20, డిసెంబర్ 2024, శుక్రవారం

స్వామినారాయణ్ జీవిత చరిత్ర

 స్వామినారాయణ్ జీవిత చరిత్ర

స్వామి నారాయణ్ లేదా సహజానంద్ స్వామి గా పిలవబడే ఈయన ఒక యోగి మరియు సన్యాసిగా తన జీవితాన్ని గడిపారు. తన జీవిత కాలంలో హిందూ ధర్మం యొక్క భోదననాలను బోధించేవారు. ధర్మం, అహింస, బ్రహ్మఅచర్యం అనే అంశాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు.      

స్వామి నారాయణ్ఉద్ధవ్ సంప్రదాయకి నాయకత్వం కూడా  వహించారు. నాయకత్వం తన గురువు స్వామి రామానంద్ చనిపోయిన తర్వాత అందచేయటం జరిగింది.   బ్రిటిష్ రాజ్ తో కూడా స్వామి నారాయణ్ గారి చాలా మంచి సంభందాలు ఉండేవి. హిందువులు అని కాకుండా ఇస్లాం మరియు జోరాస్ట్రియన్ మతం వారు కూడా వీరిని అనుసరించే వారు

బాల్యం

స్వామినారాయణ్ 3 April 1781 సంవత్సరంలో chhapaiya అనే ఉత్తరప్రదేశ్ లోని గ్రామంలో హరిప్రసాద్ పాండే, ప్రేమవతి పాండే అనే దంపతులకు జన్మించారు. సమయంలో స్వామినారాయణ్ పేరు ఘనశ్యామ్ పాండే గా పెట్టడం జరిగింది. స్వామి నారాయణ్ జన్మించిన రోజే రామ నవమి కావటం కూడా చాలా మంచిది అని అనుకుంటారు.     

స్వామి నారాయణ్ కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రంధాలూ, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం లను నేర్చుకోవటం జరిగింది.స్వామినారాయణ్ తల్లి తండ్రులు చనిపోయిన తరవాత 1792 సంవత్సరంలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు  ఇల్లు వదిలినీలకంఠ్ వార్నిపేరుతో బయలుదేరారు.  

ఇంటి నుంచి బయలు దేరిన స్వామి నారాయణ తన మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక ఆశ్రమం ను వెతకటం ప్రారంభించారు.

వేదాంతం, సమాఖ్య, యోగ, మరియు పాంచరాత్ర లాంటి తత్వ శాస్త్రాలను  వివరించే మంచి గురువును వెతకటం ప్రారంభించారు.

జీవా అంటే ఏమిటి?

ఈశ్వర అంటే ఏమిటి?

మాయ అంటే ఏమిటి?

బ్రాహ్మణ అంటే ఏమిటి?

పరబ్రహ్మణ అంటే ఏమిటి?

5 ప్రశ్నలకు కూడా సమాధానం వెతకటం ప్రారంభించారు.  

రామానంద స్వామి ను కలవటం

సంవత్సరాల సుధీర్గ ప్రయాణం తరవాత గుజరాత్ లోని ఝనాగఢ్ జిల్లా కి చేరుకున్నారు, అక్కడ ముక్తనంద స్వామి ని కలుసుకున్నారు. ముక్తనంద స్వామి స్వామినారాయణ్ మనసులో ఉన్న 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ముక్తనంద స్వామి యొక్క గురువు అయిన రామానంద్ స్వామి ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారుస్వామి నారాయణ్ వయస్సు 21 సంవత్సరాలు అయినప్పుడు రామానంద్ స్వామి తన పేరు ను నీలకంఠ పేరు నుంచి సహజానంద్ స్వామి అని పేరు పెట్టారు. రామానంద్ స్వామి తాను మొదలుపెట్టిన ఉద్దవ్ సంప్రదాయ కి స్వామి నారాయణ్ ను కూడా నాయకునిగా నియంనుంచారు.   

రామానంద్ స్వామి చనిపోయిన తరవాత ఉద్దవ్ సంప్రదాయ ను స్వామినారాయణ్ సంప్రదాయ గా మార్చటం జరిగింది. స్వామి నారాయణ్ చేసే చమత్కారాలు చూసి ప్రజలు తాను ఒక భగవంతుడి రూపం అనుకునేవారు.   

గుజరాత్ లో స్వామి నారాయణ్ చేసిన మంచి మార్పులు

స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చి నప్పుడు దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. సమయంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం రకమైన నేరాలను అదుపు చేయలేక పోయింది. స్వామి నారాయణ్ గుజరాత్ కి వచ్చిన తరవాత తన బోధనలను విని చాలా మంది నేరస్తులు తమ నేర జీవితం వదిలి మంచి జీవితాన్ని ప్రారంభించారు మార్పుని చూసి ప్రభుత్వం స్వామి నారాయణ్ ను చాలా మెచ్చుకుంది.  

స్వామి నారాయణ్ మహిళలకు విద్య చాలా ముఖ్యమని చెప్పేవారు. రోజుల్లో చాలా మంది మహిళలకు చదువు ఎందుకని ప్రశ్నించిన స్వామి నారాయణ్ మాత్రం మహిళలకు చదువు ముఖ్యమని చెప్పేవారు. స్వామి నారాయణ్ సమయంలో అక్షరాస్యత చాలా బాగా పెరిగింది.      

స్వామి నారాయణ్ కుల వ్యవస్థ ను కూడా రద్దు చేయాలనీ అనుకున్నారు. కరువు సమయాలలో పేద మరియు తక్కువ కులాల వారిని ఆదుకునే వారు, వారికి భోజన వసతి కలిపించేవారు. సమాజం లోని వివిధ రకాల ప్రజలతో డబ్బుని సమకూర్చి పేదలలో పంచేవారు.       

స్వామి నారాయణ్ వేరే మతస్తులైన షియా ముస్లిం లను కూడా తమ తో పటు ఉండటానికి ప్రోత్త్సహించే వారు

స్వామి నారాయణ్ బ్రాహ్మణులు యజ్ఞాలు చేసే సమయంలో ఇచ్చే జంతువుల బలి ను కూడా నిందించే వారు. అహింస మార్గాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని జంతు హింస మానుకోవాలని అని చేప్పేవారు. తన అనుచరులను శాఖాహారం మాత్రమే తినాలని మాంసాహారం మానుకోవాలి అని సలహా ఇచ్చే వారు.     

స్వామి నారాయణ్ చేసే మంచి పనులను మరియు సమాజంలో తెచ్చే మార్పులను మహ్మత్మా గాంధి సైతం మెచ్చుకున్నారు. చట్టం ద్వారా కూడా వీలుకాని మార్పులను స్వామి నారాయణ్ గారు చేసారని పొగిడారు.   

మరణం

1830 సంవత్సరంలో తాను ఇక చనిపోతాడని తన అనుచరులను పిలిచి చెప్పారు  ఇలా చెప్పిన తరవాత 1 జూన్ 1830 లో మరణించడం జరిగింది.  

తాను చనిపోవటానికి ముందు తన తర్వాత ఎవరు తన స్థానాన్ని కోనసాగించాలన్న విషయాలను స్పష్టంగా చెప్పారు. చాలా వరకు బాధ్యతలు తన భందువులకే ఇచ్చారు

స్వామి నారాయణ్ మొదటి సారి నిర్మించిన మందిరం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాలలో నిర్మిచడం జరిగింది. స్వామి నారాయణ్ తన జీవిత కాలంలో 6 అతి పెద్ద మందిర నిర్మాణాలు కూడా చేసారు. స్వామి నారాయణ్ అనుచరులు తనను అనుసరించే వారు క్రమ క్రమంగా పెరుగుతూ పోయారు. చాలా మంది తాను నారాయణ స్వామి అవతారం అని అనుకునే వారు, మరికొంత మంది మాత్రం తాను కృష్ణ భగవంతుడి అవతారం అని అనుకునేవారు.      

 

4, సెప్టెంబర్ 2024, బుధవారం

🍀పునర్నవ పొడి ప్రయోజనాలు🍀

 🍀పునర్నవ పొడి ప్రయోజనాలు🍀


పునర్నవ పొడి లేక ఆకులు అనేక రకాల వ్యాధులకు ప్రయోజనాలను కలిగి ఉంటాయి, 'పునర్నవ' పాండురోగాన్నీ, రక్త పిత్తాన్నీ,వాపులనూ, వ్రణాలనూ, శ్లేష్మాన్నీ పోగొట్టి మూత్రం జారీచేస్తుంది. మూత్రపిండాల వాపుకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొట్టలోని కణుతులు, గడ్డలు, పేగు కాన్సర్ మొదలైన వాటికి  బాగా పనిచేస్తుంది. కడుపులోని బాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను నశింపజేయడమే కాక  గుండెకు బలాన్నిచ్ఛే టానిక్ లాగానూ పనిచేస్తుంది కండరాల నొప్పులు ఉపశమిస్తాయి. రక్త శుద్ధికి కూడా  దోహదం చేస్తుంది.ఇది మీ సహజ ఆరోగ్యం మరియు సంరక్షణ నియమావళికి శక్తివంతమైన అదనంగా ఉంటుంది. ఇక్కడ  పునర్నవ పొడి ప్రయోజనాలను చూడండి:

🍀 మూత్రనాళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది:  పునర్నవ పొడి ఇది సిస్టిటిస్ మరియు ఇతర మూత్ర సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను వాపు తగ్గిస్తుంది మరియు మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.

యూరియా మరియు సీరం క్రీటినిన్ ను సాధారణ స్థితికి తెస్తుంది. డయాలసిస్ చేయవల్సిన ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

🍀 వాపును తగ్గిస్తుంది:  పునర్నవ పొడి దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాల వల్ల శరీరంలో మంటను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ మరియు ఇతర తాపజనక సమస్యల వంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

🍀 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఈ పొడిలోని మూత్రవిసర్జన లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా చాలా సహాయకారిగా ఉంటాయి. ఇది ఉబ్బరం, పొత్తికడుపు అసౌకర్యం మరియు అపానవాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, ఇది మొత్తంమీద మెరుగైన జీర్ణక్రియకు దారితీస్తుంది.

🍀 శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది:  పునర్నవ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం మరియు మూత్రపిండాల నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయం చేయడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది, అలాగే సోరియాసిస్ లేదా ఎగ్జిమా వంటి కొన్ని చర్మ రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

🍀 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపస్తుంది  ఎలాగంటే ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . గుండెకు బలాన్నిస్తుంది.


🍀   పునర్నవ ఊబకాయంతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది  స్థూలకాయాన్ని తగ్గించడానికి ఇది శరీరం నుండి అదనపు శరీర ద్రవాలను విసర్జించడానికి సహాయపడుతుంది.

🍀 ఆర్థరైటిస్కు చికిత్స చేస్తుంది:   ఇది కీళ్ల నొప్పులు మరియు కండరాల వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందువలన ఇది ఆర్థరైటిస్ చికిత్సకు సహాయపడుతుంది 


🍀 మధుమేహం లో   పునర్నవ హైపోగ్లైసీమిక్ ప్రాపర్టీని కలిగి ఉంది  ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ప్లాస్మా ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.

🍀 నాడీ వ్యవస్థ - పునర్నవ నాడీ వ్యవస్థపై పునరుజ్జీవన లక్షణాలను చూపుతుంది .ఇది సయాటికా లేదా నరాల బలహీనత మరియు అనేక ఇతర నాడీ రుగ్మతలకు చాలా మంచిది. రక్త హీనతకు గూడ ఇది మంచి మందు.

       

పునర్నవ పౌడర్ ఎలా ఉపయోగించాలి ?


 ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఆకుల పొడిని లేక పునర్నవ వేర్ల పొడిని ఒక గ్లాసు వెచ్చని లేక  సాధారణ నీటిలో రోజుకు రెండుసార్లు  తినక ముందు లేక తిన్న తర్వాత అరగంటకు తీసుకోవాలి  అదనపు ప్రయోజనాల కోసం మీరు  తేనె, బెల్లం కూడా కలపవచ్చు.


  అలెర్జీ ప్రతిచర్యలు : పునర్నవ పొడి ప్రయోజనాలు సురక్షితమైన ది . సాధారణంగా ఇది తెల్లగలిజేరు ఆకులు లేక తెల్లగలిజేరు వేర్లు పొడి కాబట్టి అపాయకరం కాదు.కొందరిలో దద్దుర్లు లేక దురద వస్తే దీనిని తీసుకోవడం ఆపివేయండి.

గమనిక : అటిక మామిడాకు కూడా తెల్ల గలిజేరు లక్షణాలని కలిగిఉంటుంది. పొడి లేకపోతే ఆ ఆకుల రసాన్ని గూడా తీసుకోవచ్చు. పునర్నవ వేర్లు పొడి ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ప్రతి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది

 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

9, జులై 2024, మంగళవారం

బీబీ నాంచారమ్మ:

 

బీబీ నాంచారమ్మ: 

🌻🪷🥥🌸🍓🍌🌼🌺🍎🍈

ఒక దేవుడిని పూజించేవారందరూ కలిసి తమని తాము ఒకే మతంగా భావించుకోవచ్చు. కానీ సాక్షాత్తూ ఆ భగవంతుని కులం ఏది అని అడిగితే ఏమని చెప్పగలం! ఆద్యంత రహితుడికి కులమతాలను ఆపాదించలేం కదా! దానిని నిరూపించే ప్రమాణమే బీబీ నాంచారమ్మ! 


నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట.


ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది.


కొన్ని కథల ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. 


దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి.


అలాంటి విగ్రహాలను కరింగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని దిల్లీకి బయలుదేరాడు. దిల్లీకి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్యా శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది.


ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం... అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. 


ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ అంతే బాధలో మునిగిపోయారు. 


చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు దిల్లీకి ప్రయాణమయ్యారు. సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని చెబుతారు.


రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది! తన కలల ప్రతిరూపం కనుమరుగైంది. 


ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.


మరికొన్ని గాథల ప్రకారం ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. 


దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. 


ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ .


ఓం నమో వేంకటేశాయ 🙏🙏

🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

 🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

ఎంతో పవిత్రమైన సాలగ్రామం గురించి మీకు తెలుసా? అవి ఎన్ని రకాలు? ఎటువంటి సాలగ్రామాలని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం


సాలగ్రామము విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుకే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామాలని పూజకు ఉపయోగిస్తారు. త్రిమతాచార్యులు తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది.

సాలగ్రామం విశిష్టత.. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్ధం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్ధం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు, మూడవది మోక్షం పొందడానికి. తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం, స్పృశించడం, అర్చన చేయడం వల్ల అంతులేని పుణ్యం లఖిస్తుంది.


సాలగ్రామాలు శిలాజాలు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్యులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు వీటి గురించి వివరిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సాలగ్రామం ఎలా వచ్చాయంటే.. 

పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్టుగా చేశారు. వారికి తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నట్టుగా కథ ఉంటుంది. సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

సాలగ్రామాన్ని భక్తిశద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో చేసే పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే నూరురెట్లు అధిక ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాలను నశింపజేస్తుంది.


సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం ఇదే.. 

సర్వరోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు కలుగుతాయి. సర్వశుభాలను కలిగించడంతో పాటి మోక్షం ప్రాప్తిస్తుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకున్న, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒక్కసారి భక్తిశద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది.

సాల గ్రామ తీర్ధం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృతం సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్త్రములయందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాలు తెలియకపోయినప్పటికీ శక్తిననుసరించి పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు.

సాలగ్రామ ప్రాముఖ్యత 

అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి కానీ ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరి పడేటువంటి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో “నిత్యాగ్ని హోమం” చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారని చిలకమర్తి తెలిపారు.


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి రేశవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుంది. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత  కలిగి ఉంటాయి. 

కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి. అందుకే ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామాల గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్మరమని చిలకమర్తి తెలియచేసారు.

సాలగ్రామం చక్రాల పేర్లు 

1 చక్రం ఉంటే - సుదర్శనం, 2 చక్రాలు ఉంటే - లక్ష్మీనారాయణ , 3 చక్రాలు ఉంటే - అచ్యుతుడు, 4 చక్రాలు ఉంటే -జనార్ధనడు, 5 చక్రాలు ఉంటే - వాసుదేవుడు, 6 చక్రాలు ఉంటే - ప్రద్యుమ్నుడు, 7 చక్రాలు ఉంటే - సంకర్షణుడు, 8 చక్రాలు ఉంటే - పురుషోత్తముడు, 9 చక్రాలు ఉంటే - నవ వ్యూహము, 10 చక్రాలు ఉంటే - దశావతారము, 11 చక్రాలు ఉంటే - అనిరుద్ధుడు, 12 చక్రాలు ఉంటే - ద్వాదశాత్ముడు, 12 చక్రాల కన్నా ఎక్కువ ఉంటే “అనంతమూర్తి అంటారు.


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపు పచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణం అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండి రేఖపాడవుగా ఉంటే దానిని “ఆదినారాయణ సాలగ్రామం” అని అంటారు. తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే దానిని “వాసు దేవ సాలగ్రామం” అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమైనది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

రంగుల సాలగ్రామల అర్థాలు 

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండి రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, “పద్మ చిహ్నం” పైముఖంగా ఉంటే దానిని “అనిరుద్ధ సాలగ్రామము” అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్దం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని 'నరసింహ సాలగ్రామం” అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా ఉండి మూడు బిందువులతో ఉన్నదానిని “'మత్యృమూర్తి సాలగ్రామం” అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ ఎడమవైపున గద చక్రాలు, కుడి వైపున రేఖ ఉన్న దానిని “'సుదర్శనమూర్తి సాలగ్రామం” అని అంటారు. శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. వివిధ రంగుల్లో ఉండి అనేక చక్రాలు, అనేక రేఖలు ఉన్నదానిని “అనంతమూర్తి సాలగ్రామము” అని అంటారు. ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది.


3౩ ముఖాలు 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని “'షట్బక్రసీతారామ సాల గ్రామం” అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అఫ్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు. 

సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది సర్వో తృష్టమైనది, సర్వాంతర్యామి ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జీవతాన్ని ధన్యం చేసుకోవడం శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.

సాలగ్రామ పుట్టుక వెనుక మరొక కథ 

మరోకథ ప్రకారం ఒకానాకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన కళ్ల నుంచి రెండు కన్నీరు చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.

సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృతముతో గాని శుద్ది చేయాలి. “రుద్రాక్షధారణ” నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా చేయించుకున్నా ఆ సాలగ్రామము శక్తి ద్విగుణీకృతమవుతుంది. సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది.

కనీసం సాలగ్రామంకు భక్తిశద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా సర్వపాపాలు పరిహరింపబడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

💥సాలగ్రామము పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. 💥

అపుత్రస్య గతిర్నాస్తి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

నేటి... 


                ఆచార్య సద్భోదన

                    ➖➖➖✍️

      అపుత్రస్య గతిర్నాస్తి 

‘పుత్రులు లేని వాళ్ళకు మోక్షప్రాప్తి లేదంటారా?’  అని  చాలామంది సందేహం వెలిబుచ్చుతారు.

పుత్రస్య అంటే పుత్రులే అని కాదు. పుత్రికలు కూడా అని అర్థం వస్తుంది.

 పుత్ర అనే పదం సంస్కృతంలో ఏక శేష సమానం క్రిందకు వస్తుంది. పురుషార్థాలు, పురుష పయత్నం అనేవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. 

పుత్ర అనే పదం పుత్రిక కు కూడా వర్తిస్తుందని ఆడపిల్లలు తమను పున్నామ నరకం నుంచి తప్పించలేరని తండ్రులు పెదవి విరుస్తుంటారు. 

అసలు అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆడ, మగ ఏ సంతానము లేని వారికి ఉత్తమ గతులుండవని అర్థం. 


సంతానం కలగని వాళ్ళు ఒక అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చుకొని, చట్టబద్ధంగా దత్తత చేసుకొని, పెంచుకోవచ్చు. అయితే బిడ్డలున్న వాళ్ళంతా మోక్షానికి పోతున్నారనుకుంటే పొరపాటే.

మోక్షమిచ్చేవాడు ఆ పరమాత్మ తప్ప అన్యులు కారు. సదాచార్యుని ద్వారా ఆయన్నే శరణువేడాలి. వీలైనంత వరకూ దానధర్మాలు చేయాలి. మన వెంట వచ్చేవి, మనకు మోక్షాన్ని ప్రసాదించేవి మనం చేసిన దానధర్మాలు తప్ప మరేమీ కావు.✍️

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

                     ➖▪️➖

రాజసూయ యాగం

 

రాజసూయ యాగం 

ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా విన్నవించాడు. "ప్రభూ! గోవిందా! నేను రాజసూయ యాగంచేసి, దేవతలను ఆరాధించుటకు నీ ఆశీస్సులను, అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిన్ను ఆశ్రయించి, నీ పాద పద్మాలను సేవించే వారి కోరికలు నెరవేరుతాయి కదా!” అనగా శ్రీకృష్ణుడు ఇలాగ అన్నాడు. "ధర్మనందనా! నీ నిర్ణయం హర్షింప దగినది. ఈ యాగం దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూత శ్రేయోదాయకం కాన ఇది చేయదగినదే. నీకు పుణ్యం, కీర్తి, విజయం సిద్ధిస్తాయి. కనుక ఈ యాగాన్ని చేయి. నీ తమ్ముళ్ళు నీకు తోడుగా వుంటారు. వారు అస్త్రశస్త్ర విశారదులు.

నీ శత్రువులను ఓడించి, నీ కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నీవు ఏ కార్యం చేయమన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” అని చెప్పిన శ్రీకృష్ణునకు ధర్మజుడు కృతజ్ఞతలు తెలిపి, నమస్కరించాడు. నలుగురు తమ్ముళ్ళను నాలుగు దిక్కులకూ పంపాడు. అదేవిధంగా తమ్ముళ్ళు వెళ్ళి, రాజులను జయించి, కప్పాలు కట్టించుకొని, సంపదలను ప్రోవుచేసుకొని వచ్చారు. ఒక్క జరాసంధుడు మాత్రం లొంగలేదని ధర్మరాజుకు తమ్ముళ్ళు చెప్పారు. అపుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. "ధర్మరాజా! జరాసంధునికి బ్రాహ్మణ భక్తి మెండు. బ్రాహ్మణులు అడిగింది ఏదైనా ఇస్తాడు. భీముడు, నేను, అర్జునుడు బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి, అతనితో ద్వంద్వ యుద్ధ చేయాలని వరాన్ని కోరుతాం. అతడు సమ్మతించి వస్తాడు. అపుడు భీముడు అతనిని ఓడిస్తాడు." అనగా అందరూ సంతసించారు.

శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు ఆ బ్రాహ్మణులను సత్కరించాడు. ఆ కపట బ్రాహ్మణ వేషంలో వున్న శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. “ఓ మగధరాజా! బ్రాహ్మణ అతిథి దేవులను పూజించి, వారి కోర్కెలను తీర్చు వదాన్యత నీకున్నదని తెలిసి, ఒక కోర్కెతో నీ వద్దకు వచ్చాం. దానశీలురకు ఇవ్వదగనిది ఏదీ ఉ ౦డదు కదా! దధీచి, కపోతం, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు మున్నగు వారెందరో పురాణ పురుషులైనారు గదా! ఇప్పటికీ వారు ప్రజల మనస్సున సజీవులై యున్నారు.” అనిన మాటలు వినిన జరాసంధుడు “ధీమంతులారా! మీరు ఏది అడిగినా ఇస్తాను. అడగండి.” అనగా, శ్రీకృష్ణుడు జరాసంధునితో, 'ఓ మగధేశ్వరా! మీ దానశీలతయందు మాకు విశ్వాసం ఏర్పడింది. మేము నీతో మల్లయుద్ధం చేయాలని ఇష్టపడుతున్నాం. ఇదే మా కోరిక. అవకాశం ఇప్పించు. మేము బ్రాహ్మణులం కాదు. ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు, నేను వసుదేవుని పుత్రుడనైన కృష్ణుడను. నీవు మాతో ఎవ్వరితోనైనా మల్లయుద్ధం చేయవచ్చు.” అనగా జరాసంధుడు వికటాట్టహాసంతో ఇలా అన్నాడు. “ఎంత ఆశ్చర్యం! నన్ను ఎదిరించలేక, మధుర వీడి, సముద్రగర్భంలో తలదాచుకున్న వానితో ఈ మగధరాజు యుద్ధం చెయ్యడమా! సిగ్గు సిగ్గు. నీవు తప్పుకో. అర్జునుడు చిన్నవాడు. ఈ భీముడు నాకు సమానుడేమో చూస్తాను. వీడితోనే యుద్ధం చేస్తాను.” అని చెప్పి, రెండు గదలను తెప్పించి, ఊరిబయటకు అందరినీ తీసికొని వెళ్ళాడు.

భీముడు, జరాసంధుడు భూమి దద్దరిలేటట్లు కొట్టుకున్నారు. భయంకర పోరులో గదలు విరిగి పోయాయి. మల్లయుద్ధం మొదలైంది. ముష్టియుద్ధం చేశారు. గుద్దుకొన్నారు. ఎత్తి పడేసుకున్నారు. తన్నుకొన్నారు. ఎవరూ అలసిపోలేదు. ఇలా ఎంతకాలం జరిగిందో తెలియదు. జరాసంధుడు ఈలాటి దెబ్బలతో చావడని శ్రీకృష్ణుడికి తెలుసు. అక్కడే వుండి భీమునిపై తన దివ్యశక్తిని ప్రవేశ పెట్టేవాడు. ఇక ఈ యుద్ధాన్ని ముగించతలచి, శ్రీకృష్ణుడు భీమునకు ఒక సంకేతం ఇచ్చాడు. ఒక చెట్టుకొమ్మను నిలువుగా చీల్చి చూపించాడు. దాన్ని గ్రహించిన భీముడు జరాసంధుని నేలపై పడేసి, అతని ఒక కాలిని తన కాలితో తొక్కిపెట్టి, రెండవ కాలిని తన రెండు చేతులతో పట్టుకొని అతని శరీరాన్ని రెండు ముక్కలుగా వేసి, దూరంగా అటూ ఇటూ పారవేశాడు. దానితో అజేయుడైన జరాసంధుడు మరణించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుని కౌగలించుకొని ప్రస్తుతించారు.

శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడైన సహదేవుని రాజును చేశాడు. రాజులందరినీ విడుదల చేశాడు. ఆ రాజులు భగవానుని దర్శించి, ఆనంద భరితులైనారు. వారందరు ముక్తసంగులైన మునుల వలె బాధలన్నీ తొలగించుకొని భగవానుని ఇలా సేవించారు. “ఓ పద్మనాభా! వాసుదేవా! ఆశ్రితరక్షకా! శ్రీకృష్ణా! శ్రీహరీ! ఇందిరావల్లభా! అప్రమేయా! నీ కరుణచే

మేము విముక్తులమైనాం. కాని ఈ సంసార బంధాలనుండి విముక్తి లభించాల్సి ఉంది. ప్రభూ! నిరంకుశ పాలనచేసి, ఐహికమే నిత్యమని నమ్మి, పరమార్థాన్ని విస్మరించాం. నీ లీలావిలాసం చేత, మా అహంకారాలను పోగొట్టుకొని, నీవే శరణ్యమని తెలుసుకున్నాము, దేవా! మా రాజ్యాల్ని, సర్వస్వాన్ని, అపహరించిన జరాసంధునిపై మాకు కోపం లేదు. అతడు అలాగ చేసినందు వల్లనే కదా, ఇపుడు నీ దర్శనభాగ్యం పొందగలిగాం. ఈ లౌకిక భాగ్యాలన్నీ మాకు ఇప్పుడు తృణప్రాయంగా కన్పిస్తున్నాయి.శాశ్వత విముక్తిని ప్రసాదించే, మీ పాదాలే మాకు శరణ్యమని భావిస్తున్నాం.
 గోవిందా! దామోదరా! నీ పాదపద్మాలు మా హృదయాల్లో నిరంతరం నిలిచి వుండేటట్లు అనుగ్రహించు.” అని వేడుకొన్న రాజులతో శ్రీకృష్ణుడు ఇలాగన్నాడు. "రాజేంద్రులారా! రాజ్యాహంకారంతో గర్వించిన వేనుడు, నహుషుడు, రావణుడు మున్నగు రాజులు బ్రాహ్మణులను, ప్రజలను బాధించి, నశించిపోయారు. ధర్మపథంలో నడిచేవారికి సర్వం శుభప్రదంగా ఉంటుంది. సురాజ్యపాలన చేయండి. యజ్ఞయాగాదులు చేస్తూ, నాయందు భక్తి కలిగి ఉండండి. మీరు సమభావంతో రాజ్యపాలన చేస్తే, నన్ను చేరగలరు.” అని బోధించి, అందరికీ మంగళస్నానాలు చేయించి, వస్త్రాలు, కానుకలు, రథాలు, గోవులు, ఏనుగులు ఎవరివి వారికి ఇప్పించి, అందరినీ ఆనందంతో సాగనంపాడు పరమాత్మ.

భీమార్జునులతో కూడి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం చేరి, ధర్మరాజుకు మగధ విజయ వృత్తాంతం అంతా చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని అభినందించి, తమ్ముళ్ళను ఆలింగనం చేసుకొని, భీముని మిక్కిలిగా ప్రశంసించాడు.

  ఓం నమో వేంకటేశాయ




మండోదరి

 మండోదరి

                ➖➖➖


మండోద‌రి నిజానికి ఒక దేవ‌త‌. చాలా అంద‌గ‌త్తె.


ఒక‌సారి ఆమె కైలాసంలో శివ‌పార్వతుల‌ను ద‌ర్శించుకునేందుకు వెళ్లడమూ, అదే స‌మ‌యానికి పార్వ‌తీ దేవి త‌న కుమారుల‌ను చూసేందుకు ప‌క్క‌కు వెళ్లడమూ జరిగాయి. అప్పుడు మండోద‌రి చూపు శివుడిపై ప‌డింది. 


ఈ విషయాన్ని గ్రహించిన పార్వ‌తీదేవి మండోద‌రిని క‌ప్ప‌గా మార‌మ‌ని శాపం పెడుతుంది. 


ఆమె క‌ప్ప‌గా మారాక పార్వ‌తి ఆమెను బావిలో ప‌డేస్తుంది.


 మండోద‌రి అస‌లు పేరు మ‌ధుర‌. కానీ శాపవ‌శాన క‌ప్ప‌గా మార‌డం వ‌ల్ల ఆమెకు మండోద‌రి అనే పేరు వ‌చ్చింది.


అయితే శివుడు మండోద‌రికి 12 ఏళ్ల త‌రువాత శాప విముక్తి అవుతుంద‌ని, అనంత‌రం ఆమె మునుప‌టిలాగే అందగత్తె అవుతుందని చెబుతాడు. 


12 ఏళ్లు పూర్త‌ైన మండోద‌రికి శాప విముక్తి అవుతుంది. కానీ బావిలోనే ఉండి స‌హాయం కోసం పిలుస్తుంది. 


అదే స‌మ‌యానికి అటుగా వ‌చ్చిన మ‌యాసురుడు, అత‌ని భార్య హేమలు మండోద‌రి అరుపులు విని బావి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చూస్తారు.


అనంత‌రం వారు మండోద‌రిని బావి నుంచి ర‌క్షిస్తారు.


అయితే వారు మండోద‌రిని త‌మకు దేవుడిచ్చిన పుత్రిక‌గా భావించి త‌మ‌తో ర‌మ్మంటారు.


ఆమె వారితో వెళ్లిపోతుంది


త‌రువాత కొంత కాలానికి రావ‌ణుడు మండోద‌రిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని మ‌యాసురున్ని అడుగుతాడు.


అందుకు అతను ఒప్పుకోగానే ఇద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంది.


ప్ర‌స్తుతం జోధ్‌పూర్‌లో ఉన్న మండోర్ అనే ప్రాంతాన్ని మండోద‌రి జ‌న్మ‌స్థ‌లం అని చెబుతారు.


రావ‌ణున్ని పెళ్లి చేసుకున్నాక ఆమె అత‌నితో క‌లిసి లంక‌కు వెళ్తుంది.


రావ‌ణుడు క్రూరుడు. కానీ అత‌ని భార్య మండోద‌రి చాలా అణ‌కువ క‌లిగిన‌, జాలి, ద‌య ఉన్న వ్య‌క్తి.


సీత‌ను అప‌హ‌రించుకు వ‌చ్చాక ఎంత చెప్పినా సీత రావ‌ణుడితో ఉండేందుకు అంగీక‌రించ‌దు. సీత‌ను రావ‌ణుడు చంపాల‌ని చూస్తాడు. కానీ మండోద‌రి వ‌ద్ద‌ని వారిస్తుంది.


సీత కోసం హ‌నుమంతుడు లంక‌కు వ‌చ్చిన‌ప్పుడు మండోద‌రిని చూసి సీత అని భ్ర‌మిస్తాడు.


కానీ సీత అయితే    అంతఃపురంలో సంతోషంగా ఎందుకు ఉంటుంది? అని అనుమానం వ‌చ్చి లంకంతా గాలించి సీత‌ను వెదికి ప‌ట్టుకుంటాడు.


మండోద‌రికి ముగ్గురుకుమారులు. మేఘ‌నాథుడు, అక్ష‌య కుమారుడు, అతికాయుడు.


సీత‌ను వ‌దిలేయ‌మ‌ని, రాముడికి అప్ప‌గించ‌మ‌ని మండోద‌రి చెబుతుంది. అయిన‌ప్ప‌టికీ రావ‌ణుడు వినిపించుకోడు.


రావ‌ణుడు చ‌నిపోయాక మండోద‌రి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటుంది. కానీ రాముడు వారిస్తాడు.


పాపాల‌ను హ‌రించే పంచ‌క‌న్య‌ల‌లో మండోద‌రి ఒక క‌న్య అని చెబుతారు.......🙏

🙏\|/🙏 శ్రీనివాసుని చేత తాతా అని పిలిపించుకున్న భక్తుడు 🙏\|/🙏

 

🙏\|/🙏 శ్రీనివాసుని చేత తాతా అని పిలిపించుకున్న భక్తుడు 🙏\|/🙏 

🙏🌹🪷\|/🪷🌹\|/🌹🪷\|/🪷🌹🙏 


🙏\|/తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. 


🙏\|/ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి?


🙏\|/పూర్వం శ్రీరంగంలో యామునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో  వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. 


🙏\|/ఆయనను శ్రీశైలపూర్ణులు అని కూడా అంటారు. 


🙏\|/ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. 


🙏\|/ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. 


🙏\|/వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది.నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు.


🙏\|/ ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే...


🙏\|/బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. 


🙏\|/కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు.


🙏\|/ ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... 


🙏\|/వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు.


 🙏\|/ఆకాశగంగ అలా వచ్చింది.


🙏\|/ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’

అని పురమాయించారు.


 🙏\|/ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. 


🙏\|/అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. 


🙏\|/అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసారు స్వామి వారు.


🙏\|u/ఏడుకొండలవాడా... వేంకటరమణా... 

గోవిందా గోవింద...

23, జూన్ 2024, ఆదివారం

నవగ్రహాల అనుగ్రహం కోసం..??

నవగ్రహాల అనుగ్రహం కోసం..?? 

సూర్యడు 
🌞 ఆదివారానికి అధిపతి సూర్యడు. సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి, ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిచ్చుట శుభము.

చంద్రుడు 
🌞 సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేయుట మంచిది. అన్యోన్య దాయకమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజ, అభిషేకములు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజ చేసి ఉపవాసం ఉండటం శుభము. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి. చంద్ర హోర లో దానము శుభము.

కుజుడు 
🌞మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేకంగా తమలపాకు మరియు సింధూర పూజ చేయాలి. ఎర్రటి దుస్తులు, ఎర్రటి పూలు ఉపయోగించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువుకోవాలి. కందులు దానమివ్వాలి.

బుధుడు 
🌞 బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజ చేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు పెసలు, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

బృహస్పతి 
🌞 గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞాన సముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, శనగలు వంటివాటిని దానమివ్వాలి.

శుక్రుడు 
🌞శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. 

శనిశ్వరుడు 
🌞 శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. నూనెతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి.

రాహువు 
🌞నీలం మరియు నలుపు రంగుల దుస్తులను దానం చేయడం మంచిది. ఈ చర్య రాహువును ప్రసన్నం చేస్తుందని మరియు ప్రయోజనకరమైన ఫలితాలను తెస్తుందని భావిస్తారు. ఆదివారం రోజున గోధుమలు, బెల్లం లేదా రాగిని దానం చేయడం మంచిది.

కేతువు 
🌞 గణేశుడిని రోజూ పూజించడం వల్ల, కేతువు యొక్క దుష్ప్రభావాల నుండి దూరంగా ఉండవచ్చని నమ్ముతారు. కేతు మహాదశ సమయంలో స్థానికులు ఎదుర్కొనే సమస్యలను గణేశుడు మాత్రమే పరిష్కరించగలడని చెబుతారు.

🌹🌹👉🌹🌹👉

*శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం*

ఓం ఆంజనేయాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం హనుమతే నమః |
ఓం మారుతాత్మజాయ నమః |
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః |
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః |
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః |
ఓం సర్వమాయావిభంజనాయ నమః |
ఓం సర్వబంధవిమోక్త్రే నమః |
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః ౧౦ 

ఓం పరవిద్యాపరీహారాయ నమః |
ఓం పరశౌర్యవినాశనాయ నమః |
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః |
ఓం పరయంత్రప్రభేదకాయ నమః |
ఓం సర్వగ్రహవినాశినే నమః |
ఓం భీమసేనసహాయకృతే నమః |
ఓం సర్వదుఃఖహరాయ నమః |
ఓం సర్వలోకచారిణే నమః |
ఓం మనోజవాయ నమః |
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః ౨౦ 

ఓం సర్వమంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వయంత్రాత్మకాయ నమః |
ఓం కపీశ్వరాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం సర్వరోగహరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం బలసిద్ధికరాయ నమః |
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః |
ఓం కపిసేనానాయకాయ నమః ౩౦ 

ఓం భవిష్యచ్చతురాననాయ నమః |
ఓం కుమారబ్రహ్మచారిణే నమః |
ఓం రత్నకుండలదీప్తిమతే నమః |
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః |
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః |
ఓం కారాగృహవిమోక్త్రే నమః |
ఓం శృంఖలాబంధమోచకాయ నమః |
ఓం సాగరోత్తారకాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః ౪౦ 

ఓం రామదూతాయ నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం వానరాయ నమః |
ఓం కేసరిసుతాయ నమః |
ఓం సీతాశోకనివారకాయ నమః |
ఓం అంజనాగర్భసంభూతాయ నమః |
ఓం బాలార్కసదృశాననాయ నమః |
ఓం విభీషణప్రియకరాయ నమః |
ఓం దశగ్రీవకులాంతకాయ నమః |
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః ౫౦ 

ఓం వజ్రకాయాయ నమః |
ఓం మహాద్యుతయే నమః |
ఓం చిరంజీవినే నమః |
ఓం రామభక్తాయ నమః |
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః |
ఓం అక్షహంత్రే నమః |
ఓం కాంచనాభాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం మహాతపసే నమః |
ఓం లంకిణీభంజనాయ నమః ౬౦ 

ఓం శ్రీమతే నమః |
ఓం సింహికాప్రాణభంజనాయ నమః |
ఓం గంధమాదనశైలస్థాయ నమః |
ఓం లంకాపురవిదాహకాయ నమః |
ఓం సుగ్రీవసచివాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం దైత్యకులాంతకాయ నమః |
ఓం సురార్చితాయ నమః |
ఓం మహాతేజసే నమః ౭౦ 

ఓం రామచూడామణిప్రదాయ నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం పింగళాక్షాయ నమః |
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః |
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః |
ఓం విజితేంద్రియాయ నమః |
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః |
ఓం మహిరావణమర్దనాయ నమః |
ఓం స్ఫటికాభాయ నమః |
ఓం వాగధీశాయ నమః ౮౦ 

ఓం నవవ్యాకృతిపండితాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సంజీవననగాహర్త్రే నమః |
ఓం శుచయే నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం దృఢవ్రతాయ నమః |
ఓం కాలనేమిప్రమథనాయ నమః ౯౦ 

ఓం హరిమర్కటమర్కటాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం శతకంఠమదాపహృతే నమః |
ఓం యోగినే నమః |
ఓం రామకథాలోలాయ నమః |
ఓం సీతాన్వేషణపండితాయ నమః |
ఓం వజ్రదంష్ట్రాయ నమః |
ఓం వజ్రనఖాయ నమః ౧౦౦ 

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః |
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః |
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః |
ఓం శరపంజరభేదకాయ నమః |
ఓం దశబాహవే నమః |
ఓం లోకపూజ్యాయ నమః |
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః |
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః ౧౦౮ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏

నవగ్రహాల ప్రదక్షిణం ఎలా చేయాలి..??

నవగ్రహాల ప్రదక్షిణం ఎలా చేయాలి..?? 


🙏నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. నవగ్రహ ప్రదక్షిణలకు కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మనిషి మనుగడ, వారి జీవన విధానం, మానసిక స్థితిగతులు అన్నీ ఈ నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి. 

🙏జీవితంలోని అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. ఈ ప్రదక్షిణలు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

🙏 నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళతాం కదా.. లోపలికి వెళ్లాక ఎడమ వైపు నుంచి.. అంటే క్లాక్ వైజ్ కుడి వైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. కుడి భాగం సూర్యుడికి, ఎడమ భాగం చంద్రుడికి సంబంధించినవిగా భావించాలి.

🙏 అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహాల ప్రతిమలను తాకుతుంటారు. అలా తాకకూడదు. తాకకుండానే ప్రదక్షిణలు పూర్తి చేయాలి.

🙏 తొమ్మిది ప్రదక్షిణలూ పూర్తయ్యాక కుడి వైపు నుంచి ఎడమ వైపు.. అంటే బుధుడి వైపు నుంచి రాహు, కేతువులను ధ్యానిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

🙏 మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణలలోనూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో గ్రహాన్ని స్మరించుకోండి.

🙏 ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక నవగ్రహాలకు మీ వీపును చూపించకుండా మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. చాలా మంది ఇలా చేయరు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

🙏 శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన మండపం ఉంటుంది. మనం గుడిలోకి వెళ్లగానే ముందు మూల విరాట్టును దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే నవ గ్రహః దర్శనానికి వెళ్లాలి.

🙏నవగ్రహాల ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ '
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: ''

🙏అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేయాలి. 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు.. అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 

🙏రాహుకేతువులకు ప్రత్యేకంగా ఎందుకంటే అవి ఛాయా గ్రహాలు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాలు. రాహుకేతువులను సంతృప్తి పరచడం వల్ల మన జీవితంలో ఒడుదొడుకులు ఉండవు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా రాశ్యాధిపతులైన నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది. 

🙏తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అపసవ్యంగా అంటే ఇంతకుముందు మీరు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడంవల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. 

🕉️🕉️🕉️🕉️🌹🌹🕉️🕉️🕉️🕉️

గంగావతరణం

గంగావతరణం

శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.

సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు.ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.ఆదిత్యయోగీ..

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.ఆదిత్యయోగీ..
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్ర మయినది.....🙏🙏🙏🙏*
.

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం: ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు,j పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య"
" న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా "
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
       ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.
ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.
ఇరవైనాలుగు అక్షరములు - దేవతలు
1. తత్ – గణేశ్వరుడు- వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. స - నృసింహ భగవానుడు: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. వి - విష్ణుదేవుడు: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
4. తుః - శివదేవుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. వ - కృష్ణ భగవానుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
6. దే - రాథా దేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
7. ణ్యం - లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
8. భ - అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
9. ర్గః – ఇంద్రదేవుడు- మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. దే - సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. వ - దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. స్య - హనుమంతుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. ధీ – పృధ్వీదేవి-భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. మ - సూర్యదేవుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. హి - శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. ధి - సీతామాత: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. యో - చంద్రదేవుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యో - యమదేవుడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. నః - బ్రహ్మదేవుడు: సకల సృష్టికి అధిష్ఠాత.
20. ప్ర - వరుణదేవుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. చో - నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. ద - హయగ్రీవ భగవానుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. యా - హంసదేవత: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. త్ - తులసీదేవి: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
       ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.
      గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.
       వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.

త్రిశంకు స్వర్గం*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
       
               *త్రిశంకు స్వర్గం*
                 ➖➖➖✍️
```
విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలా సేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్టుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేసాడు.

విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక “మహారాజా! మీరు, మీ పరివారమూ బాగా డస్సినట్టున్నారు. త్వరగా స్నానాదికాలు కానివ్వండి. భోజనం చేద్దురుగాని"  అన్నాడు వశిష్టుడు.

మహారాజు,ఆయన సేవకులు స్నానాలు పూర్తిచేసి వచ్చేసరికి రకరకాల పిండివంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో యిన్ని వంటకాలు యీ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్టుడి దగ్గరకు వెళ్ళి “స్వామీ షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు?" అని అడిగాడు.

తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని "నందిని" అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు.

విశ్వామిత్రుడికి పేరాశ కలిగింది.

ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. "విరాగీ! నీ కామధేనువును నాకివ్వు. బదులుగా నీకు శ్రేష్ఠమైన కోటి పాడి ఆవుల్ని ఇస్తాను" అన్నాడు విశ్వామిత్రుడు.

వశిష్టుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు.

విశ్వామిత్రుడికి కోపం వచ్చి... "రాజ్యంలోని సమస్త వస్తువులూ సకల సంపదలూ మహారాజుకే చెందుతాయి. రాజే అన్నిటికీ అధిపతి" అన్నాడు.

వశిష్టుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళెర్రజేసి బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళబోయాడు.

వశిష్టుణ్ణి వదలి వెళ్ళటం ఇష్టంలేని నందిని తోక ఝుళిపిస్తూ, కొమ్ములు విసురుతూ, ముంగాళ్ళపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోరయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది. ఓడిపోయారు.

ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్టుడితో యుద్ధానికి తలపడ్డాడు.

విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్టుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం, అధికారం, అంగబలం, ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి.

విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై, ఖిన్నుడై రాజనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు.

అయితే అప్పటినుంచీ ఆయనలో వశిష్టుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కాని లేశమైనా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన, అన్వేషించని మార్గాలూ లేవు.

రాజుకన్నా, రాజ్యాధికారంకన్నా తపశ్శక్తి గొప్పదని, తాపసులు దైవసమానులనీ, మహర్షులు తలచుకుంటే యీ పృథ్వి మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు.

రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు.

నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్నీ, అద్భుతశక్తుల్నీ సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్నకొద్దీ వశిష్టుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది.
*************

సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్టుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు.

ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్టుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ                ఆ యాగంలో పాల్గొనలేదు.

విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తిచేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్ళాడు.

తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు.

ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని , కోపగించి, త్రిశంకుణ్ణి కిందకు ఒక్కతోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేలమీదకు వచ్చిపడుతూ "విశ్వామిత్రా రక్షించు" అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు.

విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపివుంచి, అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. (దీనినే త్రిశంకు స్వర్గం అంటారు)కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణీ, దేవతలనూ సృష్టించ బోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు.

ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

ఇంద్రుడు తక్షణమే బంగరు విమానాన్ని తీసుకు వచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
🕉️🕉️🕉️🌹🕉️🕉️🕉️🌹🕉️🕉️🕉️

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 1 ॥

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 2 ॥

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 3 ॥

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 4 ॥

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 5 ॥

దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 6 ॥

పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 7 ॥

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 8 ॥

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 9 ॥

తిరుమల - నడకదారులు

తిరుమల - నడకదారులు

తిరుమల శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఉన్న నడకదారులు వాటి వివరాలు తెలుసుకుందాం

ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు.

తాళ్ళపాక అన్నమాచార్యులు అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు . అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి.

మొదటి మెట్టు

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. దూరం 11- 12 కి.మీ లు ఉంటుంది.

రెండవ దారి

తిరుపతి కి 10 కి.మీ ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.

చంద్రగిరికి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు. కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి ఎక్కువగా తెలీదు.

మూడవ దారి

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

నాల్గవ దారి

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ఉంది... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం నుండి వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి

కల్యాణి డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 కి.మీ.

ఐదవ దారి

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 కి.మీ.

ఆరవ దారి

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

తలకోన

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేట దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

తిరుమల గురించి మరికొన్ని విషయాలు

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద విజయనగర రాజులు మెట్లు నిర్మించారు. ఆ తర్వాత అలిపిరి నుండి- గాలి గోపురం వరకు మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..
అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

ఆంజనేయస్వామి

గాలిగోపురం లోపలికి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి,అక్కడినుండి అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట 

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య జగజ్జనని పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.. 🙏🙏🙏🙏🙏🙏

ఆత్మలతో మాట్లాడుతాను

https://youtu.be/9D33Q_78d9g?si=7Fo2-5kHCSg7dcxr

హనుమాన్ చాలీసా (తెలుగు)*_గానం : శ్రీ M. S. రామారావుగారు.

_*హనుమాన్ చాలీసా (తెలుగు)*_
గానం : శ్రీ M. S. రామారావుగారు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*శ్రీరామ జయరామ జయజయరామ*
*శ్రీరామ జయరామ జయజయరామ*
*శ్రీరామ జయరామ జయజయరామ*

*ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం*
*లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహమ్*

*హనుమాన్ అంజనాసూనుః వాయు పుత్రో మహాబలః*
*రామేష్ఠః ఫల్గుణసఖః, పింగాక్షో అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్య మృత్యుభయంనాస్తి సర్వత్ర విజయీభవేత్*

శ్రీ హనుమాను గురుదేవు చరణములు!
ఇహపర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు ॥ శ్రీ ॥

జయ హనుమంత జ్ఞానగుణ వందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మండిత కుంచిత కేశ ॥ శ్రీ ॥

రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలము జేసిన ॥శ్రీ॥

సీతజాడగని వచ్చిన నినుగని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్త్ర రీతుల నిను కొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ

వానర సేనతో వారధి దాటి
లంకేసునితో తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసన గూల్చిన ॥ శ్రీ ॥

లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీ రామబాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురులేని ఆ లంకాపురమున
ఏలికగా విభిషను జేసిన ॥ శ్రీ ॥

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగి పొరలె 

సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతు పదం నీ హృదయం
రామచరిత కర్ణామృత గాన
రామనామ రసామృత పానా ॥ శ్రీ ॥

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీకృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న

రామద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీనామ జపము విని ॥ శ్రీ ॥

ధ్వజాది రాజా వజ్ర శరీరా
భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీకీర్తి గానముల ॥ శ్రీ ॥
   
సోదర భరత సమానా యని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడ వన్నా
అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ది నవనిధులకు దాతగ
జానకీ మాత దీవించెనుగా
రామరసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసిన  శ్రీ

నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దు:ఖ భంజన
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ॥ శ్రీ ॥

శ్రద్ధగ దీనిని అలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగ గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న 
ఓ హనుమన్నా!

 *మంగళహారతి* 

మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలువో అనంత
నీవే అంతా శ్రీ హనుమంతా!!!!!

     *ఓం శాంతి: శాంతి: శాంతి:*

*శ్రీరామ జయరామ జయజయరామ*
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

చాలీసా*. అంటే ఏమిటి?

*చాలీసా*.     అంటే ఏమిటి? 
జ. ఈస్తోత్రంలో  40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)

2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.* 

3. ఆంజనేయ - అర్థం?
జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.

4. తులసీదాస్ అస్సలు పేరు ?
జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.

5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?
జ. దేవుళ్ళ భార్యలను,  మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య  వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.

6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?
జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.

7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?
జ.  తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా  అర్ధం  చేసుకోవాలి.

8. హనుమంతుని పంచముఖములు ఏవి?
జ.  హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....
తూర్పున వానర ముఖం  జన్మతః  వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం  గరుడ ముఖం  అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం  వరాహ ముఖం  అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు  వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది🙏🙏🙏🙏

9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం  అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.

10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.

11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం  వచ్చినపుడు, ఎవరైనా  గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.

12. రాక్షస సంహారానికై  హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం  చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి  నారదుని ద్వారా  హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ  ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.

13 . రామకార్యం  చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం  స్వీకరించకుండా వెళ్ళడంలో.

14 . సీతారాములు పట్టాభిషేక  అనంతరం  హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన  అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని  బహుమతిగా  ఇచ్చాడు.

15.  కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ  అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం)  పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా  తేజస్వరూపుడు అని అర్థం.

16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏

17. హనుమ రామదూత ఎలా అయ్యాడు  ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా  వెళ్ళి  సీతమ్మ కు ఇచ్చాడు. వేదం  అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  
అగ్ని ముఖావై దేవాః. 
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు  దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం  అంటే  సృష్టి  క్రమంలో  ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి  వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో  పోల్చారు. అగ్ని ఏవిధంగా  అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను  పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు  హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.

18 . అతులిత బలధామా  అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో  పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే  సీతాన్వేషణ కై హనుమని  ఎంచుకోవడం.

19 . ఇంతకూ  హనుమ కేసరి నందనుడా?  వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు  సూర్య  నాడి ద్వారా  వాయుదేవుడు  సర్వ దేవతా తేజస్సు  ప్రవేశ  పెట్టాడు కాబట్టి  ఇద్దరికీ.

20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో  తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.

21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని  తానే  నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 

22 . ఆ రోజులలో ఉన్న వానరుల  ప్రత్యేకత ఏమిటి? 
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.

23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.

24 . విక్రమ  అంటే  అర్థం  ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.

25. సూక్ష్మరూపం  ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా  ప్రవేశ సమయంలో  పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ  ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .

26. వికటరూపం  అంటే  ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో  చూపుతాడు.

27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో  హనుమ  తత్వాన్ని చూస్తాము.

28. భీమరూపధారిగా  ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .

29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో  దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని  రావణుడు భయపడాలి అని  భావించి లంకా దహనం చేసాడు.

30. అశోకవన నాశనానికి ప్రతిగా  రావణుడు హనుమకి  ఇచ్చిన దండన ఏది? 
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక  తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని  చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .

31. రఘువీరుడు ఎందుకు  సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం  వల్ల  లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.

32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.

33. భీముడు హనుమని  కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం  చూపమని  అడుగుతాడు.

34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం  నేర్చుకున్నపుడు,  అశోకవనంలో సీతమ్మ దగ్గర  మొత్తం మూడు సార్లు తనమహత్  రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏

35. హనుమంతుని జన్మదినం  రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ  బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో  చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.

36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.

 37. భజరంగీ అంటుంటాం - ఎందుకు? 
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.

38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో  రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం  లేక  వినడు కానీ అక్కడే ఉండి  విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహ రచన.
39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు  రాళ్లతో  కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని  సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం  వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు  నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి  అలా కారణమై నాడు.

యుద్ధసమయంలో  అర్జునుడు కృష్ణునితో  అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని  ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం  వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏

40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.

41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని  గురించి చెప్పేదే సుందరాకాండ.

పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.

హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. 

పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* . 

42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే  హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని  చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.

43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?

జ.  *బ్రహ్మ పదవి.* 

పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ  నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది  బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా  బ్రహ్మ లోకం వెళ్లి  బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ  దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో  మన గా  చూస్తే  అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక  ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.

 బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.

తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు  రాబోయే  కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.

*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.* 
20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు .

.అటువంటి హనుమకు బ్రహ్మతో సహా  మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.🙏🙏

 *రామ లక్ష్మణ జానకి జై బోలో* *హనుమాన్ 🍊🪻🪷🌺🌸🍓🍒🌻🍌🍋🥥🍎🍅* ,