5, జులై 2025, శనివారం

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1

సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2

సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3

వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4

మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5

భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6

బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7

ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8

పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9

మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10

భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11

ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12

భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13

ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14

మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15

ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16

మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17

వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18

వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19

వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20

మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21

మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22

మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23

మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24

మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25

మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26

కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27

ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28

శకుని www.freegurukul.org/g/Bharatham-29

భీముడు www.freegurukul.org/g/Bharatham-30

దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31

మహారధి www.freegurukul.org/g/Bharatham-32

బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33

మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34

ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35

మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36

తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37

ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38

ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39

తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40

మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41
భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42

ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43

ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44

మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45

భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46

వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47

ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48

మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49

విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50
సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51

ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52

ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53

మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా నిజంగా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.ఇంకా మా దరిద్రం ,రోగాలు పోలేదేమిటి అని అడిగితే దేవుడు పరీక్ష పెడుతున్నాడు కర్రు కాలితే గదా తుప్పు వదిలేది అంటారు.మీరు ఎంతోమంది  పాస్టర్ల గురించి ఎంక్వయిరీ చేయండి.షుగర్,బీపీ కాన్సర్ లు ఉంటాయి. 


వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . వీరు ముఖ్యానంగా హిందూ స్త్రీలు ,పిల్లలను మతం మార్చడానికి అదేపనిగా ప్రయత్నిస్తుంటారు.కొంతమంది ఆడవారిని గూడా తీసుకువచ్చి మాకు ఇలా అద్భుతాలు జరిగాయి,జబ్బులు పోయాయి,దరిద్రం పోయింది అని మెస్మరిజం తో వారిలో ఆశ పుట్టించి కుటుంబం లో ఒకరిని ఎలాగోలా మార్చేస్తారు.ఆడవారిని మార్చేస్తే ఆమె భర్తను మరియు పిల్లలను మార్చేస్తుందని వారి నమ్మకం.ఇలా ఎంతమందిని మార్చగలిగితే వారికి వారి మినిస్ట్రీస్ నుండి  అంత ప్రొమోషన్ లు ఉంటాయి . ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.మన దేశాన్ని  పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి విదేశాల కుట్రతో  వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .


కరోనా సెకండ్ వేవ్ లో అధికారిక లెక్కల ప్రకారం  తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి.ఎన్నో క్రిష్టియన్ కుటుంబాలు జీవితాంతం గుండెలు బాదుకొంటూ కన్నీటి ప్రార్ధన చేస్తూ వారికొచ్చే ఆదాయంలో 10 వ వంతు పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికి వారి దారిద్య బాధలు తొలగవు. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.జాగ్రత్త : వారు మన ఇంటివైపు వస్తున్నారు అంటే శవాల నుండి ప్రేతాత్మలు మనఇంటివైపు వస్తున్నట్టే.


  గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి


భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్పమో  లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు


మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.


ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.

తోమాల సేవ :-

 

తోమాల సేవ :-


ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్ లక్కీడిప్ లో,ఆఫ్‌లైన్ CRO ఆఫీసు లక్కీడిప్ కౌంటర్ ద్వారా సామాన్య భక్తులు పొందవచ్చు. పలుకుబడి కలిగిన వారు టీటీడీ బోర్డు చైర్మన్ లేదా CMO పేషీ ద్వారా..


ఈ సేవ ఖరీదు 220/- మాత్రమే. కాని గర్భగుడిలో షుమారుగా నలబై నిమిషాల పాటు స్వామి వారి ముందు కూర్చుని ఆ మూలవిరాట్టుకు పుష్ప మాలలతో అర్చక స్వాములు అలంకరించి హరతులు ఇవ్వడం చూస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. దర్శనం చేసుకుని బయటకు వచ్చినా మనం మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. 


సుప్రభాతం జరుగుతున్నంత సేపు ఈ తోమాల సేవకు వచ్చిన భక్తులను ధ్వజస్తంభం దగ్గర ఆపి తరువాత గర్భగుడిలోకి( ఆనంద నిలయం) మగ వారిని ఎడమ వైపు ఆడ వారిని కుడి వైపుగా లోపలకు పంపుతారు.ముందు ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కలిగిన భక్తులను కూర్చోబెట్టి తర్వాత ముందుగా లైన్లో వచ్చిన వారిని కూర్చోబెడతారు. మీకు అవకాశం ఉంటే స్వామి వారి ముందు గదిలో ఓ మూల నిలబడి చూస్తుంటే...ఎందుకంటే కూర్చుని చూస్తుంటే మనకు పూర్తిగా భోగ శ్రీనివాసమూర్తికి జరిగే కార్యక్రమం కనపడదు.


మగవారు పంచె తప్పనిసరి.. షర్టు మరియు బనియన్ వేసుకోకూడదు. ఆడవారు సాంప్రదాయిక దుస్తులు దరించాలి.


మంగళ,బుధ,గురువారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏకాంతంగా నిర్వహిస్తారు. 


* ఇదే విధంగా అర్చన కూడా ఉంటుంది. కాకపోతే ఈ సేవలో స్వామి వారి సహస్ర నామార్చన చదువుతారు.చివరకు హరతులు..


ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఓ ఇరవై సార్లకు పైగా సేవ చేసుకునే భాగ్యం స్వామి వారు కల్పించారు. మీరు నిరుత్సాహ పడకుండా నిరంతరం లక్కీడిప్ వేస్తునే ఉండండి.


ఒక్కటి మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను మీరు తన నిజమైన, ప్రియమైన భక్తుడు అని స్వామి వారు భావిస్తే మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దగ్గరగా కూర్చోపెట్టుకుని  మీతో అన్ని సేవలూ చేయించుకుంటారు.ఇది మాత్రం నిజం.


సుప్రభాతం తర్వాత..


తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు... ఇంకా ఇతర విగ్రహాలకు పుష్పమాలలతోను, తులసి మాలలతోను అలంకరించే కార్యక్రమాన్నే 'తోమాలసేవ' అంటారు. భుజాల మీదినుంచి వేలాడేట్లుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని “తోళ్మలై" అంటారు. అదే “తోమాల"గా మారిందంటారు. తోళ్ అనగా భుజమని అర్థం.

ఆర్జితం చెల్లించిన భక్తులు కూడ ఈ సేవలో పాల్గొని దర్శించవచ్చు. అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొన వీలులేదు.


ఏకాంగి కాని లేదా జియ్యంగారులు పూల అరనుంచి సిద్ధంచేసిన పూలమాలను తీసికొనివచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు అర గంటసేపు జరుగుతుంది. ఈ అరగంట మనం స్వామి వారి ముందు కూర్చోవచ్చు.


సేవ చివర కర్పూర హారతి నక్షత్ర హారతి తో తోమాల సేవ పూర్తవుతుంది..

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🍂🥥💐🥭🍉🍁🍍🥀🍒🌹🍎

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🍂🥥💐🥭🍉🍁🍍🥀🍒🌹🍎

మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి. కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన 
మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.🙏

తులాభారం:-

 

తులాభారం:-


తమ కష్టాలు తీరి నప్పుడు, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు తులాభారం ఇస్తామని మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.


తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైనవి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.


గతంలో బరువుకు తగ్గ వస్తువును మోసుకుని వెళ్ళి సమర్పించేవారు. ఇప్పుడు తులాభారంలో కూర్చోబెట్టి కిలో చొప్పున ఆ వస్తువు రేటు చెల్లిస్తే మీకు రసీదు ఇస్తారు.అది హుండీలో వేస్తారు.


ఇప్పుడు రేట్లు :-

రూపాలు నాణేలు kg 202/-

రెండు రూపాయల నాణేలు kg 332/-

ఐదు రూపాయల నాణేలు kg 555/-

పంచదార kg 40/-

పటికబెల్లం kg 30/-

బెల్లం kg 38/-

బియ్యం kg 41/-(చివరి నాలుగు రేట్లు మార్కెట్ ని బట్టి మారుతుంటాయి)

ఉదాహరణకు మీరు 58 kgలు ఉంటే..మీరు ఐదు రూపాయల నాణేలు మొక్కుకుంటే 58*555=32,190/


**ఈ తులాభారం మహాద్వారం నుండి లోపలకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఎడమ చేతి వైపు ఉంటుంది. దీనిని ఎటువంటి టిక్కెట్ అవసరం లేదు.తులాభారం తరువాత మీరు దర్శనానికి వెళ్ళడమే..

*కృష్ణార్పణం..!* ➖➖➖✍️


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                   *కృష్ణార్పణం..!*
                   ➖➖➖✍️

```ఒక పేద, అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది.

ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ ‘కృష్ణార్పణం‘ అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ ‘కృష్ణార్పణం’ అనడం మొదలుపెట్టింది.

ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకొనేముందు కృష్ణార్పణం, భుజించేముందు, భోజనం తరువాత, బయట కెళ్ళేముందు, ఇంటికొచ్చిన తరువాత.. కృష్ణార్పణమే..! చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ ‘కృష్ణార్పణం’ అనటమే!

ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.

ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతీరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. ఎవరికీ అర్ధం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరిమీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆదేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.

రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.

ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ ‘కృష్ణార్పణం’ అంది.

మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... 

ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు.

ఆమె కటికనేల పై పడుకొనే ముందు ‘కృష్ణార్పణం’ అనుకుంది.

రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.

ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు.

ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది.

అప్రయత్నంగా “కృష్ణార్పణం”అనగానే గాయం మాయమయ్యింది. 

అదిచూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.

అదేసమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు... “మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వట్లేదు” అని వాపోయారు.

రాజు గారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. “నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిం”దని.

“నాకు తెలియదు” అంది.

సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె ‘కృష్ణార్పణం’ అనే అన్నాను అని బదులిచ్చింది.

సభలోని వారందరూ హతాశులయ్యారు.

ఆమెని ‘నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?’ అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.

సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. 

ఆమెకు ‘కృష్ణార్పణం’ అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీద పడ్డారు.

ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. ‘అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్తపోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది’ అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.

చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు ‘కృష్ణార్పణం’అనడం మొదలుపెట్టింది. 

శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.

సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్నితండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.

ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా?!✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

19, జూన్ 2025, గురువారం

మంచి సావాసం.....

 🔔 అనగనగా... 🔔


మంచి సావాసం.....


ఒక రోజు సాయంత్రం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.


కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు. 

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.


అప్పుడు అందులోంచి ఒక పెద్దమనిషి లేచి ఇలా అన్నాడు... "చూడండీ... మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు'. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చేప్పేది జాగ్రత్తగా వినండి... ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో... ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో... అందరి కోసం ఒక్కరు చస్తారో... ఆలోచించుకోండీ...” అన్నాడు.


అప్పుడు ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి మొదలుపెట్టారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. అలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే... అని అందరూ అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.


కాని... బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా... వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చింది, తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు... బస్సుపైన. అవును... బస్సుపై పిడుగు పడి అందులోని వున్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంత వరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు మిగిలిన వారి అందరిని కాపాడింది.


*అందుకే... మన పూర్వీకులు చెప్పేవారు... ఎల్లప్పుడూ మంచివారి తోనే సావాసం చేయమని. మంచివారితో సావాసం చేయడం వల్ల వారి వారి చెడు కర్మ ఫలాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని.

మనదేశపు కోడలు_సోనియానా? #ఎమిలీ యా?

 

మనదేశపు కోడలు_సోనియానా? #ఎమిలీ యా?


ఒకసారి 1940 వ దశకం లోకి వెళదాం. ఈ కథ ఒక జర్మన్ మహిళది. పేరు #Emilie_Schenkl. ఈ పేరు మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. విని ఉండకపోయినా , తప్పు మీది కానే కాదు. చరిత్రపుటల నుంచి ఈమె పేరుని మాయం చేసిన చరిత్రకారులదే. 

                     ఈమె 1937 లో ఒక భరతమాత ముద్దుబిడ్డ ని వివాహం చేసుకున్నది. మెట్టినింటిగా ఆమె భారతదేశాన్ని వరించినా , ఆమె దురదృష్టంకొద్దీ  ఏనాడూ ఈదేశం ఆమెకు స్వాగతం పలుకలేదు. ఆమెకోసం మంగళగీతాలు పాడలేదు. ఆమెను గురించిన చర్చని కూడా ఈదేశం ప్రజలు ఏనాడూ చేయలేదు. ఆమె ఎలా బతుకుతున్నదో కూడా పట్టించుకోలేదు. 

                      7 ఏళ్ళ వైవాహిక జీవితంలో తాను భర్తతో గడిపినది 3 సంవత్సరాలు మాత్రమే. తనను , తన పిల్లను వదిలేసి భర్త బయలుదేరి వెళ్ళిపోయాడు. ముందు తన దేశానికి స్వాతంత్ర్యం తీసుకునిరావాలనీ , అనంతరం హాయిగా దేశానికి వెళతాననీ చెప్పాడు. అయితే అలా జరగలేదు. 1945 వ సంవత్సరంలో తన భర్తను విమాన ప్రమాదంలో మరణించినట్లుగా ప్రకటించింది. 


అప్పటికి ఎమిలీ యువావస్థలోనే ఉన్నది. తాను తలచుకుంటే , పాశ్చాత్యసంస్కృతి ప్రకారం హాయిగా మరొక వివాహం చేసుకుని శేషజీవితాన్ని గడిపేసేది. కానీ , ఆమె అలా చేయలేదు. సంఘర్షమయ జీవితాన్నే ఎంచుకున్నది. 

          

ఎంతో తక్కువజీతానికి టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ, కూతురిని పెంచుతూ వచ్చింది. ఎవరినుంచీ ఏమీ ఆశించనూ లేదు, ఎవరిమీద ఫిర్యాదు చేయనూ లేదు. ఇంతలో భారతదేశం పూర్తి స్వతంత్రదేశమయ్యింది. తన భర్త ఏదేశంకోసం పోరాడాడో ఆ దేశం స్వాతంత్ర్యమయినదని సంతసించి ఒకసారి భారత్ ను చూడాలని ఆశ పడింది. 

          కానీ ఈ దేశంలో ఒక కుటుంబం ఈ మహిళ భారత్ వస్తోందని తెలిసి గజగజ వణికిపోయింది. ఏ మహిళకయితే సమ్మానపూర్వకంగా మనదేశ పౌరసత్వాన్ని ఇవ్వాలో , ఆ మహిళకు వీసా కూడా జారీ చేయకుండా ఇబ్బందులపాలు చేసింది. చివరకు ఆమె కష్టాలతో కూడిన జీవనాన్నే గడుపుతూ 1996 లో  దూరంగానే తన తనువు చాలించింది.


ఆమె పూర్తిపేరు ఎమిలీషెంకల్బోస్ . ఈ దేశం ఎంతో ప్రేమించిన , గౌరవించిన , అనుసరించిన జననాయకుడు సుభాష్ చంద్రబోస్ ధర్మపత్ని ఆమె.  ఆతల్లిని ఈ దేశం రాకుండా ఎంతగా కుట్రలు పన్నారో మీరు ఊహించవచ్చు. ఆమె ఈదేశంలో అడుగుపెడితే భారతప్రజలు ఆమెను నెత్తిన పెట్టుకుంటారని పసిగట్టిన ఆ జంట , తమ రాజకీయజీవితానికి ఆమె స్వస్తి పలుకగలదని విశ్వసించింది. ఆమె వచ్చి ఉంటే , అదే జరిగేదేమో. 


💪🏼💪🏼భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳

ధృతరాష్ట్ర కౌగిలి.

 ధృతరాష్ట్ర కౌగిలి.


ధృతరాష్ట్ర కౌగిలి అంటారు, అంటే వదిలించుకోలేనిదానిని, ఆ కౌగిలిలోకి పోతే నాశనం కాక తప్పని దానిని, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. దీన్నే సాధారణంగా భల్లూకపు పట్టూ అంటారు, భల్లూకం అంటే ఎలుగు, ఇది గనక దాడిచేసి పట్టుకుంటే వదిలించుకోవడం అసాధ్యం. ధృతరాష్ట్ర కౌగిలి కూడా అటువంటిదేనట, వివరాలకోసం భారతంలోకెళితే……………భారతం. స్త్రీ పర్వం. ఆశ్వాసం-౧ ౧౧౭ నుంచి


భారత యుద్ధం పూర్తయింది, దుర్యోధనుడు గతించాడు. కృష్ణుడు,ద్రౌపది కూడా ఉండగా, ధర్మరాజిలా అన్నాడు,తమ్ములతో ”నూర్వురు పుత్రులను కోల్పోయిన శోకంలో ఉన్న ధృతరాష్ట్రుడు,గాంధారీ సహితంగా పరివారంతో యుద్ధరంగానికొస్తున్న వార్త తెలిసింది, ఆయనను చూడక ఉండక కుదరదు, కదలండి” అన్నాడు. కృష్ణ, భీమార్జున నకుల సహదేవులు,సాత్యకి,ద్రౌపది, బంధు జన స్త్రీ వర్గం కూడా రాగా బయలు దేరాడు, ధర్మరాజు. అంతకు ముందురోజు రాత్రి దుర్యోధనుని పరివారంలోని స్త్రీలను హస్తినాపురికి క్షేమంగా చేర్చి,ధృతరాష్ట్రుని చూడడం కుదరక, మరునాడు ఉదయమే తిరిగివచ్చిన యుయుత్సుడు కూడా బయలు దేరాడు.


వీరు యుద్ధరంగానికి చేరేటప్పటికి ధృతరాష్ట్రుడు కూడా అక్కడకు చేరాడు,పరివారంతో. పరివారంలో ఉన్న స్త్రీలు పాండవులను చూడడంతోనే చేతులెత్తి ఏడుస్తూ, ”ఈ రాజుకి దయ ఎక్కడుంది, ధర్మమెక్కడిది?తండ్రులను,మామలను,కొడుకుల్ని,తోబుట్టువులను, చంపించిన కౄరత తప్పించి” అన్నవారు కొందరు. ”చేతకానివాడా! తాతని,గురువుని చంపే నేర్పు ఎక్కడ సంపాదించా”వని అర్జునుణ్ణి తూలనాడేరు, మరి కొందరు ”ఇంతమందిని చంపేమని గొప్పపోనక్కరలేదు,పొంగిపోనక్కరలేదు, ద్రౌపది కొడుకుల్ని, అభిమన్యుడిని, అంతెందుకయ్యా! చెల్లిలి మగడు సింధురాజుని చంపుకున్నారు” అని మాటలాడేరు, పాండవులు తలవంచుకు వెళుతుండగా. ఇలా పలుకుతున్నవారి మధ్యనుంచి కొడుకుల్ని కోల్పోయిన తండ్రి ధర్మరాజు, కొడుకుల్ని కోల్పోయిన మరో తండ్రి ధృతరాష్ట్రుని చేరి, పక్కనున్నవారు ధృతరాష్ట్రునికి చెబుతుండగా పాదాభివందనం వేశాడు, ధర్మరాజు. మనసులో అప్రియము,కొత్తదనము తోచగా దీనవదనుడై ధర్మరాజును కౌగిట చేర్చి అనునయవాక్యాలు పలికాడు. ఆ తరవాత భీమ,అర్జున,నకుల,సహదేవులూ వచ్చారన్న మాట విని, భీముడనే మాట వినేటప్పటికి పెద్దకోపంతో,రగిలిపోయాడు. ధృతరాష్ట్రుడు అధర్మమైన పనికి తయారవుతున్నాడనుకుని కృష్ణుడు,భీమసేనుని చెయ్యిపట్టినిలిపి, అప్పటికే తాను తయారు చేయించి తెప్పించి ఉంచిన భీమసేనుని ఇనుప ప్రతిమను ధృతరాష్ట్రుని ముందుపెట్టించాడు. ధృతరాష్ట్రుడు ఆ ఇనుప ప్రతిమను భీమునిగా తలచి, రెండు చేతులతో ఆ ప్రతిమను కౌగలించుకుని ముక్కలుగా చేశాడు.


వెయ్యి ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు భీముని ప్రతిమను ముక్కలు చేసి మనసులో సంతోషం వెల్లి విరియగా హా!భీమసేనా అంటూ ఏడ్చాడు. తానూహించినట్లే జరిగిన సంఘటనతో కృష్ణుడు చిరునవ్వుతో,ధృతరాష్ట్రునితో ”నీ బలంగురించి నాకు తెలియదా! నీ కౌగిలిలో కి వచ్చినవారి నెవరినైనా చంపగలవు, చావకుండడం వాళ్ళ వశమా! నీవిలా చేస్తావనే ఇనుప ప్రతిమను పెట్టించాను, ఏది ఎలాజరగాలో అలా జరుగుతుందన్న సంగతి మరచిపోయి ఇలా బేలతనానికి గురయ్యావు. మరోమాట చెబుతా విను, ఇప్పుడు నువ్వు భీముణ్ణి చంపినంతలో చచ్చిన నీకొడుకులు తిరిగొస్తారా? నీ కొడుకు చేసిన ఎన్ని దురంతాలకు మేము గురి కాలేదు? జరిగిపోయినదాని గురించి వగచి ఉపయోగం లేదు అన్నారు.


ఇదీ ధృతరాష్ట్ర కౌగిలి కత, చెబితే శానా ఉంది, వింటే ఎంతో ఉంది…ఇక్కడితో ఆపేద్దాం 🙂


ధృతరాష్ట్రుని ముందు ఇనుప ప్రతిమను పెట్టినపుడు, కౌగలించుకున్న వెంటనే అది భీముడు కాదన్న సంగతి తెలియలేదా అనిపిస్తుంది కదా! కోపంలో ఉచుతానుచితాలు మరచిన ధృతరాష్ట్రునికి మతి వశం తప్పింది, అందుకే అదెవరో పోల్చుకోలేకపోయాడు.ఆ తరవాత దొంగ ఏడుపు ఏడవడం కొత్త సంగతేం కాదు, ఇదివరలో ఇలాగే పాండవులు లక్క ఇంటిలో కాలి చనిపోయారన్నపుడూ ఏడ్చాడు.

"ఋణాను బంధం"

 "ఋణాను బంధం"

                  

పూర్వకాలమందు ధారానగరంలో ధర్ముడు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు.చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి ఝూము ఝాముకీ "దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండండి" అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది. కానీ ఎన్నాళ్లకూ సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊర్లోనే ఒక గొప్ప పండితుడు ఒకాయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకొని ఇంటికి పోయే వేళ పండితుడు ఏటికి స్నానానికి వచ్చేవేళ ఒకటి. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు జీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు "ధర్మన్నా? పిల్లలు లేరని ఎందుకోయీ విచారపడతావు?

"ఋణాను బంధ రూపేనా 

పశు,పత్నీ సుతాలయాః"

అన్నారు. అనగా "పెళ్ళాం, పిల్లలు,గొడ్డు, గోదా, ఇల్లు, వాకిలి ఇవన్నీ కేవలము ఋణానుబంధం వల్లనే వస్తాయి. ఋణం తీరిపోవడంతో పోతాయి".అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధవల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరి కదా, ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే వాడు నాకు ఋణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి ఋణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది. అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని ధర్మన్న తయారుచేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు ఉత్త పుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ ఋణాన పడి ఉండటానికి మాకు ఏమంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్లు. ఇలాగ ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకుని ధర్మాన్న మరొక ఉపాయం పన్నాడు. "ఊరుకీ ఏరుకీ మధ్యన ఇసుకపర్ర  ఇంచుమించు క్రోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్య దారిలో పెట్టి వస్తాను. మిట్టమధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిని రాకపోతాడా. ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా. ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు ఋణ పడక ఏమి చేస్తాడు?" అని ఆలోచన చేశాడు.ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్లి ఇసుకపర్రలో నడిచే దారిలో పెట్టాడు.సాయంత్రం వెళ్లి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉన్నది.ఎన్నాళ్లు చూసినా చెప్పులు ఎవరూ తోడుగుకొని పోయేటట్లు కనపడలేదు." అయ్యో! నాకైతే సంతానం ప్రాప్తి లేదు కాబోలు. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుగుకొనక పోవడం ఏమిటి?నాకు ఋణ పడకపోవడమేమిటి?" అనుకుని ధర్ముడు నిరాశ చెందాడు. అయినా పట్టుదలగల ధర్మన్న మరి కొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిచే దారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్లి అది ఏమైందో అని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూసేసరికి ఆ చెప్పుల జత కనపడలేదు. "నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది. నా అదృష్టం పండింది" అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు.ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలని ఆదర్దా కూడా వాడికి లేదు. ఋణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురు పనిమీద పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగా మధ్యాహ్నం రెండు ఝాములు అయింది.పండితునికి చెప్పులు లేక పోవటం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కినాయి. అంతలో ధర్మన్న చెప్పుల జత కనబడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుకున్నాడు."ఎవడో మాదిగ వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు" అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురుచూస్తూ నించున్నాడు. కానీ ఎవరు ఆయనకు కనబడలేదు." సరే జోడు ఎవరు పెట్టింది ఊళ్లో కనుక్కొని డబ్బు ఇచ్చేయవచ్చునని" తలచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్లో మాదిగ వాళ్ళందరినీ వాకబు చేశాడు. కానీ వాళ్ళందరూ "మాకు తెలియదంటే మాకు తెలియదు" అనేసారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో ననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు. చెప్పులు తాలూకు ఋణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరి కొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు.ఋణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుని వంటి మగ శిశువును కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లీ తండ్రీ పిల్లవాడిని చూసుకుని మురిసిపోయారు. వారికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లేని చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు.

ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్లయితే వానికి తనకు ఋణం తీరిపోతుందనీ, తీరిపోయినట్లయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తను ఫలానా పండితుడు అన్న సంగతి సంగడికి తెలుసు. తను ధర్మడింట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. "ఎంత త్వరలో ఆ చెప్పుల ఋణం తీర్చుకుంటానా, అని ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటా"అని సంగడు ఆత్ర పడేవాడు. కానీ అతను సంపాదించు కొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకపోవడం వల్ల అనుకున్నంత త్వరగా తీరడం లేదు. ఇలా ఉండగా ధర్ముడు ఒకనాడు ఊరికి పోవాల్సి వచ్చింది అతను కుమారుడిని పిలిచి "నాయనా! నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి నాలుగు ఝాములి ప్రజలను మేల్కొలప వలసింది" అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగడు ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్ళాడు. అతనికి తోడు వచ్చిన తలారి "సంగన్నా! ఇప్పుడు ఝాము రాత్రి అయింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి" అన్నాడు. అప్పుడు సంగడి రూపంలో ఉన్న ఆ పండితుడు 

"మాతా నాస్తి పితా నాస్తి

నాస్తి బంధు సహోదరః

అర్థం నాస్తి గృహం నాస్తి

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

అని కంఠమెత్తి అందరికీ మెలకువ వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి" ఈ శ్లోకానికి అర్థం ఏమిటి?" అని అడిగాడు. దానికి సంగడు " తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు, సోదరులు లేరు.ధనమూ లేదు, ఇల్లూ లేదు ఇవన్నీ ఉత్త మాయ.కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి"అని అర్థం చెప్పాడు. సంగడు. ఈ వేదాంతం బోధించేసరికి రెండో ఝాము గడిచి పో వచ్చింది. అప్పుడు అతను 

"కామ క్రోధం లోభశ్చ

దేహే తిష్ఠన్తి తస్కరాః

జ్ఞానరత్నా పహారాయ

తస్మాత్ జాగ్రత్త!జాగ్రత్త!"

అని శ్లోకం చదివి మళ్లీ ప్రజల్ని మేల్కొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడని తోటివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. "కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించటం కోసం మన దేహంలో దాగి ఉన్నారు. జాగ్రత్త"అని సంగడు అర్థం చెప్పాడు. ఈ అర్థం వినే వరకు పక్కన ఉన్న తలారి వానికి ఆశ్చర్యం అనిపించింది. ఓయీ సంగన్నా నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబూ, తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు. కానీ ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. ఈ చిత్రాలు ఎప్పుడు నేర్చినావో గమ్మత్తుగా ఉన్నది" అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. మూడవ ఝాము గడిచేసరికి సంగడు మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. 

"జన్మ దుఃఖం జరా దుఃఖం

జాయా దుఃఖం పునః పునః

సంసారం సాగరం దుఃఖం

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

ఇది విని తోటివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. "ఏమిటోయీ సంగన్నా! అన్ని రకాల దుఃఖాలు ఏకరు వు పెడుతున్నావు.వీటికి కూడా అర్థం చెబుదూ" అని అతను కోరగా దానికి సంగడు "జన్మ ఎత్తడం ఒక దుఃఖం. తరువాత భార్యతో ఉండడం ఒక దుఃఖం. ముసలితనం రాగానే అదొక దుఃఖం. ఇలా ఒక దానివెంట మరొక దుఃఖం వస్తువునే ఉంటుంది. అసలు దుఃఖము అనే కెరటాలతో కూడుకొని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేల్కొని జాగ్రత్తగా ఉండండి"అని హెచ్చరించాను అన్నాడు. దానికి తోటివాడు "మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలు పెట్టావేమిటి? అని అనే అంతలో నాలుగో ఝాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగడు

"ఆశారాం బద్ధతే లోకే

కర్మణా బహు చింతయా

ఆయఉః క్షీణం నజానాతి

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోటివాడు మరీ అబ్బురపడినాడు.సంగడి యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోటివాడు కోరేసరికి సంగడు" కర్మచేత, చింతచేత, ఆశచేత, ఈ లోకం బంధించబడుతున్నది. వీటిలో చిక్కుకుని పోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడాలి" అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడి మొదటి చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెపుతాడేమోనని మేల్కొన్నాడు. అతనికి మిగతా మూడు శ్లోకాలు కూడా వినిపించినవి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సంగడు రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగడికి నమస్కరించి "మీరెవరో మహానుభావులు గానీ, సామాన్యులు కారు.తలారికేమిటి? ఇంత అద్భుతమైన పాండిత్యమేమిటి? నా యందు దయవుంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి" అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికి ఇచ్చారు. అయితే సంగడు ఈ ధనం ఏమి చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకు ఇచ్చి ఋణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరి నుంచి ధర్ముడు వచ్చాడు.

తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను ఏమిటా ఉపాయము అని ఆలోచిస్తూ ఉండగావాళ్ళ వీధిలో ఇళ్లు అంటుకున్నాయి. తలారి వాళ్లంతా సామానులు తగలబడి పోకుండా బయటపడవేస్తున్నారు. సంగడు కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామాన్య తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగడు తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరాహల సంచి కూడా తండ్రికి అందించాడు ఆ కంగారులో "ఇదేమిటి?" అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన  సామాన్లతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన ఋణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగడు ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్లయిన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటి తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడైనాడు.