10, ఫిబ్రవరి 2024, శనివారం

బ్రహ్మముహూర్తం

హరిఓం , - *బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం*.... 

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
తంత్ర మరియు క్రియాయోగ రహస్యం.....🙏

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

ఏది మాట్లాడినా, వింటున్న మనసు యొక్క సూక్ష్మ తలంలో అలల రేఖల రూపంలో ముద్రింపబడుతుంది. శక్తి ప్రవాహాల రూపంలో మేల్కొంటుంది. దాని ముద్రలు ఏర్పడతాయి. ధ్వని తరంగాలు మరొక భాగాన్ని దాటినప్పుడు, అక్కడ త్రిభుజాలు, చతుర్బుజాలు, వృత్తాలు, పంచబుజి, బిందువులు మొదలైనవి ఏర్పడతాయి. మెదడు యొక్క సూక్ష్మ కేంద్రాలను ప్రబావితం చేసే సమాధి యొక్క ఉన్నత స్థితిలో అనేక మంత్రాలు స్వీకరించడబతాయి. ఇది సైన్స్. ఇది కొత్త విషయం కాదు. ఉదాహరణకు గాయత్రీ మంత్రం ఉంది... ఇందులో 24 అక్షరాలు ఉన్నాయి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.. ఈ అక్షరాలలో చాలా శబ్దాలు ఉన్నాయి. వీటి నుంచి అనేక రకాల ప్రీక్వెన్సీ వేగ ప్రవాహాలు ఉద్భవిస్తాయి అవి అన్ని పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.. మనుషుల మనస్సు, శరీరం, భావోద్వేగాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రబావితం చేస్తాయి. చెరువులోకి ఒక రాయి విసిరినప్పుడు నీటిలో అలలు ఎగసిపడటం వల్ల కంపనం ఏర్పడి క్రమంగా విస్తరిస్తుంది. ఈ కంపనం నీటిలోని ప్రతి అణువును కంపించేలా చేస్తుంది. అదే విధంగా, మాట్లాడే మాటలు, మంత్రాలు వాతావరణంలో ఒక కంపనం సృష్టిస్తాయి ఆ కంపనం చాలా మంది వ్యక్తుల మనసులలో అల రూపంలో సూక్ష్మంగా ప్రతిబింబిస్తుంది. మంత్రం యొక్క శక్తివంతమైన శబ్దం మన అంతర్గత మనసు యొక్క పాత్రపై చెరగని ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తుంది !!!

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు :- 

వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి .. గురుముఖతః తెలుసుకుని ఆచరించి సత్ఫలితాలు పొందగలరు .

👉 దుష్టగ్రహ , దుష్టశక్తులు తొలగాలంటే ..

ప్రతీ నిత్యం మహాంకాళీమాతను ఉపాసించండి . దంత మాలను ధరించవచ్చు .. దంతమాలతో జపం చేయాలి .

👉 ప్రయోగభాధలు , చేతబడి , చిల్లంగి మొదలైన క్షుద్ర ప్రయోగాలు తొలగాలంటే 

తారాదేవిని ఉపదేశం తీసుకుని సాధన చేయాలి . ఎముకల మాలను మెడలో ధరించండి .

👉 రోగభాధలు , విషపీడలు నుండి బయటపడాలంటే 
చిన్నమస్తా దేవిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి . 

👉 అధికారం , రాజ్యం గ్రహం అనుకూలతలకు .. త్రిపుర సుందరి దేవిని ఆరాధించండి . రక్తచంధన మాలను మెడలో ధరించండి. రక్త చందనమాలతో జపం చేయాలి.

👉 దుష్టపీడల నుంచి బయటకు రావాలంటే .. భైరవి దేవిని ఆరాధించాలి . గులకరాళ్ళను మాలన చేసి మెడలో ధరించండి జపం చేయాలి.

 👉 ఋతుబాధలు , కుటుంబ క్లేశాలు , దైవశాపాలు తొలగాలంటే.. మాతంగి దేవిని ఆరాధించండి .. గురువింద గింజలను ధరించండి .. జపం చేయాలి .. 

👉 కోర్టు వ్యవహారాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే .. భగళాముఖిని ఆరాధించండి .. హరిద్రమాలను మెడలో ధరించండి.. అదే విధంగా జపం చేయాలి .. 

👉 అధిక సంపన్నులు కావాలంటే .. కమలాత్మికా దేవిని గురుముఖతః తెలుసుకుని సాధన చేయాలి .. తామరగింజల మాలతో జపం చేయాలి ..

👉 రాజకీయ వ్యవహారాల విషయం లో , ఐశ్వర్య అంతస్తులు పెరగాలంటే .. భువనేశ్వరి దేవి ఉపాసన గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. స్పటిక మాలతో జపం చేయాలి .. 

👉 శతృభాధలు అధికంగా ఉన్నా .. నిరంతరం గొడవలు కోట్లాటలు ఉంటే .. శరభశాలవను తాంత్రిక పద్ధతిలో గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. భద్రాక్ష మాలతో జపం చేయాలి .. 

👉 ప్రతీ విషయం లో విఘాతం, విఘ్నాలు , ఏ పని ముందుకు సాగకపోతే .. గణపతిని ఉపాసన మొదలుపెట్టండి .. ఏనుగు దంత మాలను ఉపయోగించి జపం చేయాలి .. 

👉 దాంపత్య సుఖం కోసం , ప్రేమ ఫలించాలంటే .. శ్రీ కృష్ణుడిని ఆరాధించండి .. ప్రావళమాలను మెడలో ధరించండి .. అదే విధంగా జపం చేయాలి .. 

👉 వశీకరణ ప్రయోగాలు సిద్ధించాలంటే .. పగడ మాలను ధరించండి.. జపం చేయాలి..

3, ఫిబ్రవరి 2024, శనివారం

మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??

మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??

ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 
మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 

అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 
" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 

"చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.

  అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 

*"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 

 అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.
ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 

 "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 

"అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది
భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 

 వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 

 *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 

 జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 

 అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 

లేదా ......
*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 

ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 
తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??

 *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 
*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 

*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 
చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 
అలెగ్జాండర్ 
" *వెనుదిరగవలసి వచ్చింది* 

 ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 

ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏
 
 *కొందరు పంపరు*... 
అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻

*వర్ధిల్లాలి భారతి యశస్సు*
*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*

 *భారత్ మాతాకీ జై* 🇮🇳
✊✊✊✊✊✊

29, జనవరి 2024, సోమవారం

ఈ సృష్టిలో మనమెక్కడ

ఈ సకల సృష్టి లో మన సూర్యుడు ఒక ధూళి రేణువు అంత అయితే సూర్యుడిలో మన భూమి లాంటివి 13లక్షలు భూములు పడుతాయి అంత పెద్దది సూర్యుడు ఇక చంద్రుడు భూమిలో 4వ వంతు మాత్రమే.. ఇంకా సూర్యుడు పాల పుంత చుట్టూ 7,92,000km వేగంతో ప్రయాణిస్తుంటే సూర్యుడితో పాటు భూమి ఇతర గ్రహాలు ఉప గ్రహాలు అన్ని అదే వేగంతో సూర్యుడి వెనకాలే ప్రయాణిస్తున్నాయి... సూర్యుడు పాలపుంతని ఒక సారి చుట్టి రావడానికి 26,00,00,000.కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ భూమి పైన నీరు 71% ఉంటే మిగిలిన నేల 29% భూమి పైన మంచి నీళ్లు 1%, మనం వుండే ఈ పాల పుంత లో ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్ళాలి అంటే ఒక లక్షల కాంతి సంవత్సరలు పడుతుంది... క్రాంతి సంవత్సరం అంటే క్రాంతి వేగం సెకండ్ కీ 3కోట్ల km ఈ వేగంతో ఒక సంవత్సరాం ప్రయాణిస్తే దాన్ని దాన్ని కాంతి సంవత్సరం (light year) అంటారు.. ఇప్పుడు చెప్పండి ఈ విశ్వం లో మనిషి స్థానం? ఈ సృష్టి ఎంత పెద్దది అనేది ఇప్పటివరకు తెలియదు ఇక నాది నేను అహంకారం తో మనిషి చేసే చేష్టలు... దేవుడు ఒకడు ఉండి ఉంటాడు లేకపోతే సృష్టి ఎలా వస్తుంది అనే ఆలోచనతో మానవుడు దేవుడిని మతాన్ని సృష్టించాడు మానవుడు ఈ మానవులు మాట్లాడే భాషలు 7139 రకాల భాషలు వున్నాయి 750కోట్ల మంది జనాభ ఈ భూమిపైన వున్నారు... 200 దేశలు వున్నాయి ఈ విశ్వం ఎంత పెద్దది అంటే నువ్వు ఊహించడానికి నీ ఊహ సరిపోదు.. అణువులో ఒక పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయివీటి గురించి తెలుసుకుంటే ఈ విశ్వం గురించి తేలిపోద్ది... ఇక నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ విశ్వం గురించి తెలుస్తుంది... JBuddha

19, జులై 2023, బుధవారం

🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!

 🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి.హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.


🌸మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది.హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి.


🌿హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు.ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి.


🌸హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ కూడా ఇప్పటి వరకు ఛేదించలేకపోయింది.ఈ పనిలో కూడా శాస్త్రవేత్తలు విజయం సాధించలేకపోయారు.అలాంటి రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


🌹1) ప్రపంచంలో ఉన్న పెద్ద సరస్సుల్లో గురుభోంగ్ మార్ సరస్సు ఒకటి.🌹


🌿ఈ సరస్సు సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో, టెస్టా నదితో కలిసి ఉంటుంది.


🌸కంచనగంగా పర్వతం పక్కనే ఇది ఉంటుంది.ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.

ఈ సరస్సులోని నీరు చలికాలంలో కూడా గడ్డ కట్టవు.దీనికి ఓ కారణం ఉంది.


🌿ఆ సరస్సు ఎప్పుడూ గడ్డ కట్టి ఉండటంతో ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలను గురు పద్మ సాంబవ అనే ట్రైబల్ దేవుడు చూస్తాడు.


🌸దీంతో తన వద్ద ఉన్న ఒక ఆయుధంతో సరస్సులోని ఒక ప్రదేశంలో టచ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆప్రదేశంలో నీరు గడ్డకట్టకుండా ఉంటాయి.దీంతో అక్కడి ప్రజల నీటి కష్టాలు తీరుతాయి.

ఆ నీరు మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా గడ్డ కట్టవు.


🌹2 ) జ్ఞానగంజ్ అనేది ఓ సిద్ధ ఆశ్రమం.🌹


🌿ఈ ఆశ్రమంలో ఉండేవారికి చావు అనేది ఉండదట.

ఇక్కడ ఉండే వారు గాలిని పీల్చుకుని జీవిస్తుంటారు.అయితే ఈ ప్రదేశం అందరికీ కనబడదు.


🌸దేవుడి మీద నమ్మకం ఉండి, ఎవరికీ ద్రోహం చేయకుండా, అందరి మంచి కోరుకునే వారికి మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుంది.అక్కడ ఉండే యోగులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి.


🌿వారు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతామో కూడా చెప్పగలరు.మన పూర్వం కూడా చెప్పగలరట.


🌹3 )రూప్ కాండ్ సరస్సు:🌹


🌸ఈ సరస్సుకు అస్థి పంజరాల గుట్ట అని కూడా అంటారు.ఇక్కడ పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి.


🌿అయితే అవి ఎవరివి అనేది ఇంకా రహస్యంగానే ఉంది.కొంత మంది అవి రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారివి అంటారు.


🌸వీరంతా రాజ కుటుంబానికి చెందిన వారని, ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని మరికొందరు చెబుతారు.దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.


🌹4 ) గ్యాంగ్ ఖార్ ప్యునేసం:🌹


🌿ఇది ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం.ఇప్పటి వరకు ఎవరూ ఈ పర్వత శిఖరాన్ని చేరుకోలేదు.

ఈ పర్వతం భూటాన్ లో ఉంది.


🌸ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించకపోవడంతో దీనిని ఒక రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు.

భూటానీస్ లు ఈ ప్రాంతాన్ని దేవుళ్లు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు.


🌿ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్ధాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే వారు చెబుతారు.


🌹5 ) మౌంట్ కైలాష్:🌹


🌸మౌంట్ కైలాష్ అనేది హిమాలయాల్లోనే వింతైన ప్రదేశం.ఇక్కడి నుంచే ప్రపంచ మొదలవుతుందని చెబుతారు.


🌿హిందువులు ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడని నమ్ముతారు.ఇది సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉంటుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

💫 శాపవిమోచనం 🎊

 💫 శాపవిమోచనం  🎊

➖➖➖➖➖➖➖✍️

-(అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం - పుణ్యచరిత్ర)

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


🪷 ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమిత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు.


🪷 ఇలావుండగా, ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలను తుంచి, వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరం నుండి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు.


🪷 తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచనమీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు... 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరు' అని విమోచనమార్గం అనుగ్రహించాడు.


🪷 ఫలితంగా... ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. 


🪷 ఆదేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగాకమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాల కోసం  వెదకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి, వేసారి వెనుదిరుగుదామ అనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి, కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడసాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.


🪷 ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్యపురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింది" అని ప్రార్ధించగా వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి...


🪷 "రాజా ! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరిరూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజూ ఉదయాన్నే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటిగిరిని ప్రదక్షిణం చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు.


🪷 వెంటనే రాజు అంజలి ఘటించి.. "మహాత్మ్యమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణం చేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి ? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా.. 


🪷 "రాజా ! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినైనా పొందగలరు" అని వివరించి, గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు.


🪷 ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు.


*_🪷 నేడు 'అరుణాచలం' అని పేరుబడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. కోరికలీడేర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు. (సుమారు 14 కి.మీ) అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది.

[4:58 pm, 18/07/2023] Satyam Sivam Group: ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆకాలంలో అతను నిర్మించినవే. వీటిలో దుర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది.!_*


ఓం అరుణాచలేశ్వరాయ నమః