8, నవంబర్ 2018, గురువారం

ఏడు జన్మల వెనక ఉన్న ఆసక్తికర రహస్యాలు..!!



పునర్జన్మ ఎప్పుడూ మనకు అర్థంకాని.. అద్భుతమైన కాన్సెప్ట్. హిందూమతంతో పాటు, ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్లీ, మళ్లీ ఈ భూమ్మీద పుడతారని చెబుతాయి. ఉదాహరణకు బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్ లో చాలా ధృడమైన నమ్మకం ఉంది. వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ? హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ విష్ణువు. అతను మనిషి రూపంలో.. అనేకసార్లు జన్మెత్తారు. భూమ్మీద ఉండే దుర్మార్గులను నాశనం చేయడానికే విష్ణువు అన్ని సార్లు పునర్జన్మ పొందారు. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూశాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది. అది సాధ్యం కాదన్న భావం ఉంది. అయితే.. పునర్జన్మ గురించి.. కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలున్నాయి.

ఆత్మ బతికే ఉంటుంది హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరం మరణించినా.. ఆత్మ బతికే ఉంటుందని చెబుతుంది. మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట.

కర్మను బట్టి ఆత్మ ప్రవేశం ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది మనం మన పూర్వ జన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి, చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి, మంచి కర్మ పొంది ఉంటే.. ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి, చెడు కర్మను పొంది ఉంటే.. అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది.
జంతువులుగా కూడా జన్మించే అవకాశం చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ.. కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉంది.

ఆత్మ దెయ్యంగా మారుతుంది ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే.. అతను లేదా ఆమె దయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చేన తర్వాత పునర్జన్మ పొందుతారు.

అంత్యక్రియలు హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది. ఎందుకంటే.. మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూదని.. దేహాన్ని కాల్చడం, లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ.. ఈ మెమరీస్ కోసం వెతుక్కోకుండా..మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు.

ఏడు జన్మలు ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా మగవాళ్లు, ఆడవాళ్లు మాదిరిగానే ఏడు సార్లు జన్మిస్తారు. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది.

అనుకూల పరిస్థితుల్లో ఆత్మ ప్రవేశం మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చనిపోయిన వెంటనే.. ఆత్మ మరో శరీరరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత.. కొత్త శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుంది.

పూర్య జన్మ గురించి రికార్డ్ మహర్షుల ప్రకారం.. మన గత జన్మ గురించి ప్రతీది మనకు గుర్తు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే.. పూర్వ జన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే.. మన పూర్వ జన్మల గురించి మన అన్ కాన్సియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటాయన్నమాట.

సి విశ్వశక్తిని తెచ్చుకోవడమే.”



“‘ధ్యానం’ అంటే విశ్వశక్తి ఆవాహనం చేసి, నాడీమండల శుద్ధి కలిగి, దివ్యచక్షువు ఉత్తేజితమై, సూక్ష్మశరీరయానం చేయడం క్రమక్రమంగా ఆత్మజ్ఞానం కలిగి, ఆత్మారాముని పూర్ణంగా కనుగొనడం.”

“ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ఊహ తెలిసిన వయస్సు నుంచే పిల్లలు ధ్యానం మొదలుపెట్టాలి. విద్యార్ధులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు కూడా ప్రతిరోజూ … ఎవరికి ఎంత్ వయస్సు వుంటే అన్ని నిమిషాలు … ఒక సిట్టింగ్‌లో ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తులు కావడమే కాకుండా, అసలు జబ్బులు లేకుండా, రాకుండా జీవించవచ్చు.”

పదివేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌లో పిరమిడ్‌లు నిర్మించారనీ, అవి అద్భుత విశ్వశక్తి ఆవాహన్ క్షేత్రాలు అని ప్రయోగాత్మకంగా తెలుసుకున్న తాము ధ్యానానికి పిరమిడ్‌ను జోడించి అందరితో ధ్యానం చేయిస్తున్నాం.

“అనవసరమైన మాటలు మాట్లాడి ఎనర్జీని వృధా చేసుకోరాదు. మనలోని శక్తితో మంచి మాటలు మాట్లాడి, మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి. ధ్యానం చేసి మరింత కాస్మిక్ ఎనర్జీని ప్రతిఒక్కరూ పొంది అమిత శక్తివంతులు అవ్వాలి. ఆత్మవంతులు కావాలి. ఎవరు ధ్యానం చేస్తారో వారు ‘ఆత్మచైతన్యం’ లో వుంటారు. ఎవరు ధ్యానం చేయరో మనస్సులోనే వుంటారు. బుద్ధితో వుండరు.”

“మనస్సువత్ మనిషి రావణాసురుడు. ఆత్మవత్ శ్రీరాముడు. మనస్సుతో రావణుడు సీతను ఎత్తుకుపోతే ఆత్మతో రాముడు రావణాసురుని చంపి సీతను తెచ్చుకుంటాడు. అంజనేయస్వామి ద్వారానే రామునికి సీత జాడ తెలిసినట్లు. శ్వాస ద్వారానే ప్రతి వ్యక్తి ఆత్మారాముడిని తనలోనే కనుగొంటాడు. మనస్సువత్ కిష్కిందకాండ … ధ్యానసాధనావత్ సుందరకాండ. వాల్మీకి రామాయణంలో ధ్యానం గురించి విస్తారంగా చెప్పి వున్నాడు.”

“ధ్యానం వల్ల ప్రతి వ్యక్తీ ఆత్మారాముడవుతాడు. నారాయణుడు అవుతాడు. నలభైరోజులు ధ్యానం చక్కగా చేస్తే ప్రతి వ్యక్తీ ఎన్‌లైటెన్ అవుతాడు. మన దగ్గర కాస్మిక్ T.V. వుంది. ‘థర్డ్ ఐ’ అంటే అదే. ‘థర్డ్ ఐ’ వల్ల మొత్తం సృష్టి అంతా మరి భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుస్తాయి.”

మీ జీవితంలో మీకు ఏమి కావాలి?

🌹మీ జీవితంలో మీకు ఏమి కావాలి?
🌹సంపూర్ణ ఆరోగ్యం కావాలా?
🌹ఉన్నతమైన జీవితం కావాలా?
🌹మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం కావాలా?
🌹ఆత్మవిశ్వాసం కావాలా?
🌹ధైర్యం కావాలా?
🌹ఙ్ఞాపకశక్తి పెంచుకోవాలా?
🌹పాజిటివ్ ఆలోచనలు కావాలా?
🌹ఇంటర్వ్యూ బాగా చేయాలా?
🌹కోపం తగ్గించుకోవాలా?
ఆర్థికంగా బాగా ఎదగాలా?
🌹మంచి జాబ్ కావాలా?
🌹మంచి మార్క్స్ కాని మంచి ర్యాంక్ కాని కావాలా?
🌹మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాంగుడాలా? 
🌹వయస్సు పెరుగుతోందని భయపడుతున్నారా?
🌹ఆకర్షణీయంగా కనపడాలా?
🌹మీ కర్మలను తొలగించుకొవాలా?
🌹ఆత్మఙ్ఞానం పొందాలా?
🌹కుటుంబ కలహాల నుంచి విముక్తి చెందాలా?
🌹ఇంకా ఎన్నెన్నో సమస్యలనుండి విముక్తి కావాలా?
💐వీటన్నింటికి పరిష్కార మార్గం "ధ్యానం" చేయడమే
------

           🔺      ముందుగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం తరువాత ధ్యానం ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరు చేయాలో పూర్తి వివరాలతో ఇక్కడ తెలుసుకోవచ్చు. .
                          
          💥ధ్యానం💥
               ఈ మహా విశ్వమంతా "విశ్వ శక్తి" తో నిండి వుంటుంది. దీనినే కాస్మిక్ ఎనెర్జీ అని మరియు ప్రాణ శక్తి అని కూడా అంటారు. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులు వాటి మధ్య వున్న శక్తి ఈ "విశ్వ శక్తే" . నిద్రలోనూ, సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం ఈ విశ్వశక్తిని కొద్దిగా మాత్రమే పొందుతున్నాం. అలా పొందిన విశ్వశక్తిని మన దినచర్యలలోని అన్ని శారీరిక కార్యక్రమాలకు మరియు మానసిక కార్యక్రమాలకు వాడుతున్నాము. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి అన్ని పనులకు సరిపడదు. తద్వారా అన్నిరకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి.

                 ఈ మానసిక, శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందడానికి ఏకైక సాధనం "ధ్యానం". ఈ ధ్యానం వలన ఆలోచనారహిత స్థితిలో ఉండటం జరుగుతుంది,  ఈ  స్థితిలో అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని పొందుతాము. ఈ విశ్వమయ ప్రాణశక్తిని పొందడము ద్వారా మన శరీరంలోని 2,72,000 నాడులు శుద్ది జరిగి తద్వారా మనలోని శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగి 1. సంపూర్ణ ఆరోగ్యం (Total Health) 2. మానసిక ప్రశాంతత (Mental Peace) 3. బుధ్ది కుశలత (Enhanced Intellect) 4. నైపుణ్యము (Efficiency) 5. ఆత్మ సంయమనము (Self Control) 6. ఏకాగ్రత (Concentration) 7. ఆత్మ విశ్వాసము (Self Confidence) 8. ఆత్మ సంతృప్తి (Self Satisfaction) 9. ఙ్ఞాపకశక్తి (Memory Power) 10. సంకల్పశక్తి (Thought Power) ఇవన్నియు మనలో పెరిగి 11. దివ్యచక్షువు ఉత్తేజితం (Thirdeye Activation) మరియు 12. సూక్ష్మశరీరయానం (Astrol Travelling) జరుగుతుంది.

-ధ్యానం చెసే పద్ధతి-
        అనువైన ప్రదేశంలో హాయిగా సుఖాసనంలో కూర్చొని, చేతి వ్రేళ్ళను ఒక దానితో ఒకటి కలిపి వుంచి, రెండు కళ్ళను నెమ్మదిగా మూసివుంచాలి. మనస్సులో ఏ నామాన్ని గాని మంత్రాన్ని గాని ఉచ్ఛరించరాదు. ఏ దేవతా రూపాన్ని, గురు రూపాన్ని గాని ఊహించరాదు. మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస-నిశ్వాసలను (లోనికి వెళుతున్న గాలిని-బయటకు వస్తున్న గాలిని) గమనిస్తూ వుండాలి. మధ్య మధ్యలో వచ్చే అనేకనేక ఆలోచనలని ఎప్పటికప్పుడు "నిలిపి" వేస్తూ (ఆలోచనలని వదిలించుకొని) మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాసమీదకు మరల్చాలి. మధ్యలో ఎట్టి పరిస్థితులలోను కళ్ళు తెరవకూడదు. మన శ్వాసను మత్రమే గమనిస్తూ వుండగా మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి మన నాడీ మండలాన్ని శుద్ధి  చేస్తుంది. తద్వారా మనలోని శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ధ్యానం ముగించిన తరువాత మీ రెండు చేతి వ్రేళ్ళను కళ్ళ మీదకు తీసుకొని వచ్చి 5సెకన్లు మీచేతి వ్రేళ్ళను కళ్ళ మీద తాకి వుంచాలి. అలా ఉంచడం ద్వారా మీ చేతి వ్రేళ్ళలో మిగిలివున్న విశ్వశక్తిని తిరిగి శరీరంలోనికి ప్రవేశింప చేస్తాము. 5 సెకన్ల తరువాత మీ చేతి వ్రేళ్లను తీసివేస్తూ నెమ్మదిగా కళ్లు తెరవాలి. ఈ ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాలక్రితం "ఆనాపానసతి" గా పేర్కొన్నారు. "ఆన" అంటే "ఉచ్ఛ్వాస" - "అపాన" అంటే "నిశ్వాస" - "సతి" అంటే "కూడుకుని వుండడం". అందుకే బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారు "శ్వాస మీద ధ్యాస" అని చెప్పారు. అంటే "మనశ్వాసతో మనం కూడుకుని వుండడమే" శ్వాస మీద ధ్యాస అని అర్థం. మీరు ఎన్నో ధ్యాన పద్ధతులను చూసి వున్నా వాటన్నిటిలోకి ఒకే ఒక్కటి 'సరి అయిన ధ్యాన పద్ధతి' ఆనాపానసతి మాత్రమే. ఈ ఆనాపాన సతి...సర్వరోగనివారిణి, సర్వభోగకారిణి, సత్యఙ్ఞానప్రసాదిని. ఈ ఆనాపానసతిని(ధ్యానం) చేయువారు, ఎవరి వయస్సు ఎంతనో అంతసేపు ధ్యానం చేయాలి. ఉదాహరణకు 30సంవత్సరముల వయస్సు వున్నవారు కనీససమయం 30 నిముషాలు చేయాలి. రోజుకి కనీసం 2సార్లు చేయాలి. అనారోగ్యంతో వున్నవారు ఒక రోజులో 4 నుంచి 5సార్లు, వారి వయస్సుకన్నా ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించాలి.

                    ధ్యానం చేయడానికి కుల, మత, ప్రాంత భేధాలు లేవు. పిల్లలైనా, పెద్దలైనా, వయోవృద్ధులైనా, పురుషులైనా, స్త్రీలైనా, విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఏ ప్రాంతంవారైనా, ఎవరైనా చేయవచ్చు, ఎపుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు.

                          గర్భంతో వున్న ఏ స్త్రీ అయినా ముందు నుంచే ధ్యానం చేస్తే ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా లాభం పొందుతారు. ధ్యానం వలన తల్లుల మానసిక, శారీరక స్థితులు బాగుండటమే కాకుండా యోగీశ్వరులు పుట్టే అవకాశం వుంది.
                   
            విద్యార్థులు ధ్యానం చేయడం వలన మెదడులోని న్యూరాన్లు యాక్టివేట్ అయి అధిక చైతన్యశక్తిని సంగ్రహిస్తాయి. ఈ న్యూరాన్లు చాలా ఉత్తేజంతో ప్రకంపనాలు చేస్తాయి. దీనివలన మెదడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా వున్నప్పుడు శరీరంలోని అవయవాలన్ని సరియైన రీతిలో స్పందిస్తాయి. శారీరక ఆరోగ్యం పటిష్టంగ ఉంటుంది. ఈ ధ్యానం వలన విద్యార్థులలోని చైతన్యశక్తి మనొశక్తిగా మార్పు చెంది ఇంటెలిజెన్స్ గణనీయంగా పెరుగుతుంది. వారిలో బుద్ధివికాసం వృద్ధి చెందుతుంది. పిల్లలకు 3 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పించవచ్చు.

                ధ్యానం ఒక అక్షయపాత్ర. సరిగ్గా చేయాలే కానీ సాధ్యం కానిది అంటూ వుండదు.శ్వాస మీద నిరంతరం ధ్యాస వుంచితే ప్రపంచాన్నే కాదు విశ్వాన్నే జయించవచ్చు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే తమకు తాము సుఖంగా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్నవారిని కూడా సుఖసంతోశాలతో జీవింపజేయగలరు.




పిరమిడ్ ధ్యానం
                                   ప్రకృతిలో సహజంగా ఉండే భూమ్యాకర్షణ శక్తి మరి విశ్వంలోని విశ్వశక్తి (కాస్మిక్ ఎనర్జీ) పిరమిడ్ ఆకారంలో ఇమిడి వున్న కొలతల ప్రత్యేకతల వలన ఈ ప్రాణశక్తి పిరమిడ్ లో సూక్ష్మీకరింపబడి శక్తివంతమైన జీవశక్తిగా మారి పిరమిడ్ లో ధ్యానం చేసేవారికి అద్భుత ఫలితాలను ఇస్తుంధి. గణిత సిద్ధాంతరిత్యా ప్రత్యేక కోణంలో నిర్మించబడిన పిరమిడ్లు విశ్వశక్తిని లోపలికి గ్రహించి నిల్వ చేస్తాయి. లోపల ఏర్పడే శక్తి క్షేత్రంలో పౌన:పున్యం (ఫ్రీక్వెన్సీ) తగ్గి అందరికి శక్తి అందుబాటులో ఉంటుంది. అతీతమైన మానవ శక్తులకు మూలం ఈ శక్తి.

                   పిరమిడ్ లో కూర్చొని ధ్యానంలో నిమగ్నమైనపుడు మన శరీరంలోని ప్రాణశక్తి, పిరమిడ్ శక్తి క్షేత్రంలో కలిసినప్పుడు మనలోనికి అపరిమితమైన శక్తి ప్రవేశిస్తుంది. అన్ని రకాల అనారోగ్యముల నుంచి స్వస్థత పొందడానికి, మానసిక ప్రశాంతతకు, ఆత్మదర్శనానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది. పిరమిడ్ శక్తివలన శరీరంలోని సకల కణాలు, కణ జాలాలు, సకల అవయవాలు అన్ని గొప్ప స్థాయిల్లో పని చేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఇందు వలన దీర్ఘాయుష్షు కూడా సాధ్యం. పిరమిడ్ అద్భుతశక్తి వలన కలిగే సత్ఫలితాలను తేలికగా, చవగ్గా పొందవచ్చు. మనం చేయవలసిందల్లా దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళడం లేదా ఇంట్లొనే పిరమిడ్ ను నిర్మించుకోవడం లేదా ఇంట్లోనే పిరమిడ్స్ ను తయారు చేసుకుని సర్వరోగనివారణిగా ఉపయోగించుకోవాలి.




ధ్యాన స్థితిలో అనుభవాలు
                   శరీరం చాలా తేలికకావడం, తల, శరీరం బరువు కావడం, శరీరంలో అనేక ప్రాంతాలలో కదలికలు, నొప్పులు, శరీరం ముందుకు, వెనుకకు ఊగడం, శరీరంలోని రుగ్మతలు వున్న ప్రాంతంలో నవ్వలుగాను, చీమలు పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ శారీరక రుగ్మతలు తొలగేటప్పుడు ఇలా జరుగుతుంది. అంతేగాకుండా నిశ్చల స్థితిలో ధ్యాని అనేక రంగులు, వలయాలు, వృక్షాలు, కొండలు, కోనలు, జలపాతాలు, పరమగురువులను వీక్షించగలిగే అద్భుత అనుభూతికి లోనవడం జరుగుతుంది. ధ్యానం చేస్తున్నవారందరికీ ఇలాగే జరగాలని కూడా లేదు. ఒకొక్కరి అనుభవం ఒకోరకంగా ఉంటుంది.

ప్రస్తుతం ధ్యానం చేస్తున్నవారు
                            ఈ విధమైనటువంటి ధ్యానం చేస్తున్నవారిలో కొన్నివేలమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్నవారు, ఉన్నతమైన పదవులలో ఉన్నవారు, నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థలలో పనిచేస్తున్నవారు, మన శార్ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనా సంస్థలో వున్న శాస్త్రవేత్తలు, సుమారు 100 దేశాలలోని ఎంతోమంది ప్రజలు, మనదేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఈ ధ్యానం చేస్తున్నారు. సాధారణ ప్రజలని (ధ్యానం చేయనివారిని), ధ్యానం చేస్తున్నవారిని అడగండి వారు ఎలా జీవిస్తున్నారో మీకు తెలుస్తుంది. మీరు ధ్యానం చేస్తే మీకే తెలుస్తుంది. కొంతమంది మాకు పనులున్నాయి సమయం లేదు అని అంటుంటారు కాని వారికి 10 సంవత్సరాల తరువాత పనులేమైన తగ్గుతాయా? లేదా 20 సంవత్సరాల తరువాత పనులేమైనా తగ్గుతాయా? లేదే! పనులన్నవి జీవితాంతం అందరికీ వుంటాయి ఎప్పటికీ తరగవు. మనం ఆరొగ్యంగా, ఆనందంగా జీవించాలంటే కొంతసమయాన్ని మనకోసం మనం ఏర్పరుచుకోవాలి. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, ప్రేమని పొందడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు, ఏ నియమ నిభంధనలు ప్రత్యేకంగా పాటించనవసరం లేదు. నిత్య జీవితంలో ప్రతి రోజు కొంత సమయం కేటాయించుకుని చేయవలసిందల్లా ఒక్కటే-అదే 'ధ్యానం'.

“శ్రీ సదానందయోగి” గురించి బ్రహ్మర్షి పత్రీజీ



పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌కు ఆదిదేవులు
“శ్రీ సదానందయోగి”
శ్రీ సదానందయోగి గారు అరేబియా దేశం నుంచి భారతదేశానికి వచ్చి … తమ శిష్యుడికోసం అన్వేషిస్తూ చివరాఖరికి 1975 సంవత్సరంలో కర్నూలు చేరి 1981 వ సంవత్సరం లో పత్రీజీని తమ దగ్గరకు రప్పించుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా తమలో నిక్షిప్తం చేసుకున్న తమ ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ రెండున్నర సంవత్సరాల పాటు పత్రీజీకి ధారపోసి .. తమ కర్తవ్యం పూర్తి అయ్యిందన్నట్లుగా వారు 1983 వ సంవత్సరం మే 22 తేదీ నాడు ఈ లోకం నుంచి నిష్క్రమించారు!
జూలై 19 వతేదీ గురుపౌర్ణమి శుభ సందర్భంగా తమ గురువుగారితో పత్రీజీ అనుభూతులు …
శ్రీ సదానందయోగి గారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు “ఆదిదేవులు”!
వారి పరిచయ భాగ్యం నా కొల్లీగ్ మరి స్నేహితిడు శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా నాకు లభించింది!
అప్పట్లో నేను కోరమాండల్ సంస్థలో రీజియనల్ సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్‌గా నా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూండేవాడిని. శ్రీ రామచెన్నారెడ్డి గారు E.I.D ప్యారీ కంపెనీలో ఉన్నా … ఉద్యోగరీత్యా అందరం కలిసే పనిచేస్తూండే వాళ్ళం!
ఆ క్రమంలో నంద్యాల సమీపంలోని ఆత్మకూరు దగ్గర వున్న “రేగడిగూడూరు” గ్రామానికి రామచెన్నారెడ్డి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు వారు అక్కడ శ్రీ సదానందయోగి గారి శిష్యుడు “శ్రీ యోగి రామిరెడ్డి” గారిని కలిసారట. రామిరెడ్డి గారికి అప్పటికే 70 సంవత్సరాలకు పై వయస్సు!
వారి ద్వారా శ్రీ సదానందయోగి గారి వివరాలన్నీ విని .. కర్నూలులో వారు వుండే చిరునామా తీసుకుని నా దగ్గరికి వచ్చి .. ” కర్నూలులో ఒక పెద్దాయన వున్నారు; ఆయనను మనం కలుసుకోవాలి” అన్నారు. “సరే” అని వెంటనే “అందరం కలిసి సదానందయోగి గారి దగ్గరికి ఒకానొక రోజు వెళ్ళాలి” అని నిర్ణయించుకున్నాం. నేను, “రామచెన్నారెడ్డి” మరి ప్యారీ కంపెనీ “వెంకటరత్నం” ముగ్గురం మిత్రులం కలిసి అడ్రసు వెతక్కుంటూ జనవరి 1 వ తేదీ 1981 నాడు .. ప్రొద్దున్నే 7.30 గం||లకు .. ఆప్పట్లో కర్నూలు పాత బస్‌స్టాండ్ వెనుక వున్న .. ” రాఘవేంద్ర లాడ్జి” కి వెళ్ళాం
ఆ లాడ్జిలో ఒక చిన్న గదిలో నలుగురైదుగురు మాత్రమే కూర్చోగలిగే ఓ చిన్ని మంచం పై సదానందయోగి గారు పడుకుని వున్నారు. మేం వెళ్ళేసరికి వారు .. మా అలికిడి విని కళ్ళు తెరిచి చూసి .. “ఏం కావాలి?” అని అడిగారు గంభీరంగా!
మేము జవాబు ఇచ్చే లోపలే “ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మీకు మరొకటి దొరకదు” అన్నారు! ” మాకు కావలసింది కూడా అదే స్వామీ! ఇంక వేరే దేనికోసమూ మేము రాలేదు!” అంటూ వినయంతో పలికాం.
సాధారణంగా స్వామీజీల దగ్గరకు అందరూ వచ్చి ” నా కొడుకుకు ఉద్యోగం ఎప్పుడొస్తుందండీ? నా కూతురు పెళ్ళి ఎప్పుడవుతుందండీ? మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు ఏం చెయ్యమంటారండీ?” అంటూ వారిని నానారకాలుగా విసిగిస్తూ వూంటారు. పాపం, ఈ స్వామీజీ కూడా అలాగే అందరితో విసిగి, విసిగి వేసారిపోయివున్నారేమో ..
“మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు స్వామీజీ” అని మేము చెప్పడంతో వెంటనే లేచికూర్చుని ఎంతో ప్రసన్నంగా .. “ఓహో” అంటూ తల పంకించారు!
మొదటి అయుదు, పది నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు! ఆ తర్వాత అనర్గళంగా శ్లోకం తర్వాత శ్లోకం అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడూ ఇంగ్లీషు పదాలతో కలిపి అరగంట సేపు నయాగారా జలపాతంలా తన బ్రహ్మజ్ఞానాన్ని అంతా మామీద వర్షించారు! అది విన్న నేను .. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ‘పర-వశుడను’ అయ్యాను.
అంతకు ముందు వారు ఆరు సంవత్సరాల నుంచి కర్నూలులోనే వున్నారు. కానీ మనకేం తెలుసు?!
శిష్యుడు ఎదురుగానే వుండవచ్చు .. గురువు ప్రక్కనే వుండవచ్చు .. కానీ “గురు శిష్యుల కలయిక జరగడం” అన్నది మాత్రం శిష్యుడు సంసిద్ధుడిగా వున్న తరువాతే జరుగుతుంది. ఆ రోజు నేను సంసిద్ధుడిగా వున్నాను కాబట్టే నాకు సదానందయోగి గారి దర్శనం లభించింది!
వారు నాకు తెలిసిన మరుక్షణంలోనే .. వారి గంభీర వదనం తిలకించిన వెంటనే .. నాకు నేనుగా ఆ మహాయోగి కి సమర్పణ అయిపోయాను.
ఆ తరువాత “రేపు ఉదయం 4.30 గంటలకు మళ్ళీ రండి .. ధ్యానం నేర్పిస్తా” అన్నారు వారు. మర్నాడు .. అంటే 1981 జనవరి 2 వతేదీన .. ప్రాతఃకాలం 4.30 గంటలకు మళ్ళీ మేము ముగ్గురం .. అంటే నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం .. త్రిమూర్తుల్లాగా వెళ్ళాం.
మమ్మల్ని “కూర్చోండి” అని చెప్పేసి, “చేతుల్లో చేతులు పెట్టండి; కళ్ళు రెండూ మూసుకోండి; శ్వాసను గమనించండి” అన్నారు.
ఇంతే మాకు వారు చెప్పింది! ఏ మంత్రమూ లేదు! ఏ తంత్రమూ లేదు!! ఏ యంత్రమూ లేదు!!!
అలా అప్పటినుంచి, అంటే 1981 జనవరి 1 వ తేదీ నుంచి శ్రీ సదానందయోగి గారి దగ్గర నా ఆధ్యాత్మిక శిష్యరికం మొదలయ్యింది!
ఆ రోజులలో కోరమాండల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్‌గా ఉద్యోగరీత్యా నేను మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు .. ఇలా మొత్తం ఆరు జిల్లాలు తిరుగుతూండేవాడిని. నెలకు 25 రోజులు టూర్ లోనే ఉంటూ 5,6 రోజులు మాత్రం కర్నూలులో వుండేవాడిని.
అంతకు మునుపు కర్నూలులో వున్నన్ని రోజులూ “అగ్రి ఫ్రెండ్స్ క్లబ్” కు వెళ్ళి ఎక్కువగా పేకాడేవాడిని.
అయితే సదానంద యోగిగారిని కలిసిన తరువాత నుంచి క్లబ్ బ్ంద్!! పేకాట బంద్!! అన్నీ బంద్!!! ఎంతో ఆర్తిగా వెళ్ళి వారి దగ్గర కూర్చుని .. ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకునేవాళ్ళం.
శ్రీ సదానందయోగి గారు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూండేవారు! మేము ఆయనకు ప్రతిరోజూ రెండు సిగరెట్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళం ! చాయ్ త్రాగుతూ, సిగరెట్ త్రాగుతూ వారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక జీవిత సత్యాలను మాకు అనర్గళంగా చెబుతూనే వుండేవారు.
ఆయనది “అచల సిద్ధాంతం” .. “శ్రీ శివరామ దీక్షితులు” అంటే వారికి ఎంతో మక్కువ! ఎప్పుడూ దీక్షితులు గారి పద్యాలను వారు విశేషంగా చెప్పేవారు!
వారికి అరబిక్ భాష కూడా అనర్గళంగా వచ్చు! ఆ భాష వారి నోటి ద్వారా వింటూంటే ఎంతో వినసొంపుగా వుండేది! వారి నోటి నుండి వచ్చే “సుభాష్” అన్న పిలుపు నాకు ఎంత మధురంగా వుండేదో చెప్పనలవి కాదు!!
వారికి కేవలం కొంతమందే శిష్యులు ఉండేవారు! మిగతా వారంతా ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో కోరికలను వారిని కోరుతూ వారిని ఇబ్బంది పెడుతూండే సామాన్యులు! ఆత్మజ్ఞానానికీ, ధ్యానానికీ వచ్చే శిష్యులు కేవలం నలుగురైదుగురు .. నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, జనార్దనరావు, సూర్యమోహన్ .. అంతే!
మా ధ్యానజ్ఞానసాధనలు ఇలా జరుగుతూ వుండగా 1981 వ సంవత్సరంలో మా హెడ్ ఆఫీసు నుంచి “నువ్వు సీనియర్ మోస్టువి; హెడ్ ఆఫిసుకు రావాలి! నిన్ను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూన్నాం” అని పిలుపువచ్చింది.
“నా గురువుగారు ఇక్కడ వుంటే నాకు హైదరాబాద్‌లో ఏం పని?” అనుకుని .. “నేను రాను” అని వారికి ఖచ్చితంగా చెప్పాను!
హైదరాబాద్‌లో మా తల్లిగారు, తండ్రిగారు వున్నారు; సొంత ఇల్లువుంది. నిజానికి అక్కడికి పోతే నాకు ఎంతో సుఖంగా వుంటుంది .. మరి నెలకు రెండు వేల రూపాయలు కూడా మిగులుతాయి.
అయితే వీటన్నింటినీ మించిన పెన్నిధి .. నా గురువుగారు .. ఇక్కడ వున్నారు కనుక “నేను కర్నూలు వదలను” అని నిశ్చయించుకుని .. “నాకు మీ ప్రమోషనూ వద్దు .. ఏమీ వద్దు .. నేను కర్నూలులోనే వుంటాను” అని మా ఆఫీసువాళ్ళకు తేల్చిచెపాను!
“సరే” అన్నారు మా (మంచి) ఆఫీసువాళ్ళు. మళ్ళీ 1982 వ సంవత్సరంలో “ఈసారయినా రావయ్యా .. హైదరాబాద్‌కు! హెడ్ ఆఫీసులో నీ అవసరం వుంది!” అన్నారు.
“నేను రాను” అని మళ్ళీ చెప్పాను. పాపం మా ఆఫీస్‌వాళ్ళు చాలా, చాలా మంచివారు; “సరే” అని నన్ను నా ఇష్టానికే వదిలివేసారు.
శ్రీ సదానందయోగి గారి దగ్గర నా శిష్యరకం సాగుతూ వుండగా ఒకరోజు .. 1983 .. ఏప్రిల్ 16వ తేదీన .. శ్రీ సదానంద యోగిగారు నాతో ..
“సుభాష్! నేను శరీరం వదిలివేయాలని నిశ్చయించుకున్నాను; నువ్వు నా కోసం సమాధిని సిద్ధం చెయ్యి” అని ఆదేశం ఇచ్చారు.
మరింకో ఆలోచన లేకుండా “సరే స్వామీ” అని చెప్పి .. కర్నూలు పట్టణం చుట్టూ స్థలం కోసం వెతికాం. ఎక్కడా నాకు సంతృప్తికరమైన స్థలం దొరకలేదు!
చివరికి సదానంద స్వామీజీ యొక్క ఒక భక్తుడు .. “చెన్నారెడ్డి” అనే ఆయన “బనగానపల్లి దగ్గర వున్న ‘నందవరం’ గ్రామంలో వున్న నా పొలంలో గురువుగారికి సమాధి ఏర్పాటుచేస్తే బాగుంటుంది” అన్నాడు.
వెంటనే చెన్నారెడ్డి, నేను కలిసి నందవరం వెళ్ళాం! అక్కడ నాకు బాగా అనిపించి .. ఒక స్థలాన్ని ఎంపిక చేసి .. ఆ స్థలాన్ని అంతా త్రవ్వి చదును చేసి .. గురువుగారి ఆజ్ఞమేరకు సమాధిని సిద్ధం చేసాం.
స్వామీజీ తాము చెప్పిన సమయం ప్రకారం హాయిగా తమ శరీరాన్ని వదిలిపెట్టేసారు!
“పోలీసులతో ఏం ఇబ్బంది వస్తుందో” అని నేను .. నా సంగీత గురువు మరి గవర్నమెంట్ డాక్టర్ అయిన డా|| పినాకపాణి గారిని కలిసి ” శ్రీ సదానందయోగి తమ శరీరాన్ని వదలి పెట్టేస్తున్నానని చెప్పారు ; మీరు వచ్చి ఆయనను పరీక్షించి వారి ఆఖరి శ్వాసను రికార్డు చేయండి” అని కోరాను.
వారు అలాగే వచ్చి “ఇక శ్వాస లేదు” అని రికార్డు చేయగా .. నిబంధనల ప్రకారం అంతా సజావుగా జరిగిపోయింది. తర్వాత శ్రీ సదానంద యోగి గారి పార్థివ శరీరాన్ని నందవరం తీసుకుని వెళ్ళి అక్కడ మేము సిద్ధం చేసివుంచిన సమాధిలో పెట్టి … పై నుంచి ఒక రాయిని కప్పాం!
ఇలా 1983 మే 22వ తేదీన వారు ఈ లోకంలో తమ దేహయాత్రను చాలించారు. వారు తమ సమాధిని నందవరంలో ఏర్పాటు చేయమని మాకు సూచించిన తరువాత మేము ఆ ఏర్పాట్లలో ఉండగానే వారు రెండుమూడు సార్లు సశరీరంగా ఆ గ్రామంలో ఒక రైతుకు దర్శనం ఇచ్చారట!
పోల్చిచూసుకుంటే సరిగ్గా ఆ రైతు చెప్పిన సమయాలలో వారు కర్నూలులోని రాఘవేంద్ర లాడ్జిలోనే మాలో ఎవరో ఒకరి సమక్షంలో వున్నారు. అంత గొప్ప సిద్ధపురుషులాయన!
సుమారు రెండున్నర సంవత్సరాల పాటు వారి సేవాభాగ్యం నాకు లభించింది.
సదానంద యోగి తర్వాత అంతటి మహాయోగి “శ్రీ కాశిరెడ్డి నాయన”! వారు ఒకే సమయంలో అయిదు చోట్ల తమ భౌతిక శరీరంతో దర్శనం దర్శనం ఇవ్వగలిగేవారు!
శ్రీ కాశిరెడ్డినాయన కర్నూలు ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చి పిరమిడ్‌లో అందరికీ దర్శనం ఇచ్చేవారు; ఎన్నోసార్లు తమ దగ్గర వున్న చిల్లర నాణాలను బుద్ధా పిరమిడ్‌లో ధారపోసేవారు! నా జీవితంలో తారసపడ్డ ఆ ఇద్దరు అద్భుతమైన మాస్టర్స్ .. శ్రీ సదానంద యోగి మరి శ్రీ కాశిరెడ్డి నాయన గార్లకు “శ్రీ గురుపౌర్ణమి” సందర్భంగా నా వినయపూర్వక ప్రణామాలు సమర్పిస్తున్నాను!

మామ తన ముగ్గురు అల్లుళ్ళు

ఒక మామ తన ముగ్గురు అల్లుళ్లను బాగా కట్నకానుకలిచ్చి ప్రయోజకుల్ని చేశాడు.

 ఒకరోజు వారిని పిలిచి 'నేను చనిపోయినపుడు మీరు ముగ్గురూ తలొక లక్షరూపాయలు నా శవ పేటికలో పెట్టండి' అని కోరితే వారు అంగీకరించారు.

 కొన్నాళ్ళకు మామ చనిపోయాడు.

డాక్టర్ గా ఎంతో గొప్పవాడైన పెద్దల్లుడు మామ కోరిక మేరకు 500 నోట్లు 200 తెచ్చి శవపేటికలో పెట్టాడు.

 ఇంజనీర్ గా పైకొచ్చిన రెండవ అల్లుడు 2000 నోట్లు 50 తెచ్చి మామ శవపేటికలో పెట్టాడు.

 మూడవవాడు లాయర్ గా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతడొచ్చి  తాను రాసిన మూడులక్షల రూపాయల చెక్కును శవపేటికలో పెట్టి , అందులోని రెండులక్షల నగదు తీసేసుకున్నాడు.

🤣😃🤣😃🤣😃🤣😃

"" ఋణానుబంధం - అంతా ఋణానుబంధం - జగమంతా ఋణానుబంధం ""



ఈ విషయం చదివేముందు ఒక్కమాట !

ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు  వయస్సు 40, రెండవకొడుకు  వయస్సు  37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే...

అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , చివరి నాలుగవ కొడుకుతో  30 ఏళ్ళు మాత్రమే వున్నాడు . ఎందుకు ?

మీ అనుభవంలో ............ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో  డబ్బులున్నా వాడి కోరిక   తీర్చాలనిపించదు ఎందుకని ?

అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం  ఎందుకని ?

ఇక చదవండి !

మనకు పూర్వ జన్మ కర్మల వలననే
ఈ జన్మలో...
తల్లి,
తండ్రి,
అన్న,
అక్క,
భార్య,
భర్త,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు మిగతా సంభంధాలు...
ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి.

ఎందు కంటే మనం వీళ్లకు...
ఈ జన్మ లో...
ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.

# మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు.

మనకు....
పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే
ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. వాటినే  మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...

 ఋణాను బంధం:-
 గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసు కుని వుండచ్చు  లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు.

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.

# శత్రువులు - పుత్రులు:-
మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు.

అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు,
నానా గొడవలూ చేస్తారు.

జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడి పిస్తూనే వుంటారు.

ఎల్లప్పుడును తల్లితండ్రులను
నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడు తుంటారు.

# తటస్థ పుత్రులు :-
వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు...

మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు,
వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.

# సేవా తత్పరత వున్న పుత్రులు:-

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును,

ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు.

అలా వచ్చి బాగా సేవను చేస్తారు.

మీరు గతం లో
ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.

మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే,
ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు.

లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.
అని అనుకోవద్దు.

ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును.

ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.
వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా
మీ ఇంట పుట్ట వచ్చును.

ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.

లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.

అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు.

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం  అనుభవం లోకి తెస్తుంది. 

మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి.

ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి.

(అనగా పాప పుణ్యాలు)
 కొద్దిగా ఆలోచించండి "
మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.

మళ్లీ ఎంత ధనాన్ని
మీ వెంట తీసు కెళ్తారు..?

ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం,
వెండి పట్టుకు పోయారు..?

చివరగా ఒకమాట !

తాతగారు  సంపాదించిన ఆస్తినంతా  తగిలేసి  మాకు ఏమి మిగల్చలేదని  ఒక కొడుకు బాధపడతాడు .
దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే  యోగం లేదన్నమాట !

అతి బీద కుటుంబంలో  పుట్టిన  మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి  చనిపోతాడు. దీనికి కారణం ఆ తండ్రి , తన కొడుకుకు  చెల్లించాల్సిన  అప్పన్నమాట !

మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి .

నేను,
నాది,
నీది అన్నది.
అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.

ఏది కూడా వెంట రాదు.
ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంట వస్తుంది.

జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.

కావున మీరు వాస్తవాలను గ్రహించి , వాస్తవాలను తెలుసుకొని , ఎంత వీలయితే అంత మంచికర్మలు చెయ్యండి

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు



👉1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
👉 4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
👉9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
👉11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో  శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!
👉12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !
👉16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !
👉17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
👉 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
👉 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

👍శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
👉 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .

ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్

ప్రశ్న: ” మానవులలో వివిధ శక్తి స్థాయిలు ఎలా ఉంటాయి ?*

పరిప్రశ్న-పత్రీజీ సమాదానాలు
 *


 🔺పత్రీజీ :భౌతిక శరీరానికి సంబంధించి తామసిక శక్తి;-

🔺మనోమయ శరీరానికి సంబంధించి రాజసిక శక్తి; 🌹

బుద్ధిమయ శరీరానికి సంబంధించి సాత్విక శక్తి;

ఆత్మమయ శరీరానికి సంబంధించి నిర్గుణ శక్తి.

🌹వివిధ శక్తిస్థాయిలను అనుసరించి తామసిక శక్తిస్థాయిలో ఉన్నవాళ్ళు ఒకానొక వ్యక్తి యొక్క కంటికి కనిపించే ఘనరూపంలో ఉన్న శరీరాన్నే చూడగలుగుతారు. 🌹

వారు తమ కంటితో చూసిన దానినే నమ్ముతారు.

🌹రాజసిక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ వ్యక్తి యొక్క ద్రవస్థితిలో ఉన్న మనస్సును చూడగలిగితే ..🌹

🌹సాత్విక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు అదే వ్యక్తి యొక్క మంచిని చూడగలుగుతారు.🌹


🔺ఇక చిట్టచివరి నిర్గుణస్థాయిలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఈథర్ స్థాయిలో ఉన్న ఆత్మ శక్తిని చూడగలుగుతారు.🌹

🌹తామసిక శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు కేవలం తమ కంటితో చూసిన దానినే అర్థరహితంగా నమ్ముతూ .. పరిమిత శక్తిక్షేత్రంలో పనిచేస్తూ ఉంటే .. 🌹

🌹సాత్విక శక్తి స్థాయిలో ఉన్న వాళ్ళు కంటికి కనిపించిన దానిని అర్థం చేసుకుని అర్థసహితంగా పనిచేస్తూ ఉంటారు.🌹


🌹ఇక నిర్గుణ స్థాయిలో ఉన్న వాళ్ళు .. వీటన్నింటికీ అతీతంగా అత్యంత శక్తివంతమైన ఆత్మశక్తితో పనిచేస్తూ తమ జన్మలను ధన్యం చేసుకుంటూ ఉంటారు.
🔺🔺🔺🔺🔺🔺🔺🔺

ప్రశ్న : క్లీనింగ్ ఆఫ్ చక్రాలు గత కర్మలను తొలగిస్తాయంటారు కదండి?



📝 పత్రీజీ: అవన్నీ ఆటోమాటిక్ గా జరిగిపోతూంటాయి! మీ చిన్న ప్రేగులు క్లిన్ అవటం లేదా ? అవుతున్నాయి ! వాటి గురించి ఆలోచిస్తున్నారా ? లేదు ! అదంతా మన పని కానే కాదు ! మనం  వాటిని 'త్వరితగతిన చేయటం' అనే ప్రక్రియే లేదు! మనం నోట్లో మాంసం వేస్తున్నామా లేకపోతే శాఖాహారం వేస్తున్నామా ? అది పాయింట్! అంతవరకే మన ఆలోచన ! తర్వాత శరీరం ఆటోమాటిక్ గా తన పని చేస్తూపోతుంది.కనుక శ్వాసమీద ధ్యాస పెట్టడమే మన పని. ఆ తర్వాత అంతా ఆటోమాటిక్. మన మూడోనేత్రం తెరుచుకుంటుంది. మన జన్మలు మనం చూసుకుంటాం! ఈ ఏడు శరీరాలు, షట్చక్రాలు...ఇవన్నీ కూడానూ...లోపల ఒక సిస్టం ఉంది.ఆ సిస్టం గురించి మనం మర్చిపోవాలి. ఆ సిస్టం లో మనం జోక్యం చేసుకోకూడదు ! తెలీకుండా మనం కంప్యూటర్ నొక్కేశామనుకోండి ఏమవుతుంది ?

ప్రశ్న : “ధర్మబద్ధంగా ఎలా జీవించాలి ?”



💁‍♀ పత్రీజీ :మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మౌలికంగా మూడు ధర్మాలను తప్పక పాటించాలి ..  మొదటిది : “దేహం పట్ల ధర్మం” : ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ .. దేహం ఒక ‘ వాహనం ’ !

🧘‍♂ ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శ్రుతిబద్ధంగా, లయబద్ధంగా చుసుకుంటేనే అది మనకు సరి అయిన విధంగా సహకరిస్తూ వుంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎప్పటికైనా ప్రయాణం చెయ్యగలం .. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం !

🍎 కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరి అయిన పోషణను అందిస్తూ, ధ్యానంతో దానిని శక్తివంతం చేయాలి.
మన శరీరంలో కోటానుకోట్ల కణాలు వున్నాయి.🍪 వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు కానీ .. మనకే వాటి గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురిచేస్తున్నాం. పెట్రోలు కారులో డీజెల్ పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు .. మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మనం అభాసుపాలు అవుతున్నాం !

ఈ కోటానుకోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది ! మన కణజాలం అంతా కూడా ప్రతిక్షణం ఒకదానిని ఒకటి సమన్వయ పరచుకుంటూ క్రమక్రమంగా ఆత్మ ఉద్దీపన దిశగా సాగుతూంతుంది. కనుక వాటితో మనం సరియైన విధంగా ప్రవర్తించాలి అంటే .. మనకు నిరంతర ధ్యానసాధన మరి అహింసా ధర్మాచరణయే మార్గం !రెండవది

💁‍♀ “సమాజం పట్ల ధర్మం” :
సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక అందరూ సుఖంగా సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం ! అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థిక సంపదనూ ఆధ్యాత్మిక సంపదనూ అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యానప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే .. మిగతా అన్ని దానాలు కూడా వ్యర్థమైపోతాయి. మూడవది
  💁‍♀ “ఆత్మ పట్ల ధర్మం” : మనం ఏ పని కోసం ఈ భూమ్మీద జన్మ తీసుకున్నామో .. విశేషంగా ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ .. మరి ఇతర దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వుండాలి. వచ్చిన పనిని సజావుగా పూర్తిచేసుకోకపోతే .. ఇక్కడ గడిపిన మన జన్మకాలం తో పాటు మనం సంపాదించిన సంపదలన్నీ వ్యర్థమైపోతాయి !

💐 ఆ తరువాత చనిపోయి పై లోకాల్లోకి వెళ్ళాక .. జరిగిన అనర్ధానికి చింతించినా లాభం వుండదు .. మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేచి ఉండాల్సి ఉంటుంది.

🕑  కనుక సమయాన్ని అనవసరమైన కాలక్షేపాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా .. ఇతోధికంగా ధ్యాన సాధనలో🧘‍♂ ఆత్మను పరిపుష్టం  చెయ్యాలి !

 విశేషంగా స్వాధ్యాయ సాధన📖 చేస్తూండాలి .. విస్తృతంగా సజ్జన సాంగత్యం 👨‍👨‍👦👩‍👩‍👧 చేయాలి!

పంచోపచారాలు - పంచభూతాలు:-



1. పూజలు - భూతత్వం
2. అభిషేకాలు - జలతత్వం
3. యజ్ఞయాగాలు -  అగ్నితత్వం
4. మంత్రోచ్ఛరణ - వాయుతత్వం
5. ధ్యానము - ఆకాశ తత్వం

అన్ని ఆచారాలు పంచభూతాలకు సంబంధించినవే. అన్నిటికన్నా గొప్ప తత్వం ఆకాశతత్వమే.
ధ్యానం అనునది 'ఆకాశతత్వానికి' సంబంధించిన సాధన.

ప్రారబ్ద కర్మ


ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే ‘విధి’ కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట ఉండలేం,ఉండకూడదు కూడా! మానవ జీవితం నిత్యం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి లాగా ఉండాలి. దానితో పాటు మనం కూడా అన్ని చోట్లా తిరుగుతూ నిత్యం ప్రవహించాలి. అప్పుడే జీవితం చైతన్యవంతం అవుతుంది.ఎన్నో విషయాలు అనుభవంలోకి వస్తాయి.సందర్భం వచ్చింది కనుక ఇదంతా చెప్పక తప్పలేదు.మరణానంతరం జీవితం ఉందా, లేడా అనే సందేహం నన్ను కొంతవరకు పీడిస్తుంది. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాల ఘర్షణలో మనసు తీవ్రమైన అన్వేషణ ప్రారంభించింది. ఈ అన్వేషణలోనే నాకు ఏది సత్యమో బోధపడుతుందని నా విశ్వాసం. అది నా అంతట నేను తెలుసుకోవలసిన సత్యమే!దీన్ని గురించి ఎవరో చెప్పింది నమ్మటానికి ఇష్టపడను.ఎందుకంటే అది వారి నమ్మకం మాత్రమే,అది సత్యం కాకపోవచ్చు!నమ్మకాలు సత్యాలు కావు. సత్యాన్ని ఎవరికి వారే అన్వేషించి కనుక్కోవాలి!నాలో పేరుకుపోయిన కొన్ని నమ్మకాలు కొన్నిటిని నమ్మటానికి అంగీకరించటం లేదేమో!ముందుగా ఆ నమ్మకాలనుండి నేను విముక్తుడిని కావాలి. దీనికి సాధన అవసరం. కర్మ సిద్దాంతము ప్రకారము జీవుడు పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా పొందొచ్చు!కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు
కర్మగా భావిస్తారు.హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడ ఏదో ఒకనాడు ఫలితాన్నిస్తుంది.మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. మంచి పనిచేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలానంటే ,నోములు నోచి సంతానాన్ని పొందితే ,ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు!మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే, ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది! కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.అన్ని ప్రాణులు,మనుషులు జీవించటానికి ప్రాణమే మూలం . అది అన్నింటిలో సమానంగా ఉంటుంది, కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి?ఆయా జీవుల సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి (వారి) లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.జీవుల దేహ స్వభావమే అంత. ‘జీవి’ ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారబ్ధం అంటారు. దేహప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారబ్ధమును అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాయి . కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది.మట్టిని సేకరించే పనినుండి,ఆ మట్టి నుండి కుండ తీసేవరకూ జరిగినదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక , ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పనిలేదు. అంటే, కుండ ఏర్పడ్డంతోనే ఆ పని పూర్తయింది. అంటే ‘కర్మ’ ముగిసింది.అందుకే దీన్ని ”కార్య విరోధి కర్మ” అంటారు.కర్మ అంటే–వియోగం, సంస్కారం, సంయోగాలతో కలసివున్నదని భావం! ఈ మూడూ లేకుండా కర్మ ఉండదు.బౌద్ధులు ‘కర్మ’కూ, ‘పని’కి తేడా ఉంది అని అంటారు. కర్మ మానసిక మైనదనీ, పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం! బౌద్ధంలో భగవంతుడు లేడు. ఆస్థానంలో ‘కర్మే’ ఉంది.
కర్మలు మూడు రకాలు.
1) ఆగామి కర్మలు
2) సంచిత కర్మలు
3) ప్రారబ్ధ కర్మలు
1) ఆగామి కర్మలు: మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి.అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! వివాహమైన దంపతులందరికీ సంతానం కలుగకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు.దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు.ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’!
2) సంచిత కర్మలు: మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు. దీనికి కారణం ‘సంచిత కర్మలు’.
3) ప్రారబ్ధ కర్మలు: సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము.ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది.ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం!ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు,శరీరాలు వస్తున్నాయి . కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు. ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. ఆ అనుభవాలను ,కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు. అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే!యోగసాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు evaporate చేసుకోవచ్చు! అలా కర్మలు తొలగించబడేవరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇది పరమ సత్యం. ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు. వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం.ఆ బాధను చూసి కొంతమంది ,ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు .అయితే, అది అంత మంచిది కాదేమో! కారణం–ఈ ప్రారబ్ధకర్మ నుంచి తల్లి తండ్రులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయటం వలన, వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే! అంబానీ సోదరులు అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి,నిత్యం దేవుడిని సహస్ర నామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాదిమంది బిచ్చగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధమే. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపరలు పూర్తైన వారు, తర్వాత దివ్య శరీరంతో రాశీమండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే,మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు. ఇంతకు ముందర నేను చెప్పిన విధంగా వారు యేయే అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు. జన్మ పరంపరలు పూర్తి కాకపోతే ,వారు రాశీమండలంలోకి చేరటానికి అర్హులు కారు. కారణం శరీరం నశించిన తర్వాత ,సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది.వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది.సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలుగదు.సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి.సూక్ష్మ శరీరం నశింప చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.ముముక్షువు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా ,దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే!ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తే కారణ శరీరం నశిస్తుంది. అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడుతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది.కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ,మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం
కావచ్చేమో!జాతక కధల ప్రకారం బుద్ధుడిది అది 700 వ జన్మ అని చెప్పబడింది.ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో?  అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం! ప్రాపంచిక విషయాలాలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించటం అనేదే కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం!

ధ్యానానుభవాలు

 
"ధ్యానం చేయడం ఎలాగ? ధ్యానం అంటే ఏమిటి? " ధ్యానం అంటే మన మనస్సుని ఖాళీ చేసుకోవడం . "యోగః  చిత్తవృత్తి నిరోధః ". దానికి మార్గం ఏమిటి?  - "శ్వాస మీద ధ్యాస", ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండూ ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి ; వీలైనంతవరకు నిటారుగా కూర్చుని సహజసిద్దంగా జరుగుతున్న ఉచ్వాస నిశ్వాశాలను గమనించాలి. పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేనివాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగినవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఎవరి వయస్సు ఎంతో కనీసం అంత సేపు రోజూ రెండు పూటలా ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు .. శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి ‘నాసికాగ్రం’ లో అంటే ‘భ్రూమధ్యం’ లో, అంటే ఆజ్ఞాచక్రస్థానం లో, అంటే సుదర్శనచక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై వుంటే .. “మూడవ కన్ను” యొక్క విస్పోటనం మొదలవుతుంది.’ .. అదే మూడవ కంటిచూపు -ముక్కంటి చూపు .. థర్డ్ ఐ విజన్ !
కళ్ళు రెండూ మూసేసుకోగానే ధ్యానానుభవాలు రావు. మొదట్లో రకరకాల ఆలోచనల పరంపర మొదలవుతుంది. ఏంతో సేపటికికానీ ఆ ఆలోచనల పరంపర శమించదు. ఆలోచనలు వస్తూంటాయి...., పోతుంటాయి... వాటిని ఎప్పటికప్పుడు ' కట్ ' చేసేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూండగా ఆ ఆలోచనల పరంపర యొక్క ప్రెషర్ తగ్గుతుంది. ఒక్కొక్క ఆలోచనా మటుమాయమైపోతూ చివరకి ఆలోచనా రహితస్థితి వస్తుంది.  అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి.ఎప్పుడయితే ధ్యానస్థితిలోకి వెళ్తామో అంటే ఇక్కడ ఆలోచనా రహిత స్థితే ధ్యానస్థితి అప్పుడు ధ్యాననుభవాలు మొదలవుతాయి. అంతవరకూ మనం ప్రాణాయామ స్థితి  అంటే "శ్వాస మీద ధ్యాస" పెడుతూ వున్న స్థితిలో వుంటాం. ఏదేని సుఖమయ ఆసనంలో కూర్చుని 'ఆనాపానసతి' ఆచరిస్తూ వుంటే, అంటే ధ్యానంలో ఉంటూ ఉంటే మనకు రకరకాల అనుభవాలు మొదలవుతాయి. అంతర దృశ్యాలు కనపడతాయి.అంతర్ నాదాలు,ధ్వనులు,శబ్దాలూ వినబడతాయి. అంతర్ యానాలు చేస్తాం  వీటన్నిటినీ వెరసి " ధ్యానానుభవాలు " అంటాం.   ప్రాథమిక ధ్యానానుభవాలు: ఈ 'ఆనాపానసతి' మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లి మెల్లిగా ఆలోచనలన్నీ శమించిపోతాయి. ఆలోచనలన్నీ జీరో అయినప్పుడు, శూన్యమై పోయినప్పుడు, అప్పుడు ఆ స్థితిలో మొదలవుతాయి ధ్యానానుభవాలు. ఇప్పుడు మనం ఈ ధ్యానానుభవాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రాథమికంగా అంటే ...  మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి, వెంటనే కానీ, కొన్ని గంటలలో కానీ, కొన్ని రోజులలో కానీ ఏడు రకాలైన ... అనుభవాలు వచ్చి తీరుతాయి. ఏడు రకాలైన ప్రాథమిక అనుభవాలను గురించి ముందుగా తెలుసుకుందాం. ప్రాథమికంగా ఏడు రకాల అనుభవాలు కలుగుతాయి, అందులో
1. శరీరం తేలికగా అయిపోవడం
శరీరం తేలికగా అయిపోవడం, ఎవరి వయస్సు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిముషాలు అంటే పదేళ్ళ పిల్లలు పది నిమిషాలు, అరవై ఏళ్ళ వారు అరవై నిమిషాలు రోజుకు రెండు సార్లు ధ్యానం చేస్తే, ముందు శరీరం బాగా తేలికగా అయిపోతుంది.  శరీరం అసలు ఉందో లేదో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది.  ఇది మొట్టమొదటి ధ్యానానుభవం - "ద హోల్ బాడీ బికమ్స్ వెరీ వెరీ లైట్ ".
2. శరీరం బరువుగా అయిపోవడం
ధ్యానంలో ఉండగా, తల భాగం కానీ, శరీరంలోని ఏ ఇతర భాగం గానీ ఒక ' గ్రానైట్ రాయి' లాగా బరువుగా అయిపోతుంది.  తల కానీ మొత్తం శరీరం కానీ, - ఇది రెండవ అనుభవం.           మొట్టమొదటిది శరీరం తేలికగా అయిపోవడం, శరీరం బరువుగా అయిపోవడం.
3. రకరకాల రంగులు కనపడతాయి
రకరకాల రంగులు కనపడతాయి, చిత్ర విచిత్రాలయిన రంగులు కనపడతాయి.  అంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతమైన రంగులు మన పాలభాగంలో మనకు కనపడతాయి.  దీనినే మనం "దివ్యచక్షువు ఉత్తేజితం కావడం" అని అంటాం. కళ్ళు రెండూ మూసుకున్నప్పుడు మనలోని శక్తి అంతా మన యొక్క పాలభాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడవ కన్నును ఉత్తేజితం చేస్తుంది.  టి.వి. స్విచ్చ్ ఆన్ చేసిన వెంటనే మనకు రంగులు ఎలా కనిపిస్తాయో అలాంటిదే ఈ మూడవ రకం అనుభవం కూడా. చాలా రంగులు కనపడతాయి.  మనకి ఏ, ఏ రంగులు కనపడుతున్నాయో ...  వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.  ధ్యానంలో ఏ, ఏ అనుభవాలు కలుగుతాయో ...  వాటితో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా గమనిస్తూ ...  వీక్షిస్తూ ... ఉండాలి.  ప్రాపంచిక ఆలోచనలను 'కట్' చేసేస్తూ ఉండాలి.  "నేనొక భర్త" అనీ, "తల్లి" అనీ, "తండ్రి" అనీ, "కూతురు" అనీ, "అన్న" అనీ, "ప్రైమ్ మినిస్టర్ " అనీ, బస్ కండక్టర్ అనీ, ఇవన్నీ తీసేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉండగా, కనీస సమయంలో కూర్చోగా, కూర్చోగా మైండ్ శూన్యమైపోగా ఈ ధ్యానానుభవాలు మొదలవుతాయి.
4. శరీరంలోని అన్ని భాగాలలో ముఖ్యంగా వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి.
శరీరంలోని అన్ని భాగాలలో, అన్ని అంగాలలో ముఖ్యంగా, వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి. ఎంతగా నొప్పులు వస్తాయంటే  ఎప్పుడు కళ్ళు తెరిచేద్దామా, ఎప్పుడు "ఓ.కె" చెప్తారా అని ఎదురు చూస్తూంటామన్నమాట.  ఆ బాధలను భరించలేక, ఒంట్లో అంతా ఎన్ని బాధలు వచ్చినా, ఈ నొప్పులన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ ధ్యానంలో ఉండాలి.  ఈ నొప్పులను భరించే శక్తిని 'తితీక్ష' అని అన్నారు ఆదిశంకరాచార్యులవారు. 
'సమము', 'దమము', 'తితీక్ష', 'ఉపరతి', 'శ్రద్ధ', 'సమాధాన', అని షట్ సంపత్తులను ఆయన వివరించారు.  ముముక్షువు కాదలచుకున్నవాడు షట్ సంపత్తులను కలిగి ఉండాలి.  'సమము', 'దమము', 'తితీక్ష', ఈ మూడవదే తితీక్ష. ధ్యానంలో మరి రకరకాల నొప్పులొస్తున్నాయని చెప్పి వెంటనే కళ్ళు తెరిచేయకూడదు.  ఎంతసేపు కూర్చోవాలో ...  అంతసేపూ కూర్చునే తీరాలి  ఎంత నొప్పి కలిగినా సరే, ఎంత కష్టమైనా సరే  కష్టం లేకుండా ఫలం లేదు కదా ... కష్టేఫలే. కనుక ఎన్ని నొప్పులొచ్చినా కూడాను భరించాలి. ఈ నొప్పులు ఎందుకొస్తున్నాయి?  అక్కడ నాడీమండలం శుద్ధి జరగడం వలన ఈ నొప్పులు వస్తాయి.  ఎప్పుడైతే కళ్ళు రెండూ మూసుకుంటామో శ్వాస మీద ధ్యాస పెడతామో, మనస్సును ఎప్పుడైతే శూన్యం చేస్తామో అప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తూంటుంది. ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహంలో మన యొక్క నాడీమండలం అపరిశుభ్రమైన నాడీమండలం పరిశుభ్రమవుతూంటుంది.  అలాంటప్పుడు ఎన్నో నొప్పులొస్తుంటాయి. ఆ నొప్పులన్నింటినీ భరించాలి.  అయితే, ఒకానొక పరిశుద్ధ ఆత్మగల వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే ఏ విధమైన నొప్పులూ రావు, ఎంచేతనంటే పరిశుభ్రమైన నాడీమండలం ఉంటుంది కనుక. నాడీమండలం ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి.  గత జన్మల్లో ఎంత ఎక్కువగా పాపాత్ములు అయితే, అంత ఎక్కువగా ఈ నొప్పులు వస్తాయి.  ఈ జన్మలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు, ఒకవేళ ఆ నొప్పులతో గనక మనం ఆ పాపాలను పరిహారం చేసుకోకుండా ఉంటే, అవి రకరకాలైన భయంకర ధీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి.  "పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే" కనుక, ఆ పాప ప్రక్షాళన జరిగి మనకి నాడీమండలం శుద్ధి జరిగుతుంది.  అప్పుడు మనకు ఎన్నో రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులన్నింటినీ హాయిగా భరించాలి. పాప ప్రక్షాళన జరిగితే గానీ మన యొక్క ఆ దివ్యచక్షువు ఉత్తేజితం కాజాలదు. . డాక్టర్స్ దగ్గరికి అసలు ఎప్పుడూ వెళ్ళకూడదు. మనకు ఈ ధ్యానంలో వచ్చే నొప్పులు, బాధలు ధ్యానం ద్వారానే పోతాయి.
5. లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది; అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మోదలుపెడుతుంది
మనం మన యొక్క ఈ స్థూల శరీరం కదలకుండా నిశ్చలంగానే కూర్చుంటున్నాం. కానీ లోపల మరొక సూక్ష్మశరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మోదలుపెడుతుంది. ముందుకీ, వెనక్కీ ఊగిసలాడుతూంటుంది. లోపల గిర్రున తిరుగుతూంటుంది. ఆ అనుభవం మనకి వస్తుంది. ఇది అయిదవ అనుభవం. లోపల వున్న సూక్ష్మశరీరం ఈ స్థూలశరీరం నుండి విడివడడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగి తిరిగి అపకేంద్ర బలాన్ని Centrifugal Force ఆపాదించుకుంటుంది.
6. గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది
సూక్ష్మశరీరం స్థూలశరీరంలో బాగా తిరిగి తిరిగి దాంట్లోంచి బయటికి వచ్చేసి ... ఎక్కడికో దూరంగా వేళ్ళిపోయినట్లు మనకు అనుభవం అవుతుంది. ఈ అనుభవమే ఆరవ ధ్యానానుభవం. ఎక్కడో గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా, మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. మనం ఇక్కడ లేం; వేరెక్కడో ఉన్నామనే అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది.
7. దివ్యచక్షువు(మూడవకన్ను)తెరుచుకుంటుంది, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలనెన్నిటినో మనం చూస్తాం
చిట్టచివరి ఏడవ అనుభవం ఏమిటంటే, దివ్యచక్షువు(మూడవ కన్ను) తెరుచుకుంటుంది. ఉత్తేజితం కావడం జరిగిన తరువాత ఇప్పుడు ’పూర్తిగా తెరుచుకోవడం’ అన్నమాట. దివ్యచక్షువు తెరుచుకున్నప్పుడు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూస్తాం. అక్కడ ఆ దృశ్యంలో మనం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఆ నీళ్ళలో మనం వున్నట్లుగా చూడవచ్చు లేదా మనం పైన వుండి క్రింద వీటన్నిటినీ చూడవచ్చు.
గమనిక: రోజూ రెండు పూటలా ధ్యానం చేయడం వలన అన్నిరకాల దీర్ఘ కాలిక రోగాలనుండి విముక్తి కావచ్చు.జీవితంలో మందుల అవసరం             వుండదు. ధ్యానంతో 72వేల నాడుల శుద్ధి జరగడం వలన జన్మజన్మల పాపకర్మల నుండి విముక్తి కావచ్చు.జీవితమంతా ఎన్ని పూజలు ప్రార్ధనలు చేసినా పరమాత్మ దర్శనం దుర్లభం.కేవలం ధ్యానం ద్వారానే తేలికగా పరమాత్మదర్శనం పొందవచ్చు. పరమాత్మ పరలోకంలో లేడు,నీలోనే వున్నాడు.ధ్యానమార్గంలో మాత్రమె జీవాత్మ పరమాత్మ అవుతుంది.విద్యార్ధులు ధ్యాన సాధన తో ఏకసంధాగ్రహ శక్తిని అనగా అద్భుతమైన జ్ఞాపక శక్తిని పొంది విద్యలో అద్భుతంగా రాణించగలరు.భయం,దుఃఖం,ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.                                                                                 Buddahud Pyramid Meditation centre,Sundaram Finance Road,Durga Mitta,Nellore.Ph:9849151998,855507070725,9701256303
700272187,9494276572,9704877574,9701256303,8125774593,9849759192,9866665899,9989005007,9701256303,
Gudur:8985005484,Naidupet:9493238626,Sullurupet:9885205743,Atmakur:9441233806,Venkatagiri:9492737911,
Buchi:9441444247,Vinjamur:9490049689 
  www.pssmovement.org/telugu/  నుండి సంగ్రహించడమైనది

“ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస”


“ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..
  ‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస’
‘అపాన’ అంటే ‘నిశ్వాస’
‘సతి’ అంటే ‘కూడుకుని వుండడం’
“ఆనాపానసతి” అంటే “మన శ్వాసతో మనం కూడుకుని వుండడం” .. దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !
ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి! సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి .. అక్కడి నుంచే వారి అసలైన “ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం” మొదలవుతుంది!
“కుంభకరహిత ప్రాణాయామం“
గౌతమబుద్ధుడు .. ఆనాపానసతేతర హఠయోగ ప్రాణాయామాదులు సంవత్సరాల తరబడి చేసి వాటన్నింటి యొక్క నిస్సారాన్నీ, నిష్ఫలతనూ స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా విసర్జించాడు.
“కఠోరమైన కుంభకాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించాను ; మొత్తంమీద నా శ్వాసలోనే ఎక్కడో రహస్యం వుంది ; సహజమైన శ్వాస రీతి మర్మం వున్నట్లు ఉంది ; చిన్నప్పటి నుండి ఎలాగైతే సహజసిద్ధంగా శ్వాసను గమనిస్తున్నానో అదే సరియైనది” అని తర్కించుకుని హాయిగా దానినే గమనించడం మొదలుపెట్టాడు. అంతే! ఒక్కొక్కటిగా ఆయనకు సర్వం అవగతమైంది.
“సహజమైన శ్వాస“
 సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం “ప్రకృతి ఎప్పుడూ సహజంగా సులభరీతిలో వుంటుంది” అని చెప్తోంది. “ఏదైతే ప్రకృతిసహజంగా, సులభరీతిగా వుందో అదే సత్య‌మైంది” అని మనం స్పిరిచ్యువల్ సైన్స్‌లో తెలుసుకుంటాం. మరి అలాగే కఠినంగా, అసహజంగా వుండేదే అసత్యం.
“శ్వాసను కుంభించడం” అన్నది కఠోరమైంది కనుక “హఠయోగ ప్రాణాయామం” అన్నది అసహజమైంది ; అది సత్యానికి సదూరమైంది.
కుంభక రహిత కేవల పూరక రేచకాత్మకం అయిన “సుఖమయ ప్రాణాయామం” అన్నది సహజమైంది ; అది సత్యంతో కూడుకుని వుంది.
“ఉపాసన – విపస్సన“
“ఉపాసన” అంటే అది “నోట్లోంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ”. “విపస్సన” అంటే శ్వాస నుంచి మొదలై మూడవ కన్ను వరకు పోయే ప్రక్రియ”.
మంత్రోపాసకులు మంత్రోచ్ఛారణ ద్వారా అభ్యాసం చేస్తూ వుంటారు. ఆ మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్ర-రహిత-స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్యరూపాలు కనబడతాయి. అయితే, అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి యొక్క ప్రాథమికాలలో, ప్రాథమిక దశలలో సంచరించడమే ఉపాసకులు సాధించగలిగిన అంతకన్నా పైన వున్న .. “దివ్యదృష్టి” అన్నది .. “మంత్ర ఉచ్ఛారణ” లో “మంత్రోపాసన” లో ఎంత మాత్రం సాధ్యం కాదు !
మంత్రోపాసకులు కేవలం ఐదవ చక్రం వరకే చేరుకుంటారు. మహా అయితే “ఆజ్ఞాచక్రం” అంటే “సుదర్శన చక్రం” ఛాయలు మాత్రమే కనబడతాయి కానీ అందులో పరపక్వత సాధించలేరు.
మంత్రజపం అన్నది అధోస్థానమైన నోట్లో వుంది ; ఆనాపానసతి అన్నది ఊర్థ్వస్థానమైన నాసికలో వుంటుంది. “నోటితో చేసే క్రియ” ను .. వదిలి “శ్వాస ద్వారా చేపట్టే క్రియ” అనే “ఆనాపానసతి” ని మొదలుపెడితే .. దివ్యదృష్టి అనతికాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్యజ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం ; అదే ఏడవదైన సహస్రారస్థితి.
“ఉపాసన ”  =  “‘ఉప’ + ‘ఆసన’”  =  “ప్రక్కనున్న ఆసనం”
“మంత్రజపం” అన్నది చిన్న ఆసనం ; “విపస్సన” అన్నది ప్రధాన సింహాసనం ఆసనం .. అక్కడే మనిషి “రారాజు” అవుతాడు ‘సింహం’ అవుతాడు.
“ఆనాపానసతి” అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై ఆజ్ఞా చక్రం ద్వారా అందరినీ ఏడవ సహస్రార స్థితికి వెంటనే తీసుకుని వెళ్తుంది.
“మంత్రోపాసన” ద్వారా శిష్యుడుగా అవ్వొచ్చు కానీ .. గురువుగా మాత్రం కాలేము ! ముఖ్యశిష్యుడిగా వుంటాం కానీ జీవన్ముక్త గురువుగా కాలేము !
ఆరవదైన ఆజ్ఞా చక్రానికి చేరుకున్నవారు గురువులు : ఏడవ స్థితికి అంటే సహస్రారస్థితికి చేరుకున్నవారే జీవన్ముక్త స్థితిలో ఉన్న పరమ గురువులు !
“దివ్యదృష్టి“
ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన “నాడీమండలం” అంతా శుద్ధి అవుతుంది ; నాడీమండలం శుద్ధం అవుతూన్నప్పుడు ఆ స్థితులను గమనిస్తూ వుండడమే కాయానుపస్సన. “కాయానుపస్సన” అనే రెండవ దశను దాటి “విపస్సన” అనే మూడవ దశ అంటే “దివ్యదృష్టి” లోకి ప్రవేశిస్తాం.
“దివ్యదృష్టి” లో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి, చెప్పుకోవాలి ; ఇదే “సజ్జనసాంగత్యం” .. ఇతర ధ్యానులతో సాంగత్యం.
“విపస్సన” ను ఇంగ్లీషులో “SEEING .. సీయింగ్” అన్నారు. అంటే “చూడడం” అన్నమాట. ఆనాపానసతి ద్వారా మనం “ఋషులం” అంటే ” SEERS .. సీయర్స్”, “ద్రష్టలం” అవుతాం.
“ధ్యానం .. సర్వ రోగనివారిణి“
ఆనాపానసతి అన్నది “పశువు” ను “పశుపతి” గా చేస్తుంది. అంటే తన జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తన జంతుతత్వానికి తాను “పతి” అంటే “యజమాని” కావడం.
ఒకానొక “పశువు” ను “పశుపతి” గా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు .. అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు !
ఆనాపానసతి .. అన్నది సర్వరోగనివారిణి-సకలశక్తి ప్రదాయిని ! ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి – సకల సమస్యల పరిష్కారిణి ! ఆనాపానసతి అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని – సకల సంశయాల హారిణి! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌‌మెంట్ యొక్కమూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం “ఆనాపానసతి”.
“నాసికాగ్రం .. భ్రూమధ్యం”
ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే .. హాయిగా కూర్చుని, కాళ్ళు రెండూ కట్టేసుకుని, చేతులు రెండూ కట్టేసుకుని, కళ్ళు రెండూ కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస వుంచాలి.
నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే  “భ్రూమధ్యం” .. అదే “నాసికాగ్రం”.
“నాసికాగ్రం” అంటే “ముక్కుకొన”  కాదు !
అలా చేసినప్పుడు .. శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి ‘నాసికాగ్రం’ లో అంటే ‘భ్రూమధ్యం’ లో, అంటే ఆజ్ఞాచక్రస్థానం లో, అంటే సుదర్శనచక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై వుంటే .. “మూడవ కన్ను” యొక్క విస్పోటనం మొదలవుతుంది.
మూడవ కన్ను యొక్క విస్ఫోటనాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటాం. “పశ్యతి ” అంటే సంస్కృతంలో “చూడడం”. “పస్సన” అంటే పాళీ భాషలో “చూడడం” .. “విపస్సన” అంటే విశేషంగా చూడడం ! ‘వి’ అంటే ‘విశేషమైన’ .. అదే మూడవ కంటిచూపు -ముక్కంటి చూపు .. థర్డ్ ఐ విజన్ !
ఆనాపానసతి – కాయానుపస్సన – విపస్సన ను మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దానిద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలలో సంచరిస్తూ ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించాలి ; పూర్ణమైన సవ్యఅవగాహన కలిగించుకోవాలి.
“ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు”
ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండూ ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి ; పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేనివాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగినవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి.
ఆనాపానసతి కి ఉపక్రమించే ముందు అర్థగ్లాసు నీళ్ళు త్రాగి ఇంకొక అర్థగ్లాసు నీళ్ళు ప్రక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పుర్తి అయిన తర్వాత, మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అర్థగ్లాసు నీళ్ళు త్రాగాలి. ఆనాపానసతి అభ్యాసం మనం చేస్తున్నప్పుడు గదిని వీలయినంత చీకటి మనం చేస్తున్నప్పుడు గదిని వీలయినంత చీకటి చేసుకోవాలి.
మనం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. సామూహిక ధ్యానం అన్నది మూడింతలు మరింత శక్తిదాయకం !
“ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?”
ప్రతిరోజూ విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే పది సంవత్సరాల వయస్సు వాళ్ళు పదినిమిషాలు, ఇరవై సంవత్సరాల వయస్సువాళ్ళు ఇరవైనిమిషాలు, ముప్పై సంవత్సరాల వయస్సువాళ్ళు ముప్పై నిమిషాలు .. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి.
ప్రతిరోజు ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడ్తుంది. ఊరికే ‘అలా’ పొయ్యి మీద బియ్యం పెట్టి ‘ఇలా’ తీసేస్తే అన్నం ఎంతమాత్రం వుడకదు గదా! అలాగే “ఆత్మ కూడా ‘ఉడకాలి’” అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యిమీద కాస్సేపు వుండాలి! “ఎంతసేపు ఉడకబడాలి?” అంటే వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు వుండాలి. తక్కువ వయస్సు వున్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరియైన సమయం కేటాయించినప్పుడే, పూర్తిగా ఉడకుతాం ! అప్పుడే “విపస్సన” అనేది మనకు సంభవిస్తుంది.
ఈ ఆనాపానసతి అన్నది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి.
ఇంకా అదనంగా .. ఇతర సమయాల్లో ఓ అయిదు నిమిషాలు సమయం దొరకితే అయిదు నిమిషాలు .. పది నిమిషాలు దొరికితే పది నిమిషాలు .. ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా .. వేరే పని ఏమీ లేనప్పుడు .. చక్కగా కళ్ళు రెండూ మూసుకుని ఎక్కడంటే అక్కడ కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి.
రాత్రిపూట పడుకునేటప్పుడు, ఆ పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే .. ఆ నిద్ర అంతా కూడా “యోగ నిద్ర” అయిపోతుంది కనుక రాత్రి పడుకునే ముందు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా “శ్వాస మీద ధ్యాస” ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి.
“నాడీమండలశుద్ధి“
ధ్యాన విజ్ఞానశాస్త్రంలో మూడు విషయాలు ఉన్నాయి ;
* ఆనాపానసతి
* కాయానుపస్సన
* విపస్సన
ఆనాపానసతి అభ్యాసంలో భౌతికకాయం వుడుకుతుంది. అంటే నాడీమండలశుద్ధి జరుగుతుంది. అనేకానేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయశరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కెడెక్కడో నొప్పులు వస్తూంటాయి. ఎక్కడెక్కడో శక్తి ప్రవాహం అవుతున్నట్లు మనం గమనిస్తూ వుంటాం. దీనిని “కాయనుపస్సన” అని గౌతమబుద్ధుడు అన్నాడు. అంటే అంతర్‌శరీరంలో, నాడీమండలంలో జరిగే మార్పులను గమనిస్తూ వుంటాం.
“కాయానుపస్సన” లో విశేషంగా నాడీమండల శుద్ధి జరుగుతుంది. నాడీమండలకాయంలో సుమారు రెండు లక్షల 72 వేల నాడులు వున్నాయి. ‘నాడీ’ అంటే “నాడీమండలం” లోని ఓ ఎనర్జీ ఛానెల్. నాడులన్నీ శుద్ధం కావడాన్నే .. ఆ విధంగా శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులనూ, బాధలనూ, అనుభవాలనూ గమనించడాన్నే .. “కాయానుపస్సన ” అంటాం.
“ప్రాణశక్తి ఆవాహనం“
ఆనాపానసతి అన్నదానిని చేస్తూంటే, చేస్తూంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి, ఆ ప్రాణశక్తి అనేకానేక మలిన నాడులను ప్రక్షాళన గావిస్తూ వుంటే ఆ యొక్క కదిలికలనూ, ఆ యొక్క కడిగే రీతులనూ, కడగడం ద్వారా వచ్చే నొప్పులనూ గమనించడమే “కాయనుపస్సన”.
ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులను అనుభవిస్తూ వుంటాం. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి .. కాయానుపస్సనలో వచ్చే తప్పనిసరి బాధలు .. ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే వాటిని మనం అధిగమించగలం. చాలామందికి ఇది తెలియక “ధ్యానంలో నొప్పులు వస్తున్నాయి” అని ధ్యానం మానేస్తూ వుంటారు ; ఇది చాలా తెలివితక్కువ పని !
“తితీక్ష .. పీడను భరించే శక్తి“
ఇలా ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత వచ్చే నొప్పులను సంతోషంగా సహనంగా, ఓపిగ్గా భరించాలి ! ఈ “భరించే శక్తి” నే శంకరాచార్యులవారు “తితీక్ష” అన్నారు.
“సమం” – “దమం” – “తితీక్ష” – “ఉపరతి” – “శ్రద్ధ” – “సమాధానం” .. వీటినే ఆయన “షట్‌సంపత్తి” అన్నారు.
షట్‌సంపత్తులలో మూడవదే “తితీక్ష” అంటే నాడీ మండలశుద్ధి జరిగేటప్పుడు మనం పడే బాధలను సహనంతో భరించటం ! మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వచ్చి తీరుతాయి.
ఎందుకంటే, మనం మన గతజన్మలలో .. ప్రాథమిక అహంకారపూరిత జన్మల్లో .. అనేకానేక హింసాత్మక కర్మల ద్వారా మన నాడీమండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నామో ! అంతటి అశుద్ధాన్ని మన ఆఖరి జన్మల్లో, తప్పనిసరిగా శుద్ధం చేసుకోవలసిందే ! నాడీమండలం ఎంత అశుద్ధంగా వుంటే అది “శుద్ధం” అయ్యేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ వుంటాయి. గతజన్మల్లో మనం ధ్యానయోగ అభ్యాసం చేయకపోతే .. గతజన్మల్లో ఎక్కువగా మరి పాపచరితులం అయితే .. ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీమండలశుద్ధి లోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు ఆ కాయానుపస్సనలోనే .. ఆ రెండో దశలోనే వుంటూ ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి.
ఈ కాయానుపస్సన, రెండవ దశ, అంటే నాడీమండలశుద్ధి అన్నది “ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుంది?” అన్నది ఆయా సాధకుల గతజన్మల చరిత్రను బట్టి వుంటుంది.
కనుక, “గతజన్మల్లో ఏం చేశాం? ఏం చెయ్యలేదు?” అన్న దానిని బట్టి ఈ జన్మలో ఈ యొక్క కాయానుపస్సన దశ “ఎంత వరకు వుంటుంది? ఎంత వరకు వుండదు” అని మనకు తెలుస్తుంది.
అయితే, గతజన్మల్లోనే గొప్ప యోగాభ్యాసి అయితే కాయానుపస్సన అన్న రెండవదశ అసలే వుండకపోవచ్చు ! లేదా బహుకొద్దిగా వుండవచ్చు ! ఆనాపానసతి మొదలుపెడ్తూనే మూడోకన్ను తెరుచుకోవచ్చు  ..
“మండల ధ్యాన దీక్ష“
అయితే, గతజన్మల్లో ఏది ఎలా వున్నా, ఈ వర్తమాన జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యాన అభ్యాసం చేస్తామో దాని మీదే ఫలితాలు అధికంగా ఆధారపడి వుంటాయి. ధ్యానాభ్యాసం అకుంఠిత దీక్షగా చేస్తే నలభై రోజుల్లో ఎవరికైనా సరే ఈ కాయానుపస్సన, నాడీమండలశుద్ధి అన్న దశ పూర్తిగా అయిపోయి విపస్సన దశలోకి సత్వరంగా, ఖచ్చితంగా వచ్చేస్తారు. నలభై రోజుల దీక్షనే “మండల దీక్ష” అన్నాం.
ఏసుక్రీస్తు .. “ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్” అన్నారు. అంటే, జీసస్ నలభై రోజులు ఏకధాటిగా ధ్యానం చేసారన్నమాట ! నలభై రోజుల మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనషి కూడా తప్పకుండా ఓ మాస్టర్ అవుతాడు.
“జీవుడే దేవుడు“
దేహమే దేవాలయం ; జీవుడే దేవుడు ; అయితే ఇదంతా మనకు “అనుభవం” లోకి రావాలి. పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మనం ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని ఉండవచ్చు. కానీ స్వానుభవం లేకపోతే అది “జ్ఞానం” కాజాలదు.
“ఆత్మే పరబ్రహ్మం” – ప్రథమ సత్యం
“జీవుడే దేవుడు” – ద్వితీయ సత్యం
“దేహమే దేవాలయం” – తృతీయ సత్యం
ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాలు .. ఈ మూడు సూత్రాలే జ్ఞానం. “నేనే అంతా” అన్నది మొట్టమొదటి సత్యం. “ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైనవాడు” అన్నది రెండవ సత్యం. “ఈ దేహమే దేవాలయం” ; ఈ కణ విభాగమే దేవాలయం ; అందులో విరాజిల్లుతున్నవాడే దేవుడు ” అన్నదే మూడవ సత్యం.
“సాధన”
ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి ? “సాధనా ప్రకరణం” లో ప్రవేశించాలి ; ఈ సాధనా ప్రకరణంలో ఉన్న నాలుగు సత్యాలు ఏమిటంటే ..
ప్రప్రధమంగా – ” శ్వాసే గురువు “
రెండవది – “సమయమే సాధన”
మూడవది – “సహనమే ప్రగతి”
నాల్గవది – “అనుభవమే జ్ఞానం”
‘సాధన’ అన్నది గురువు దగ్గరి నుంచే మొదలువుతుంది; ఎక్కడ సద్గురువు లేడో .. ఎక్కడ సత్యాన్ని చెప్పేవాడు లేడో .. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో .. ఏది ఎలా చేయకూడదో, ఏది ఎప్పుడు చేయకూడదో, ఏది ఎక్కడ చేయకూడదో .. మరి ఇవన్నీచెప్పేవాడే గురువు.
“శ్వాసే గురువు“
సంగీతం నేర్చుకోవాలంటే గురువు ఉండాలి .. సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం గురువు కావాలి. అలాగే ఆధ్యాత్మికంలో కూడా “నేనే అంతా”.. “ఈ దేహమే దేవాలయం” అన్నవి స్వంతానికీ, అనుభవానికీ రావాలంటే గురువు దగ్గరకు చేరాలి. గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి. గురువుకు సేవ చేయాలి. అప్పుడు ఆ గురువు .. జ్ఞానాన్ని బోధిస్తాడు .. సర్వమూ బోధిస్తాడు !
అయితే ఈ ఆధ్యాత్మిక సాధన ప్రకరణంలో మాత్రం “ఎవరు గురువు?”, ” ఏమిటి గురువు? ” అంటే “శ్వాసయే గురువు.” అసలు ఒక ముముక్షువు ఇంకొక “వ్యక్తి – గురువు” దగ్గరకు వెళ్ళనే అక్కర్లేదు .. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణమే !
“ధ్యానం .. ఆత్మప్రయాణం“
రెండు రకాల ప్రయాణాలు ఉన్నాయి. మొదటి ప్రాపంచిక ప్రయాణంలో బయటివాళ్ళను వివరాలు అడగాలి. రెండవ ఆధ్యాత్మిక ప్రయాణంలో లోపలున్న వాళ్ళను అడగాలి.
ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మరి బయటివాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపలున్న వాడినే అడగాలి ! కానీ లోపల చేసే ప్రయాణం గురించి బయటివాళ్ళను ఎలా అడుగుతాం?? బయట చేసే ప్రయాణాలకు లోపల ఎక్కడ అడుగుతాం??
అయితే లోపల మన శ్వాస ఉందని మనకు తెలుసు ! మనకు ఖచ్చితంగా శ్వాస అన్నది బయటి నుంచి లోపలికి పోతోందనీ, లోపల నుంచి బయటకు వస్తోందనీ తెలుసు !
కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో “శ్వాసే గురువు” అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రభోధిస్తోంది !
“గౌతమబుద్ధుడు”
గౌతమబుద్ధుడు ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్ళాడు. అలారకలముడు, ఉద్ధకరామభద్రుడు, ఇంకా ఎంతోమంది ! “మంత్రమే గురువు” అనీ, మరొకరు “ఆహారం లేకుండా ఉండు .. అదే నీ గురువు అవుతుంది” అనీ, “ఉపనిషతులు చెప్పిందే మననం చేస్తూండు” అనీ, “ముక్కు బిగపట్టుకుని ఉండు .. చక్రాల మీద మనస్సును ఏకాగ్రం చెయ్యి .. భృకుటి మధ్యలో మనస్సును లగ్నం చెయ్యి” అనీ రకరకాల గురువులు రకరకాలుగా బుద్ధుడికి బోధించారు.
ఆయన అన్నింటినీ త్రికరణశుద్ధిగా అభ్యసించి తాను నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా .. “అది తప్పు”, “ఇది తప్పు” అని తేల్చుకోవడానికి ఐదున్నర సంవత్సరాలు పట్టింది!
చివరికి సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే .. ఏ కుంభకమూ లేని .. కేవల సహజ పూరక రేచకాత్మకమైన .. తన యొక్క శ్వాస ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి “ఆనాపానసతి ” చేశాడు.
ఒకటవ జాములో “మూడోకన్ను” తెరుచుకుంది. అదే జాములో .. “జన్మపరంపర” ను తెలుసుకున్నాడు. రెండవ జాములో ఆ మూడోకన్ను ద్వారా “కర్మపరంపర” సత్యాలను తెలుసుకున్నాడు ; మూడో జాములో “ఈ ప్రపంచంలోని దుఃఖం, తృష్ణ వలన” అనీ, “తృష్ణ, అవిద్య వలన ఏర్పడుతోంది” అనీ .. “అవిద్య, చిత్తవృత్తినిరోధంతో అంతమవుతుంది” అనీ .. తెలుసుకున్నాడు. వెరసి ధ్యాన జ్ఞాన సాధన కోసం అష్టాంగ మార్గాన్ని కనుక్కున్నాడు ; దుఃఖ నివారణకు ఉపాయం తెలుసుకున్నాడు.
ఇక ఆ తరువాత .. తన జీవితాంతం .. అందరికీ “ఆనాపానసతి ధ్యానం” బోధించాడు ; “నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన ‘శ్వాస మీద ధ్యాస’ ఉంచాను ; ఇంకేది చెయ్యకూడదు ; మంత్రం చెప్పుకోకూడదు .. ఫలానా గురువు ముఖారవిందం మీద ధ్యాస వద్దు .. కళ్ళు చిట్లించి, ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చెయ్యకూడదు ..” అంటూ అన్నీ క్షుణ్ణంగా విశదీకరించి, విపులీకరించి చెప్పాడు !
“నేను ఎవ్వరికీ గురువును కాజాలను కనుక ‘అప్పో దీపో భవ’ అంటే ఎవరి దీపం వారే వెలిగించుకోవాలి “అన్నారు.” నేను నీ దీపం ఎన్నటికీ కాజాలను “అని తన ప్రియశిష్యుడు ఆనందుడికి సందేశం ఇచ్చిన గౌతమబుద్ధుడు ..”  “నీ శ్వాసే నీ దీపం .. నీ శ్వాసే నీ గురువు” అంటూ తమ చివరి శ్వాసను వదిలారు! గౌతమబుద్ధుడు చూపిన ముక్తి మర్గాన్నే మనం అందరం అనుసరిద్దాం !!

http://www.pssmovement.org/telugu/anapanasati-meditation/    నుండి గ్రహించబడింది

ప్రయాణం అంటే పరిగెత్తటడం కాదు🔥

ప్రయాణం అంటే పరిగెత్తటడం కాదు🔥

🔺 పదార్థం వెంట పరిగెత్తడం ఆపితేనే, యదార్థం వైపు ప్రయాణం మొదలవుతుంది ..

🔺 కోట్లజన్మల నుండి పరిగెత్తుతూనే ఉన్నాము. ఇప్పుడైనా పరుగు ఆపాలి, "భ్రమ"కు, "బ్రహ్మ"కు మధ్య తేడాను పట్టుకోవాలి...

🔺 బాహ్యంలో పరుగు ఆపితేనే అంతర్ముఖ  ప్రయాణం మొదలవుతుంది...

🔺 శరీరం అనేది సాధనం , శరీరపోషణకు కాదు 'సత్య శోధనకు' అని గ్రహించాలి...

 🔺 అసత్యం వెంట పరిగెత్తడంలో ,కాళ్ళు అరుగుతాయి, కీళ్లు విరుగుతాయేతప్ప శరీరంలో గ్రుచ్చుకున్న ఆత్మ అనే ముళ్ళు మాత్రం విరుగదు...

🔺 మాంసనేత్రం మాయను మోహిస్తుంది,మనోనేత్రం మర్మాన్ని గ్రహిస్తుంది...

🔺 అసత్యం వెంట పెట్టే పరుగు చీకటిని చూసి ఆగిపోతుంది ...

🔺 అసలైన ప్రయాణం చీకటిని చీల్చుకుని వెలుతురువైపుకి సాగుతుంది...

🔺 అహం కోసం పరిగెత్తడంలో దేహం  అలుస్తుంది...

🔺 అహం నశించినాడు జీవం, దైవంలో కలుస్తుంది...

🔥ఈ శరీరంతో పరమాత్మను వెతకగలిగితే , మళ్ళీ ఇంకోశరీరాన్ని వెతికే అవసరం జీవాత్మకు   ఉండదు...

🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♀🧘‍♀🧘‍♀🧘‍♀🧘‍♀

ప్రయాణం

పూర్వం ఒక అమాయకుడు సాయంత్రం ఆరు గంటలకు పొరుగూరికి బయలుదేరాడు. చీకటి గనుక లాంతరు, అగ్గిపెట్టె వెంట తీసుకెళ్ళాడు. బాగా చీకటి పడడంతో దారి కనిపించడం లేదు. అందుకే లాంతరు వెలిగించాడు. వెంటనే ఏదో ఒక ఆలోచన వచ్చి చతికిలబడి కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. దారిలో వస్తున్న బాటసారి "ఎందుకయ్యా ఏడుస్తున్నావ్" అన్నాడు. "బాబూ ఏమని చెప్పేది..... నేను నాలుగు మైళ్ళు ఈ చీకట్లో పోవాలి... ఈ లాంతరు వెలిగిస్తే పది గజాల దూరం కన్నా ఎక్కువ కాంతి పడడం లేదు. ఎక్కడి నాలుగుమైళ్ళు? ఎక్కడి పది గజాలు? ఈ పది గజాలు దాటితే ఆ కటిక చీకట్లో ఎలా ప్రయాణిస్తాను?" అన్నాడు.
 అతడి వెర్రికి నవ్వుకుంటూ.... "ఓరి వెర్రివాడా! లేచి లాంతరు పట్టుకొని నడక సాగించు.... నీవు ఎంతదూరం వెళ్ళినా ఈ పది గజాల దూరం కాంతి పడుతూనే వుంటుంది.... నాలుగు మైళ్ళు కాదు.... నలభై మైళ్ళు అయినా వెళ్ళవచ్చు" అన్నాడు. దానితో అతడు ప్రయాణం సాగించి గమ్యాన్ని చేరుకున్నాడు.
 అలాగే మనం శాస్త్ర శ్రవణం ద్వారా ఆత్మను గురించి తెలుసుకొని ఆ ఆత్మను నేనేనని తెలుసుకొని ఆత్మధ్యాన సాధన కొనసాగించాలి. అలా నిత్యం సాధన చేయగా, చేయగా గమ్యంవైపు.... ఆత్మవైపు...... "స్వస్ధితి" వైపు ప్రయాణం సాగుతుంది. ఒకనాటికి ఆత్మతో ఏకమై ఆత్మగా వుండిపోవడం జరుగుతుంది. అలాగాక నిరాశతో కూర్చుంటే ఏనాటికీ గమ్యం చేరుకోలేం. నడక సాగిస్తే చాలు.... చీమ కూడా వేలమైళ్ళు ప్రయాణిస్తుంది... కదలకుండా కూర్చుంటే గరుత్మంతుడైనా సరే ఒక్క అడుగు ముందుకు వేయలేడు.

“పిరమిడ్ ధ్యానం”


Pyramid-Northపిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేయడం వల్ల మూడు రెట్లు అధిక విశ్వశక్తి లభిస్తుంది. పిరమిడ్ అనేది ఒక భూతద్దం (Magnifying Glasses) లాంటిది. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా ఉన్నాయి, కానీ ఆ సౌరశక్తి కంటికి కనిపించదు. అయితే ఒక కాగితం ముక్కను ఆ భూతద్దం క్రింద వుంచితే, అదే సౌరశక్తితో కాగితం మాడి బూడిద అవుతుంది. అలాగే, విశ్వశక్తి అన్ని చోట్లా ఉన్నా, పిరమిడ్ క్రింద మాత్రం మూడు రెట్లు అధికంగా ఉంటుంది.

పిరమిడ్ క్రింద కానీ, పిరమిడ్ లోపల కానీ కూర్చొని చేసే ధ్యానం – ‘పిరమిడ్ ధ్యానం’ అంటారు.

“ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు”


Patriji-Speakingఈ భూమిపై మానవుల్లా జన్మతీసుకున్న మనం… మన జీవితక్రమంలో ఎదురయ్యే సంఘటనల పట్ల మరి సమస్యల పట్ల సరియైన రీతిలో ప్రతిస్పందిస్తూ… వాటి నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తూ… ప్రతిక్షణం ఆత్మోన్నతిని పొందుతూనే ఉండాలి. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం యొక్క మూల సిద్ధాంతాల పట్ల విశేషమైన అవగాహన తప్పక ఉండాలి.

1.ఆత్మసిద్ధాంతం: ఈ శరీరాన్ని మనం ఒక ‘రథం’ అనీ .. మరి అందులో ఉండే మనల్ని రథాన్ని తోలే రథికుడు అన్నారు. మనం ఈ శరీరంలో వుండి దానిని నడిపించే ‘ఆత్మస్వరూపులం’ అన్న సత్యాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. అన్ని మతాలు, మరి అందరు గురువులూ కూడా బోధించే సత్యం ఇదే.

2.జన్మ – పునర్జన్మ సిద్ధాంతం: అలాగే ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకుని కొన్ని అనుభవాల కోసం మొట్టమొదటిసారి ఈ భూమి మీద పుడితే… దానిని “జన్మ” అంటాం. అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ రకరకాల వాసనలతో కూడి రకరకాల శరీరాల్లో జన్మలు తీసుకొంటూ రకరకాల కర్మలు చేస్తూ ఈ భూలోకానికి వస్తూ పోతూ ఉంటూంటే… వాటిని “పునర్జన్మలు” అంటాం. ఇదంతా కూడా ఆత్మ తన ఎదుగుదల కోసమే కావాలని సృష్టించుకునే ఒకానొక “ఆత్మప్రణాళిక”. ఇందులో తల్లి, తండ్రి, తోబుట్టువులు, భర్త, భార్య ఇంకా ఇతరత్రా బంధుగణం, స్నేహగణం మరి పరిసరాలూ… అన్నీ కూడా ఆత్మ తన ‘స్వ’ ఇచ్ఛ ప్రకారమే ఎన్నుకుంటుంది. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది కనుక ఒకటో, పదో, వందో మరి పది వందలో…ఎవరికి ఇష్టమైనన్ని జన్మలు వాళ్ళే తీసుకుంటారు. దీనినే మనం “జన్మ – పునర్జన్మ సిద్ధాంతం” అంటాం.

3.కర్మ – కర్మఫల సిద్ధాంతం: ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాక మనం చేసే ఏ రకమైన కర్మ అయినా వెంటనే తిరిగి మనం అదే ప్రతిఫలాన్ని పొందడమే… “కర్మ – కర్మఫల సిద్ధాంతం” అన్నమాట. కాబట్టి మనం ముందుగా కర్మ చేసే విధానంలోనే అత్యంత జాగరుకతతో ఉంటే… ఇక కర్మఫలితాన్ని గురించి బెంగపడనవసరం లేదు. అందుకే… ఈ “కర్మ – కర్మఫల సిద్ధాంతం” పట్ల మనం అత్యంత ఎరుకతో ఉంటూ… అన్నిరకాల హింసలనూ మానాలి… మరి శుద్ధ శాకాహారులమై విలసిల్లాలి.

4.పురోగమన సిద్ధాంతం: ఎప్పుడైనా, ఎక్కడైనా మరి ఏ క్షణమైనా కూడా ఆత్మకు పురోగమనమే కాని.. ‘తిరోగమనం’ అన్నది ఎన్నటికీ వుండదు.

సాధారణంగా మనం ఒక విద్యార్థికి ఒకానొక పరీక్షలో 20 శాతం మార్కులు వస్తే అతడు ‘ఫెయిల్ అయ్యాడు’ అనుకుంటాం. కానీ ఆ పరీక్షలో నూటికి 20 శాతం మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థి .. “నాకు ఆ సంబంధిత సబ్జెక్టులో కనీసం 20 శాతం పరిజ్ఞానం వుంది; మరి నేను ఇంకా 80 శాతం తెలుసుకోవలసింది వుంది; అన్న జ్ఞానాన్ని పొందుతాడు. ఇలా అతడు తన గురించిన సంపూర్ణ అవగాహనను మరి జ్ఞానాన్నీ తాను పొందడం అన్నది ‘అపజయం’ ఎలా అవుతుంది?

కాబట్టి ఎవరైనా సరే… ఫలానా విషయంలో అపజయం అయ్యారు అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా తమ తమ పిల్లల పట్ల ఇలాంటి మూర్ఖత్వాలను వదిలిపెట్టాలి. ఉదాహరణకు: సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదిలో అపస్వరాలు పలుకకుండానే … గొప్ప సంగీత విద్వాంసులయ్యారా? ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచీ ఒక్క ఆట కూడా ఓడిపోకుండానే… ప్రపంచ ఛాంపియన్ అయ్యాడా? అసలు ‘ఫెయిల్యూర్’ అన్న పదమే ఈ సృష్టిలో లేదు. అవన్నీ కూడా ఆత్మ పురోగమనానికి ఏర్పాటు చేయబడ్డ సోపానాలే.

5.యోగ సిద్ధాంతం: ఒకానొక విద్యార్థి ఒక పరీక్షలో 20 శాతం మార్కులు తెచ్చుకుని “ఆ సంబంధిత సబ్జెక్టులో నేను ఇంకా 80 శాతం తెలుసుకోవాలి” అన్న జ్ఞానాన్ని పొందాక … ఇక అతడు ఆ “చేరుకోవల్సిన దిశ”గా తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. అందుకోసం కష్టపడి చదువుకుంటూ మరి ఇంకొంచెం అంటే … 30 శాతం మార్కులు తెచ్చుకోగలిగితే అది అతడికి పురోగమనమే… మరి అలా పురోగమనం చెందుతూన్న విద్యార్థి ప్రతిరోజూ ధ్యానసాధన కూడా చేస్తూ ఉంటే… అతడిలోని పురోగమనానికి అడ్డుపడే ఆలోచలన్నీ తొలగిపోయి, విశ్వశక్తితో అతడి మెదడు యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగి… అదే విద్యార్థి.. అంతే సమయంలో తక్కువ శ్రమతో రెట్టింపు ఫలితాన్ని.. అంటే 60 శాతం మార్కులను పొందుతాడు. ఇలా “ధ్యానసాధన అతడి పురోగమనాన్ని వేగవంతం చేస్తుంది” …. మరి దీనినే “యోగసిద్ధాంతం” అంటాం. నడిచి వెళ్ళేవాడు వాహన యోగం ద్వారా తన గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకున్నట్లు… ధ్యానయోగం ద్వారా మనం మన జన్మ ప్రణాళిక అమలులో ఉన్న అవరోధాలను సునాయాసంగా దాటుకుంటూ ఆత్మ పురోగమనాన్ని ఇంకా వేగవంతం చేసుకుంటాం.

6. అనేకానేక సిద్ధాంతం: ధ్యానం ద్వారా మనం సత్యశోధన మరి దైవశోధన చేస్తాం… మరి ఈ సృష్టిలో మనం వుంటోన్న ఈ ఒక్క భూలోకమే కాకుండా ఇంకా అనేకానేక లోకాలు ఉన్నాయనీ, అనేకానేక జీవులు ఉన్నాయనీ, అనేకానేక జ్ఞానాలు ఉన్నాయనీ, అనేకానేక కోణాలు ఉన్నాయనీ తెలుసుకుంటాం. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు సిద్ధాంతాల పట్ల చక్కటి అవగాహనతో కూడిన ఎరుకతో మన జీవితాలను గడుపుతూ ఉంటే… జీవితాలను గడుపుతూనే ఉంటే జీవితంలోని ఒక్కోక్షణం మనకు అందించే అద్భుత ఆనందాలను మనం ఆస్వాదించగలుగుతాం.                    http://www.pssmovement.org/telugu/6-laws-of-spiritual-science/        నుండి గ్రహించబడినది

మాంసాహార మిత్రమా! ఒక్కసారి ఆలోచించు


మహాత్మా గాంధీ          “గొర్రెప్రాణం విలువ … మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమీ కాదు. మనిషి శరీరాన్ని పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను.జంతువు చాలా నిస్సహాయమైన ప్రాణి. మానవుడి సహాయం పొందడానికి అది అధికారి. అయితే, దానికి సాయం చెయ్యాలంటే మనిషికి ఎంతో యోగ్యత,అధికార విచక్షణ వుండడం అవసరం.”
“హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది; అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలోని ఏ క్రూరశక్తినయినా జయించవచ్చు.”
వీరబ్రహ్మేంద్రస్వామి  “జీవులను వధించి జీవికి వేసిన  జీవ దోషములను జిక్కువడును: జీవహింస చేత చిక్కునా మోక్షంబు?    కాళికాంబ ! హంస కాళికాంబ ! “
యోగి వేమన      ” పక్షిజాతి బట్టి పరగ హింసల బెట్టి     కుక్షినిండ కూడు కూరుటకును   వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”
జార్జి బెర్నార్డ్‌షా    “మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చిపెట్టబడ్డాయి.”
“శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం. దీనివల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింతలేదు. మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో ..”
ఓషో రజనీష్     “జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమిమీద నుండి అది అదృశ్యమైపోతుంది.“
“జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”
తిరువల్లువర్      “తన స్వంత మాంసాన్ని క్రొవ్వు పట్టేలా చేసేందుకు ఒక జంతువు మాంసాన్ని తినేవాడు నిజమైన కరుణను ఎలా అభ్యసించగలడు?”
“ప్రజలంతా మాంసాన్ని కొనడం మరి వినియోగించడం చేయకపోతే కనుక జంతువులను వధించి మరి మాంసాన్నిఅమ్మకానికి ఉంచేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.”
“ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్య్రంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురవుతారు.”
కబీర్ దాస్      “జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలాసేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటివారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”
“కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా .. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడంలేదు.”
స్వామి దయానంద సరస్వతి   “మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినేవారి, మత్తుపానీయాల్ని త్రాగేవారి శరీరాలు మరి వీర్యకణాలు కూడా కలుషితమవుతాయి.”
మైఖేల్ నేమి  “ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువబడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే” ఇది తిరుగులేని న్యాయ సూత్రం.
మనుస్మృతి      “జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”
ఇస్లాం
“భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.” -7వ కాండ 38వ వాక్యం, ఖురాన్
                                                                                                                                                 
“అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరువేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను.అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చుచేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”                     -8వ కాండ 142వ వాక్యం, ఖురాన్
                                                                                                                                             
“ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’మార్గంలో నడవకుము.నిశ్చయముగా ‘సాతాను’మీకు సుస్పష్టమైన శత్రువు. హింసాకార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”                                                                                                                   -2వ సూరా 168వ వాక్యం, ఖురాన్
“ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టివాడు సర్వజీవులను చంపినవాడగును.ఎవడు ఒక ఆత్మను బ్రతకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”                                                                 -6వ కాండ 32వ వాక్యం, ఖురాన్                                                                                                                                         
క్రైస్తవం
ఎడ్మండ్ జకై ప్రచురించిన “గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్” అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:
“ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువుగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది .. మరి పశువుల మరణం వాని మరణం అవుతుంది” అని చెప్పారు.
“మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు .. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వబడ్డాయి.రక్తమాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.                                                                                           – The Gospal of peace, Jesus p.48,49                           
జైన్ బోధనలు       “జీవించు–జీవించనివ్వు“  “జైన మతం” లో అయిదు మహావ్రతాల్లో మొదటిది మరి అత్యంత అవశ్యకమైన మహావ్రతం ‘అహింస’. ఏ జీవికి ఏ రకమైన దుఃఖాన్నీ,కష్టాన్నీ కలిగించకుండటం, వాటిపై దయ, ప్రేమ చూపడమన్నది ముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. వారు దీనినే ‘మహావ్రతం’అంటారు.   జైన మతం ప్రకారం జంతువులను బంధించడం దుఃఖాన్ని కలిగించడం, కొట్టడం, వాటిపైన అధిక బరువు వేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది.
బుద్ధుని బోధన      “ప్రాణాలను ఎవరైనా తీయగలరు, కానీ ఎవరైనా ప్రాణాలను పోయగలరా? ఎంతటి నిమ్న జాతికి, అధమ జాతికి చెందిన వాటికి కూడా ప్రాణం ప్రియమైనదే .. ఎవ్వరూ తమ ప్రాణాలను అర్పించటానికి సిద్ధపడరు. మన మనస్సులో ‘దయ’ అనే భావం వుంటే ఈ జీవితం అమూల్యమైనది. జనులు తాము స్వయంగా నిర్దయులై వుండి దేవతల నుంచి మాత్రం దయను అర్థిస్తారు. దేవతలకు, మానవులు,పశువులూ ఇద్దరూ సమానమే, సర్వ జీవులూ సమానమేనన్న జ్ఞానం ఎవరికి కలుగుతుందో వారే శ్రేష్ఠమైన మానవులు.”
ఆధ్యాత్మికత .. శాకాహారం
“ఓ దివ్య శక్తులారా ! మా ద్విపాద మరి చతుష్పాద జీవజాతులు రెండింటినీ సంరక్షించండి. వాటి అవసరాలకు ఆహారాన్నీ మరి జలాన్నీ అందించండి. మాతో పాటు వాటి ఉన్నతి మరి దృఢత్వం కూడా వృద్ధి చెందుగాక!”                                                  –ఋగ్వేద సంహిత 10.37.11.VE,319
 “ఓరాజా ! .. మాంసపు భాగాన్ని పుచ్చుకునేవాడు, గుర్రపు మాంసం లేదా ఇతర జంతువు మాంసమైనా, మరి గోవులను వధించడం ద్వారా ఇతరులకు పాలు అందుబాటులో లేకుండా చేసే పాపిష్టివాడు దానిని మానుకొనకపోతే కనుక అలాంటప్పుడు అతనికి శిరచ్ఛేదం చేయడానికి నువ్వు సంశయించకూడదు.”                                                                                                                              – ఋగ్వేద సంహిత 1087.16,FS,90
 “ధ్యానాన్నీ మరి ఇతర యోగ మార్గాలనూ అవలంబించే ఉన్నతాత్మలు.. సకల జీవుల పట్ల ఎల్లవేళలా శ్రద్ధ వహించేవారు, జంతువులను సంరక్షించేవాళ్ళు, ఆధ్యాత్మిక అభ్యాసాల గురించి వాస్తవంగా శ్రద్ధ కలిగిన వ్యక్తులు.”       –అధర్వణ వేద సంహిత 19.48.5.FS, 90                                                                                           
“భగవంతుడిచే ప్రసాదించబడిన శరీరాన్ని భగవంతుడి యొక్క జీవులను చంపేందుకు వినియోగించకూడదు .. అది మనిషి అయినా,జంతువైనా లేదా మరేదైనా.”                                                                                                                                                   –యజుర్వేద సంహిత 12.32. FS,90
 “అసలైన ధర్మం తెలియని వాళ్ళు, దుర్మార్గులు మరి గర్వాంధులూ అయినప్పటికీ, తమను తాము నీతివంతులుగా పరిగణించుకుంటారు.ఏ విధమైన పశ్చాత్తాపభావం, కనికరం లేదా శిక్ష పట్ల భయం లేకుండా .. జంతువులను చంపుతారు. తరువాత అటువంటి పాపిష్టి వ్యక్తులు తమ తదుపరి జన్మలలో, తాము ఈ ప్రపంచంలో చంపిన జీవులకే ఆహారమవుతారు.”                                        –శ్రీమద్భాగవతం 11.5.4
శ్లో|| ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున|
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః||                                                                        –భగవద్గీత 6-32
 “ఓ అర్జునా ! ఎవడు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం.”                               
 From   http://www.pssmovement.org/telugu/vegetarianism-2/

“లేదు మరణం”


ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి కూడా “దేహ మరణం” తప్పదు! ఇది మనకు తెలిసిన సత్యం!! అయితే “ఆ తరువాత ఏమైనా ఉంటుందా?!” అన్నదే అసలైన ప్రశ్న!
సామాన్య ప్రజాబాహుళ్యానికీ, మరి ఆధ్యాత్మికపరంగా అంతగా ఎదగని ఆత్మలకూ ఈ ప్రశ్న అసంగతంగా మరి “తెలుసుకోవడానికి ఏమీ ఉండదు” అన్నట్లుగా అనిపించినా .. తెలివైన ప్రతి మనిషికీ మరి పరిణితి చెందిన ప్రతి ఆత్మకూ .. అది సహజసిద్ధంగా వచ్చే మౌలిక సందేహం మరి కీలక ప్రశ్న!
మానవజీవితంలో “శైశవ దశ” .. “బాల్య దశ” .. “యవ్వన దశ” .. “ప్రౌఢదశ” మరి “వృద్ధాప్య దశ” అనే రకరకాల దశలు ఉంటాయి. ఈ అన్ని దశలలో కూడా పుడుతూనే చనిపోతూన్న వాళ్ళు .. శిశువులుగా చనిపోయిన వాళ్ళు .. యువకులుగా మరి పెద్దవాళ్ళుగా .. చనిపోతూన్న వాళ్ళు ఉంటారు. ఇక ముసలితనం వచ్చాక అందరూ విధిగా చావవలసిందే. ఒక్కోసారి రకరకాల సమస్యలను తట్టుకోలేక బెంబేలెత్తిపోయి “చావే శరణ్యం” అనుకుని ఆత్మహత్యలకు పాల్పడేవాళ్ళు కూడా అన్ని దశలలో ఉంటారు.
మరికొందరు ఏదో విధంగా తమ జీవితాన్ని పొడిగించుకోవాలని యుక్తులూ కుయుక్తులతో రకరకాల వృధా ప్రయాసలు పడుతూ మరి వ్యర్థ ప్రయోగాలు చేస్తూంటారు. ఇదంతా కూడా “మరణం తరువాత ఇక ఏమీ ఉండదు కనుక చనిపోయే లోపలే అంతా తినెయ్యాలి .. అంతా మ్రింగి వేయాలి .. మంచి అయితే మంచిగా .. చెడు అయితే చెడుగా అంతా అనుభవించెయ్యాలి” అన్న అజ్ఞానం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామం. దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరుగులాటలు మరి అంతులేని కీచులాటలు మొదలవుతూ ఉంటాయి!!
అయితే “మరణం తరువాత కూడా జీవితం ఉంది; ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణంలో ‘భౌతిక మరణం’ అన్నది ఒకానొక మలుపు మాత్రమే” అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ధ్యానయోగులు మరి సద్గురువుల జీవితాలలో సామాన్య ప్రజల జీవితాలలో ఉన్నంత పరుగులాటలూ మరి కీచులాటలూ ఉండనే ఉండవు. “ఇప్పుడే అన్నీ సాధించుకోవలసింది ఏమీ లేదు; క్రమక్రమంగా అవే వస్తాయి” అన్న మనోనిబ్బరత వారిలో ఉంటుంది.
“గౌతమబుద్ధుడు”, “మహావీరుడు”, “గురునానక్”, “జొరాస్టర్”, “ఏసుక్రీస్తు”, “మహమ్మద్ ప్రవక్త” వంటి యోగిపుంగవులు అందరూ కూడా తమ తమ స్వంత యోగ సాధనల ద్వార ఈ స్వానుభవాన్ని పొందిన వారే! వారిలాగే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా స్వానుభవం పొందితీరాలి. అప్పుడే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయం అవుతుంది.
ఇది శాస్త్రీయ యుగం. ఇక్కడ “శాస్త్రీయ దృక్పథం” అన్నది ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. అనేకానేక ఆధ్యాత్మిక సత్యాలను పరిశీలించి, పరిశోధించి వాటిలోని శాస్త్రీయతను వెలికి తీయాలి. ఎన్నెన్నో ప్రదేశాలలో చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మల అనుభవాలను గురించి చెప్పడం మనం వింటున్నాం. నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన ఆధారాలతో పరిశోధనలు జరిపి “వాళ్ళు చెప్పింది నిజమే” అని నిర్ధారించారు కూడా.
“డాక్టర్ ఇయాన్ స్టీవెన్‌సన్” ఈ దిశగా అనేక పరిశోధనలు చేసి “Twenty Cases Suggestive of Re-Incarnation” అన్న అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. ఇందులో వారు అనేక క్షేత్ర పరిశోధనా వ్యాసాలను అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. “డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లెర్ రాస్”, “డాక్టర్ రేమాండ్ మూడీ” గార్లు “మరణ సమయంలో అనుభవాలు (Near death experiences)” అన్న అంశంపై ఎంతో విపులంగా పరిశోధనలు జరిపి అనేక గ్రంథాలను మనకు అందించారు.
ఒక్కోసారి మరణశయ్యమీద ఉన్నవాళ్ళు తాము చనిపోయిన స్థితిలో తమ శరీరాలను వదిలిపెట్టి .. ఏవేవో క్రొత్త లోకాలను చూసి వచ్చాం అని చెబుతూంటారు. సొరంగాల ద్వారా చీకటిలోకి ప్రవేశించి వెలుతురులోకి రావడం, చనిపోయిన తమ పాత మిత్రులనూ మరి బంధువులనూ కలవడం, ఉన్నత లోకాల మాస్టర్ల దగ్గర ప్రత్యక్షంగా శిక్షణ తీసుకోవడం వంటి ఎన్నెన్నో అనుభవాలను వారు పొందుతూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితకాలం ముగియకపోవడంతో వారికి ఏ వైద్యమో అందుబాటులోకి వచ్చి వాళ్ళు తిరిగి పునరుద్ధరింపబడిన శరీరంలోకి చేరిపోవడం జరుగుతుంది. ఇలాంటి దృష్టాంతాలు కూడా “మరణాంతర జీవితం ఉంది” అని మనకు తెలియజేస్తున్నాయి.
ఒక్కోసారి కొందరు ఉన్నట్లుండి తమ తమ ముఖ కవళికలను మార్చేసుకుని, వేరే వేరే భాషలను మాట్లాడేస్తూంటారు! ఆ మనిషి మునుపటి మనిషిలా ఉండడు. దీనినే “మీడియమ్‌షిప్” అంటాం ఇది కొన్ని క్షణాలు ఉండవచ్చు .. లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రోజులు .. నెలలు కూడా ఉండవచ్చు. దీనినే “దయ్యం పట్టింది” అని కొన్నిచోట్ల అంటూంటారు.
నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇలాంటి విషయాలను పరిశోధించి “మరణించిన కొన్ని మూర్ఖపు ఆత్మలు తిరిగి తమ కోర్కెలను తీర్చుకోవడంకోసం అంతగా ఎదగని అజ్ఞానపు ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోర్కెలు తీర్చుకుంటూ ఉంటాయి” అని ధృవీకరించారు. ఇలాంటి వారికి చక్కటి జ్ఞానాన్ని అందించడం ద్వారా వారిని ఆ మూర్ఖపు ఆత్మలబారి నుంచి విముక్తులను చేయవచ్చు.
ఇదేవిధంగా ఎంతోమంది తమ తమ నిద్రావస్థలలో కూడా స్వప్న విహారాలు చేసి రాబోయే కాలానికి సంబంధించిన వార్తలను సేకర్తిస్తూంటారు. ఆ వార్తలను విశ్లేషించగా అవి “నిజమే” అని నిరూపించబడ్డాయి. కనుక తెలివైన మానవాళికీ మరి అధిమానస ప్రయోగాలను అవగాహన చేసుకోగలిగే వాళ్లకూ “మరణానంతర జీవితం” అన్నది నిరూపితమైన సత్యం!!
భగవద్గీతలో “శ్రీకృష్ణ పరమాత్మ” కూడా –
“జాతస్య హి ధృవోమృత్యుః ధృవం జన్మ మృతస్య చ
తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి”
(భగవద్గీత 2-27)
“పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదే పూర్ణయోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టే దానికి ఎవ్వరూ ఎప్పుడూ ఏడవరాదు” అంటూ మరణానంతరం జీవితం గురించి పరమాద్భుతంగా తెలియజేశారు.
ప్రతి ఒక్క ఆత్మకూడా రకరకాల జన్మల ద్వారా రకరకాల శరీరాలలోకి ప్రవేశిస్తూ .. మరణం ద్వారా వాటిని వదిలిపెడుతూ .. మళ్ళీ పుడుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానిగా జనన మరణ పరంపరను చేధిస్తుంది. చివరికి తాను కూడా ఒకానొక “పరమ ఆత్మ”గా పరిణితి చెంది ఇక ఊర్థ్వలోకాలలో శాశ్వతమైన సద్గురువు పదవిని చేరుకుంటుంది!
ఇది తెలుసుకున్న గౌతమబుద్ధుడు “ఆనాపానసతి ధ్యానం” చేసి స్వంత దివ్యచక్షువు ద్వారా తన జన్మ కర్మ పరంపరనంతా చూసుకుని దుఃఖరహితుడు అయ్యాడు. మరెందరో యోగమూర్తులు ఇదే దారిలో నడిచి మోక్షాన్ని పొందారు. జీసస్ క్రైస్ట్ అయితే “నేను క్రితం జన్మలో ‘ఎలియా’ ను” అని చాటి చెప్పాడు.
వాళ్ళలాగే నేను కూడా ధ్యానం చేసి ఇదే సత్యాన్ని తెలుసుకున్నాను. నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుసుకున్నారు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మస్వరూపులమైన మనకు ఆత్మానుభవం ఉండడం సహజం! అది లేకపోవడమే అసహజం! కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ సత్యాలను తెలుసుకోవాలి. నిజానికి ప్రతి ఒక్క మనిషికి కూడా తన జీవితంలో చిన్నప్పటినుంచీ ఏదో ఒక సమయంలో ఆత్మానుభవాలు వస్తూనే ఉంటాయి.
కానీ సగటు సామాజిక వ్యవస్థలవల్ల అయితేనేమి, మూర్ఖపు పెంపకాలవల్ల అయితేనేమి అవి అన్నీ వారి మస్తిష్కాలలోనే అణిచివేయబడతాయి. అటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడయితే ధ్యానయోగ మార్గంలోకి అడుగు పెడతారో .. ఇక పరంపరగా వారికి ఆత్మానుభవాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భౌతిక, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాది సముదాయానికి చెందిన అనుభవాల ద్వారా ఆత్మసత్యాలు అవగతమై వారు చిన్నప్పుడు తమకు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో తెలుసుకుంటారు.
ఎవరికి వారే ధ్యాన సముద్రంలో ఈది తమలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏ శాస్త్రాన్నీ, ఏ మతాన్నీ లేదా ఏ గురువునూ గ్రుడ్డిగా నమ్మరాదు.
కాస్సేపు హాయిగా కూర్చుని .. కళ్ళు రెండూ మూసుకుని .. సహజంగా జరుగుతున్నటువంటి “శ్వాస మీద ధ్యాస” ఉంచాలి. ఏ రూపాన్నీ ఊహించకుండా ఏ మంత్రాన్నీ జపించకుండా అలా అలా సహజ శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమంగా ఆలోచనల ఉధృతి తగ్గిపోయి ఆలోచనారహితస్థితికి చేరుకుంటాం. ఆ అద్భుత స్థితిలో మెల్లి మెల్లిగా దివ్యచక్షువు ఉత్తేజితమై .. మరి భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల అవుతుంది. ఆ సూక్ష్మశరీరం వెంట ప్రయాణిస్తూ వెళ్తే మరణానంతరం వెళ్ళే సకల లోకాల దర్శనాలు ముందే కలుగుతాయి.
ఇలా ధ్యానంలో భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల కావడం కూడా అన్నది ఒక రకంగా మరణమే! ఇది ఎలా అంటే .. మన భౌతిక శరీరానికీ మరి సూక్ష్మ శరీరానికీ మధ్యలో “ప్రాణమయ తీగ (Silver Cord)” అనుసంధానమై ఉంటుంది. ధ్యానంలో ఎరుకతో చేసే సూక్ష్మశరీర యానంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ప్రాణమయ తీగ ద్వారా సూక్ష్మశరీరం మళ్ళీ చటుక్కున వచ్చి భౌతిక శరీరంలో దూరిపోతూ ఉంటుంది. అదే మరణంలో అయితే ఈ ప్రాణమయతీగ తెగిపోయి రెండు శరీరాల మధ్య ఉన్న బంధం శాశ్వతంగా ముగిసిపోతుంది.
ఇలా మరణం ద్వారా భౌతిక శరీరాన్ని శాశ్వతంగా వదిలి పెట్టేసిన ఆత్మ .. తన సూక్ష్మశరీరంతో సూక్ష్మలోకాలన్నీతిరిగేస్తూ అంతకు ముందు భూమిమీద తను చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలిపెడితే అది భూలోకంలో సృష్టించినట్లే సూక్ష్మ లోకాలలో కూడా చీకటి రూపాలను సృష్టించుకుంటూ వాటిలోపడి నరకయాతనను అనుభవిస్తూ ఉంటుంది .. మరి సుజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే అది నేరుగా ఊర్థ్వ లోకాలకు చేరుకుని అక్కడ తన కర్మల ప్రతిఫలాలను ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది.
ఇలా ప్రతి ఒక్క ఆత్మకు కూడా మరణానికి పూర్వపు జీవితానుభవాలు ఎన్ని ఉంటాయో మరణాంతర జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి. సూక్ష్మశరీరాలతో అవి కోటానుకోట్ల సూక్ష్మలోక అనుభవాలను పొంది .. అక్కడి తమ గత జన్మ స్మృతుల ఆధారంగా నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానం చేసి ఎవరికి వారే తెలుసుకోవచ్చు.
ధ్యానానికి కూర్చున్న మొదటిరోజే ఇవన్నీ తెలిసిపోవు! కనుక కనీసం నలభై రోజులు ఏకదీక్షగా తీవ్రతర సాధన చెయ్యాలి. ధ్యానంలో కలుగుతూన్న అనుభవాలను వ్రాసి పెట్టుకోవాలి.
ఇక్కడ “నమ్మకాలకు” ఎంత మాత్రం తావు లేదు. కేవలం శాస్త్రీయ దృక్పధానికీ మరి స్వీయ అనుభవానికీ మాత్రమే తావు ఉంది .. కనుక మానవ జీవితాన్ని మనం సరియైన విధంగా జీవించాలంటే ముందు ఈ మరణానంతర జీవితం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అప్పుడే మన జీవితాలలో పోట్లాడుకోవడాలూ, హింసా ప్రవృత్తులూ, జంతు-పక్షి మాంస భక్షణలూ, జంతువధ మరి ఇతరుల వ్యక్తిగత జీవితాలలో తలదూర్చడాలవంటి అనాచారాలన్నీ మటుమాయం అయిపోతాయి. జీవితమంతా శుభాలతో మరి ఆనందాలతో నిండిపోతుంది.
ఇలాంటి జీవులనే “ముక్తజీవులు” లేదా “ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్స్” అంటారు. అలాంటి ముక్తజీవులే సభ్య సమాజ జీవులుగా మెలగగలుగుతారు మరి తమ చుట్టూ ఉన్నవారిని కూడా తమలాగే తయారుచేసి ఈ భువిని దివిగా మార్చగలుగుతారు!
నిజానికి సమాజంలో ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టినా మరి ఎన్ని మంచి పనులు చేసినా ఆత్మజ్ఞానం అన్నది లోపిస్తే మాత్రం వారు చివరికి రకరకాల ప్రలోభాలకు లోనై పరితపించవలసిందే .. మరి ఆత్మశాంతి కరువై శోకించవలసిందే!
చాలామంది “మేము భగవంతుని భక్తులం; ఎన్నో మంచి పనులు చేస్తున్నాం; ఆ పుణ్యమే మాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది” అంటూ ధ్యానం చెయ్యడానికి విముఖత చూపిస్తూంటాయి.
శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో ..
“తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్య్వలోకం విశంతి
ఏవం త్రయా ధర్మ మనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే”
(భగవద్గీత 9-20)
“ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత, అక్కడివన్నీ భోగించి పుణ్యం క్షీణించిన తరువాత, అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే ‘మరణం’ ఉన్న లోకంలోకి తిరిగి ప్రవేశిస్తారు; ఈ విధంగా రావడం, పోవడం అన్నది మూడు ధర్మాలను నిర్వర్తించడంకోసం .. మరి వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం .. యధావిధిగా జరుగుతూనే ఉంటుంది” అని సుస్పష్టంగా తెలియజేశారు.
మంచి కార్యాలవల్ల పుణ్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం మాత్రం రాదు! ఆత్మానుభవం వల్ల పొందే అనుభవజ్ఞానంతో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొంది మనం జనన మరణ చక్రం నుంచి విముక్తులం అవుతాం! కనుక ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యజీవితాన్ని మనం భౌతిక శరీరంతో బ్రతికి ఉన్నప్పుడే అనుభవించడం మొదలుపెడదాం.
ఇందుకుగాను మన దైనందిన జీవితంలో ఏ మాత్రం మార్పులు చేసుకోనవసరం లేదు. సంసార సుఖాలను అసలు విడిచి పెట్టనవసరం లేదు. ఇహలోకపు విద్యలనూ మరి సకల కళలనూ ఒకవైపు నేర్చుకుంటూనే మరొకవైపు పరలోకపు సమాచారాన్నంతా విశేషంగా సేకరించుకోవాలి. ఇహలోకపు సుఖాలు ఒకవైపు హాయిగా అనుభవిస్తూనే మరొకవైపు అమరలోకపు ఆనందాలను ఆస్వాదించాలి.
ఇదే సరియైన మానవ జీవన విధి విధానం .. మరి ఇదే పరిపూర్ణమైన మానవ దివ్యజీవన సారాంశం!!