పుట్టుక వెనుక మరొక కథ 

మరోకథ ప్రకారం ఒకానాకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన కళ్ల నుంచి రెండు కన్నీరు చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.

సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృతముతో గాని శుద్ది చేయాలి. “రుద్రాక్షధారణ” నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా చేయించుకున్నా ఆ సాలగ్రామము శక్తి ద్విగుణీకృతమవుతుంది. సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది.

కనీసం సాలగ్రామంకు భక్తిశద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా సర్వపాపాలు పరిహరింపబడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

💥సాలగ్రామము పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. 💥

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా నిజంగా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.ఇంకా మా దరిద్రం ,రోగాలు పోలేదేమిటి అని అడిగితే దేవుడు పరీక్ష పెడుతున్నాడు కర్రు కాలితే గదా తుప్పు వదిలేది అంటారు.మీరు ఎంతోమంది  పాస్టర్ల గురించి ఎంక్వయిరీ చేయండి.షుగర్,బీపీ కాన్సర్ లు ఉంటాయి. 


వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . వీరు ముఖ్యానంగా హిందూ స్త్రీలు ,పిల్లలను మతం మార్చడానికి అదేపనిగా ప్రయత్నిస్తుంటారు.కొంతమంది ఆడవారిని గూడా తీసుకువచ్చి మాకు ఇలా అద్భుతాలు జరిగాయి,జబ్బులు పోయాయి,దరిద్రం పోయింది అని మెస్మరిజం తో వారిలో ఆశ పుట్టించి కుటుంబం లో ఒకరిని ఎలాగోలా మార్చేస్తారు.ఆడవారిని మార్చేస్తే ఆమె భర్తను మరియు పిల్లలను మార్చేస్తుందని వారి నమ్మకం.ఇలా ఎంతమందిని మార్చగలిగితే వారికి వారి మినిస్ట్రీస్ నుండి  అంత ప్రొమోషన్ లు ఉంటాయి . ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.మన దేశాన్ని  పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి విదేశాల కుట్రతో  వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .


కరోనా సెకండ్ వేవ్ లో అధికారిక లెక్కల ప్రకారం  తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి.ఎన్నో క్రిష్టియన్ కుటుంబాలు జీవితాంతం గుండెలు బాదుకొంటూ కన్నీటి ప్రార్ధన చేస్తూ వారికొచ్చే ఆదాయంలో 10 వ వంతు పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికి వారి దారిద్య బాధలు తొలగవు. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.జాగ్రత్త : వారు మన ఇంటివైపు వస్తున్నారు అంటే శవాల నుండి ప్రేతాత్మలు మనఇంటివైపు వస్తున్నట్టే.


  గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి


భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్పమో  లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు


మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.


ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.