15, ఏప్రిల్ 2023, శనివారం

కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.

కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి
ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.
ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!
కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది.
ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది.
ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే.
మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి.
మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు.
మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది.
అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు.
కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు.
ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే“నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.
అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి.
అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది.
పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది.
ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మలగురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము.
అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు.
కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు.
కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు.
భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే.
అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి.
చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి.
రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి.
రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి.
అలాంటివాడు కేవలం“దొంగే” అవుతాడుగాని“రాజు” ఎన్నటికీ కాలేడు.
అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు.
కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!
అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి.....🙏

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...?

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...? 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి. 

🌸అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. 

🌿ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. 

🌸బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది.

🌿 విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. 

🌸బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. 

🌿ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. 

🌸ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

🌿తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. 

🌸ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

🌿విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.

🌸ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. 

🌿ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది.

🌸అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.

🌿ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు.

🌸 దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది.

🌿సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్యభగవానుడికి, భానుడు, రవి వంటి వివిధ రకాల పేర్లతో పిలవడం గురించి మనం విన్నాం.కానీ సూర్య భగవానుడి విమలాదిత్యుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

🌸అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది.కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మరి జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.

🌿అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిలో స్నానం చేయాలని చెబుతుంటారు.

🌸పరమపవిత్రమైన కాశీలో మనకు 12 సూర్య దేవాలయాలు కనిపిస్తాయి.ఈ పన్నెండు ఆలయాలలో ఒక్కో ఆలయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు.ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం.

🌿పూర్వం విమలుడు అనే ఒక రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవారు.ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్యా బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు.

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.

వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . భారత దేశాన్ని పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .

కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.

  ఎందుకు నేను వారిపై అంత కసిగా ఉన్నానంటే నేను లేని సమయం చూసి జబ్బుతో ఉన్న మా నాన్నను ప్రార్ధన చేస్తే జబ్బు నయమౌతుందని మా అమ్మను నమ్మించి ప్రార్ధనలు చేశారు. మా నాన్న మనసు గూడ మార్చారు . ఒకవేళ మందులతో మా నాన్న బ్రతికుంటే వారి గొప్పగా చెప్పుకొనేవారు. గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి

భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్మమో లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు

మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.

ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.