30, మే 2023, మంగళవారం

# పెరుగు తింటున్నారా..!

 # పెరుగు తింటున్నారా..!


చాలామంది అమ్మాయిలు పాలే కాదు.. పెరుగు కూడా తీసుకోరు. తింటే లావైపోతామేమో అని భయపడటమే కారణం. కానీ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు ఎన్నో తెలుసా..


పెరుగులోని పోషకాల్ని జీర్ణవ్యవస్థ సులువుగా స్వీకరిస్తుంది. దీన్ని మసాలాపదార్థాలతో కలిపి తీసుకుంటే గనుక ఆ ఘాటు తగ్గి.. హాయిగా అనిపిస్తుంది.


ఈ రోజుల్లో చాలామంది యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ పెరుగు తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు కూడా అదుపులో ఉండి, చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.


పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిని పెంచి, హానిచేసే సూక్ష్మక్రిముల్ని నశింపచేస్తుంది. జననేంద్రియ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.


పెద్దయ్యేకొద్దీ ఆస్టియోపోరోసిస్‌ వచ్చే సమస్య మహిళల్లో ఎక్కువ అంటారు. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ముందునుంచీ పెరుగు తినడం మంచిది. ఇది ఎముకలకు మేలుచేసి.. ఆ సమస్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలల్లోలా ఇందులోనూ పాస్ఫరస్‌, క్యాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.


పెరుగులో జింక్‌, విటమిన్‌ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగు రోజూ తినడం వల్ల చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. బరువునూ అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.


పెరుగు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని భయపడేవారు ఓ పనిచేయొచ్చు. వెన్నలేని పాలతో తోడుబెట్టిన పెరుగును ఎంచుకోవచ్చు. దానివల్ల కెలొరీల భయం ఉండదు.. పోషకాలూ అందుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి