13, మార్చి 2020, శుక్రవారం

🙏ప్రశ్న : “యోగభ్రష్టత్వం అంటే ఏమిటి?”🙏



 🌷పత్రీజీ :

👉సరియైన ధ్యాన సాధనను విశేషంగా చేసిన ప్రతి ఒక్కరికీ అపరమితమైన శక్తి సామర్థ్యాలు సంక్రమిస్తూ ఉంటాయి.

👉తద్వారా వారు ఏది కోరుకుంటే అది ప్రాపంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా సునాయాసంగా కలిసివస్తూ ఉంటాయి.

👉“ప్రాప్తి” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధుల వల్ల మనం గర్వం, అహంకారం మరి డంబాతిశయాలను పెంచుకుంటే .. అది మన ఆధ్యాత్మిక మరి ప్రాపంచిక పతనాలకు దారితీసి మనల్ని యోగభ్రష్ఠుల్లా మలిచి మరు జన్మల్లో మరింత క్లిష్ట పరిస్థితుల్లో జన్మతీసుకునేలా చేస్తుంది.

👉అలా కాకుండా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు సంక్రమిస్తోన్న సిద్ధుల పట్ల ఎరుకతో కూడిన సమదృష్టిని కలిగి ఉండాలి!

👉కోరుకున్నవైనా .. లేదా అనాలోచితంగా నైనా సరే .. మనకు సంప్రాప్తిస్తోన్న అద్భుత ఫలితాలు పట్ల కృతజ్ఞతతో కూడి ఉంటూ గర్వానికి లోబడిపోకుండా జాగ్రత్త వహించాలి.

👉అప్పుడే ఆత్మ తన పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది.
💐☘💐☘🙏☘🙏☘💐☘

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి