23, నవంబర్ 2021, మంగళవారం


🌹విశ్వ చైతన్య శక్తి🌹

శక్తి సర్వాత్రా వ్యాపించియున్నది
విశ్వానికి ఆధారంలా  పంచభూతాల్లో ప్రాణంలా ఉంది 
చైతన్య స్వరూపంలో అంతటా విస్తరించింది
జీవి మనుగడ శక్తి పై ఆధారపడి ఉంది
సంసార చక్రానికి ఇరుసులా  పని చేస్తోంది
శక్తి లేకపోతే శరీరం మనస్సు నిర్ఙీవమౌతుంది 
మనస్సు హృదయ స్పందన ఆగిపోతుంది

పూదండలో ధారంలా అన్నిటిని కలుపుతుంది
శరీరంలో శక్తి విరాట్ రూపం దాల్చితే విశ్వ శక్తిని అందుకొంటుంది
భూమిపై మనిషిని దైవస్వరూపంలా నిలబెడుతుంది.

అండ పిండ బ్రహ్మాండం వరకు శక్తి ప్రసరించింది
ఈ సృష్టికి మూలమై సృజన చేస్తుంది
సృజనాత్మకతకి మూలంగా ఉంది
జీవితానికి సర్వస్వమైనది

భోజనంతో శక్తి లభిస్తుంది
నిద్రతో శక్తి సంగ్రహితమౌతుంది
మెలకువతో ఖర్చు అయిపోతుంది
ప్రాణాయామంతో జాగృతిలోకి వస్తుంది
ధారణతో కేంద్రీకృతమౌతుంది
ధ్యానంతో ఊర్ద్వగమనం అవుతుంది
భయంతో క్షీణిస్తుంది
కోరికలతో  శక్తి నిర్వీర్యం అవుతుంది

ప్రేమతో శక్తి విస్తరిస్తుంది
సమాధిలో విరాట్ స్వరూపంతో ఒకటౌతుంది
సర్వాత్మలో లీనమౌతుంది
పదార్ధాన్ని పారమార్దికాన్ని కలిపే వారధిలా ఉంది.

🌹
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి