19, జులై 2023, బుధవారం

🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!

 🎻🌹🙏హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి.హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.


🌸మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది.హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి.


🌿హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు.ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి.


🌸హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ కూడా ఇప్పటి వరకు ఛేదించలేకపోయింది.ఈ పనిలో కూడా శాస్త్రవేత్తలు విజయం సాధించలేకపోయారు.అలాంటి రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


🌹1) ప్రపంచంలో ఉన్న పెద్ద సరస్సుల్లో గురుభోంగ్ మార్ సరస్సు ఒకటి.🌹


🌿ఈ సరస్సు సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో, టెస్టా నదితో కలిసి ఉంటుంది.


🌸కంచనగంగా పర్వతం పక్కనే ఇది ఉంటుంది.ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.

ఈ సరస్సులోని నీరు చలికాలంలో కూడా గడ్డ కట్టవు.దీనికి ఓ కారణం ఉంది.


🌿ఆ సరస్సు ఎప్పుడూ గడ్డ కట్టి ఉండటంతో ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలను గురు పద్మ సాంబవ అనే ట్రైబల్ దేవుడు చూస్తాడు.


🌸దీంతో తన వద్ద ఉన్న ఒక ఆయుధంతో సరస్సులోని ఒక ప్రదేశంలో టచ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆప్రదేశంలో నీరు గడ్డకట్టకుండా ఉంటాయి.దీంతో అక్కడి ప్రజల నీటి కష్టాలు తీరుతాయి.

ఆ నీరు మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా గడ్డ కట్టవు.


🌹2 ) జ్ఞానగంజ్ అనేది ఓ సిద్ధ ఆశ్రమం.🌹


🌿ఈ ఆశ్రమంలో ఉండేవారికి చావు అనేది ఉండదట.

ఇక్కడ ఉండే వారు గాలిని పీల్చుకుని జీవిస్తుంటారు.అయితే ఈ ప్రదేశం అందరికీ కనబడదు.


🌸దేవుడి మీద నమ్మకం ఉండి, ఎవరికీ ద్రోహం చేయకుండా, అందరి మంచి కోరుకునే వారికి మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుంది.అక్కడ ఉండే యోగులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి.


🌿వారు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతామో కూడా చెప్పగలరు.మన పూర్వం కూడా చెప్పగలరట.


🌹3 )రూప్ కాండ్ సరస్సు:🌹


🌸ఈ సరస్సుకు అస్థి పంజరాల గుట్ట అని కూడా అంటారు.ఇక్కడ పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి.


🌿అయితే అవి ఎవరివి అనేది ఇంకా రహస్యంగానే ఉంది.కొంత మంది అవి రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారివి అంటారు.


🌸వీరంతా రాజ కుటుంబానికి చెందిన వారని, ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని మరికొందరు చెబుతారు.దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.


🌹4 ) గ్యాంగ్ ఖార్ ప్యునేసం:🌹


🌿ఇది ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం.ఇప్పటి వరకు ఎవరూ ఈ పర్వత శిఖరాన్ని చేరుకోలేదు.

ఈ పర్వతం భూటాన్ లో ఉంది.


🌸ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించకపోవడంతో దీనిని ఒక రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు.

భూటానీస్ లు ఈ ప్రాంతాన్ని దేవుళ్లు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు.


🌿ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్ధాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే వారు చెబుతారు.


🌹5 ) మౌంట్ కైలాష్:🌹


🌸మౌంట్ కైలాష్ అనేది హిమాలయాల్లోనే వింతైన ప్రదేశం.ఇక్కడి నుంచే ప్రపంచ మొదలవుతుందని చెబుతారు.


🌿హిందువులు ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడని నమ్ముతారు.ఇది సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉంటుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

💫 శాపవిమోచనం 🎊

 💫 శాపవిమోచనం  🎊

➖➖➖➖➖➖➖✍️

-(అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం - పుణ్యచరిత్ర)

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


🪷 ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమిత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు.


🪷 ఇలావుండగా, ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలను తుంచి, వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరం నుండి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు.


🪷 తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచనమీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు... 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరు' అని విమోచనమార్గం అనుగ్రహించాడు.


🪷 ఫలితంగా... ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. 


🪷 ఆదేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగాకమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాల కోసం  వెదకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి, వేసారి వెనుదిరుగుదామ అనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి, కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడసాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.


🪷 ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్యపురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింది" అని ప్రార్ధించగా వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి...


🪷 "రాజా ! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరిరూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజూ ఉదయాన్నే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటిగిరిని ప్రదక్షిణం చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు.


🪷 వెంటనే రాజు అంజలి ఘటించి.. "మహాత్మ్యమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణం చేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి ? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా.. 


🪷 "రాజా ! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినైనా పొందగలరు" అని వివరించి, గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు.


🪷 ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు.


*_🪷 నేడు 'అరుణాచలం' అని పేరుబడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. కోరికలీడేర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు. (సుమారు 14 కి.మీ) అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది.

[4:58 pm, 18/07/2023] Satyam Sivam Group: ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆకాలంలో అతను నిర్మించినవే. వీటిలో దుర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది.!_*


ఓం అరుణాచలేశ్వరాయ నమః

30, మే 2023, మంగళవారం

# పెరుగు తింటున్నారా..!

 # పెరుగు తింటున్నారా..!


చాలామంది అమ్మాయిలు పాలే కాదు.. పెరుగు కూడా తీసుకోరు. తింటే లావైపోతామేమో అని భయపడటమే కారణం. కానీ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు ఎన్నో తెలుసా..


పెరుగులోని పోషకాల్ని జీర్ణవ్యవస్థ సులువుగా స్వీకరిస్తుంది. దీన్ని మసాలాపదార్థాలతో కలిపి తీసుకుంటే గనుక ఆ ఘాటు తగ్గి.. హాయిగా అనిపిస్తుంది.


ఈ రోజుల్లో చాలామంది యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ పెరుగు తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు కూడా అదుపులో ఉండి, చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.


పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిని పెంచి, హానిచేసే సూక్ష్మక్రిముల్ని నశింపచేస్తుంది. జననేంద్రియ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.


పెద్దయ్యేకొద్దీ ఆస్టియోపోరోసిస్‌ వచ్చే సమస్య మహిళల్లో ఎక్కువ అంటారు. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ముందునుంచీ పెరుగు తినడం మంచిది. ఇది ఎముకలకు మేలుచేసి.. ఆ సమస్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలల్లోలా ఇందులోనూ పాస్ఫరస్‌, క్యాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.


పెరుగులో జింక్‌, విటమిన్‌ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగు రోజూ తినడం వల్ల చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. బరువునూ అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.


పెరుగు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని భయపడేవారు ఓ పనిచేయొచ్చు. వెన్నలేని పాలతో తోడుబెట్టిన పెరుగును ఎంచుకోవచ్చు. దానివల్ల కెలొరీల భయం ఉండదు.. పోషకాలూ అందుకోవచ్చు.

🕉️సనాతన ఋషుల జాబితా!🕉️

 🕉️సనాతన ఋషుల జాబితా!🕉️

    ☘️  అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు☘️



  🌻దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

  🌻బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

  🌻మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

  🌻రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


  💥అ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు

  ∷ అగ్ని మహర్షి

  ∷ అగస్త్య మహర్షి

  ∷ అంగీరస మహర్షి

  ∷ అంగిరో మహర్షి

  ∷ అత్రి మహర్షి

  ∷ అర్వరీవత మహర్షి

  ∷ అభినామన మహర్షి

  ∷ అగ్నివేశ మహర్షి

  ∷ అరుణి మహర్షి

  ∷ అష్టావక్ర మహర్షి

  ∷ అష్టిక మహర్షి

  ∷ అథర్వణ మహర్షి

  ∷ ఆత్రేయ మహర్షి

  ∷ అథర్వాకృతి‎

  ∷ అమహీయుడు

  ∷ అజామిళ్హుడు‎

  ∷ అప్రతిరథుడు‎

  ∷ అయాస్యుడు‎

  ∷ అవస్యుడు

  ∷ అంబరీషుడు


  💥ఇ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ ఇరింబిఠి‎



  💥ఉ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ ఉపమన్యు మహర్షి

  ∷ ఉత్తమ మహర్షి

  ∷ ఉన్మోచన

  ∷ ఉపరిబభ్రవుడు

  ∷ ఉద్దాలకుడు‎

  ∷ ఉశనసుడు

  ∷ ఉత్కీలుడు


  💥ఊ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ ఊర్ఝ మహర్షి

  ∷ ఊర్ద్వబాహు మహర్షి


  💥ఋ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ ఋచీక మహర్షి

  ∷ ఋషభ మహర్షి

  ∷ ఋష్యశృంగ మహర్షి

  ∷ ఋష


  💥ఔ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ ఔపమన్యవ మహర్షి

  ∷ ఔరవ మహర్షి


  💥క - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ కపిల మహర్షి

  ∷ కశ్యప మహర్షి

  ∷ క్రతు మహర్షి

  ∷ కౌకుండి మహర్షి

  ∷ కురుండి మహర్షి

  ∷ కావ్య మహర్షి

  ∷ కాంభోజ మహర్షి

  ∷ కంబ స్వాయంభువ మహర్షి

  ∷ కాండ్వ మహర్షి

  ∷ కణ్వ మహర్షి

  ∷ కాణ్వ మహర్షి

  ∷ కిందమ మహర్షి

  ∷ కుత్స మహర్షి

  ∷ కౌరుపథి‎

  ∷ కౌశికుడు‎

  ∷ కురువు

  ∷ కాణుడు‎

  ∷ కలి

  ∷ కాంకాయనుడు

  ∷ కపింజలుడు‎

  ∷ కుసీదుడు

  ∷ కౌడిన్యమహర్షి


  💥గ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ గౌతమ మహర్షి

  ∷ గర్గ మహర్షి

  ∷ గృత్సమద మహర్షి

  ∷ గృత్సదుడు‎

  ∷ గోపథుడు‎

  ∷ గోతముడు

  ∷ గౌరీవీతి

  ∷ గోపవనుడు

  ∷ గయుడు


  💥చ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ చ్యవన మహర్షి

  ∷ చైత్ర మహర్షి

  ∷ చాతనుడు‎


  💥జ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ జమదగ్ని మహర్షి

  ∷ జైమిని మహర్షి

  ∷ జ్యోతిర్ధామ మహర్షి

  ∷ జాహ్న మహర్షి

  ∷ జగద్బీజ

  ∷ జాటికాయనుడు‎


  💥త - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ తండి మహర్షి

  ∷ తిత్తిరి మహర్షి

  ∷ త్రితుడు

  ∷ తృణపాణి


  💥ద - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ దధీచి మహర్షి

  ∷ దుర్వాస మహర్షి

  ∷ దేవల మహర్షి

  ∷ దత్తోలి మహర్షి

  ∷ దాలయ మహర్షి

  ∷ దీర్ఘతమ మహర్షి

  ∷ ద్రవిణోదస్సు‎


  💥న - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ నచికేత మహర్షి

  ∷ నారద మహర్షి

  ∷ నిశ్ఛర మహర్షి

  ∷ సుమేధా మహర్షి

  ∷ నోధా

  ∷ నృమేధుడు


  💥ప - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ పరశురాముడు

  ∷ పరాశర మహర్షి

  ∷ పరిజన్య మహర్షి

  ∷ పులస్త్య మహర్షి

  ∷ ప్రాచేతస మహర్షి

  ∷ పులహ మహర్షి

  ∷ ప్రాణ మహర్షి

  ∷ ప్రవహిత మహర్షి

  ∷ పృథు మహర్షి

  ∷ పివర మహర్షి

  ∷ పిప్పలాద మహర్షి

  ∷ ప్రత్య్సంగిరసుడు

  ∷ పతివేదనుడు

  ∷ ప్రమోచన‎

  ∷ ప్రశోచనుడు‎

  ∷ ప్రియమేథుడు

  ∷ పార్వతుడు

  ∷ పురుహన్మ‎

  ∷ ప్రస్కణ్వుడు

  ∷ ప్రాగాథుడు

  ∷ ప్రాచీనబర్హి

  ∷ ప్రయోగుడు

  ∷ పూరుడు

  ∷ పాయు


  💥బ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ భరద్వాజ మహర్షి

  ∷ భృగు మహర్షి

  ∷ భృంగి మహర్షి

  ∷ బ్రహ్మర్షి మహర్షి

  ∷ బభ్రుపింగళుడు

  ∷ భార్గవవైదర్భి‎

  ∷ భాగలి

  ∷ భృగ్వంగిరాబ్రహ్మ

  ∷ బ్రహ్మస్కందుడు‎

  ∷ భగుడు‎

  ∷ బ్రహ్మర్షి

  ∷ బృహత్కీర్తి‎

  ∷ బృహజ్జ్యోతి‎

  ∷ భర్గుడు


  💥మ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ మరీచి మహర్షి

  ∷ మార్కండేయ మహర్షి

  ∷ మిత మహర్షి

  ∷ మృకండు మహర్షి

  ∷ మహాముని మహర్షి

  ∷ మధు మహర్షి

  ∷ మాండవ్య మహర్షి

  ∷ మాయు

  ∷ మృగారుడు‎

  ∷ మాతృనామ‎

  ∷ మయోభువు‎

  ∷ మేధాతిథి

  ∷ మధుచ్ఛందుడు

  ∷ మనువు

  ∷ మారీచుడు


  💥య - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ యాజ్ఞవల్క మహర్షి

  ∷ యయాతి‎


  💥ర - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ రురు మహర్షి

  ∷ రాజర్షి మహర్షి

  ∷ రేభుడ

  💥వ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ వశిష్ట మహర్షి

  ∷ వాలఖిల్యులు

  ∷ వాల్మీకి మహర్షి

  ∷ విశ్వామిత్ర మహర్షి

  ∷ వ్యాస మహర్షి

  ∷ విభాండక ఋషి

  ∷ వాదుల మహర్షి

  ∷ వాణక మహర్షి

  ∷ వేదశ్రీ మహర్షి

  ∷ వేదబాహు మహర్షి

  ∷ విరాజా మహర్షి

  ∷ వైశేషిక మహర్షి

  ∷ వైశంపాయన మహర్షి

  ∷ వర్తంతు మహర్షి

  ∷ వృషాకపి

  ∷ విరూపుడు‎

  ∷ వత్సుడు‎

  ∷ వేనుడు

  ∷ వామదేవుడు‎

  ∷ వత్సప్రి

  ∷ విందుడు


  💥శ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ శంఖ మహర్షి

  ∷ శంకృతి మహర్షి

  ∷ శతానంద మహర్షి

  ∷ శుక మహర్షి

  ∷ శుక్ర మహర్షి

  ∷ శృంగి ఋషి

  ∷ శశికర్ణుడు

  ∷ శంభు‎

  ∷ శౌనకుడు

  ∷ శంయువు‎

  ∷ శ్రుతకక్షుడు


  💥స - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  సమ్మిత మహర్షి

  సనత్కుమారులు

  సప్తర్షులు

  ∷ స్థంభ మహర్షి

  ∷ సుధామ మహర్షి

  ∷ సహిష్ణు మహర్షి

  ∷ సాంఖ్య మహర్షి

  ∷ సాందీపణి మహర్షి

  ∷ సావిత్రీసూర్య

  ∷ సుశబ్దుడు‎

  ∷ సుతకక్షుడు‎

  ∷ సుకక్షుడు‎

  ∷ సౌభరి

  ∷ సుకీర్తి‎

  ∷ సవితామహర్షి సామావేదానికి మూలము.

  ∷ సింధుద్వీపుడు

  ∷ శునఃశేపుడు

  ∷ సుదీతి


  💥హ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు


  ∷ హవిష్మంత మహర్షి

  ∷ హిరణ్యరోమ మహర్షి .

6, మే 2023, శనివారం

🔔రామ నామ మహిమ🔔

 🔔రామ నామ మహిమ🔔

       🚩🌳🚩


హనుమంతుడు ఆశోకవనంలో  సీతాదేవిని దర్శించి , సీతమ్మవారి వద్ద నుండి చూడామణి తీసుకుని  రాముని వద్దకు తిరిగి

వెళ్ళాడు.

సీతాదేవిని దర్శించాను అని తెలిపి శ్రీ రాముని చరణాల వద్ద సీతమ్మ యొక్క చూడామణిని వుంచాడు.  ఆనందంతో రాముడు తనని

ఆలింగనం చేసుకుంటాడని ఆశించిన హనుమకి నిరాశే  మిగిలింది.

చూడామాణిని చూసిన రాముని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు  రాముడు అడిగిన ప్రశ్న హనుమంతునికి విస్మయం కలిగించింది.  ఆంజనేయుని చూసి  రాముడు 'హనుమా.. నేను చెప్పినదేమిటి ? నీవు చేసినదేమిటి ? సీతాదేవిని చూసి రమ్మని నిన్ను పంపాను. కాని నీవు లంకనే కాల్చి 

రావణుని ప్రజలను తీవ్రమైన బాధలకు గురిచేశావు.

ఇదంతా నీవు నా అనుమతితోనే చేశావా ?అని అడిగాడు.

" రామప్రభూ .. రావణుని అనుచరులు నా తోకకు నిప్పు ముట్టించారు.  రావణుడు వేడుకతో చూస్తూ ఆనందించాడు. నేను ఆ నిప్పును ఆర్పేందుకు అటు ఇటూ తిరుగుతూ  నా వాలమును ఆడించాను.  ఆ సమయంలో  మంటలు చెలరేగి లంకాపట్టణం

కాలిపోయింది. ఇది రావణుడు చేసిన

తప్పు వల్లే జరిగింది" అని సంజాయిషీ చెప్పాడు హనుమ.


నీ తోకకు అంటించిన అగ్ని  వల్ల నీ శరీరము  కాలి బాధ కలిగినదా ?"


" లేదు...రామా! నేను తమ నామమునే

జపిస్తూ నిశ్చింతగా వుండిపోయాను. రామ నామ మహిమ వలన

నాకు ఏ బాధా కలుగలేదు" అనిఅన్నాడు హనుమ. నిన్ను నీవు  కాపాడుకోవడానికి జపించిన మంత్రాన్ని లంకా ప్రజలకి  కూడా చెప్పిన పిదప కదా

నీవు లంకా దహనం చేయవలసినది.నిన్ను

నీవు కాపాడుకొన్నావు. కాని  లంక ప్రజలను ఇబ్బందులపాలు చేశావు.  నీవు చేసిన ఈ పాపకార్యంలో నన్ను భాగస్వామిని చేశావుకదయ్యా హనుమ ? అని  రాముడు చింతించాడు. హనుమంతుడు రాముడి కాళ్ళమీద పడి ."  అజ్ఞానంతో అకార్యం చేసి మీకు విచారం కలిగించాను నన్ను మన్నించండి, స్వామీ అని దీనంగా వేడుకున్నాడు.


" ఒకవేళ రావణుడు తన మనసు మార్చుకుని సీతాదేవిని నాకు అప్పగించినా నేను లంకకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించావు. అగ్నివలన దహనమైన లంకని తిరిగి పునరుధ్ధరించి, భాధించబడినవారికి సేవలందించి యీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకొనేతీరాలి "

అని అన్నాడు రాముడు. 

రాముని కరుణార్ద్ర హృదయానికి హనుమ చలించిపోయాడు

రాముని పాదాలకు నమస్కరించి,  హనుమ "రామ..రామ ..అంటూ రామనామ స్మరణ ప్రారంభించాడు.

ఇప్పుడు హనుమంతుడు జపించినది తనకోసం కాదు, తనవల్ల నష్టపోయిన

లంకా ప్రజల కోసం.

సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు

 సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి.  మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే  వంట చేయలేం కదా?  అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి.  ఎంతకాలం 'నేను' అనే‌ భావనతో ఈ‌ లోకంలో  తిరుగుతూ‌ ఉంటామో అంతకాలమూ సాధకులమే.  ఈ‌ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే!  ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ‌ అక్కరలేదు వంటా అక్కర లేదు.  అది వేరే‌ స్థితి.


ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి.  దాన్ని బ్రహ్మబీజం అంటారు.  అది ముల్లోకాల్నీ‌ పవిత్రం చేసే‌ పరమమంత్రం. 


ప్రణవం అంటే ఓం‌కారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓం‌కారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.  ఈ‌ ఓం‌కారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి.  ‌ఓం‌కారం గురించి ఎంతైనా చెప…

మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి.  అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం.  ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది.  మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే  ఊతం ఇస్తే,  వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది.  అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి. 


ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది.  లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ?  ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.


సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు.  సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి.  రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ,  నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి,  క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట.  తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట.  ఈ‌ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ‌ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ‌ త్రిగుణాలనే‌ రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం‌ అన్న మాట.  మనం‌ ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు. 


ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది.  నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.


మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే,  ఆకర్షిస్తూనే ఉంటాయి.  రకరకాల అనుభవాల్ని ఈ‌ త్రిగుణాలు అందిస్తూ,  అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.


కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి?  అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది.  అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.


ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి?  వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా?  ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది.  కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది.  అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం.  విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు.  అదే కైవల్యం, అంటే మోక్షం. 


ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది .  ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు.  ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.


మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు.  కాని జీవుడిగా మిగిలే ఉంటాడు.  ఈ‌ స్థితిలో వాడికి ప్రపంచంతో‌ ఏవిధమైన సాంగత్యం ఉండదు.  వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం.  ఈ‌ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు.  ఈ‌ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని. 


ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి.  క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది.  ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.


ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా?  అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే‌ భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే.  పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?


ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది.  నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది.  నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే‌ కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును.  కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది.  వచ్చే జన్మలో అది కొనసాగుతుంది.  ఈ‌ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు.  ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.

జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

 జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

✍🏻...దాసు కిరణ్‌

💫🌈💫🌈💫🌈


💐 జ్ఞాన సిద్ధిని గురించి వివరించే లోక ప్రసిద్ధమైన ఒక ఉపమానం వేదాంతంలో ఉంది. అదే... ‘రజ్జు సర్ప భ్రాంతి’. చీకటిలో తాడును చూసి ‘పాము’ అని భ్రాంతి చెందుతాం. ఆ భ్రాంతి కారణంగా భయం ఏర్పడుతుంది. ఇక్కడ పాము అంటే ‘నేను’ అనే భావన. ఆ భావన ఉన్నంత వరకూ... కోరికలు, బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ‘జ్ఞాన సిద్ధి’ అనే వెలుగులో ‘నేను’ అనే భావన కరిగిపోయినప్పుడు (‘పాము కాదు తాడే’ అని తెలిసినప్పుడు) అవన్నీ పటాపంచలవుతాయి. నిరంతరం ఈ స్థితిలో ఉండడమే మోక్ష సిద్ధి. 


💐 జ్ఞాన సిద్ధి ఒక ఘటన. చాలా సందర్భాలలో అది ఆకస్మికంగా జరుగుతుంది. ఈ విషయంలో చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం శ్రీ రమణ మహర్షిది. 


💐 ఆయనకు ఒక రోజు మధ్యాహ్నం... కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మతత్త్వం తెలిసిపోయింది. కానీ జ్ఞాన సిద్ధి చాలా నెమ్మదిగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆకస్మికంగా జరిగినా, నెమ్మదిగా జరిగినా... జ్ఞానసిద్ధి కలిగిన తరువాత... ‘ఏదో జరిగింది’ అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. అది ఎప్పుడు, ఎలా అవుతుందో ఎవరూ చెప్పలేరు. సృష్టి, స్థితి, లయ... వీటికి అదనంగా మరో రెండు పార్శ్వాలు ఉన్నాయంటారు. అవి.. మాయ, అనుగ్రహం. ఏ కొందరికో, ఎప్పటికో... కృప ద్వారా ‘మాయ’ అనే పొర తొలగిపోవడం జరుగుతుంది. 


💐 ఈత కొట్టడం వచ్చిన తరువాత... ఈత రాని స్థితి ఇక ఎప్పటికీ ఎలా ఉండదో... జ్ఞాన సిద్ధి పొందిన తరువాత పూర్వపు స్థితి ఉండదు. ఇది వినగానే... సాధకులకు తప్ప... చాలామందికి భయం కలుగుతుంది. ‘అదేమిటి? నేను లేకపోతే ఇంకేం ఉంటుంది? జీవితం అన్న తరువాత బాధలు ఉండడం సహజం. అన్నీ వదిలేస్తే జీవితానికి గమ్యం, సార్థకత ఏముంటాయి? బతుకు నిస్సారం అవుతుంది కదా?’... ఇలా సాగుతాయి ఆలోచనలు. 


💐 కుటుంబంలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే... ‘సన్యాసుల్లో కలిసిపోతాడో ఏమిటో?’ అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ ఆలోచనలకు కారణం అజ్ఞానం. నిజానికి జ్ఞానుల్లో సన్యాసుల కన్నా గృహస్తులే అధికం. జ్ఞాన సిద్ధి పొందిన తరువాత... సాధారణ జీవితాన్ని ఇంకా ఆనందంగా గడుపుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. దీనికి శ్రీ రమణ మహర్షి ఒక ఉపమానం చెప్పారు... ‘‘కాలిన తాడు ఆకారం తాడులాగే ఉంటుంది, కానీ దానికి బిగువు ఉండదు. అలాగే జ్ఞానులను బంధాలు కట్టివెయ్యలేవు. కానీ బంధాలకు దూరంగా ఉండడం కూడా జరగదు’’ అని.


🔅"మనస్సు యొక్క స్వభావంపై స్థిరమైన మరియు నిరంతర పరిశోధన ద్వారా, మనస్సు ' నేను' సూచించే అది( తత్ ) కి రూపాంతరం చెందుతుంది; మరియు అదియే నిజానికి ఆత్మ ."


గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,

జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం🙏🏻

అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏

 అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏


కాంతపాళ్యం శ్రీ ఆది శివలింగాచార్య సీనందల్ విశ్వబ్రాహ్మణ పీఠం - తిరువణ్ణామలై నంది


తమిళనాడులోని తిరువణ్ణామలై  కి దగ్గరలో ఉన్నటువంటి కాంత పాళ్యం అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ గురు పీఠం ఉన్నది.ఇది చాలా ప్రాచీనమైనది.మహాభారత కాలము నాటి ఋషుల తపస్సులు ఆచరించిన అరణ్యం గా ప్రసిద్ధి.


తిరువన్నామలై ప్రాంతమును మొఘల్ లు పరిపాలచేసే రోజుల్లో తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవస్తానమ్ లో ఉన్న పెద్ద నంది కి నంది పూజ చేస్తున్నారు.


అప్పుడు అక్కడికి వచ్చిన మొఘల్ రాజు మేము ఆహారం గా స్వీకరించే జీవిని మీరు పూజ చేస్తున్నారు అని అక్కడ పూజ నిర్వహణ చేస్తున్న ఒక 5గురు భక్తులను ని అపహాస్యం గా అంటే ఆ 5 గురు కూడా ఇది మీరు ఆహారం గా స్వీకరించే ఎద్దు కాదు మా సంప్రదాయం లో నందిని అరుణాచలేశ్వర స్వామి  వాహనము గా భావిస్తాము అని చెప్పారు.


ఆ సందర్భములో అక్కడికి ఒక తేజస్సుకలిగిన  బాలుడు వచ్చాడు.


ఈ బాలుడికి మొఘల్ రాజు కి కాస్త వాగ్వివాదాము జరిగినది.మొఘల్ రాజు ఇచ్చిన మాంసమును పువ్వులు గా మార్చాడు.


ఈ మాయలు నేను సహించను అని ఆ మొఘల్ రాజు ఈ అరుణాచలేశ్వరుడి ఎదురుగా ఉన్న నంది నేను రెండు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేయబోయాడు


అప్పుడు ఆ బాలుడి తపస్సు కి నంది సహజముగా తన కూర్చున్న స్థితిని కుడి కాలు మడిచి ఎడమ కాలు ముందుకు పెట్టింది.


ఈ సంఘట చూసిన అక్కడి వారు అందరూ ఆశ్చర్యం కు లోనయ్యారు.


కళ్ళముందు రాతి నంది అలా మార్చుకున్న స్థితిని చూసిన ఆ మోఘల్ రాజు.


ఆ పిల్లవాడిని క్షమించమని వేడుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.


ఆ పిల్లవాడే విశ్వబ్రాహ్మణ వంశీయడు సిద్ధపురుషుడు అయినాడు.


ఆయనే శ్రీ ఆది శివలింగాచార్య స్వామి.


వీరు సజీవ సమాది చెందిన ప్రాంతం.


తిరువణ్ణామలై కి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న కాంతపాళ్యం.


ప్రస్తుతం 8 వ తరానికి చెందిన శ్రీ శివ జ్ఞాన స్వామి 6382658268 వారు పీఠమును నిర్వహణ చేస్తున్నారు.


🙏🏻అరుణాచలశివ 🙏🏻

15, ఏప్రిల్ 2023, శనివారం

కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.

కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి
ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.
ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!
కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది.
ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది.
ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే.
మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి.
మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు.
మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది.
అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు.
కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు.
ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే“నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.
అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి.
అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది.
పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది.
ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మలగురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము.
అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు.
కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు.
కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు.
భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే.
అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి.
చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి.
రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి.
రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి.
అలాంటివాడు కేవలం“దొంగే” అవుతాడుగాని“రాజు” ఎన్నటికీ కాలేడు.
అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు.
కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!
అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి.....🙏

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...?

🎻🌹🙏సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏంటి ...? 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి. 

🌸అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. 

🌿ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. 

🌸బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది.

🌿 విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. 

🌸బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. 

🌿ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. 

🌸ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

🌿తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. 

🌸ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

🌿విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.

🌸ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. 

🌿ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది.

🌸అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.

🌿ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు.

🌸 దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది.

🌿సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్యభగవానుడికి, భానుడు, రవి వంటి వివిధ రకాల పేర్లతో పిలవడం గురించి మనం విన్నాం.కానీ సూర్య భగవానుడి విమలాదిత్యుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

🌸అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది.కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మరి జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.

🌿అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిలో స్నానం చేయాలని చెబుతుంటారు.

🌸పరమపవిత్రమైన కాశీలో మనకు 12 సూర్య దేవాలయాలు కనిపిస్తాయి.ఈ పన్నెండు ఆలయాలలో ఒక్కో ఆలయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు.ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం.

🌿పూర్వం విమలుడు అనే ఒక రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవారు.ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్యా బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు.

సువార్త స్వస్థత కూటములు:

 సువార్త స్వస్థత కూటములు:   స్టేజి మీద వెనక్కు పడిపోతుంటారు. సాక్ష్యం చెప్పడం మొదలుపెడతారు.  ఇప్పటిదాకా కుంటి  ఉండింది. కుంటీ  పోయింది. ఇంకొకరు ఇప్పటిదాకా గుడ్డీ  ఉండింది .గుడ్డి  పోయింది. ఆ డ్రామా ఆర్టిస్టులంతా నటించడం కాదు నటనలో జీవిస్తారు. అంతే అందరు హాలాలూయా అంటూ అమాయకులు ఊగిపోతారు. అది చూసి అమాయక హిందువులు మతం మారడానికి క్యూ కడుతారు .కానీ మీరెవరైనా  జబ్బు పడిన వారిని స్టేజి వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రానివ్వరు. ఒకవేళ బలవంతంగా పోగలిగితే జబ్బు తగ్గలేదేంటి అని అడిగితే విశ్వాసం లేదంటారు. బాప్టిజం తీసుకొంటే అంటే మతం మారితే తగ్గుతుందంటారు . బాప్టిజం తీసుకొన్న తర్వాత జబ్బుతో  చనిపోతే అదృష్టవంతుడు దేవుడు స్వయంగా  తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు . మతం మారిన  అప్పటివరకు  కళకళలాడిన   హిందూ స్త్రీలను ముండమోపులు లాగా బొట్టు పెట్టుకోగూడదు అంటారు. ఇంటి ముందర ముగ్గు వేయగూడదు అంటారు. ఇలా ఎక్కువగా స్త్రీలు మోసపోతుంటారు.  ఇంకా అద్భుతాలు జరగలేదేంటి అని అడిగితే ఇంటిలో సైతాన్ ఉందంటారు .ఆ సైతాన్ ఎవరో గాదు హిందూ దేవుళ్ళు . ఆ దేవుడి పటాలను దూరంగా పారవేయమంటారు. ప్రశాంతంగా ఉన్న ఆ హిందూ ఇంటిలో గొడవలు మొదలవుతాయి .ఆ విధంగా సర్వనాశనమైన కుటుంబాలు కోకొల్లలు.

వారి మాటలతో ఎటువంటి వారినైనా మెస్మరిజం చేస్తారు . ఎందుకంటే మానవుడు ఆశా జీవి కదా. అందులోకి పోతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మారిపోతుంటారు. మాటలతో మాయ చేయడం ఎలా అని వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది . భారత దేశాన్ని పూర్తిగా క్రిష్టియన్ దేశంగా మార్చడానికి వేల కోట్ల విదేశీ ఫండ్ వారికి వస్తోంది .

కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాలలో 350 మంది మహిమ గలిగిన పాస్టర్లు చనిపోయారు.వారినెందుకు దేవుడు రక్షించలేదు  మతం మారిన లేక మహాభక్త క్రిష్టియన్ సోదరులలో ఎవరూ జబ్బు పడి  పోవడం లేదా. ఆక్సిడెంట్ లలో పోవడం లేదా లేక భయంకర బీదరికం అనుభవించడం లేదా. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా. విచారించి చూడండి. ఎవరి దేవుడిని వారు పూజించుకొంటే ఎవరికీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఎంతసేపు హిందూ దేవుళ్లను మన వద్ద హేళన చేస్తున్నారు. ఈ మతం మాఫియా ను మనవద్దకు వచ్చినప్పుడు  అడ్డుకోకపోతే తర్వాతి తరం వారు అప్పుడు హిందూ మతం ఉండేది అని చదువుకోవలసి వస్తుంది.

  ఎందుకు నేను వారిపై అంత కసిగా ఉన్నానంటే నేను లేని సమయం చూసి జబ్బుతో ఉన్న మా నాన్నను ప్రార్ధన చేస్తే జబ్బు నయమౌతుందని మా అమ్మను నమ్మించి ప్రార్ధనలు చేశారు. మా నాన్న మనసు గూడ మార్చారు . ఒకవేళ మందులతో మా నాన్న బ్రతికుంటే వారి గొప్పగా చెప్పుకొనేవారు. గ్రామాలలో ఎక్కువగా ప్రజలు అమాయకులు గాబట్టి ఎక్కువగా వారినే లక్శ్యంగా  చేసుకొంటారు . వారు ఇంకొకటి చెబుతుంటారు. క్రిష్టియన్ దేశమైన అమెరికా ఐశ్వర్యంతో ఉందని అంటారు. క్రిష్టియన్ దేశాలలో డబ్బున్న దేశాలు 5 మాత్రమే . వాటి జనాభా మన దేశం లో ఒక రాష్ట్రంలో లేక ఒక జిల్లా అంత ఉంటుంది. జపాన్ ,చైనా ,తైవాన్ లాంటి దేశాలు క్రిష్టియన్ దేశాలు కాదు కదా. గూగుల్ లో చూడండి ప్రపంచ దేశాల ప్రజలు హిందూ మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. మన వాళ్ళు వారి మతం వైపు ఆకర్షింపబడుతున్నారు. హిందువుగా పుట్టినందుకు గర్వించండి.ప్రపంచంలో తలెత్తుకు తిరగండి. ప్రాణం పోతున్నా తల్లి లాంటి హిందూ మతాన్ని వదలకండి

భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. నీవు ఎవ్వరిని పూజించిన ధ్యానించినా (అనగా చెట్టును పుట్టను లేక ఏ రూపాన్నైనా) నా నుండే నీకు అనుగ్రహం కలుగుతుంది . ఆయన దశమ భాగాలను అడగలేదు. ఫలమో ,పుష్మమో లేక తోయమో (నీరు) భక్తితో సమర్పించిన అదే నాకు మహదానందం . సర్వకాల సర్వావస్థలయందు ఏ పనిచేస్తున్నా  ఎవ్వరైతే నన్నే స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలన్ని నిరంతరం నేను చూసుకొంటారు అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు

మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా సాష్టాంగ నమస్కారం తో సర్వస్య శరణాగతి తో 3 రోజులు మీరు ఏ పనిచేస్తున్నా మీ ఇష్టదైవం నామస్మరణ చేయండి. ఉదాహరణకు ఓం నమో వెంకటేశాయ ,ఓం నమశ్శివాయ  లేక ఓం శ్రీ మాత్రే నమః  ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ప్రయత్నించి చూడండి  మీకు దైవం నుండి ఏ చిన్న సహాయం లభించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆత్మ స్వరూపమైన దైవానికి ప్రతి చిన్న లేక పెద్ద విషయాలు చెప్పుకోండి దైవం మీకు దగ్గరౌతుంది.

ఇంకా తెల్లవారుఝాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త  కాలంలో ధ్యానం చేయండి. అద్భుతాలు చూస్తారు.