6, మే 2023, శనివారం

🔔రామ నామ మహిమ🔔

 🔔రామ నామ మహిమ🔔

       🚩🌳🚩


హనుమంతుడు ఆశోకవనంలో  సీతాదేవిని దర్శించి , సీతమ్మవారి వద్ద నుండి చూడామణి తీసుకుని  రాముని వద్దకు తిరిగి

వెళ్ళాడు.

సీతాదేవిని దర్శించాను అని తెలిపి శ్రీ రాముని చరణాల వద్ద సీతమ్మ యొక్క చూడామణిని వుంచాడు.  ఆనందంతో రాముడు తనని

ఆలింగనం చేసుకుంటాడని ఆశించిన హనుమకి నిరాశే  మిగిలింది.

చూడామాణిని చూసిన రాముని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు  రాముడు అడిగిన ప్రశ్న హనుమంతునికి విస్మయం కలిగించింది.  ఆంజనేయుని చూసి  రాముడు 'హనుమా.. నేను చెప్పినదేమిటి ? నీవు చేసినదేమిటి ? సీతాదేవిని చూసి రమ్మని నిన్ను పంపాను. కాని నీవు లంకనే కాల్చి 

రావణుని ప్రజలను తీవ్రమైన బాధలకు గురిచేశావు.

ఇదంతా నీవు నా అనుమతితోనే చేశావా ?అని అడిగాడు.

" రామప్రభూ .. రావణుని అనుచరులు నా తోకకు నిప్పు ముట్టించారు.  రావణుడు వేడుకతో చూస్తూ ఆనందించాడు. నేను ఆ నిప్పును ఆర్పేందుకు అటు ఇటూ తిరుగుతూ  నా వాలమును ఆడించాను.  ఆ సమయంలో  మంటలు చెలరేగి లంకాపట్టణం

కాలిపోయింది. ఇది రావణుడు చేసిన

తప్పు వల్లే జరిగింది" అని సంజాయిషీ చెప్పాడు హనుమ.


నీ తోకకు అంటించిన అగ్ని  వల్ల నీ శరీరము  కాలి బాధ కలిగినదా ?"


" లేదు...రామా! నేను తమ నామమునే

జపిస్తూ నిశ్చింతగా వుండిపోయాను. రామ నామ మహిమ వలన

నాకు ఏ బాధా కలుగలేదు" అనిఅన్నాడు హనుమ. నిన్ను నీవు  కాపాడుకోవడానికి జపించిన మంత్రాన్ని లంకా ప్రజలకి  కూడా చెప్పిన పిదప కదా

నీవు లంకా దహనం చేయవలసినది.నిన్ను

నీవు కాపాడుకొన్నావు. కాని  లంక ప్రజలను ఇబ్బందులపాలు చేశావు.  నీవు చేసిన ఈ పాపకార్యంలో నన్ను భాగస్వామిని చేశావుకదయ్యా హనుమ ? అని  రాముడు చింతించాడు. హనుమంతుడు రాముడి కాళ్ళమీద పడి ."  అజ్ఞానంతో అకార్యం చేసి మీకు విచారం కలిగించాను నన్ను మన్నించండి, స్వామీ అని దీనంగా వేడుకున్నాడు.


" ఒకవేళ రావణుడు తన మనసు మార్చుకుని సీతాదేవిని నాకు అప్పగించినా నేను లంకకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించావు. అగ్నివలన దహనమైన లంకని తిరిగి పునరుధ్ధరించి, భాధించబడినవారికి సేవలందించి యీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకొనేతీరాలి "

అని అన్నాడు రాముడు. 

రాముని కరుణార్ద్ర హృదయానికి హనుమ చలించిపోయాడు

రాముని పాదాలకు నమస్కరించి,  హనుమ "రామ..రామ ..అంటూ రామనామ స్మరణ ప్రారంభించాడు.

ఇప్పుడు హనుమంతుడు జపించినది తనకోసం కాదు, తనవల్ల నష్టపోయిన

లంకా ప్రజల కోసం.

సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు

 సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి.  మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే  వంట చేయలేం కదా?  అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి.  ఎంతకాలం 'నేను' అనే‌ భావనతో ఈ‌ లోకంలో  తిరుగుతూ‌ ఉంటామో అంతకాలమూ సాధకులమే.  ఈ‌ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే!  ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ‌ అక్కరలేదు వంటా అక్కర లేదు.  అది వేరే‌ స్థితి.


ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి.  దాన్ని బ్రహ్మబీజం అంటారు.  అది ముల్లోకాల్నీ‌ పవిత్రం చేసే‌ పరమమంత్రం. 


ప్రణవం అంటే ఓం‌కారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓం‌కారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.  ఈ‌ ఓం‌కారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి.  ‌ఓం‌కారం గురించి ఎంతైనా చెప…

మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి.  అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం.  ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది.  మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే  ఊతం ఇస్తే,  వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది.  అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి. 


ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది.  లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ?  ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.


సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు.  సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి.  రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ,  నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి,  క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట.  తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట.  ఈ‌ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ‌ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ‌ త్రిగుణాలనే‌ రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం‌ అన్న మాట.  మనం‌ ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు. 


ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది.  నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.


మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే,  ఆకర్షిస్తూనే ఉంటాయి.  రకరకాల అనుభవాల్ని ఈ‌ త్రిగుణాలు అందిస్తూ,  అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.


కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి?  అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది.  అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.


ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి?  వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా?  ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది.  కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది.  అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం.  విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు.  అదే కైవల్యం, అంటే మోక్షం. 


ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది .  ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు.  ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.


మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు.  కాని జీవుడిగా మిగిలే ఉంటాడు.  ఈ‌ స్థితిలో వాడికి ప్రపంచంతో‌ ఏవిధమైన సాంగత్యం ఉండదు.  వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం.  ఈ‌ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు.  ఈ‌ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని. 


ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి.  క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది.  ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.


ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా?  అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే‌ భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే.  పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?


ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది.  నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది.  నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే‌ కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును.  కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది.  వచ్చే జన్మలో అది కొనసాగుతుంది.  ఈ‌ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు.  ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.

జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

 జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

✍🏻...దాసు కిరణ్‌

💫🌈💫🌈💫🌈


💐 జ్ఞాన సిద్ధిని గురించి వివరించే లోక ప్రసిద్ధమైన ఒక ఉపమానం వేదాంతంలో ఉంది. అదే... ‘రజ్జు సర్ప భ్రాంతి’. చీకటిలో తాడును చూసి ‘పాము’ అని భ్రాంతి చెందుతాం. ఆ భ్రాంతి కారణంగా భయం ఏర్పడుతుంది. ఇక్కడ పాము అంటే ‘నేను’ అనే భావన. ఆ భావన ఉన్నంత వరకూ... కోరికలు, బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ‘జ్ఞాన సిద్ధి’ అనే వెలుగులో ‘నేను’ అనే భావన కరిగిపోయినప్పుడు (‘పాము కాదు తాడే’ అని తెలిసినప్పుడు) అవన్నీ పటాపంచలవుతాయి. నిరంతరం ఈ స్థితిలో ఉండడమే మోక్ష సిద్ధి. 


💐 జ్ఞాన సిద్ధి ఒక ఘటన. చాలా సందర్భాలలో అది ఆకస్మికంగా జరుగుతుంది. ఈ విషయంలో చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం శ్రీ రమణ మహర్షిది. 


💐 ఆయనకు ఒక రోజు మధ్యాహ్నం... కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మతత్త్వం తెలిసిపోయింది. కానీ జ్ఞాన సిద్ధి చాలా నెమ్మదిగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆకస్మికంగా జరిగినా, నెమ్మదిగా జరిగినా... జ్ఞానసిద్ధి కలిగిన తరువాత... ‘ఏదో జరిగింది’ అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. అది ఎప్పుడు, ఎలా అవుతుందో ఎవరూ చెప్పలేరు. సృష్టి, స్థితి, లయ... వీటికి అదనంగా మరో రెండు పార్శ్వాలు ఉన్నాయంటారు. అవి.. మాయ, అనుగ్రహం. ఏ కొందరికో, ఎప్పటికో... కృప ద్వారా ‘మాయ’ అనే పొర తొలగిపోవడం జరుగుతుంది. 


💐 ఈత కొట్టడం వచ్చిన తరువాత... ఈత రాని స్థితి ఇక ఎప్పటికీ ఎలా ఉండదో... జ్ఞాన సిద్ధి పొందిన తరువాత పూర్వపు స్థితి ఉండదు. ఇది వినగానే... సాధకులకు తప్ప... చాలామందికి భయం కలుగుతుంది. ‘అదేమిటి? నేను లేకపోతే ఇంకేం ఉంటుంది? జీవితం అన్న తరువాత బాధలు ఉండడం సహజం. అన్నీ వదిలేస్తే జీవితానికి గమ్యం, సార్థకత ఏముంటాయి? బతుకు నిస్సారం అవుతుంది కదా?’... ఇలా సాగుతాయి ఆలోచనలు. 


💐 కుటుంబంలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే... ‘సన్యాసుల్లో కలిసిపోతాడో ఏమిటో?’ అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ ఆలోచనలకు కారణం అజ్ఞానం. నిజానికి జ్ఞానుల్లో సన్యాసుల కన్నా గృహస్తులే అధికం. జ్ఞాన సిద్ధి పొందిన తరువాత... సాధారణ జీవితాన్ని ఇంకా ఆనందంగా గడుపుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. దీనికి శ్రీ రమణ మహర్షి ఒక ఉపమానం చెప్పారు... ‘‘కాలిన తాడు ఆకారం తాడులాగే ఉంటుంది, కానీ దానికి బిగువు ఉండదు. అలాగే జ్ఞానులను బంధాలు కట్టివెయ్యలేవు. కానీ బంధాలకు దూరంగా ఉండడం కూడా జరగదు’’ అని.


🔅"మనస్సు యొక్క స్వభావంపై స్థిరమైన మరియు నిరంతర పరిశోధన ద్వారా, మనస్సు ' నేను' సూచించే అది( తత్ ) కి రూపాంతరం చెందుతుంది; మరియు అదియే నిజానికి ఆత్మ ."


గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,

జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం🙏🏻

అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏

 అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏


కాంతపాళ్యం శ్రీ ఆది శివలింగాచార్య సీనందల్ విశ్వబ్రాహ్మణ పీఠం - తిరువణ్ణామలై నంది


తమిళనాడులోని తిరువణ్ణామలై  కి దగ్గరలో ఉన్నటువంటి కాంత పాళ్యం అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ గురు పీఠం ఉన్నది.ఇది చాలా ప్రాచీనమైనది.మహాభారత కాలము నాటి ఋషుల తపస్సులు ఆచరించిన అరణ్యం గా ప్రసిద్ధి.


తిరువన్నామలై ప్రాంతమును మొఘల్ లు పరిపాలచేసే రోజుల్లో తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవస్తానమ్ లో ఉన్న పెద్ద నంది కి నంది పూజ చేస్తున్నారు.


అప్పుడు అక్కడికి వచ్చిన మొఘల్ రాజు మేము ఆహారం గా స్వీకరించే జీవిని మీరు పూజ చేస్తున్నారు అని అక్కడ పూజ నిర్వహణ చేస్తున్న ఒక 5గురు భక్తులను ని అపహాస్యం గా అంటే ఆ 5 గురు కూడా ఇది మీరు ఆహారం గా స్వీకరించే ఎద్దు కాదు మా సంప్రదాయం లో నందిని అరుణాచలేశ్వర స్వామి  వాహనము గా భావిస్తాము అని చెప్పారు.


ఆ సందర్భములో అక్కడికి ఒక తేజస్సుకలిగిన  బాలుడు వచ్చాడు.


ఈ బాలుడికి మొఘల్ రాజు కి కాస్త వాగ్వివాదాము జరిగినది.మొఘల్ రాజు ఇచ్చిన మాంసమును పువ్వులు గా మార్చాడు.


ఈ మాయలు నేను సహించను అని ఆ మొఘల్ రాజు ఈ అరుణాచలేశ్వరుడి ఎదురుగా ఉన్న నంది నేను రెండు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేయబోయాడు


అప్పుడు ఆ బాలుడి తపస్సు కి నంది సహజముగా తన కూర్చున్న స్థితిని కుడి కాలు మడిచి ఎడమ కాలు ముందుకు పెట్టింది.


ఈ సంఘట చూసిన అక్కడి వారు అందరూ ఆశ్చర్యం కు లోనయ్యారు.


కళ్ళముందు రాతి నంది అలా మార్చుకున్న స్థితిని చూసిన ఆ మోఘల్ రాజు.


ఆ పిల్లవాడిని క్షమించమని వేడుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.


ఆ పిల్లవాడే విశ్వబ్రాహ్మణ వంశీయడు సిద్ధపురుషుడు అయినాడు.


ఆయనే శ్రీ ఆది శివలింగాచార్య స్వామి.


వీరు సజీవ సమాది చెందిన ప్రాంతం.


తిరువణ్ణామలై కి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న కాంతపాళ్యం.


ప్రస్తుతం 8 వ తరానికి చెందిన శ్రీ శివ జ్ఞాన స్వామి 6382658268 వారు పీఠమును నిర్వహణ చేస్తున్నారు.


🙏🏻అరుణాచలశివ 🙏🏻

15, ఏప్రిల్ 2023, శనివారం

కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.

కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి
ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.
ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!
కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది.
ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది.
ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే.
మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి.
మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు.
మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది.
అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు.
కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు.
ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే“నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.
అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి.
అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది.
పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది.
ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మలగురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము.
అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు.
కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు.
కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు.
భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే.
అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి.
చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి.
రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి.
రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి.
అలాంటివాడు కేవలం“దొంగే” అవుతాడుగాని“రాజు” ఎన్నటికీ కాలేడు.
అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు.
కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!
అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి.....🙏

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...?

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...? 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి. 

🌸అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. 

🌿ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. 

🌸బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది.

🌿 విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. 

🌸బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. 

🌿ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. 

🌸ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

🌿తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. 

🌸ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

🌿విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.

🌸ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. 

🌿ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది.

🌸అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.

🌿ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు.

🌸 దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది.

🌿సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్యభగవానుడికి, భానుడు, రవి వంటి వివిధ రకాల పేర్లతో పిలవడం గురించి మనం విన్నాం.కానీ సూర్య భగవానుడి విమలాదిత్యుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

🌸అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది.కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మరి జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.

🌿అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిలో స్నానం చేయాలని చెబుతుంటారు.

🌸పరమపవిత్రమైన కాశీలో మనకు 12 సూర్య దేవాలయాలు కనిపిస్తాయి.ఈ పన్నెండు ఆలయాలలో ఒక్కో ఆలయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు.ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం.

🌿పూర్వం విమలుడు అనే ఒక రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవారు.ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్యా బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు.

7, అక్టోబర్ 2022, శుక్రవారం

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో తెలుసా👉

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో తెలుసా👉

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం

🌷మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. 
🌷మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
🌷హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
🌷మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
🌷మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
🌷మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
🌷మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
🌷మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
🌷మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
🌷మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
🌷మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి 🌷ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
🌷మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
🌷మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
🌷మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
🌷మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
🌷మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
🌷మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
🌷మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
🌷మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
🌷మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
🌷మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
🌷మానవుని మెదడుకు నొప్పి తెలియదు
🌷మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
🌷మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
🌷 మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
🌷తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
🌷చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
🌷స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
🌷స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
🌷 రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
🌷మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జించును
🌷స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
🌷మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
🌷మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
🌷ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
🌷 రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
🌷మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
🌷మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
🌷మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
🌷మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
🌷మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
🌷మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనును 
🌷ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
🌷మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
🌷ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
🌷మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
🌷మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
🌷ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు. 
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.
" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము".