6, మే 2023, శనివారం

🔔రామ నామ మహిమ🔔

 🔔రామ నామ మహిమ🔔

       🚩🌳🚩


హనుమంతుడు ఆశోకవనంలో  సీతాదేవిని దర్శించి , సీతమ్మవారి వద్ద నుండి చూడామణి తీసుకుని  రాముని వద్దకు తిరిగి

వెళ్ళాడు.

సీతాదేవిని దర్శించాను అని తెలిపి శ్రీ రాముని చరణాల వద్ద సీతమ్మ యొక్క చూడామణిని వుంచాడు.  ఆనందంతో రాముడు తనని

ఆలింగనం చేసుకుంటాడని ఆశించిన హనుమకి నిరాశే  మిగిలింది.

చూడామాణిని చూసిన రాముని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు  రాముడు అడిగిన ప్రశ్న హనుమంతునికి విస్మయం కలిగించింది.  ఆంజనేయుని చూసి  రాముడు 'హనుమా.. నేను చెప్పినదేమిటి ? నీవు చేసినదేమిటి ? సీతాదేవిని చూసి రమ్మని నిన్ను పంపాను. కాని నీవు లంకనే కాల్చి 

రావణుని ప్రజలను తీవ్రమైన బాధలకు గురిచేశావు.

ఇదంతా నీవు నా అనుమతితోనే చేశావా ?అని అడిగాడు.

" రామప్రభూ .. రావణుని అనుచరులు నా తోకకు నిప్పు ముట్టించారు.  రావణుడు వేడుకతో చూస్తూ ఆనందించాడు. నేను ఆ నిప్పును ఆర్పేందుకు అటు ఇటూ తిరుగుతూ  నా వాలమును ఆడించాను.  ఆ సమయంలో  మంటలు చెలరేగి లంకాపట్టణం

కాలిపోయింది. ఇది రావణుడు చేసిన

తప్పు వల్లే జరిగింది" అని సంజాయిషీ చెప్పాడు హనుమ.


నీ తోకకు అంటించిన అగ్ని  వల్ల నీ శరీరము  కాలి బాధ కలిగినదా ?"


" లేదు...రామా! నేను తమ నామమునే

జపిస్తూ నిశ్చింతగా వుండిపోయాను. రామ నామ మహిమ వలన

నాకు ఏ బాధా కలుగలేదు" అనిఅన్నాడు హనుమ. నిన్ను నీవు  కాపాడుకోవడానికి జపించిన మంత్రాన్ని లంకా ప్రజలకి  కూడా చెప్పిన పిదప కదా

నీవు లంకా దహనం చేయవలసినది.నిన్ను

నీవు కాపాడుకొన్నావు. కాని  లంక ప్రజలను ఇబ్బందులపాలు చేశావు.  నీవు చేసిన ఈ పాపకార్యంలో నన్ను భాగస్వామిని చేశావుకదయ్యా హనుమ ? అని  రాముడు చింతించాడు. హనుమంతుడు రాముడి కాళ్ళమీద పడి ."  అజ్ఞానంతో అకార్యం చేసి మీకు విచారం కలిగించాను నన్ను మన్నించండి, స్వామీ అని దీనంగా వేడుకున్నాడు.


" ఒకవేళ రావణుడు తన మనసు మార్చుకుని సీతాదేవిని నాకు అప్పగించినా నేను లంకకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించావు. అగ్నివలన దహనమైన లంకని తిరిగి పునరుధ్ధరించి, భాధించబడినవారికి సేవలందించి యీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకొనేతీరాలి "

అని అన్నాడు రాముడు. 

రాముని కరుణార్ద్ర హృదయానికి హనుమ చలించిపోయాడు

రాముని పాదాలకు నమస్కరించి,  హనుమ "రామ..రామ ..అంటూ రామనామ స్మరణ ప్రారంభించాడు.

ఇప్పుడు హనుమంతుడు జపించినది తనకోసం కాదు, తనవల్ల నష్టపోయిన

లంకా ప్రజల కోసం.

సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు

 సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి.  మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే  వంట చేయలేం కదా?  అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి.  ఎంతకాలం 'నేను' అనే‌ భావనతో ఈ‌ లోకంలో  తిరుగుతూ‌ ఉంటామో అంతకాలమూ సాధకులమే.  ఈ‌ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే!  ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ‌ అక్కరలేదు వంటా అక్కర లేదు.  అది వేరే‌ స్థితి.


ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి.  దాన్ని బ్రహ్మబీజం అంటారు.  అది ముల్లోకాల్నీ‌ పవిత్రం చేసే‌ పరమమంత్రం. 


ప్రణవం అంటే ఓం‌కారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓం‌కారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.  ఈ‌ ఓం‌కారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి.  ‌ఓం‌కారం గురించి ఎంతైనా చెప…

మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి.  అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం.  ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది.  మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే  ఊతం ఇస్తే,  వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది.  అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి. 


ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది.  లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ?  ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.


సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు.  సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి.  రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ,  నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి,  క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట.  తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట.  ఈ‌ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ‌ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ‌ త్రిగుణాలనే‌ రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం‌ అన్న మాట.  మనం‌ ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు. 


ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది.  నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.


మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే,  ఆకర్షిస్తూనే ఉంటాయి.  రకరకాల అనుభవాల్ని ఈ‌ త్రిగుణాలు అందిస్తూ,  అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.


కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి?  అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది.  అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.


ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి?  వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా?  ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది.  కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది.  అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం.  విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు.  అదే కైవల్యం, అంటే మోక్షం. 


ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది .  ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు.  ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.


మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు.  కాని జీవుడిగా మిగిలే ఉంటాడు.  ఈ‌ స్థితిలో వాడికి ప్రపంచంతో‌ ఏవిధమైన సాంగత్యం ఉండదు.  వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం.  ఈ‌ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు.  ఈ‌ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని. 


ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి.  క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది.  ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.


ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా?  అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే‌ భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే.  పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?


ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది.  నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది.  నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే‌ కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును.  కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది.  వచ్చే జన్మలో అది కొనసాగుతుంది.  ఈ‌ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు.  ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.

జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

 జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

✍🏻...దాసు కిరణ్‌

💫🌈💫🌈💫🌈


💐 జ్ఞాన సిద్ధిని గురించి వివరించే లోక ప్రసిద్ధమైన ఒక ఉపమానం వేదాంతంలో ఉంది. అదే... ‘రజ్జు సర్ప భ్రాంతి’. చీకటిలో తాడును చూసి ‘పాము’ అని భ్రాంతి చెందుతాం. ఆ భ్రాంతి కారణంగా భయం ఏర్పడుతుంది. ఇక్కడ పాము అంటే ‘నేను’ అనే భావన. ఆ భావన ఉన్నంత వరకూ... కోరికలు, బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ‘జ్ఞాన సిద్ధి’ అనే వెలుగులో ‘నేను’ అనే భావన కరిగిపోయినప్పుడు (‘పాము కాదు తాడే’ అని తెలిసినప్పుడు) అవన్నీ పటాపంచలవుతాయి. నిరంతరం ఈ స్థితిలో ఉండడమే మోక్ష సిద్ధి. 


💐 జ్ఞాన సిద్ధి ఒక ఘటన. చాలా సందర్భాలలో అది ఆకస్మికంగా జరుగుతుంది. ఈ విషయంలో చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం శ్రీ రమణ మహర్షిది. 


💐 ఆయనకు ఒక రోజు మధ్యాహ్నం... కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మతత్త్వం తెలిసిపోయింది. కానీ జ్ఞాన సిద్ధి చాలా నెమ్మదిగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆకస్మికంగా జరిగినా, నెమ్మదిగా జరిగినా... జ్ఞానసిద్ధి కలిగిన తరువాత... ‘ఏదో జరిగింది’ అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. అది ఎప్పుడు, ఎలా అవుతుందో ఎవరూ చెప్పలేరు. సృష్టి, స్థితి, లయ... వీటికి అదనంగా మరో రెండు పార్శ్వాలు ఉన్నాయంటారు. అవి.. మాయ, అనుగ్రహం. ఏ కొందరికో, ఎప్పటికో... కృప ద్వారా ‘మాయ’ అనే పొర తొలగిపోవడం జరుగుతుంది. 


💐 ఈత కొట్టడం వచ్చిన తరువాత... ఈత రాని స్థితి ఇక ఎప్పటికీ ఎలా ఉండదో... జ్ఞాన సిద్ధి పొందిన తరువాత పూర్వపు స్థితి ఉండదు. ఇది వినగానే... సాధకులకు తప్ప... చాలామందికి భయం కలుగుతుంది. ‘అదేమిటి? నేను లేకపోతే ఇంకేం ఉంటుంది? జీవితం అన్న తరువాత బాధలు ఉండడం సహజం. అన్నీ వదిలేస్తే జీవితానికి గమ్యం, సార్థకత ఏముంటాయి? బతుకు నిస్సారం అవుతుంది కదా?’... ఇలా సాగుతాయి ఆలోచనలు. 


💐 కుటుంబంలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే... ‘సన్యాసుల్లో కలిసిపోతాడో ఏమిటో?’ అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ ఆలోచనలకు కారణం అజ్ఞానం. నిజానికి జ్ఞానుల్లో సన్యాసుల కన్నా గృహస్తులే అధికం. జ్ఞాన సిద్ధి పొందిన తరువాత... సాధారణ జీవితాన్ని ఇంకా ఆనందంగా గడుపుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. దీనికి శ్రీ రమణ మహర్షి ఒక ఉపమానం చెప్పారు... ‘‘కాలిన తాడు ఆకారం తాడులాగే ఉంటుంది, కానీ దానికి బిగువు ఉండదు. అలాగే జ్ఞానులను బంధాలు కట్టివెయ్యలేవు. కానీ బంధాలకు దూరంగా ఉండడం కూడా జరగదు’’ అని.


🔅"మనస్సు యొక్క స్వభావంపై స్థిరమైన మరియు నిరంతర పరిశోధన ద్వారా, మనస్సు ' నేను' సూచించే అది( తత్ ) కి రూపాంతరం చెందుతుంది; మరియు అదియే నిజానికి ఆత్మ ."


గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,

జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం🙏🏻

అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏

 అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏


కాంతపాళ్యం శ్రీ ఆది శివలింగాచార్య సీనందల్ విశ్వబ్రాహ్మణ పీఠం - తిరువణ్ణామలై నంది


తమిళనాడులోని తిరువణ్ణామలై  కి దగ్గరలో ఉన్నటువంటి కాంత పాళ్యం అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ గురు పీఠం ఉన్నది.ఇది చాలా ప్రాచీనమైనది.మహాభారత కాలము నాటి ఋషుల తపస్సులు ఆచరించిన అరణ్యం గా ప్రసిద్ధి.


తిరువన్నామలై ప్రాంతమును మొఘల్ లు పరిపాలచేసే రోజుల్లో తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవస్తానమ్ లో ఉన్న పెద్ద నంది కి నంది పూజ చేస్తున్నారు.


అప్పుడు అక్కడికి వచ్చిన మొఘల్ రాజు మేము ఆహారం గా స్వీకరించే జీవిని మీరు పూజ చేస్తున్నారు అని అక్కడ పూజ నిర్వహణ చేస్తున్న ఒక 5గురు భక్తులను ని అపహాస్యం గా అంటే ఆ 5 గురు కూడా ఇది మీరు ఆహారం గా స్వీకరించే ఎద్దు కాదు మా సంప్రదాయం లో నందిని అరుణాచలేశ్వర స్వామి  వాహనము గా భావిస్తాము అని చెప్పారు.


ఆ సందర్భములో అక్కడికి ఒక తేజస్సుకలిగిన  బాలుడు వచ్చాడు.


ఈ బాలుడికి మొఘల్ రాజు కి కాస్త వాగ్వివాదాము జరిగినది.మొఘల్ రాజు ఇచ్చిన మాంసమును పువ్వులు గా మార్చాడు.


ఈ మాయలు నేను సహించను అని ఆ మొఘల్ రాజు ఈ అరుణాచలేశ్వరుడి ఎదురుగా ఉన్న నంది నేను రెండు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేయబోయాడు


అప్పుడు ఆ బాలుడి తపస్సు కి నంది సహజముగా తన కూర్చున్న స్థితిని కుడి కాలు మడిచి ఎడమ కాలు ముందుకు పెట్టింది.


ఈ సంఘట చూసిన అక్కడి వారు అందరూ ఆశ్చర్యం కు లోనయ్యారు.


కళ్ళముందు రాతి నంది అలా మార్చుకున్న స్థితిని చూసిన ఆ మోఘల్ రాజు.


ఆ పిల్లవాడిని క్షమించమని వేడుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.


ఆ పిల్లవాడే విశ్వబ్రాహ్మణ వంశీయడు సిద్ధపురుషుడు అయినాడు.


ఆయనే శ్రీ ఆది శివలింగాచార్య స్వామి.


వీరు సజీవ సమాది చెందిన ప్రాంతం.


తిరువణ్ణామలై కి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న కాంతపాళ్యం.


ప్రస్తుతం 8 వ తరానికి చెందిన శ్రీ శివ జ్ఞాన స్వామి 6382658268 వారు పీఠమును నిర్వహణ చేస్తున్నారు.


🙏🏻అరుణాచలశివ 🙏🏻