6, మే 2023, శనివారం

🔔రామ నామ మహిమ🔔

 🔔రామ నామ మహిమ🔔

       🚩🌳🚩


హనుమంతుడు ఆశోకవనంలో  సీతాదేవిని దర్శించి , సీతమ్మవారి వద్ద నుండి చూడామణి తీసుకుని  రాముని వద్దకు తిరిగి

వెళ్ళాడు.

సీతాదేవిని దర్శించాను అని తెలిపి శ్రీ రాముని చరణాల వద్ద సీతమ్మ యొక్క చూడామణిని వుంచాడు.  ఆనందంతో రాముడు తనని

ఆలింగనం చేసుకుంటాడని ఆశించిన హనుమకి నిరాశే  మిగిలింది.

చూడామాణిని చూసిన రాముని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు  రాముడు అడిగిన ప్రశ్న హనుమంతునికి విస్మయం కలిగించింది.  ఆంజనేయుని చూసి  రాముడు 'హనుమా.. నేను చెప్పినదేమిటి ? నీవు చేసినదేమిటి ? సీతాదేవిని చూసి రమ్మని నిన్ను పంపాను. కాని నీవు లంకనే కాల్చి 

రావణుని ప్రజలను తీవ్రమైన బాధలకు గురిచేశావు.

ఇదంతా నీవు నా అనుమతితోనే చేశావా ?అని అడిగాడు.

" రామప్రభూ .. రావణుని అనుచరులు నా తోకకు నిప్పు ముట్టించారు.  రావణుడు వేడుకతో చూస్తూ ఆనందించాడు. నేను ఆ నిప్పును ఆర్పేందుకు అటు ఇటూ తిరుగుతూ  నా వాలమును ఆడించాను.  ఆ సమయంలో  మంటలు చెలరేగి లంకాపట్టణం

కాలిపోయింది. ఇది రావణుడు చేసిన

తప్పు వల్లే జరిగింది" అని సంజాయిషీ చెప్పాడు హనుమ.


నీ తోకకు అంటించిన అగ్ని  వల్ల నీ శరీరము  కాలి బాధ కలిగినదా ?"


" లేదు...రామా! నేను తమ నామమునే

జపిస్తూ నిశ్చింతగా వుండిపోయాను. రామ నామ మహిమ వలన

నాకు ఏ బాధా కలుగలేదు" అనిఅన్నాడు హనుమ. నిన్ను నీవు  కాపాడుకోవడానికి జపించిన మంత్రాన్ని లంకా ప్రజలకి  కూడా చెప్పిన పిదప కదా

నీవు లంకా దహనం చేయవలసినది.నిన్ను

నీవు కాపాడుకొన్నావు. కాని  లంక ప్రజలను ఇబ్బందులపాలు చేశావు.  నీవు చేసిన ఈ పాపకార్యంలో నన్ను భాగస్వామిని చేశావుకదయ్యా హనుమ ? అని  రాముడు చింతించాడు. హనుమంతుడు రాముడి కాళ్ళమీద పడి ."  అజ్ఞానంతో అకార్యం చేసి మీకు విచారం కలిగించాను నన్ను మన్నించండి, స్వామీ అని దీనంగా వేడుకున్నాడు.


" ఒకవేళ రావణుడు తన మనసు మార్చుకుని సీతాదేవిని నాకు అప్పగించినా నేను లంకకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించావు. అగ్నివలన దహనమైన లంకని తిరిగి పునరుధ్ధరించి, భాధించబడినవారికి సేవలందించి యీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకొనేతీరాలి "

అని అన్నాడు రాముడు. 

రాముని కరుణార్ద్ర హృదయానికి హనుమ చలించిపోయాడు

రాముని పాదాలకు నమస్కరించి,  హనుమ "రామ..రామ ..అంటూ రామనామ స్మరణ ప్రారంభించాడు.

ఇప్పుడు హనుమంతుడు జపించినది తనకోసం కాదు, తనవల్ల నష్టపోయిన

లంకా ప్రజల కోసం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి