18, ఫిబ్రవరి 2024, ఆదివారం

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Pumpkin Seeds: నానబెట్టిన గుమ్మడి గింజలు  తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

 గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్, కూర, స్వీట్ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే.. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఎక్కువగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉంటుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే.. జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది.

గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్టెన్షన్ కంట్లోల్లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి.

గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి∙ గుమ్మడి గింజల్లో çపనాగమిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే సెల్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

షుగర్ పేషెంట్స్కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.

రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రష్యన్ ఆధ్యాత్మికవేత్త మరియు థియోసఫీ ఉద్యమం యొక్క ప్రధాన ఆలోచనాపరురాలు హెలెనా బ్లావాట్స్కీ

రష్యన్ ఆధ్యాత్మికవేత్త మరియు థియోసఫీ ఉద్యమం యొక్క ప్రధాన ఆలోచనాపరురాలు హెలెనా బ్లావాట్స్కీ

🌺PART-1      https://www.youtube.com/watch?v=7h4rhQQFIUQ&t=53s
ఓ అతీంద్రియ శక్తీ .శంబళ లో మాస్టర్ ని దర్శించుకొన్న MADAM  బ్లవట్ స్కై

🌺PART-2     https://www.youtube.com/watch?v=TyYkyTeVtAY
ఆర్య మునులతో సంభాషించిన బ్లావట్  స్కై

🌺PART-3     https://www.youtube.com/watch?v=h3v-JQflssA
భర్తను విడిచి బ్లావట్ స్కై టిబెట్ ఎందుకు వెళ్ళిపోయింది

🌺PART-4    https://www.youtube.com/watch?v=JPtsU_BiSuM&t=16s
ఎందుకు ఆమె హిందూ ధర్మానికి హిమాలయ గురుదేవులకు ఎందుకు ఆకర్షితురాలైంది

🌺PART-5     https://www.youtube.com/watch?v=85KBS7HQlBk
గురువుల అన్వేషణలో ప్రమాదానికి గురైన బ్లావట్ స్కై ని ఎవరు రక్షించారు

🌺PART-6    https://www.youtube.com/watch?v=DzfALjVvuQQ
తిబ్లిన్ లో బ్లావట్ స్కై కి ఏమైంది . శంబాలా గురువులు ఆమెను ఎలా కలిశారు

🌺PART-7   https://www.youtube.com/watch?v=_D96K_wgilE
అతీంద్రియ శక్తులు ఆమెకు ఎలా ఉపయోగపడేవి . ఆమె అనారోగ్యానికి అతీంద్రియ శక్తులకు సంభంధం ఏమిటి
🌺PART-8       https://www.youtube.com/watch?v=g8prhDsczck
మేడం బ్లావట్ స్కై. ఆత్మ శక్తీ అంటే ఏమిటి

🌺PART-9    https://www.youtube.com/watch?v=fbUSK7LP7ts
మేడం బ్లావట్ స్కై . థియోసాఫికల్ సొసైటీ స్థాపన  .. ఆమెను ఇండియా కు వెళ్ళమని పరమ గురువులు ఎందుకు శాశించారు

🌺PART-10   https://www.youtube.com/watch?v=EZ5P9DQEwMs
సైంటిస్ట్ లను అబ్బురపరిచిన బ్లావేట్ స్కై మాయలు

🌺PART-11    https://www.youtube.com/watch?v=UO449tYUsFg
బ్లావట్ స్కై ఆస్ట్రల్ రూపం లో ఉండే గురువులతో ఎలా సంభాషించేవారు

🌱MINI MOVIE   https://www.youtube.com/watch?v=NkuKhCX614w&t=229s
సైంటిస్ట్ లను అబ్బురపరిచిన ఆధ్యాత్మిక రష్యన్ తాంత్రికురాలు

10, ఫిబ్రవరి 2024, శనివారం

బ్రహ్మముహూర్తం

హరిఓం , - *బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం*.... 

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
తంత్ర మరియు క్రియాయోగ రహస్యం.....🙏

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

మంత్ర శక్తి ఎలా పనిచేస్తుంది!?

ఏది మాట్లాడినా, వింటున్న మనసు యొక్క సూక్ష్మ తలంలో అలల రేఖల రూపంలో ముద్రింపబడుతుంది. శక్తి ప్రవాహాల రూపంలో మేల్కొంటుంది. దాని ముద్రలు ఏర్పడతాయి. ధ్వని తరంగాలు మరొక భాగాన్ని దాటినప్పుడు, అక్కడ త్రిభుజాలు, చతుర్బుజాలు, వృత్తాలు, పంచబుజి, బిందువులు మొదలైనవి ఏర్పడతాయి. మెదడు యొక్క సూక్ష్మ కేంద్రాలను ప్రబావితం చేసే సమాధి యొక్క ఉన్నత స్థితిలో అనేక మంత్రాలు స్వీకరించడబతాయి. ఇది సైన్స్. ఇది కొత్త విషయం కాదు. ఉదాహరణకు గాయత్రీ మంత్రం ఉంది... ఇందులో 24 అక్షరాలు ఉన్నాయి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.. ఈ అక్షరాలలో చాలా శబ్దాలు ఉన్నాయి. వీటి నుంచి అనేక రకాల ప్రీక్వెన్సీ వేగ ప్రవాహాలు ఉద్భవిస్తాయి అవి అన్ని పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.. మనుషుల మనస్సు, శరీరం, భావోద్వేగాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రబావితం చేస్తాయి. చెరువులోకి ఒక రాయి విసిరినప్పుడు నీటిలో అలలు ఎగసిపడటం వల్ల కంపనం ఏర్పడి క్రమంగా విస్తరిస్తుంది. ఈ కంపనం నీటిలోని ప్రతి అణువును కంపించేలా చేస్తుంది. అదే విధంగా, మాట్లాడే మాటలు, మంత్రాలు వాతావరణంలో ఒక కంపనం సృష్టిస్తాయి ఆ కంపనం చాలా మంది వ్యక్తుల మనసులలో అల రూపంలో సూక్ష్మంగా ప్రతిబింబిస్తుంది. మంత్రం యొక్క శక్తివంతమైన శబ్దం మన అంతర్గత మనసు యొక్క పాత్రపై చెరగని ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తుంది !!!

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు :- 

వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి .. గురుముఖతః తెలుసుకుని ఆచరించి సత్ఫలితాలు పొందగలరు .

👉 దుష్టగ్రహ , దుష్టశక్తులు తొలగాలంటే ..

ప్రతీ నిత్యం మహాంకాళీమాతను ఉపాసించండి . దంత మాలను ధరించవచ్చు .. దంతమాలతో జపం చేయాలి .

👉 ప్రయోగభాధలు , చేతబడి , చిల్లంగి మొదలైన క్షుద్ర ప్రయోగాలు తొలగాలంటే 

తారాదేవిని ఉపదేశం తీసుకుని సాధన చేయాలి . ఎముకల మాలను మెడలో ధరించండి .

👉 రోగభాధలు , విషపీడలు నుండి బయటపడాలంటే 
చిన్నమస్తా దేవిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి . 

👉 అధికారం , రాజ్యం గ్రహం అనుకూలతలకు .. త్రిపుర సుందరి దేవిని ఆరాధించండి . రక్తచంధన మాలను మెడలో ధరించండి. రక్త చందనమాలతో జపం చేయాలి.

👉 దుష్టపీడల నుంచి బయటకు రావాలంటే .. భైరవి దేవిని ఆరాధించాలి . గులకరాళ్ళను మాలన చేసి మెడలో ధరించండి జపం చేయాలి.

 👉 ఋతుబాధలు , కుటుంబ క్లేశాలు , దైవశాపాలు తొలగాలంటే.. మాతంగి దేవిని ఆరాధించండి .. గురువింద గింజలను ధరించండి .. జపం చేయాలి .. 

👉 కోర్టు వ్యవహారాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే .. భగళాముఖిని ఆరాధించండి .. హరిద్రమాలను మెడలో ధరించండి.. అదే విధంగా జపం చేయాలి .. 

👉 అధిక సంపన్నులు కావాలంటే .. కమలాత్మికా దేవిని గురుముఖతః తెలుసుకుని సాధన చేయాలి .. తామరగింజల మాలతో జపం చేయాలి ..

👉 రాజకీయ వ్యవహారాల విషయం లో , ఐశ్వర్య అంతస్తులు పెరగాలంటే .. భువనేశ్వరి దేవి ఉపాసన గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. స్పటిక మాలతో జపం చేయాలి .. 

👉 శతృభాధలు అధికంగా ఉన్నా .. నిరంతరం గొడవలు కోట్లాటలు ఉంటే .. శరభశాలవను తాంత్రిక పద్ధతిలో గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. భద్రాక్ష మాలతో జపం చేయాలి .. 

👉 ప్రతీ విషయం లో విఘాతం, విఘ్నాలు , ఏ పని ముందుకు సాగకపోతే .. గణపతిని ఉపాసన మొదలుపెట్టండి .. ఏనుగు దంత మాలను ఉపయోగించి జపం చేయాలి .. 

👉 దాంపత్య సుఖం కోసం , ప్రేమ ఫలించాలంటే .. శ్రీ కృష్ణుడిని ఆరాధించండి .. ప్రావళమాలను మెడలో ధరించండి .. అదే విధంగా జపం చేయాలి .. 

👉 వశీకరణ ప్రయోగాలు సిద్ధించాలంటే .. పగడ మాలను ధరించండి.. జపం చేయాలి..

3, ఫిబ్రవరి 2024, శనివారం

మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??

మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??

ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 
మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 

అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 
" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 

"చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.

  అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 

*"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 

 అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.
ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 

 "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 

"అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది
భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 

 వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 

 *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 

 జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 

 అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 

లేదా ......
*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 

ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 
తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??

 *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 
*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 

*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 
చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 
అలెగ్జాండర్ 
" *వెనుదిరగవలసి వచ్చింది* 

 ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 

ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏
 
 *కొందరు పంపరు*... 
అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻

*వర్ధిల్లాలి భారతి యశస్సు*
*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*

 *భారత్ మాతాకీ జై* 🇮🇳
✊✊✊✊✊✊

29, జనవరి 2024, సోమవారం

ఈ సృష్టిలో మనమెక్కడ

ఈ సకల సృష్టి లో మన సూర్యుడు ఒక ధూళి రేణువు అంత అయితే సూర్యుడిలో మన భూమి లాంటివి 13లక్షలు భూములు పడుతాయి అంత పెద్దది సూర్యుడు ఇక చంద్రుడు భూమిలో 4వ వంతు మాత్రమే.. ఇంకా సూర్యుడు పాల పుంత చుట్టూ 7,92,000km వేగంతో ప్రయాణిస్తుంటే సూర్యుడితో పాటు భూమి ఇతర గ్రహాలు ఉప గ్రహాలు అన్ని అదే వేగంతో సూర్యుడి వెనకాలే ప్రయాణిస్తున్నాయి... సూర్యుడు పాలపుంతని ఒక సారి చుట్టి రావడానికి 26,00,00,000.కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ భూమి పైన నీరు 71% ఉంటే మిగిలిన నేల 29% భూమి పైన మంచి నీళ్లు 1%, మనం వుండే ఈ పాల పుంత లో ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్ళాలి అంటే ఒక లక్షల కాంతి సంవత్సరలు పడుతుంది... క్రాంతి సంవత్సరం అంటే క్రాంతి వేగం సెకండ్ కీ 3కోట్ల km ఈ వేగంతో ఒక సంవత్సరాం ప్రయాణిస్తే దాన్ని దాన్ని కాంతి సంవత్సరం (light year) అంటారు.. ఇప్పుడు చెప్పండి ఈ విశ్వం లో మనిషి స్థానం? ఈ సృష్టి ఎంత పెద్దది అనేది ఇప్పటివరకు తెలియదు ఇక నాది నేను అహంకారం తో మనిషి చేసే చేష్టలు... దేవుడు ఒకడు ఉండి ఉంటాడు లేకపోతే సృష్టి ఎలా వస్తుంది అనే ఆలోచనతో మానవుడు దేవుడిని మతాన్ని సృష్టించాడు మానవుడు ఈ మానవులు మాట్లాడే భాషలు 7139 రకాల భాషలు వున్నాయి 750కోట్ల మంది జనాభ ఈ భూమిపైన వున్నారు... 200 దేశలు వున్నాయి ఈ విశ్వం ఎంత పెద్దది అంటే నువ్వు ఊహించడానికి నీ ఊహ సరిపోదు.. అణువులో ఒక పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయివీటి గురించి తెలుసుకుంటే ఈ విశ్వం గురించి తేలిపోద్ది... ఇక నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ విశ్వం గురించి తెలుస్తుంది... JBuddha