30, జనవరి 2026, శుక్రవారం

విష్ణువు రామునిలా అవతారం ఎత్తుతాడని రావణుడికి ముందే తెలుసా?

🔔 *జై శ్రీరాం* 🔔

విష్ణువు రామునిలా అవతారం ఎత్తుతాడని రావణుడికి ముందే తెలుసా?

తెలియదనే వాల్మీకి శ్రీరామాయణం చదివితే అనిపిస్తుంది.

రావణుడి గురించిన గొప్ప విషయాలు చెప్పాలంటే కాస్త భయం వేస్తుంది. 

ప్రతీ వారి చరిత్ర ఇతిహాసం కాదు. అదీ ఆచరణకి,అనుసరణకి అంత యోగ్యం కాదు.

కానీ రామాయణమే అన్ని కోట్ల సార్లు పారాయణ చేయబడింది.

రావణుడి గొప్పదనం చెప్పాలంటే భయం ఎందుకంటే ఆయనని అనుసరించాలని అనుకుంటారేమో అని!

అంతటి గొప్పవాడు ఎందుకు పతనమయ్యాడో తెలుసుకుని మనం ఆ తప్పు చేయకుండా ఉండడానికి తెలుసుకోవచ్చు.

రావణాసురుడి జీవుడు వైకుంఠ వాసి ఎంత గొప్పవాడు కాకపోతే అక్కడిదాకా వెళ్ళాడు.

చిన్న తప్పుకి బ్రహ్మఙ్ఞానులను గుర్తించలేక ఇబ్బంది పడ్డారు శాపం పొందారు.

మూడు జన్మల వైరం తరువాత నిన్ను చేరిపోవాలి అని అడిగారు.

ఆలెక్కన ఆయన జీవుడికి తెలుసు (సామవేదం వారు చెబుతారిలా) కానీ రావణుడికి తెలియదు.

మన లోని జీవుడికీ తెలుసు ఎప్పటికైనా అక్కడికి చేరాలని లోపలున్న రాముణ్ణి అనుభూతి చెందాలని.

అందుకనే రాముడి గురించి విన్నా రామనామం చెప్పినా పరవశం కలుగుతుంది. 

అది మనలోని జీవుడి భావన!

ఆభావనని జన్మజన్మాంతరంగా మనం సంపాదించుకున్న వాసనలు, అరిషడ్వర్గాలు,రాగద్వేషాలు,అహంకార మమకారాలూ, అవిద్య పొరలుగా మారి చుట్టూ రాళ్లతో దుర్గం(కోట) ఏర్పడిపోతుంది.

ఈ దుర్గాన్ని ఛేదించడం మన వల్లకాదు!

రామనామం, రామాయణ పఠనం, శ్రవణం అందుకు అంటే దుర్గం ఛేదనానికి ఉపకరిస్తాయి.

ఎప్పుడు అది జరుగుతుందో అపుడు రాముడు అనుభూతిలోకి వచ్చి జన్మపరంపర ఆగిపోతుంది.

కోట్ల జన్మలు! కానీ.. అది జరిగితీరుతుంది!

*అంతదాకా...*
*రామనామము రామనామము రమ్యమైనది రామనామము*      
  

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

1 కామెంట్‌:

  1. ఉత్తరరామాయణంలో కొంత సూటి సమాచారం ఉంది. రావణుడు తన జైత్రయాత్రలో భాగంగా పాతాళం చేరినపుడు అక్కడ కపిలుడిని దర్శించి విచలితు డవుతాడు. నన్ను నీవు చంపుతావా అని రావణుడు ప్రశ్నిస్తే ఇప్పుడు కాదు వేరే రూపంలో వచ్చి యుద్ధంలో చంపుతానని ఆయన చెబుతారు.

    శ్రీమద్రామాయణంలో నుండి కూడా సమాధానం గ్రహించే అవకాశం ఉంది. రాముడి పూర్వీకుడయిన అనరణ్యుని మీదకు యుద్ధానికి పోయి అయన్ను చంపుతాడు రావణుడు. ఆయన మరణిస్తూ నిష్కారణవైరంతో నన్ను వధించావు కాని నావంశంలోనే ముందుముందు నిన్ను సంహరించే వాడు జన్మిస్తాడుపో అని శపిస్తాడు. రాముడితో వైరం పెట్టుకొన్న రావణుడికిఆరాముడు అనరణ్యుడి వంశస్థుడే అని తెలుసును. అంతే కాదు తనని నరుడిగా వచ్చి చంపగలిగేది దానవవైరి ఐన శ్రీహరి అనీ అతడికి తెలుసు. కపిలుడు విష్ణువే అన్న ప్రతీతి రావణుడికి తెలిసిన విషయమే.

    రిప్లయితొలగించండి