23, జనవరి 2026, శుక్రవారం

బ్రహ్మకుమరీస్ భాగోతం

*జాగ్రత్త బ్రహ్మకుమారీస్ వలన హిందువులకు జరిగే నష్టాలు* 

*-బొట్టు పెట్టుకోకూడదు*

*-తెల్లని చీరలు ధరించాలి*

*-ఆలయాలలో ప్రసాదం తినకూడదు.*

*-హిందూ దేవతలను కేవలం సామాన్య మనుసష్యులుగా భావించాలి.*

*-పెళ్ళి చేసుకోరాదు.*

*-చేసుకున్నా పిల్లల్ని కనరాదు...*

*-ఒక వేళ పిల్లలు ఉంటే వాళ్లకు పెళ్ళి చేయకుండా మా సంస్థ సభ్యులుగా మార్చాలి.*

*-శివలింగం పై ఎల్ఈడి బల్బ్ పెట్టి బల్బ్ ని మాత్రమే పూజించాలి.*

*-భార్య, భర్తను అన్నా అని, భర్త, భార్యను అక్కా అని పిలుచుకోవాలి...*

*-కొంతమంది రాఖీలు కూడా కట్టుకోవడం విడ్డూరం...*

*-కృష్ణుడు గీత చెప్పలేదు...*

*-ఆలయాల్లో స్టాల్స్ పెట్టి అందరికి దేవుడు ఒక్కడే అని చెప్పాలి... ఎందుకంటే హిందువులు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి.*

*-చర్చ్ మరియు మసీదులకు వెళ్లే వారికి జ్ఞానాన్ని భోదించారాదు, ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉంది...*

*-వ్యాస, వశిష్ఠ లాంటి ఋషులు అజ్ఞానులు...*

*-జీసస్, ప్రవక్త లాంటి వారు ధర్మాత్ములు...*

*-ఇస్లాం ధర్మం చెప్పినట్టు సృష్టి ని కాదు, సృష్టి కర్తను పూజించండి...*

*-అన్నింటికీ మించి ఏటువంటి గ్రంథ ప్రమాణంలేని వ్యాఖ్యానాలు, బోధనలు వీళ్ళ అజెండా*

*ఇదీ బ్రహ్మకుమారిస్ అనే హిందూ వ్యతిరేకి సంస్థ*

3, డిసెంబర్ 2025, బుధవారం

*తిరుపతి యాత్రలో చూడవలసిన దేవాలయాల జాబితా.*🙏🙏🙏🙏

*తిరుపతి యాత్రలో చూడవలసిన దేవాలయాల జాబితా.*
🙏🙏🙏🙏

*తిరుమల*
01 - వరాహ స్వామి
02 - వెంకటేశ్వర స్వామి
03 - చక్ర తీర్థం
04 - శిలాతోరణం
05 - బేడి ఆంజనేయ స్వామి  మందిరము
06 - ఆంజనేయ స్వామి మందిరము
07 - లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం
08 - జాపాలి ఆంజనేయ స్వామి దేవాలయం
09 - పాపనాశనం
10 - ఆకాశ గంగ

తిరుపతి
----------------------------------------------
*తిరుపతి లోకల్*

01 - కపిల తీర్థం తిరుపతి
02 - గోవింద రాజ స్వామి మందిరము
03 - ఇస్కాన్ ఆలయం
04 - తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం
05 - శ్రీ కల్పకాంబిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
06 - శ్రీ కన్యక  పరమేశ్వరి ఆలయం
07 - శివ నాగేంద్ర స్వామి  మందిరము
08 - శ్రీ రాధా కృష్ణ మందిరము
09 - సిద్ధి బుద్ధి వినాయక మందిరము
10 - కోదండ రామాలయం
----------------
*తిరుపతి పరిసర ప్రాంతాలు*

01 - తిరుపతి నుండి తిరుచానూరు 5.3                                కి.మీ(అలిమేలుమంగ)
02 - తిరుపతి నుండి వకుళమాత  ఆలయం 8.1 కి.మీ
03 - తిరుపతి నుండి శ్రీనివాసుడి  మంగాపురం 10.6కి.మీ
04 - తిరుపతి టు లలిత    పీఠం 11 కి.మీ                             (శ్రీనివాస్ దగ్గర మంగాపురం)
05 - తిరుపతి టు అగస్తేశ్వరాలయం 11.1 కి.మీ
06 - తిరుపతి టు అప్పలాయగుంట 18.9 కి. మీ      (అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం)
07 - తిరుపతి నుండి గుడిమల్లం 30.4 కి.మీ
08 - తిరుపతి టు   తొండమాన్పురం 33.7 కి.మీ                    (కాళహస్తి దగ్గర)  (శ్రీదేవి భూదేవి   సమేత ప్రసన్న             వెంకటేశ్వర స్వామి)
09 - తిరుపతి నుండి కాళహస్తి  38.7 కి.మీ                           (శ్రీ కాళహస్తీశ్వర  మందిరము)
10 - తిరుపతి టు నారాయణ వనం 40.8 కి.మీ
11 - తిరుపతి నుండి కాణిపాకం 64.9 కి.మీ
12 - తిరుపతి టు
      వేదనారాయణ దేవాలయం,నాగులాపురం 65.8 కి.మీ
13 - తిరుపతి నుండి అరగొండ    (అర్దగిరి) 75.5 కి.మీ
14 - తిరుపతి టు
   పల్లికొండేశ్వర స్వామి ఆలయం, సూరటపల్లి 76.7 కిమి.

*తిరుపతి నుండి తమిళనాడు*

01 - తిరుపతి నుండి తిరుత్తణి
      69.3 కి.మ(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి)
02 - తిరుపతి నుండి వెల్లూరు
      గోల్డెన్ టెంపుల్,  శ్రీపురం 115.1 కి.మీ
03 - తిరుపతి నుండి కాంచీపురం
        113.5 కి.మీ (విష్ణు కంచి / కామాక్షి / శివ కంచి)

*తిరుపతిలో లోకల్ దేవాలయాలు చూడటానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక ప్యాకేజీ కలదు. విష్ణు నివాసం మరియు శ్రీనివాసం ఉన్న కౌంటర్ నందు సంప్రదించండి.
🪷🪷🪷🪷🪷 ఓం నమో శ్రీ వేంకటేశాయ 
🙏🙏🙏🙏

23, అక్టోబర్ 2025, గురువారం

హిందువుగా మనం అనుసరించాల్సిన నియమాలు

హిందువుగా మనం అనుసరించాల్సిన నియమాలు
🌸🌸🌸🌸🌸🌸🌸
1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.

6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.

7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.

11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.

12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.

18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.

19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.

20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.

21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.

22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.

27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.

30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.

31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.

32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.ఆదిత్యయోగీ.

34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు.నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడాలి.ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.

36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.

38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.

39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.

40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.

41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.

42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.

43. ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.

46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.

47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.

48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.

50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.

51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.

55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.

56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.ఆదిత్యయోగీ.

85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

91. దిగంబరంగా నిద్రపోరాదు.

92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.

96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి..*
.

మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి,
 పక్కవాళ్ళల్లో చెడుని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే 
వినేవాళ్ళ దృష్టిలో , మనమే చెడ్డవాళ్లుగా కనిపిస్తాం!

వ్యసనం అనేది మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది.విజ్ఞానం అనే వ్యసనం మాత్రం ఆకాశమంత ఎత్తు ఎదిగేలా చేస్తుంది పుస్తుకం హస్త భూషణం కాదు మస్తక భూషణం కావాలి
తెలిసి మసలుకోండి సన్నిహితులారా
అనుకున్నది సాధించడానికి ఇష్టపడాలి , కష్ట పడాలి.అసాధ్యమైంది సాధించడానికి ఇష్టం , కష్టం తో పాటు చెయ్యగలనన్న విశ్వాసం ఉండాలితెలిసి మసలుకోండి సన్నిహితులారా.....*
.

27, సెప్టెంబర్ 2025, శనివారం

*మరణం ఇంత గొప్పదా!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         *మరణం ఇంత గొప్పదా!* 
                 ➖➖➖✍️

*[మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలో..! అదేంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథ చదవండి...]*
```
       
ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి _ “ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి” అని అడిగాడు. 

అప్పుడా సన్యాసి “ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు.”అని చెప్పాడు.
      
రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. 

రాజు కారణం అడగగా...
“నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు. గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను.”
     
రాజు ఆలోచించాడు... “అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి?” నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. “నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలపండి"_ అని.
       
సన్యాసి ఇలా అన్నాడు... “సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు.”
       
రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.
       
నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. 

వారిలో ఒకరు _ “నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు... “నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.
      
రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...
“మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు.” అన్నాడు.
        
అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...
“మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది.”```

        
*"మరణాన్ని నివారించే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది.* ```

*1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది ‘తీర్థ స్నానం’(పవిత్ర స్నానం) లాగా ఉంటుంది.
 
*2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ‘ప్రసాదం’ అవుతుంది.
 
*3. నడిచేటప్పుడు జపిస్తే అది ‘తీర్థయాత్ర’ లాగా ఉంటుంది.
 
*4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే ‘మహా ప్రసాదం’ అవుతుంది.
 
*5. నిద్రించే ముందు జపం చేస్తే ‘ధ్యాన నిద్ర’ లాగా ఉంటుంది.

*6. పనిచేసేటప్పుడు జపిస్తే అది ‘భక్తి’ అవుతుంది.
 
*7.ఇంట్లో జపిస్తే ఇల్లు ‘దేవాలయం’ అవుతుంది..✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015
🙏🙏🙏🙏

21, జులై 2025, సోమవారం

*🙏నవగ్రహ స్తోత్రములు*(తాత్పర్య సహితము)🙏

*🙏నవగ్రహ స్తోత్రములు*
(తాత్పర్య సహితము)🙏


🙏 *నవగ్రహస్తోత్రం* 🙏

*ఆదిత్యాయ చ సోమాయ*
*మంగళాయ బుధాయ చ*
*గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!!*


🕉️ *01. రవి (ఆదిత్య):* 🙏

*జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్!*
*తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!*

*భావము:* 🌹

*దాసనచెట్టుపువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు, కాశ్యప వంశంలో జన్మించినవాడు, గొప్ప కాంతి కలవాడు, చీకటికి శత్రువు, అన్ని పాపములను పోగొట్టేవాడు అయిన సూర్యభగవానునికి నమస్కరించుచున్నాను.*


🕉️ *02. చంద్ర (సోమ):* 🙏

*దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!*
*నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్!!*

*భావము:* 🌹

*పెరుగు, శంఖము, మంచు మొదలైనవాటి తెలుపురంగుతో సమానమైన తెలుపురంగు కలవాడు,  పాలసముద్రం నుండి పుట్టినవాడు, శివుని యొక్క కిరీటము నందు అలంకారమైనవాడు, కుందేలు గుర్తుగా కల్గినవాడు, ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన (స+ ఉమ=సోమ) సోమునికి నమస్కరించుచున్నాను.*

*విశేషము:* 🌈

*చంద్రమా మనసో జాతః...* 
భగవంతుని మనస్సు చంద్రుడు.. . 
శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకు బలం కలుగుతుంది.

🕉️ *03. కుజ (మంగళ):* 🙏

*ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్!*
*కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్!!*

*భావము:* 🌹

*భూమికి జన్మించినవాడు, మెఱుపు వంటి కాంతి కలవాడు, బాలుడు, శక్తి అనే ఆయుధం హస్తము నందు కలవాడు, శుభములను, క్షేమమును ప్రసాదించే అంగారకుని (కుజుని) కి నమస్కరించుచున్నాను.*

*విశేషాలు:* 🌈

1. *శక్తి హస్తమందు కలవాడు.*
(1. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,  
2. ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము 
3. సత్వము, రజస్సు, తమస్సు 
అను శక్తులను తన అధీనమందు కలిగినవాడని తాత్పర్యం.) 

2. *భూమికి జన్మించినవాడు*
మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి కుమారుడు. ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు.


🕉️ *04. బుధ:* 🙏

*ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్!* 
*సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.*

*భావము:* 🌹

*ప్రేంకణపు చెట్డు అనగా కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సోముడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరింతును.*

*విశేషం:* 🌈
✅👉 *బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.*


🕉️ *05. గురు:* 🙏

*దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |* 
*బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||*

*భావము:* 🌹

క్రీడించేవారిని దేవతలంటారు. అటువంటి దేవతలకు; జ్ఞానము యొక్క సారము పొందినవారు ఋషులు. అటువంటి ఋషులకి ; సర్వార్ధములు చెప్పే గురువుకి; 
ప్రకాశించేది కాంచనం. అటువంటి బంగారముతో సమానమైన కాంతి కలవానికి; దేనిచేత తెలియబడుతుందో అది బుద్ధి. అటువంటి బుద్ధి కలవారిలో శ్రేష్ఠునికి; మూడు లోకములకు ప్రభువైన; దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు. వాటికి ప్రభువు బృహస్పతికి; నమస్కరించుచున్నాను.  

*విశేషాలు:* 🌈

1. ఇందులోని త్రిలోకేశ పదం - *జాగ్రత్, స్వప్న సుషుప్తావస్థలను* సూచిస్తుంది. ఈ మూడు దశలలోను బుద్దిని సరిగా ఉంచుటకు గురు గ్రహ ప్రార్ధన ఉపయోగపడుతుంది.

🕉️ *06. శుక్ర:* 🙏

*హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |*
*సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||*

*భావము:* 🌹

*చల్లని మంచులా, మొల్ల పుష్పము వలె, తామరతూడువలె పోలిక కలిగినవాడు, రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్త్రములను చక్కగానెరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను.*

*విశేషాలు:* 🌈

1) *ఈ శుక్ర గ్రహ స్తోత్రం బలాన్ని, ఉత్సాహాన్ని కలుగచేస్తుంది.*

2) *శుక్రమనగా తేజస్సు. అది కలవాడు శుక్రుడు.*


🕉️ *07. శని:* 🙏

*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|* 
*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||*

*భావము:* 🌹

*నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను.*

*విశేషములు:* 🌈

మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.

ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. 

కనుక,  ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే. శని అని ఏలినాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి చక్కగా అతన్ని స్మరించండి చాలు ఆయన అదుపులో వున్న అన్ని సమస్యలనుండి బయటపడేస్తాడు. అంతేకాని జాతకాల పేరిట మోసం చేసావారికి దూరంగా వుండండి.


🕉️ *08. రాహువు:* 

*అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |*
*సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||*

*భావము:* 🌹

*సగము శరీరము కలవాడు;  మహావీరుడు;  చంద్రుడిని సూర్యుడిని కబళించి, విడచువాడు;  సింహిక - హిరణ్య కశిపుని చెల్లెలు. ఆమె కొడుకు; అయిన రాహు గ్రహమునకు ; నేను నమస్కరింతును.;*

*విశేషాలు:* 🌈

👉 రాహుగ్రహదశ 18 సంవత్సరాలు.

👉 రాహువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవటానికి సహాయం చేస్తాడు. విషాహారం తినుట, పాముకాటు, తేలుకాటు, కుష్ఠు, కాన్సర్ మొదలైన వాటిని కలిగిస్తాడు. 

👉 మోహిని అవతారంలో విష్ణు మూర్తి రాహు కేతువుల శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి. సగం శరీరం కలవారు అనగా అర్థ కాయులయ్యారు.

🕉️ *09. కేతు:* 🙏

*ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |*
*రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్||*

*భావము:* 🌹

*మోదుగ పువ్వుతో సమానమైన పోలిక కలవాడు;  నక్షత్రాలకు, గ్రహాలకు శిరస్సు వలె ఉండునది; భయంకరమైనది; తీక్షణతతో కూడినది;  భయం కలిగించేది అయిన; ఆ కేతుగ్రహమునకు;  నేను నమస్కరింతును;*

*విశేషాలు:* 🌈

👉 *పుష్పములతో మాంసమును తినుదానివలె ఉండేదానిని సంస్కృతంలో 'పలాశము' అంటారు.*

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

5, జులై 2025, శనివారం

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1

సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2

సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3

వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4

మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5

భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6

బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7

ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8

పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9

మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10

భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11

ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12

భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13

ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14

మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15

ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16

మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17

వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18

వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19

వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20

మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21

మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22

మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23

మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24

మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25

మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26

కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27

ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28

శకుని www.freegurukul.org/g/Bharatham-29

భీముడు www.freegurukul.org/g/Bharatham-30

దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31

మహారధి www.freegurukul.org/g/Bharatham-32

బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33

మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34

ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35

మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36

తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37

ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38

ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39

తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40

మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41
భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42

ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43

ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44

మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45

భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46

వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47

ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48

మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49

విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50
సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51

ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52

ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53

మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀