21, ఫిబ్రవరి 2024, బుధవారం

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

https://www.youtube.com/watch?v=Pvcp1_cAYic

🪷నానబెట్టిన అవిసె గింజలు( flax seeds): ఈ గింజలు రోజూ తింటే.. గుండె సమస్యలు రావు..!🪷

అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మలబద్ధకం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. 

అవిసె గింజలు LDL (చెడు కొలెస్ట్రాల్)ను కరిగించి, HDL (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. 

🌷అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దిని వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను నిర్వహించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మెరుగ్గా పనిచేస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తినే వ్యక్తుల్లో గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

🌷బీపీ కంట్రోల్లో ఉంటుంది..

అవిసె గింజలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.

🌷క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది..!

మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజల్లో ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్నాన్స్ ఉంటాయి. ఈ గింజల్లోని ఒమెగా-3 యాసిడ్కు రొమ్ముక్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

🌷ప్రోటిన్ స్టోర్ హౌస్..
మీరు వెజిటేరియన్స్ అయితే.. మీకు అవిసె గింజలు సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. వీటిలో ప్రోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజూ మీ డైట్లో చేర్చుకుంటే.. ప్రోటిన్ లోపం దూరమవుతుంది.

🌷జుట్టు బలంగా..
దీనిలో ఉండే.. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచే కొలాజెన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. అవిసె గింజలు జుట్టు ఆరోగ్యంగా ,మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో విటమిన్-బి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టుకు బలం చేకూర్చడంతో పాటు జుట్టు పొడిబారకుండా చేసి సిల్కీగా ,మెరిసేలా చేస్తుంది.

ఎలా తీసుకోవాలి..❓
వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్ చేసి, పొడిచేసుకుని తింటే మంచిది. వీటిని వేయిస్తే.. దీనిలోని హానికారక ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి, జెల్లీలా మారతాయి . అంటే ఇవి నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే చెంచా తిన్నా, అరచెంచా తిన్నా తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసెగింజల ప్రయోజనాల్ని సంపూర్ణంగా పొందవచ్చు . వీటిని పొడి రూపంలో తినాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రిజ్లో దాచిపెట్టాల్సిందే. లేదంటే పోషకాలు త్వరగా పోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి