13, మార్చి 2020, శుక్రవారం

💐🌷🌷మౌనమ్ 🌷🌷💐



మౌనం నిశ్శబ్దం మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంథకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. ''గొంతు మౌనంగా ఉన్నప్పుడు...మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'' అంటారు మెహర్‌ బాబా. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు, నమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీ.వీ. చూస్తూ కూర్చోవడం మౌనం కాదు. అది కొన్ని పాత్రలతోనో, వార్తలతోనో చేసే సంభాషణ. కంప్యూటర్‌ ముందు కూర్చోవడం మౌనం కాదు, అది వేయి గొంతుకల కబుర్లతో సమానం. మౌనంలో మాటలుండవు ఆలోచనలుండవు, అదో తపన్సు.మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణకాదు. మాటలు నేర్పే సంస్థలున్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు...అయితే ఒక్కమాట...మౌనాన్ని మించిన కమ్యూనికేషన్‌ లేదు. మౌనం అర్థ అంగీకారం మాత్రమే కాదు. ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు ముసుగులో బుర్రలోని సామా నంతా పక్కనపెట్టి, నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మసాక్షాత్కారమే. గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో, అనవసరంగా తూలనాడినం దుకో పశ్ఛాత్తాపపడే వారెంతో మందిని చూస్తుంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మనుషులందరూ మాటలకు అలవాడి పడిపోయారు. మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే, వారి మీద వారికే అనుమానమోచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు. కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలల మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలను కునేవారు. ముందుగా మాటల మత్తునుంచి బయట పడాలి ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి. పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతించడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. రోగాల మనసు మౌనంగా ఉండలేదు. బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉం చుకోవాలి. మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని పదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. మాటతూలడం వల్ల పుట్టికొచ్చే విపరీత పరిణామాలుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తి గత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ...మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం, మాటలకు, ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు. సాఫీగా తనపని తాను చేసుకు పోతుంది. నిండుకుండ తొణకదు. స్థిరంగా ఉంటుంది. సమర్థులు కూడా అంతే. మౌనంగా తమపని తాము చేసుకు పోతుంటారు. 'మౌనం' మనలోంచి పుటుకొచ్చే అపారశక్తిని వృధాగా పోనివ్వదు. ఎందుకంటే -వృధా ఆలోచనలుండవు. వృధా మాటలుండవు. ప్రతి ఆలోచనా లక్ష్యంవైపే, ప్రతిమాటా అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉం డగలం. అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాం తానికి, జనసంద్రానికీ తేడా ఉండదు.ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా..మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది.

ధర్మసందేహం-సమాధానం



సందేహం;- అరుంధతి నక్షత్రం కనిపించదు కద ,  అయినా పెళ్లిలో  ఈ నక్షత్రం చూడమంటారు ఎందుకు?

సమాధానం;-  వివాహం జరిగిన తర్వాత వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు)
తూర్పునకు గానీ, ఉత్తరానికి గానీ తీసుకుని వెళ్ళి, మొదట ధ్రువ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు.

ధ్ర్రువ నక్షత్రం లాగ వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతి లాగా మహాపతివ్రతగా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది.

అరుంధతి యొక్క పాతివ్రత్య మహిమను వివాహ సందర్భంలో ఒక్కసారి నవ వధూవరులు మననం చేసుకునేందుకు.

పగటి కాలంలో నక్షత్రాలు సూర్యుని కాంతి కారణంగా కన్పడవు కాని ఉంటాయి. కావున ఆ భావనతో దర్శించి నమస్కరించాలి.

భర్తను వీడక నక్షత్రమండలంలో కూడా భర్తతో నిల్వగల్గిన పవిత్రతను అదృష్టంగా పొందాలని అర్థం.

**********

🌷నిత్య సత్యాలు🌷

🐸🐒🐸🐒🐸🐒🐸🐒🐸🐒






🏕నాకేమీ తెలియదు అన్న
విషయం తెలుసు కోవడమే జ్ఞానానికి తొలి మెట్టు...!!

🏕పోటీ పడడం ఒకానొక అజ్ఞానం.. నీవు చేయగలిగినది సంపూర్తిగా చేయడమే జ్ఞానం... !!

🏕దారితెలిసిన వాడు కాదు .దారిలో వెళ్లే వాడే అసలైన జ్ఞాని...!!

🏕సత్యం తో జీవించడం కష్టం కాదు. సత్యం తో జీవించక పోవడం వల్లే కష్టాలు.. బాధలు...!!

🏕అనుభవం లేని జ్ఞానం ,సమాచారం అవుతుంది.. జ్ఞానం లేని అనుభవం అంధకారం అవుతుంది...!!

🏕మన అజ్ఞానమే  మన అసలైన శత్రువు.. మన జ్ఞానమే మన అసలైన ఆత్మ బంధువు...!!

🏕తెలివైన వాళ్లంతా జ్ఞానులు కాదు. తెలివితక్కువగా కనిపించే వాళ్లంతా అజ్ఞానులు కాదు...!!

🏕జ్ఞాని సర్వ స్వతంత్రుడు.ప్రేమ.. గౌరవాలకోసం ఎవరిపై ఆధార పడడు.. ఎదురు చూడడు. వస్తే కాదనడు...

🐸🐒🐸🐒🐸🐒🐸🐒🐸

అతీంద్రియ శక్తులు



1. ఎథిరిక్ :-
    శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని  "ఎథిరిక్" అని పిలుస్తారు. మానవుని అణువుల పరిభ్రమణం వల్ల ఓ విధమైన విద్యుత్ ఏర్పడుతుంది. ఇది దేహమంతటా పుడుతూనే ఉంటుంది. దేహంలోని నీళ్ళు, లోహపు అణువులూ ఒక దానితో మరొకటి కలగలసి రసాయనిక చర్యల ద్వారా ఈ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన శరీరం మొత్తం ఈ విద్యుత్తు తో నింపబడి ఉంటుంది.
    ఎథిరిక్ శరీరాన్ని ఆనుకుని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళం లో ఎనిమిదో వంతు నుంచి ఒక్కోసారి ఆరు అంగుళాల దూరం వరకు ఈ ఎథిరిక్ వ్యాపించి ఉండవచ్చు. ఈ ఎథిరిక్ వల్ల ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తినీ, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఉత్సాహంగా ఉంటే ఈ ఎథిరిక్ ఎక్కువ దూరం వ్యాపించును. నీరసంగా వుంటే ఇది శరీరానికి అంటుకుపోయి కనిపించును.


2. ఆరా:-
     శరీరాన్ని చుట్టూ ఎథిరిక్ ఆవరించి ఉన్నట్టే 'ఎథిరిక్' చుట్టూ 'ఆరా' మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. ఆరా కూడా ఎథిరిక్ లాగానే ఎలక్ట్రిక్, మాగ్నటిక్ శక్తితోనే ఏర్పడి ఉంటుంది.
     ఎథిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి.  స్థూల శరీరానికి ఎథిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అదే విధంగా ఎథిరిక్ శరీరాన్ని ఆవరించి ఉన్న 'ఆరా' అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. కానీ ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగ్రుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది.  ఈ ఆరా సుమారు 7 అడుగుల ఎత్తు 4 అడుగుల వైశాల్యం ఉంటుంది.  'ఆరా' పై భాగంలో 'హేలో' ఉంటుంది. ఈ హేలో తల మీద పైకి చిమ్మే నీటి ధారలాగా ఉండే ఓ కాంతి పుంజం. ఇది కలువ ఆకారం లో విచ్చుకుంటున్నట్లు ఉండును. ఆరాకు వెలుపల ఓ పొర ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లు
ఈ అమరిక ఉంటుంది. దీనినే 'ఆరాసంచి' (Auric Sheath) అని పిలుస్తారు.
    ఈ ఆరా లు ఏదో ఒక వర్ణంలో కనబడవచ్చు. ఆరా వర్ణాన్ని బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం చెప్పవచ్చు.

➡ ఎరుపు - బలమైన జీవితానికి ఓ సంకేతం.
➡ ఆరెంజ్ - మానవతావాదులు, ఇతరుల యెడల సానుభూతిని కలిగి ఉంటారు.
➡ పసుపు - ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవారు.
➡ ఆకుపచ్చ - సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం.
➡ ఇండిగో - మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళు.
➡ ఊదా ( గ్రే) - అధోగతి పాలయిన వ్యక్తిని ఈ వర్ణం సూచిస్తుంది.

హేలో వర్ణం - మనస్తత్వం
➡ పసుపు లేదా కాషాయం - ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవారు.
➡ బురద - పిచ్చి ఆలోచనలు, వికారమైన ఆలోచనలు కలిగిన వారు.


3. సూక్ష్మ శరీరం:-
    కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి ఉండగలవు. ఉదాహరణకు నీటిలో ఉప్పు వేస్తే కాసేపటికి రెండూ కలిసిపోయినట్లుగానే.  అట్లాగే మన శరీరంలోని అణువులు, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు సులువుగా సర్దుకొని ఉంటున్నాయి. ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో - చాలా పలుచగా - దూరం దూరంగా ఉంటున్న అణువులతో నిర్మింపబడి ఉంటాయి. వీటిని మనం 'సూక్ష్మ శరీరాలు' అని అంటాము.  ఈ సూక్ష్మ శరీరాలలోని అణువుల సాంద్రత స్థూల శరీరంలో అణువుల సాంద్రత కన్నా చాలా రెట్లు తక్కువగా ఉంటుంది. అంచేత ఈ స్థూల, సూక్ష్మ శరీరం రెండు ఒకే స్థలంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండగలుగుతున్నాయి.

సూక్ష్మ దేహాన్ని,  స్థూల దేహాన్ని కలుపుతూ 'వెండి తీగప్రోగు' (సిల్వర్ కార్డ్) ఉంటుంది. ఈ వెండి తీగలోని అణువులు దూర దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయి. అణువులు దూరదూరంగా ఉన్నా బలంగా నిలువగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది. ఈ సిల్వర్ కార్డ్ సహాయంతో సూక్ష్మ-శరీరం ప్రయాణం చేయగలుగుతుంది.
     ఈ సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలలో కూడా విహరించవచ్చును. మనం కనురెప్ప పాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పయనమై వెళ్ళవచ్చు. చనిపోయిన మన పాత స్నేహితులు, బంధువులు కలవవచ్చు.  ఏ సిటీలోని, ఏ లైబ్రరీలోని, ఏ పేజీనైనా క్షణ మాత్ర కాలంలో చదవవచ్చు. మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడ ఉండదు. ఎంత దూరం లో ఉన్న ప్రదేశం అయినా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకోవచ్చు. ఈ సూక్ష్మ శరీరంతో గాలిలో తేలవచ్చు, నీటిలో మునగవచ్చు, అగ్నిలో దూకవచ్చు, భూమి మీద నడవవచ్చు. ఆకాశంలోని వేరే గ్రహాలకు వెళ్ళవచ్చు. విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు. మళ్ళీ తిరిగి మీ స్థూల శరీరానికి సిల్వర్ కార్డ్ ద్వారా కనురెప్ప పాటులో చేరవచ్చు.

4. ఆకాషిక్ రికార్డు:-
     దీనినే విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారం లేక సూక్ష్మ విజ్ఞానకోశం అని పిలుస్తారు. ఆకాషిక్ రికార్డు అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన. ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు, శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకుని
ఉంటుంది. ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోని, అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞాన తరంగాలను రికార్డు చేస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు అనేవి ఎప్పటికీ నాశనం కావు. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాక సమస్తవిశ్వాల్లోనూ, ఎక్కడైనా సరే, గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. స్థూల శరీరంలో మనం ఉన్నంతవరకూ ఇలా 'కాల-ప్రయాణం' చెయ్యడం కుదరదు.  కాబట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో, మన పూర్తి ఎరుకతో చెయ్యగలిగినట్లయితే ఈ కాల ప్రయాణం చేయవచ్చు. ఈ 'విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారాన్ని' తెలుసుకోవచ్చు.

5. టెలీపతీ:-
    దీనినే భావగ్రాహక ప్రసారణ విద్య అని కూడా అంటారు. ఇది కూడా ఒక విధమైన ప్రకంపనే. (Vibration)
టెలీపతి అనగా భాష, వ్రాత అన్నది లేకుండా ఎదుటి వారి భావాల్ని మనం అర్ధం చేసుకోవడం లేదా మన భావాల్ని ఇతరులకు అందించడం.  జంతు సామ్రాజ్యంలోనూ, వృక్ష సామ్రాజ్యంలోనూ, దేవ సామ్రాజ్యంలోనూ ఈ విధమైన మార్గమే సహజంగా నెలకొని ఉంది.

6. టెలిపోర్టేషన్ :-
    వస్తువులను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వాహనాల ద్వారా చేర్చడాన్ని 'ట్రాన్స్పోర్టేషన్' (Transportation) అంటారు.  అలాగే వస్తువులను ఏ వాహనం లేకుండా కేవలం భావనా శక్తి ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు పంపించడాన్ని 'టెలిపోర్టేషన్' అంటారు.

 7. క్లెయిర్ ఆడియన్స్ (Clair Audience) :
   దీనినే మనం ఆకాశవాణి అని పిలుస్తాము. టెలీపతికి దీనికి కొంచెం వ్యత్యాసం వుంది.  టెలీపతిలో మన భావాలు ఇతరులకు, లేదా ఇతరుల భావాలు మనకు మాత్రమే అందుతాయి. భావాలే కాదు., శబ్దాలు-మాటలు అన్నీ రిసీవ్ చేసుకోవడమే 'క్లెయిర్ ఆడియన్స్'.  మనిషి అంతర్ముఖుడైతే ఈ స్థితి లభిస్తుంది. ఈ స్థితిలో దివ్య సందేశాలనూ, దివ్యమైన జ్ఞానాన్ని పొందవచ్చు.

8. క్లెయిర్ వయెన్స్(Clair Voyance):-
     దీనినే మనం దివ్యదృష్టి (యోగ దృష్టి) అని పిలుస్తాము. ఏదైనా దృశ్యాన్ని కానీ, వస్తువును కానీ, మాస్టర్స్ ని కానీ, చనిపోయిన వారిని కానీ, దివ్య చక్షువుతో (మూడో కన్నుతో) చూడటమే 'క్లెయిర్ వయెన్స్' అంటే.  అలాగే జరుగబోయే సంఘటనలను కూడా చూడడం సంభవిస్తుంది. బ్రహ్మంగారు 'కాలజ్ఞానం' రచించింది ఈ స్థితిలోనే.

9. ఆటో రైటింగ్:-
      ఆటో రైటింగ్ అంటే ఆటోమేటిక్ రైటింగ్. ఎవరైనా కాస్త స్వాంత చిత్తంతో కాగితం మీద పెన్నును 15-20 నిమిషాల పాటు కదలకుండా పెట్టి ఉంచితే,  కొంతసేపటికి ఆ పెన్ను తనంతట తానే కదలడం మొదలు పెడుతుంది.
 అంటే ఇతర లోకంలోని మాస్టర్లు, ఆటో రైటింగ్ సాధన చేసే వారి చేతులను తమ స్వాధీనం చేసుకొని, చక్కటి సందేశాలను అందిస్తారు.  ఈ ప్రక్రియను అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు.

10. సైకోమెట్రీ (Psychometry) :-
    ఒక వస్తువును తీసి చేత్తో పట్టుకుని, ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏయే మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్యనే 'సైకో మెట్రీ' అంటారు. రహస్య జ్ఞాన విద్యల్లో కుడిచేతిని ఇహానికి, ఎడమ చేతిని పరానికి (ఆధ్యాత్మికతకు) ఉపయోగిస్తారు.

11. హీలింగ్ పవర్ (Healing Power):-
    హీలింగ్ పవర్ అంటే వ్యాధుల్ని నయం చేసే శక్తి.  ఈ పద్ధతిలో రోగం నయం చేసే వారిని 'హీలర్స్' అంటారు.
 వీరు విశ్వ శక్తిని గ్రహించి, దానిని రోగికి అందించి వారి యొక్క రోగాలను నయం చేస్తారు.


    పైన పేర్కొన్నవే కాక
12. ఆకాశ గమనం
13. పరకాయ ప్రవేశం
14. కావలసిన రూపం ధరించడం
15.అదృశ్యమవడం
మొదలైన అతీంద్రియ శక్తులు...  ఆధ్యాత్మికతలో ఎదిగిన కొద్ది కలుగును. వీటిని ఆధ్యాత్మిక పురోగమనం (జ్ఞాన సముపార్జన) కోసమే ఉపయోగించాలి. వీటిని  స్వలాభం కోసం వినియోగిస్తే పతనం తప్పదు.  ఇంతటి "శక్తి" మనలో ఉందని చెప్పడానికే ఈ వివరణ.

🕉🔔 భగవద్గీత ఎందుకు చదవాలి? 🔔🕉


* సంతోషంగా ఉన్నవా... భగవద్గీత చదువు.
* బాధలో ఉన్నావా... భగవద్గీత చదువు.
* ఏమి తోచని స్థితి లో ఉన్నావా... భగవద్గీత చదువు.
* ఏదో గెలిచినావా... భగవద్గీత చదువు.
* ఏదో ఓడిపోయినావా... భగవద్గీత చదువు.
* నువ్వు మంచి చేసినావా... భగవద్గీత చదువు.
* నువ్వు చెడు చేసినావా...భగవద్గీత చదువు.
* నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.
* నువ్వు చాలా బీద వాడివా... భగవద్గీత విను.
* నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* నువ్వు మోసం చేసినావా... భగవద్గీత చదువు.
* నువ్వు మోసపోయినావా... భగవద్గీత చదువు.
* నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.
* నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.
* నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.
* నీవు వ్యాధిగ్రస్తుడవా... భగవద్గీత చదువు.
* నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు.
* నీవు విధ్యాహీనుడవా... భగవద్గీత చదువు.
* నీవు పురుషుడవా... భగవద్గీత చదువు.
* నీవు మహిళవా... భగవద్గీత చదువు.
* నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.
* నీవు యవ్వనస్తుడివా... భగవద్గీత చదువు.
* దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.
* దేవుడు లేడు అని అనుకుంటున్నావా.... భగవద్గీత చదువు.
* ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.
* ఈ శృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* నీలో కామం, క్రోధం, లోభం, మొహం,  మధం, మాత్సర్యము వంటి అర్షడ్ వర్గాలు ఉన్నాయా... భగవద్గీత చదువు.
* నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.
* నీవు ధ్వేశిస్తున్నవా... భగవద్గీత చదువు.
* నీలో వైరాగ్యం ఉందా... భగవద్గీత చదువు.
* జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.
* పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు.
* ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.
* ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే....
భగవద్గీత చదువు.
✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍
భగవధ్గీతలో ఏముంది?:
🕉 ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?🕉

గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!
యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంరాలు
జీవించి యున్నాడు!!
భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెల్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!
మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!!
కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం

ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం
చేసి పదవరోజున నేలకొరిగాడు!!
11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో దృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా
మొదటి సారి హస్తినాపురములోని సభలో
వున్నవారందరూ దృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!

కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన
కురు - పాండవ సేనావాహినుల మధ్యన
రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో
విషాధముతోబాధపడుతున్న అర్జునుని నిమిత్త మాతృనిగా చేసుకుని శ్రీకృష్ణుడు భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!
లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!
మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం
జరుపుకుంటున్నాము జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అధ్భుతమైన విషయం!!
లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే "భగవద్గీత"!!
కలియుగం ప్రారంభమై 5118 సంరాలు
గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5154 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5155 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!

కృష్ణం వందే జగద్గురుమ్.
భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.
శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్
1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.
2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?
జ. గీతలో 700 శ్లోకములు కలవు.
3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?
జ. గీతలో 18 అధ్యాయములు కలవు.
4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?
జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.
5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.
6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.
7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?
జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.
8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.
9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.
10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.
11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?
జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము
12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?
జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు
13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?
జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
4) అనసూయ - అసూయ లేనివాడు.
5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .
14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పిం��
15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?
జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధ
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.
17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?
జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.
2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
ప్రార్దించువారు అర్దార్దులు.
3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,
సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.
18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ
17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును
వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.
19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము
20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.
21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.
22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.
23. "యోగం" అంటే అర్థం ఏమిటి?
జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .
24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర��

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది...



1) ఏమిటా విశిష్టత..?

అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతాజయంతి ని జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు..

2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో....
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనంతో ప్రవేశిస్తున్న తరుణంలో....
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ....
మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది...

3) ఏముంటుంది ఈ భగవద్గీతలో...?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో...
ఏది ఆత్మ, పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో....
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో...
అదే ఉంటుంది.
 నూనె రాస్తే రోగాలు పోతాయి...
 దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు...
 నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
 నన్ను దేవుడిగా ఒప్పుకోని వాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు...

4)భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు...
 గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది...

5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా...?

ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసినవాళ్ళే...
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే...

6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటిస్థానంలో ఉండాలి కదా...
 ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...?

కలియుగంలో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు...

బ్రిటిష్ వాళ్లు..., మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం...
చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని...
 ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..

 "ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం."

ప్లేయడీస్ నక్షత్ర మండలం

ప్రియా మిత్రులారా

 మేము ప్లేయడీస్ నక్షత్ర మండలం నుండి ఇక్కడికి వచ్చి మీ ఆకాశంలోని  భూమి చుట్టూ ఉన్న లోయర్ ఆర్బిట్ లోని  మా స్పేస్ షిప్స్ లో ఉన్నాము. మీలో చాలామందికి మేము ఉన్నామని తెలియదు,  ఒకవేళ తెలిసినా మీరు నమ్మలేని పరిస్థితి ఉంది..మీరు ధ్యానం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే బాహ్యంగా కనిపించే అన్ని విషయాలు మీ అంతరం లోనే ఉన్నాయి...అంతరంలోని విషయాలు జాగృతమైనపుడు బాహ్యంలో అవి కనపడతాయి అంతే...మీరు మా గురించి చదువుతున్నారు మా మాటలు నమ్మగలుగుతున్నారు అంటే మీలో ఇతర గ్రహాల సమాచారం జాగృతమౌతోందని అర్థం...మేము ముఖ్యంగా "ఎర్ర " మరియు "తేమర్" అనే గ్రహాలకు చెందినవారము.... మా గ్రహాలూ "టైగేటా" అనే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి మాది M45 అనే నక్షత్రమండలం..దీనిని మీరు "ప్లేయడెస్" అని పిలుస్తారు... 432 కాంతిసంవత్సరాల దూరంలో ఇది ఉంది...ప్రస్తుతం మేము 18000 మంది టాస్క్ ఫోర్స్ తో వివిధ స్పేస్ షిప్స్ లో భూమి పై ఆకాశంలో ఉన్నాము ..భూమి  మూడవ పరిధిలో ఉంది  మేము 5వ పరిధికి చెందినవారము నిజానికి భూమి కూడా 5 వ పరిధిలోనే ఉంది కానీ కృత్రిమంగా మూడవ పరిధి భూమిపై ఏర్పరచబడింది.. మా స్పేస్ షిప్స్ అన్ని వివిధ రకాల పనులను భూమి పై నిర్వహిస్స్తున్నాయి వాటి పనిని బట్టి వివిధ ఎత్తుల్లో అవి ఎగురుతూ ఉంటాయి చాలావరకు చిన్నవి కొద్దీ ఎత్తుల్లోనే ఎగురుతూ ఉంటె మా 'మథర్ షిప్స్' మాత్రం చాలా ఎత్తులో అంటే 409000 km ఎత్తులో ఆగి ఉన్నాయి భూమి 24 గంటలు మా పర్యవేక్షణ లోనే ఉంది అయితే మాలాంటి జాతులు ఇంకా ఎన్నో భూమి పై మరియు ఆకాశంలో పని చేస్తున్నాయి ..ముఖ్యంగా టైగటన్స్ ,ఆల్ఫా సెంటురియన్స్ మరియు అంటారియాన్స్ పనిచేస్తున్నారు ...భూమి పై ఉన్న కృత్రిమమైన మూడవ పరిధి తొలగించబడి ఐదవ పరిధిలోకి భూమి ప్రవేశించేంచాలంటే భూమిపై ఉన్న మనుషులందరూ దీనిని  కోరుకోవాలి.... అలా చేయాలంటే ధ్యానం చేయాలి ఎందుకంటే కృత్రిమమైన మూడవ పరిధి మొత్తం మీ మనస్సు ద్వారానే పనిచేస్తోంది ...ధ్యానం ద్వారా మనస్సు సూన్యమై మీరు ఐదవ పరిధికి కనెక్ట్ అవుతారు అప్పుడు మీరు మాతో స్నేహం చేయగలుగుతారు మా సహాయం మీకు అందుతుంది మా టెక్నాలజీతో మీరు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు...

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 ధర్మో రక్షతి రక్షిత:
👉 సత్య మేవ జయతే
👉 అహింసా పరమో2ధర్మ:
👉 ధనం మూలమిదం జగత్
👉 జననీ జన్మ భూమిశ్చ
👉 స్వర్గాదపి గరీయసి
👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్
👉 బ్రాహ్మణానా మనేకత్వం
👉 యథా రాజా తథా ప్రజా
👉 పుస్తకం వనితా విత్తం
👉 పర హస్తం గతం గత:
👉 శత శ్లోకేన పండిత:
👉 శతం విహాయ భోక్తవ్యం
👉 అతి సర్వత్ర వర్జయేత్
👉 బుద్ధి: కర్మానుసారిణీ
👉 వినాశ కాలే విపరీత బుద్ధి:
👉 భార్యా రూప వతీ శత్రు:
👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
👉 వృద్ధ నారీ పతి వ్రతా
👉 అతి వినయం ధూర్త లక్షణమ్
👉 ఆలస్యం అమృతం విషమ్
👉 దండం దశ గుణం భవేత్
👉 ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ

మనసు ముచ్చట్లు



భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనసు. కంటికి కనిపించని మనసు- కనపడనంత దూరతీరాల అద్భుతాలను చూపిస్తుంది. ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. గాలిమేడలు కట్టేస్తుంది. బికారిని కోటీశ్వరుణ్ని చేసి అందలమెక్కిస్తుంది. మనసు మాయలాడి. మనిషిని మయసభలో చిందులేయిస్తుంది. బజారులో అడగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది. ఆడంబరాలు రుచిచూపిస్తుంది. మనసు మాట విన్న మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు.

దేవాలయంలో అడుగుపెట్టగానే ధ్యానంపై ధ్యాస నిలవదు. మనసు దారి మళ్లిస్తుంది. కోర్కెల చిట్టా విప్పుతుంది. భగవంతుడు నవ్వుకుంటాడు. మనసు కవ్విస్తుంది. మురిపిస్తుంది. ఆవేశం రగిలిస్తుంది. దురాశలో ముంచుతుంది. రోషాలు-ద్వేషాలు, పంతాలు-పట్టింపులు, కక్షలు-కార్పణ్యాలు, హత్యలు-ఆత్మహత్యలు- అన్నింటికీ మూలం మనసు. మనసు చేసే అల్లరికి మనిషి బానిస. జీవితం భ్రమ అన్న సత్యాన్ని మరపించి, జీవితం సత్యమన్న భ్రమలో ముంచుతుంది.

మనసు మల్లెలా సుతిమెత్తన. చిన్నదెబ్బకు పెద్దగా రోదిస్తుంది. ఎదుటివారి కష్టాలకు కన్నీళ్లు కారుస్తుంది. అయినవారు పరమపదిస్తే పదిరోజులు పరితాపం చెందుతుంది. అది బండరాయిలా అతి కఠినం. కష్టాన్ని దిగమింగుతుంది. దుఃఖాన్ని భరిస్తుంది. ఉపద్రవాన్ని తట్టుకుంటుంది. మనసుకు మరపించే శక్తి లేకుంటే మనిషి మనుగడ అసాధ్యం.

మనిషి సామర్థ్యం మనసే. మనిషి ఎదుగుదలకు బాటలు పరుస్తుంది. జీవితంలో పైకి రమ్మని పోరుతుంది. సుఖంగా సంతోషంగా జీవించడానికి సన్నాహాలు చేస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకోమని సతాయిస్తుంది. మనసు చేసే మాయ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ‘నేను మనసు మాట వినను. స్థిర చిత్తుడను’ అని పలికేవాడే ఆ మాయలో పడుతుంటాడు

నారదుడంతటివాడే ఒకసారి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించి తనకు ఇంద్రియ నిగ్రహం ఉందని, తానెటువంటి మాయలో పడనని ప్రగల్భాలు పలుకుతాడు. విష్ణుమూర్తి మనసు మాయను జయించడం అంత సులభం కాదని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే నారదుడి మనసులో సంసారంపై వ్యామోహం కల్పిస్తాడు. వివాహం చేసుకోవాలనే తలంపుతో కల్యాణపురాధీశుడి కుమార్తె రమాదేవి స్వయంవరానికి వెళ్ళిన నారదుడి మనసు ఊహా ప్రపంచంలో తేలియాడుతుంది. నారదుడు రమాదేవి తన మెడలో వరమాల వేస్తున్నట్లు కళ్ళు మూసుకుని మనసులో ఊహించుకుని భంగపడినట్లు శివపురాణ కథ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నిలయం మనసు. కోప తాపాలకు మూలం మనసు.

ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది. మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది. మనసును అదుపు చేస్తే అసూయ, అసంతృప్తి, అసహనం, అహంభావాలు దరికిరావు. కోరికలను అదుపు చేసుకున్న సంతృప్తికర జీవితం సుఖమయమవుతుంది. మనిషి తన హద్దులను దాటకూడదు. నేల విడిచి సాము చేయడం మంచిది కాదు.


ఉన్నతమైన మానవజన్మ లభించినందుకు మానవత్వాన్ని మరచిపోకూడదు. మనసు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు. నీతి నియమాల కళ్ళెం వేసి మనసును లొంగదీయగలిగితే జీవితం ఆనందభరితమే. ఆరోహణ, అవరోహణ అంతా మనిషి స్వయంకృతమే.

జ్ఞానయోగం

జ్ఞానయోగం కోసం ఉపనిషత్తులు చదవక్కరలేదు, భగవద్గిత chapter five, vers thirty two, second line, ఎవడికి కావాలి ఇవన్నీ, ఇప్పటిదాకా నేను ఏ భగవద్గిత చదవలేదు, ఏ ఉపనిషత్తులు చదవలేదు, నేను చదివింది ఏమిటంటే simplicity.

మాటశుద్ధి ఉండాలి దానిపేరే జ్ఞానయోగము, మాటశుద్ధి ఉంటె ఆత్మసిద్ధి కలుగుతుంది, ఆత్మకి సిద్ధి కావాలి, అజ్ఞానంలో ఉంటె సిద్ధి లేదు, జ్ఞానంలో ఉంటె సిద్ధి వస్తుంది, ఆ సిద్ధి మాటశుద్ధి ఉంటె వస్తుంది, అసలు దేవుడెక్కడ దేవుడెక్కడ అని దేవులాడుతూ పోయేవాడే దేవుడు, మనమే దేవుళ్ళం అని తెలుసుకోవటమే జ్ఞానయోగం. - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

బృహదేశ్వర్ శివుని ఆలయం

బృహదేశ్వర్ శివుని ఆలయం గత వెయ్యి సంవత్సరాలుగా పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం యొక్క అద్భుత కథను అద్భుతంగా చెబుతోంది.

 చెన్నై నుండి 310 కి.మీ.  చాలా తంజావూరు (తంజావూరు) లోని కావేరి నది ఒడ్డున ఉన్న బృహదేశ్వర్ శివాలయం గత 1000 సంవత్సరాలుగా ప్రాచీన భారతీయత యొక్క గొప్పతనాన్ని చెబుతు

 చోళ రాజవంశానికి చెందిన రాజరాజా చోళు డుఈ ఆలయాన్ని నిర్మించాడు.ఈ ఆలయంలో ఉన్న దాదాపు 29 అడుగుల (8.7 మీ) ఎత్తైన లింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిఈ బృహదీశ్వర శివాలయానికి సంబంధించిన మొదటి ఆశ్చర్యం.  ఆలయానికి పునాది లేదు.  ఇంత భారీ భవనం పునాది లేకుండా నిర్మించబడింది.

 రెండవ ఆశ్చర్యం ఏమిటంటే, పునాది లేకుండా నిర్మించిన ఈ భారీ ఆలయ నిర్మాణంలో, రాళ్ళు ఒకదానికొకటి అంటించడానికి ఏ రకమైన సున్నం,సిమెంట్ ఉపయోగించ లేదు. మూడవ ఆశర్యం88 టన్నుల భారీ గోపురం    ఈ ఆలయం పై ఉంచబడింది.

 రాతితో చెక్కబడిన ఈ గోపురం రాయి యొక్క పరిమాణం మరియు సాంద్రత ఆధారంగా, శాస్త్రవేత్తలు దాని బరువును కనీసం 88 టన్నులుగా నిర్ణయించారు.  ఈ 88-టన్నుల గోపురం (క్యాప్ స్టోన్) ను 216 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా ఏ టెక్నాలజీని వ్యవస్థాపించారు అనేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణ శాస్త్రవేత్తలకు ఈ పజిల్ పరిష్కరించబడలేదు.  ఎందుకంటే ఈ రోజు వెయ్యి సంవత్సరాల ముందు, క్రేన్లు లేదా అలాంటి ఇతర యంత్రాలు కనుగొనబడలేదు.  అయినప్పటికీ, 88 టన్నుల బరువును 66 మీటర్ల ఎత్తుకు ఎత్తే సామర్థ్యం ఉన్న క్రేన్ ఇప్పటికీ ప్రపంచంలో నిర్మించబడలేదు.

 విలక్షణమైన వాస్తుశిల్పానికి పేరుగాంచిన బృహదీశ్వర శివాలయం 1,30,000 టన్నుల గ్రానైట్ నుండి నిర్మించబడింది.  ఈ ప్రాంతం చుట్టూ గ్రానైట్ కనిపించకపోగా, ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ ఎక్కడ తీసుకువచ్చారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.

*ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ



1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .
4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .
7. పునర్వసు - లక్ష్మి గణపతి.
8. పుష్యమి - మహ గణపతి.
9. ఆశ్లేష - విజయ గణపతి.
10. మఖ - నృత్య గణపతి.
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర - ఏకాక్షర గణపతి.
13. హస్త - వరద గణపతి .
14. చిత్త -  త్య్రక్షర గణపతి.
15. స్వాతి - క్షిప్రసాద గణపతి.
16. విశాఖ - హరిద్ర గణపతి.
17.అనూరాధ - ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి.
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట - త్రిముఖ గణపతి.
24. శతభిషం - సింహ గణపతి.
25. పూర్వాభాద్ర - యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి.
27. రేవతి - సంకట హర గణపతి.         

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము.

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది.    పై గణపతులు మరియి నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకో గలిగితే ద్వాదశ భావాలు యెక్క   రహస్యం అర్దం అవుతుంది.

ఆనందం అంటే.


ఆనందం 3 రకాలుగా చెప్పుకోవచ్చు ....

1. భౌతిక ఆనందం
2. మానసిక ఆనందము
3. ఆధ్యాత్మిక  ఆనందం

1. భౌతిక ఆనందానికి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి..

🔅 సరి అయిన ఆహారం తీసుకోవడం
🔅 సరి అయిన విశ్రాంతి తీసుకోవడం
🔅 సరి అయిన  వ్యాయామం చేయడం

2. మానసిక ఆనందానికి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

🔅 కోరికలని తగ్గించుకోవడం
🔅 కోపాన్ని , ఈర్షని తగ్గించుకోవడం
🔅 నిరాశ లేకుండా , తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండడం.

3. ఆధ్యాత్మిక ఆనందం పొందాలంటే..

🔅 ప్రతి విషయానికి మానసిక విషయాలు ఆలోచించడం.
🔅 వర్తమాన విషయాలు మనసులోకి రానివ్వకుండా ఉండాలి.
🔅 ఆనందకారలను గుర్తుంచుకోవడం, దైవశక్తి మీద నమ్మకముంచడం.

🔅 భవిష్యత్తు పై మంచి నమ్మకం ఉంచుకోవడం.
🔅 నిరాశ జనకమైన అంశాలు మరచి పోవాలి. ప్రస్తుత అంశాలపై ఒక అవగాహనతో ఉండడం. అతిగా ప్రేమించకూడదు.
🔅 అతిగా ఎవరని ద్వేషించకూడదు. వాటిని ఆయా సందర్భోచితంగానే పరిగణించాలి.
🔅 తోటి మానవులతో కలిసి ఉంటూ మనకి వీలైన సాయాన్ని అందిస్తూ ఉండాలి.
🔅 ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి సమతుల్యానికి ప్రయత్నించాలి.
🔅 మనము నమ్మిన దైవాన్ని ఆరాధిస్తూ ఆనందం పొందాలి.
🔅 ప్రతిరోజూ మనకు తప్పకుండా ఆనందం కలిగిస్తుంటుంది అనుకోనే వ్యాయామము దేనినైనా చేస్తుండాలి. (యోగ, నడక, క్రీడలు వంటివి)..

         🙏 సర్వేజనా సృజనో భవంతు  🙏

ధనలక్ష్మి ఏమంటుంది.


 నన్నుబంధించి బలైపోకండి అంటుంది.

"ఓయీ మానవులారా ! మీరందరూ నన్నెంతో భక్తిశ్రద్ధలతో  కొలుస్తున్నారు. నన్ను మీఇంటికి రమ్మని, ధనరాశులతో సిరులపంట  పండించమని వేడుకొంటున్నారు, మీ ప్రార్ధన కాదనలేక నేను మీ ఇళ్ళకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను. మీకు  బంగళాలు కార్లు, తోటలు, మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను.

ఆ తరువాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు, నన్ను మీ ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో, బంగారం రూపంలో బంధించాలని ప్రయతిస్తున్నారు. ఎల్లప్పుడూ నన్ను మీ  బందీగా వుంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు.

  మీ అసలు స్వరూపం నాకు తెలుసుగానీ, నా అసలు స్వరూపం మీకు తెలియదు. మీ నిజ స్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను. మీరు తల్లి గర్భంనుండి వచ్చేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకురారు. తిరిగి భూమిగర్భంలోకివెళ్ళేమరణయాత్రలో కూడా ఒక్క పైసాతీసుకుపోలేరు.

రోజు మీ కళ్ళముందు చనిపోయే ఎందరెందరో కోటీశ్వరులను, జమీందారులను చూస్తూ కూడా,  రేపు మన దుస్థితి కూడా అంతే కదా, అనే అసలు నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా | పోతుంది. ఇది మీరు తెలుసుకోలేని మీ నిజ స్వరూపం.

ఇకనాస్వరూపం గురించి చెబుతాను. నేను ఎవరి దగ్గర ఎప్పుడూ నిలకడగా వుండను, ఆది నా ధనరూపం యొక్క | సహజగుణం, ఒకచోటి నుండి మరో చోటికి తరలి పోవటమే నా ధర్మం. అది మిమ్మల్ని నన్ను సృష్టించిన ఆ పర్వమేశ్వరుని లీలా వినోదం. నన్ను బంధించాలని చూసిన ప్రతి వాణ్ణి, దొంగల ద్వారానో, దాయాదుల ద్వారానో, ఇన్ కంటాక్స్ వారి ద్వారానో కొల్లగొట్టించి నేను బయట పడుతుంటాను.

అయితే దేవుడు నాకొక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటంటే నేను కొందరి దగ్గర ఎల్లప్పుడూ శాశ్వతంగా వుండే అవకాశం. . అలా నేను ఎవరి వద్ద స్థిరంగా వుంటానంటే, “ఎవరు నా ధనకటాక్షంతో విర్రవీగకుండ, అహంకారులు కాకుండ, ధనమదంతో సాటి  మానవులను హింసించకుండ, తమ అవసరాలకు మించిన ధనాన్ని పుణ్యకార్యాలకు, దైవకార్యాలకు, ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తూ వుంటారో, వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి వద్దనే నేను శాశ్వతంగా వుండిపోతాను. వారి కుటుంబాన్ని | వెయ్యికళ్ళతో కాపాడుతుంటాను.


ఇప్పుడు నా నైజం మీకు అర్థమైంది కాబట్టి నన్ను బంధించి బలైపోకుండ, నన్ను మంచి కార్యాలకు వినియోగించి జీవితాలను చరితార్థం చేసుకోమని సలహాలిస్తున్నాను. వింటే మీతో వుంటా - లేదంటే టాటా చెప్తా  పారాహుషార్, ....
👏👏👏👏

🪔మరణంలో స్మరణ 🪔



పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.

ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు.

వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,
దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.

ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.

ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.

ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.

ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!

రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
 జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.

మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు,

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.

మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.

తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.   నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.

ఇలా కొంతకాలం గడిచింది.

దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”

బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే:

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం !
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

🙏ప్రశ్న : “యోగభ్రష్టత్వం అంటే ఏమిటి?”🙏



 🌷పత్రీజీ :

👉సరియైన ధ్యాన సాధనను విశేషంగా చేసిన ప్రతి ఒక్కరికీ అపరమితమైన శక్తి సామర్థ్యాలు సంక్రమిస్తూ ఉంటాయి.

👉తద్వారా వారు ఏది కోరుకుంటే అది ప్రాపంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా సునాయాసంగా కలిసివస్తూ ఉంటాయి.

👉“ప్రాప్తి” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధుల వల్ల మనం గర్వం, అహంకారం మరి డంబాతిశయాలను పెంచుకుంటే .. అది మన ఆధ్యాత్మిక మరి ప్రాపంచిక పతనాలకు దారితీసి మనల్ని యోగభ్రష్ఠుల్లా మలిచి మరు జన్మల్లో మరింత క్లిష్ట పరిస్థితుల్లో జన్మతీసుకునేలా చేస్తుంది.

👉అలా కాకుండా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు సంక్రమిస్తోన్న సిద్ధుల పట్ల ఎరుకతో కూడిన సమదృష్టిని కలిగి ఉండాలి!

👉కోరుకున్నవైనా .. లేదా అనాలోచితంగా నైనా సరే .. మనకు సంప్రాప్తిస్తోన్న అద్భుత ఫలితాలు పట్ల కృతజ్ఞతతో కూడి ఉంటూ గర్వానికి లోబడిపోకుండా జాగ్రత్త వహించాలి.

👉అప్పుడే ఆత్మ తన పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది.
💐☘💐☘🙏☘🙏☘💐☘

శ్రీ ఆంజనేయ స్వామి

శ్రీ ఆంజనేయ దండకం
శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాస్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే
దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్దమై యేగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి
సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్
లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు
సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని
వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్
దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరమ శ్రీరమయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,
కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి,
రారనాముద్దునరసింహాయంచున్,
దయాదృష్టివీక్షించి,
నన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే !
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
—————————————————————————-
 హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.
హనుమంతుని ద్వాదశనామాలు
హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్
“రామ”నామ విశిష్టత
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో “రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు.
విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో చెప్పాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం ‘రామనామం
———————————————
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేస్తె ……….!!
గమనిక – ఈ పరిహారాల్లో దేన్నైనా… ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు
అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం
2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి
4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి
నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి
5. కోరికలు నెరవేరేందుకు
బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి
7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి
పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి
8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.
పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడు ….!!
హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు … ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
______________
ఉత్తరభారత దేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన ‘రామచరిత మానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధను సుపరిచితం చేసింది.

వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. అయితే అక్బర్ ఇవేమీ అంతగా పట్టించుకోలేదు.

ఇది ఇలాగ ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా… ఆమె అక్కడే ఉన్న  తులసీదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామనామ ధ్యానంలో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి ‘దీర్ఘసుమంగళీ భవ’ అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీదాస్‌కు విన్నవించుకుంది. అప్పుడు తులసీదాస్ `నా నోట అసత్యం పలికించడు రాముడు’…అని అంటూ.. అప్పుడు ఆయన వారి కమండలంలో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరుక్షణం అతను పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటన ప్రత్యేకించి తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపోసాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీదాస్‌ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది.

‘తులసీ దాస్‌మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట?’ అని పాదుషా ప్రశ్నించారు. అందుకు తులసీదాస్ ‘అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు..’ అని బదిలిచ్చాడు. మరల పాదుషా ‘ సరేమేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము ..దానికి ప్రాణం పోయండి.. రామ నామంతో బతికించండి.. అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము’ అని సమాధానం చెబుతాడు. అందుకు తులసీదాస్ ‘క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.. అని సమాధానం చెప్పాడు. మరల పాదుషా ‘ అయితే తులసీ దాస్ జీ! ఈ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి!’ అని అంటాడు. అప్పుడు తులసీదాస్ ‘క్షమించండి నేను చెప్పేది నిజం!’ అని బదులివ్వడంతో పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ‘తులసీ  మీకు ఆఖరిసారి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో..నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో..’ అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీ రామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసీదాస్ ని బంధించమని ఆదేశించాడు.

అంతే ! ఎక్కడ నుండి వచ్చాయో..కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్‌ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు.

ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్‌కు సింహద్వారంపై హనుమంతులవారు దర్శనం ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ ..  తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో. అన్నారు..అందుకు తులసీదాస్ తండ్రీ! నాకేమి కావాలి.! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకుంటాడు.  ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ ‘తులసి ! ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము’ అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు హనుమాన్ చాలీసా కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది శ్రీ రామ జయ రామ జయ జయ రామ.


శ్రీమదాంజనేయ కల్యాణము
శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.
ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది.
విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , ” ఆ కన్య ఎవరు ? ” అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.
బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , ” గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి ” అంటాడు.
” శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను… విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ ” అంటాడు సూర్యుడు.
హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , ” దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? ” అని అడుగుతాడు.
సూర్యుడు ఉత్తరమిస్తాడు , ” సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది. ”
సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి.. [ ఈ నెల పదునాలుగో తారీఖు..మంగళ వారమే కావడము విశేషము ]
ఆ దినము ఉత్తరా నక్షత్రము ఉండినది.
హనుమంతుని కల్యాణము ఆనాడు చేయుట ఆనవాయితీ అయినది. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.
భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక
|| శుభమస్తు ||
______________
ఆంజనేయస్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు…..!!!
స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు.
హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి?
……………………………………………….
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.
‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
”యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు”
అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
* అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
* మంగళ వార సేవ
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.
* శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
* పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
* హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.
శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.
______________

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు -



     కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.

 రహస్య సూక్తులు  -

 * రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.

 * ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.

 * మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.

 * నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను

 * వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను

 * పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .

 * భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.

 * గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.

 * శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.

 * ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .

 * రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .

 * అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.

 * కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .

 * అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.

 * ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.

 * విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.

 * పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.

 * మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .

 * ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .

 * రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .

 * అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .

 * వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .

 * నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

 * పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .

 * ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .

 * దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .

 * ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .

 * ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .

 * చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం

 * మినుములు అతిగా వాడరాదు.

 * వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.

 * చవిటి ఉప్పు మంచిది కాదు.

 * గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.

 * పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.

 * దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.

 * మలమూత్ర వేగములను ఆపరాదు .

 * ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.

 * హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .

 * స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .

 * విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.

 * గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .

 * ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .

 * నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును

 * నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .

 * తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .

 * కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.

 * ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .

 * ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .

 * మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .

 * అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .

 * నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .

 * పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .

 * స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.

 * ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .

 * బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .

 * నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.

 * గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .

 * మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

 * పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .

 * సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .

 * రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.

 * మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .

 * స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .

 * బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .

 * నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .

 * భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.

 * మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .

 * అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .

 * ముక్కుతో శబ్దం చేయకూడదు .

 * పళ్ళు కొరకకూడదు .

 ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరొగ్య సూక్తులు  - 2 .

 * ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .

 * రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .

 * రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .

 * రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .

 * ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.

 * స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి  నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .

 * రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.

 * దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.

 * నిద్రనుంచి లేచిన వెంటనె మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన యెడల జలుబు చేయును . ఫలములు తీసుకున్న వెంటనె కూడా నీటిని సేవించరాదు .

 * వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.

 * అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.

 * రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.

 * బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.

 * కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.

 * అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.

 * మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .

 * నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.

 * బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .

 * శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .

 * మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.

 * సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.

 * మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.

 * అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.

 * చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.

 * భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును

         
     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది.  రక్తం నందు మార్పు  సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.  ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .


   గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది వెల  - 350 రూపాయలు .

      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384    పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు  .

      కొరియర్ చార్జీలు 50 రూపాయలు కలుపుకుని మొత్తం 850 రూపాయలు .

    ఈ రెండు గ్రంథాలు కావలసినవారు  గూగుల్ పే లేదా ఫొన్ పే లేదా పేటియం ఇదే నంబర్ 9885030034 కి పంపించి ఇదే నంబర్ కి whatsup నందు స్క్రీన్ షాట్ పెట్టి మీ పూర్తి అడ్రస్ పంపగలరు.

               కాళహస్తి వేంకటేశ్వరరావు

           అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు🙏🙏 కాశీ స్మరణం సదా మోక్షకారకం 🙏🙏

జై శ్రీరామ్
మీ హరి
                     

         🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ఈరోజు జీవిత సత్యం. 👉ప్రశ్నించాల్సిన మీ పెద్దరికం ఏమౌతోంది????👈



                             
💥నాలుగు గోడల మధ్య వేసుకోవలసిన

దుస్తులను పదిమందిలో వేసుకుంటూ

దాచుకోవలసిన వాటిని వదిలేస్తూ

దాపరికం లేని వలువలకు

విలువలు నేర్పించాల్సి వచ్చినప్పుడు

నీ పెద్దరికం ఏమౌతోంది????

💥పుట్టినరోజు లంటూ...అర్ధరాత్రి పన్నెండు వరకు

మేలుక్కూర్చుని....దెయ్యాలు తిరిగే సమయంలో

దీపాలు ఆర్పుకుంటూ..కేకుల ఫలహారాలుభుజిస్తూ...

ఎంగిలి పదార్థాలు పంచుకొంటూ..

ఇంగ్లీష్ వాని లెక్కల విషమసంస్కృతి లో

తానాలు ఆడుతుంటే ఇది కాదు

మన సంప్రదాయం అని చెప్పడానికి

నీ పెద్దరికం ఏమౌతోంది?????

💥పేరంటాలకు... శుభకార్యాలకు

ఆప్తులు పిలిచినప్పుడు...సాకులు వెదుకుతూ..

సంబంధాలు మర్చిపోతూ..నేటి తరం పరుగులు తీస్తూంటే..

సరిదిద్దవలసినది పోయి..

నీవు కూడా వత్తాసు పలుకుతూ..చతికిల బడిపోతే

నీ పెద్దరికం ఏమౌతోంది????

💥ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి

గుక్కెడు నీళ్లు ఇవ్వాలని తెలియని

చేతులకు.. చేతలు నేర్పవల్సి వచ్చినప్పుడు..

సంస్కార దీపాలకు చెయ్యొడ్డి  నిలవాల్సినప్పుడు..

మౌనంగాఉంటున్నావు..నీ పెద్దరికం ఏమౌతోంది????

💥వాట్సాప్ లంటూ... ఫేసుబుక్ లంటూ

నిశాచరుల్లా రాత్రి అంతా మేలుక్కూర్చుని

పగలు పన్నెండు అయినా పడకగది వదలకుండా

రాక్షస స్నానం చేస్తూ.. అదీ కుదరకపోతే

రెండు కాకిమునకలు వేస్తూ వేళాపాల లేని

వెర్రితనానికి నడకలు నేర్పడానికి

నీ పెద్దరికం ఏమౌతోంది????

💥మేము ఇంత సంపాదిస్తున్నాం...అంత సంపాదిస్తున్నాం...

ఒళ్ళంతా ముక్కలు చెక్కలు చేసుకుంటున్నాం .... అంటూ...భజంత్రీలు మోగించుకుంటూ..

మమతానురాగాలకు తలుపులుమూస్తుంటే..

ఇదికాదు మన జీవన విధానం అని చెప్పడానికి..

మాననీయ బంధాలు నిలపడానికి..

గొంతు విప్పాల్సిన తరుణంలో..

ఎందుకు సర్దుకుపోతున్నావు..

నీ పెద్దరికం ఏమౌతోంది????

💥ఇంటికి పట్టిన దుమ్ము.. ధూళి ని

వదలకొట్టే చీపురు ని పనయ్యాక

మూల న పెడతాం...దానికి

ఒక తృప్తి ఉంది... మూల న పెట్టినా

కనీసంఇంటిని శుభ్రం చేసాను అని..

మలిన మవుతున్న మనసుల్ని

ఉతికి ఆరేయ్యకుండా..

ఒంటికి పట్టిన గబ్బు ని వదిలించకుండా

ఊరికే మూలన కూర్చోవడానికి..

నీ పెద్దరికం ఏమౌతోంది????

💥సిగ్గుపడు అని.. మేల్కొల్పడం లేదా..

చీపురు పాటి పనికుడా నీవు చెయ్యలేవా

అని ప్రశ్నించడం లేదా...!!!

ఏమౌతోంది.. నీ పెద్దరికం????

నా మాట ఎవరూ వినరు-నా పెద్దరికానికి విలువ ఇవ్వరు అని ఆత్మవంచన చేసుకోకు- నీవు పద్దతిగా నడచి చూపిస్తే -ఏదొ ఒక రోజు నీ దారిని వారుకూడా ఇష్టపడుతారు-వారికి సరైన రీతిలో సమాధానం చెప్పిన జ్ఞానివి అవుతావు.

నీవల్ల భారతదేశం కొన్ని తరాల జ్ఞానం -కొత్త తరాలకు అందివ్వలేకపోయింది-పిల్లలు ఆత్మన్యూనతలో పడి -పాశ్చాత్య సంస్కృతి గొప్పదనుకుంటున్నారు

నీవు సంపాదన యావలోపడి-భగవద్గీతను -పురాతన ఆరోగ్య సామెతలను,నీతి కధలను,ప్రేమను పిల్లలకు అందించడం మరిచావు- సామాజిక సేవనూ మరిచావు-చివరలో ప్రపంచమంతా స్వార్దమయం అయిపోయిందని-నా భాదలను పట్టించుకోవడం లేదని ఏడుస్తున్నావు-

లే.....లేచి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఫలితం ఆశించని యోగిలా
ఇప్పటికైనా ప్రయత్నించు....🐽🐽🐽

ఏరిన ధ్యాన జ్ణాన రత్నాలు

"మహనీయులంతా బోధించిన సత్యం ఏమంటే,దేవుడి కోసం ప్రేమ,అందరిలో ఉన్న దేవుడి పై ప్రేమ ఉంచాలి".
"ధ్యాన సాధన  ద్వారా కర్మ ఫల తీవ్రతను  కొంత మేర తగ్గించు కోవచ్చు."
"మీ జీవితం లో సంపూర్ణత్వాన్ని సాధించుకోవడం కోసం ,మీరు మీ జీవితాన్ని పొడిగించుకోవచ్చు."
"నీ  ప్రతీ పనిని ధ్యానం  తోనే ఆరంభించు.నీ ప్రతి రాత్రి ధ్యానం తోనే ముగించు."
"ఎవరికి వారే పరీక్షించుకోవాలి.ఎవరికి వారే మార్కులు వేసుకోవాలి."
"మీ ద్వారా జరిగే ప్రతి పనికి ,నిజమైన కర్త 'భగవంతుడే'!
" నీపై విమర్శలు వచ్చినపుడు,నిన్ను నీవు విమర్శించుకొని,పరిశీలించుకోవాలి.నిన్ను నీవు సరిదిద్దుకోవాలి".
"ప్రతి క్షణం అంతరంగ సూచనలు వింటూ, పనులు చేస్తుంటే,సరైన గురువుల దగ్గరకు,సరైన టీచర్ల ,దగ్గరకు,సరైన డాక్టర్స్ దగ్గరకు వెళ్లగలము."
"అంతర్ లోక ప్రవేశానికి 'కీవర్డ్'ధ్యానం.meditation మాత్రమే మన మాస్టర్ కార్డ్."
"ధ్యానం నేర్చుకోవడం ,నేర్పించడం అనేది ప్రపంచానికి అందిన గొప్ప బహుమతి ."

ఎవరి ప్రాణం ఎపుడూ పోవాలి ఏ సాకుతో పోవాలి ముందే నిర్ణయింప బడి ఉంటుంది.  చావు రావాల్సి ఉంటే ఏ విధంగా నైనా వస్తుంది.సాకు కావాలి అంతే
"ప్రకృతి కున్న మెలి ముసుగును తొలగించి,దైవాన్నీ దర్శింపజేసే అంతర్దృష్టి,ధ్యానం వలన కలుగుతుంది."
"పువ్వులు ,చెట్లు వాటి సౌందర్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి".
" నీపై విమర్శలు వచ్చినపుడు,నిన్ను నీవు విమర్శించుకొని,పరిశీలించుకోవాలి.నిన్ను నీవు సరిదిద్దుకోవాలి".
"ఒక ఇసుక రేణువు ను కూడా  దాని విలువ  తెలుసుకొని,మెచ్చుకోవాలి."
"ఈ 'నేను'అన్నది మరణించగానే',నేను అనేది ఎవరు?అనితెలుసుకుంటాము."
"ఏలోకంనుంది వచ్చామో,ఈ లోకానికి ఎందుకు వచ్చామో ధ్యానం ద్వారా తెలుసుకొని,గమ్యం చేరుకుంటాం."
" ఎవ్వరి  చేత పుట్టింప బడని అనాహత ధ్వని "ఓంకారం ".
"అందరిలో   మంచిని   చూడటం నెర్చు కుంటే,అది మీలో పెరుగుతుంది."
"సాధన,వైరాగ్యాలు మాత్రమే మనం కొరదగిన సంపదలు."
"అనేక జన్మల  తర్వాత,ఒకానొక ఆత్మ తనను తాను తెలుసుకుంటుంది."
"ఆధ్యాత్మిక జీవనానికి మితి మీరిన తిండి ఆటంకం అవుతుంది.",
"జన్మ పరంపర గురించి తెలుసుకోవడానికి అందరూ విధిగా ధ్యానం  చేయాలి."
" నోట్లో శని "అంటే 'తిన కూడనివి తినడం,మాట్లాడే కూడనివి  మాట్లాడటం '.
" పిరమిడ్ నిర్మాణాలు భూకంపాలు... ఇతర ప్రకృతి వైపరీత్యాల  ను తన ప్రకంపనల ద్వారా సమతుల్యత లోకి  తెస్తాయి."
"జ్వలించే తపన ఒకటే సాధన కావాలి"
"ధ్యాన సాధన చేయండి...ధ్యానం బోధించండి...ధ్యానం వ్యాప్తి చేయండి."
"ఉన్నకళ్లు ముసుకుంటే,లేని కళ్ళు తెరచుకొంటే,చీకటి మాయం అవుతుంది వెలుగు వస్తుంది.'
"సదా ట్రూత్ ఫుల్ గా ఉంటే,సదా యూత్ ఫుల్ గా వుంటారు.ఈ సత్యాన్ని చిన్న వయసు నుండి తెలుసుకుంటే,మంచిది ."
"  విశ్వ వికాసం కోసం ధ్యానం చేసే వారికి ,పునర్జన్మలు ,కర్మ బంధాలు ఉండవు."
"అసహ్య భావం ఉండటమే అసహ్యం
ద్వేషం ,అసహ్యం తీసివేయడానికే ధ్యాన  సాధన."
"లింగాష్టకం -అబిషేకం అంటే,ధ్యానం ద్వారా, కాస్మిక్ ఎనర్జీ ని బాడీ కి ఇవ్వటమే ".
"మనసు పరమాత్మ మీద ఉంచ గల్గితే ,ధ్యానం చేయ గలిగితే ,మాయ,భ్రాంతి ఉండవు."
" ఎవరు ఏమి చేసినా ,అది మంచి ,చెడు  ఏదయినా భవిష్యత్తుకు   కేటాయించబడుతుంది."
"ప్రతి ఒక్కరి తో ఎంత అటాచ్ డ్ గా వుంటామో  అంత డిటాచ్డ్ గా ఉండాలి".
నిజస్వరూపాలు బయట పడటం ఎందుకు ?అవసరం లేదు కదా మనం పాసిటివ్ గా స్పందించాలి
మనల్ని తిట్టినా , మనం మనసులో వారిని క్షమిస్తాం.మనము ముందు జన్మ లో వారిని అంతకన్నా ఎక్కువగా బాధ పెట్టి ఉన్నాము ఇపుడు వారు మనల్ని బాధ పెడుతున్నారు.బాలెన్స్ అయిపోయినందుకు  సంతోషించాలి కర్మ సిద్ధాంతం కారణం తెలిస్తే మనల్ని బాధ పెట్టిన వారిపై మనకు కోపం రాదు.అందుకే ఈ మాలినాలు ఈ కల్మషాలు మనం మోసుకునే  బరువులు
ఇవన్నీ  మళ్ళా జన్మకు మరలా మరలా మనతో వస్తుంటాహు.ఇపుడే ఆ మురికి వదిలించుకోవాలంటే ధ్యానం చేయాలి మన గుణాలు మారుతాయి.ప్రతీకారం చేయాలన్న భావాలు మారిపోయి,అవతలి వారిని క్షమిస్తాం
 ధ్యానాన్ ముక్తిహి అంటే ధ్యానం ఇలాంటి బాధలనుంది మనకు విముక్తి  ప్రసాదిస్తుంది.ఎందుకంటే మన జీవితం ఆనందంగా వుండడము కోసమీ.ఎవరు తప్పు చేయరు.కేవలం వారికి ధ్యానం లేదు అందుకే ఆ స్థాయి లో వారుంటారు
అంతే !,ధ్యానము చేసేటపుడు ఫ్యాన్ , ఏసీ కూడా వేసుకోవచ్చు.మనసు ధ్యానం పట్ల శ్రద్ధతో ఉండటం ముఖ్యం
ధ్యానం చేసేటపుడు ఆలోచనలు వస్తుంటాహు.మనసు శ్వాస మీద పెట్టుతుంటే కొద్దిసేపటికి ఆలోచనలు ఆగిపోతాయి.అదే ధ్యాన స్థితి
"పుట్టుక తో ఎవరూ బ్రాహ్మణులు కారు.బ్రహ్మజ్ఞానం పొందిన. వాళ్లే బ్రాహ్మణులు.'"
"గురువు ముందు  వినయం  నటిస్తూ,వారి వెనుక వ్యర్ధ ప్రేలాపన లు చేయడం ఆధ్యాత్మిక సాధన అనిపించుకో దు".
"ఎలాంటి చీకు,చింతా లేకుండా ,ప్రకృతిలో ఆనందంగా విహరిస్తూ ,అధ్మొన్నతి కీ పాటు పడటం ఆనందం."
"ధ్యానం వలన ,అత్తమామ లతో ,పిల్లలతో,తల్లి తండ్రులతో  అందరితో  సంబంధ ,బాంధవ్యాలు బాగుంటాయి."
"అడవి లో ,గుహలో,ఏకాంతం లో వుండీ,ఏమి తెలుసుకోగలమో,స్వంత ఇంట్లో వుండీ  తెలుసుకోగలం."
"ధ్యానం చేయటానికి బదులు ,తగవులు వేసుకుంటూ ,గడిపితే ,నీలోని సెక్తి సన్నగిల్లి పోతుంది."
"అహం   పుణ్యహమ్,పుణ్య క ర్ మో హాఁ,సంకల్ప రహితోహం...నేను పుణ్యాత్ముడి ని ,పుణ్య కార్యములు చేయు వాడిని ,సంకల్పాలు లె ని   వాడిని."
" నీ మనసు నిండా  విశ్వాసం నింపుకొని ,నీ ధ్యానం లో గురువు ను రప్పించు.శ్రమ లేకుండా దేవుడు నీ దగ్గరకు వస్తాడు."
"సంపూర్ణ సిద్ధి ఎవరు పొందాలన్నా గురువు ద్వారానే పొందాలి."
"ఒక  వ్యక్తి కి గురువు పట్ల ప్రేమ ,భక్తి భక్త ప్రహ్లాదుని కి ఉన్నట్లు ఉండాలి".
"  నేను ఇది చేయాలి.ఇది చేయ కూడదు.నేను ఇంతే చేయాలి  .అది  చేస్తే ఏమో ?!" ఇలాంటి అన్నిటి నుండి విడుదల పొంది ,ధ్యానం మీద మనసు పెట్టు.",
"గురుదయ తో నిండిన సెక్తి జాగృతం కాగానే ,ఆత్మ సర్వోత్తమ.శివుడిగా మారుతుంది."
"మీ సెరీరం జ్ఞాన దేవాలయం.నిర్వాణనికి ఉపయోగ పడుతుంది.దానికి పరిశుద్ధమైన ,శుభ్రమైన ఆహారం,అందమైన వస్త్రాలు ఇచ్చి  ,గౌరవం తో చూడాలి."
" ధ్యాన సెక్తి ప్రేరణ వల్ల భార్యాభర్తలు పరస్పరం  గౌరవం పెంపొందించుకుంటారు."
"దేవుడికి  చిల్లుల మనసు తో  ఏది సమర్పించి నా అది ఖాళీ గానే తిరిగి వస్తుంది.ధ్యానం తోనే  దానికి మరమ్మత్తు చేసి ,భగవంతుడి కి సమర్పించాలి."
"నిజంగా మనం వదిలి పెడుతుంది 'బంధాన్ని,సంపాదించుకుంటున్నది 'ముక్తి 'ని.చిల్ల  పెంకులను వదిలి పెట్టి ,వజ్రాలను    స్వీకరిస్తున్నాము."
"సరైన విధంగా మనసును గమనించే తీరులో ధ్యాన విజయం కలుగుతుంది."
"దేవ ,దానవులు దర్శించలేని దివ్య సాక్షాత్కారం  ధ్యాన సాధకులకు లభిస్తుంది."
"అద్వైత జ్ఞానమునే 'బ్రహ్మము,పరమాత్మ,భగవంతుడు 'అంటారు".
"మనలోనే పరమాత్మ అంతర్యామిగా ఉంటూ,మన పాప,పుణ్యాలను  లెఖ్ఖ వేస్తాడు అని   మర్చి పోకూడదు".
"కష్టాలకు ,సుఖాలకు ఎవరి కర్మలకు వారే బాధ్యులు ".
"ఆత్మ లో ఉండటం 'పవిత్రత'.ఆత్మ నుండి వేరుగా ఉండటం ' అపవిత్రత'.
"ఆధ్యాత్మిక అనారోగ్యమే 'అపవిత్రత '.ఆధ్యాత్మిక ఆరోగ్యమే 'పవిత్రత'.
"సత్యం గురించి,ఆత్మ విశ్వాసం తో చెప్పే మాటలు జ్ఞాన సుగందాలను వేదజల్లుతాయి."
"నువ్వెవరో తెలుసుకో.!అది తెలుసుకొంటే,సర్వాన్ని తెలుసుకున్నట్లే !".
"  జ్ఞాన జ్యోతి ప్రవేశించినపుడు,' దిగులు' మాయం అవుతుంది".
"జ్ఞాపకాలను వదలడం వల్ల 'జ్ఞాన ప్రాప్తి 'కలుగుతుంది."
"సంక్రాంతి అంటే విశేషమైన దివ్యజ్ఞాన ప్రకాశం."
"ఆత్మ స్థితి లో ఉండటం వల్లనే దుఃఖం  నుండి  విముక్తి లభిస్తుంది.
"ఎదో అవ్వాలి ,ఏదో కావాలి 'అనే కొరిక ఒక 'బంధం'.
"మనసు దేని  మీదా లేకుండా ఉండటమే "ఇంద్రియ నిగ్రహం"
"మరణం తర్వాత కూడా జీవితం ఉందని తెలుసుకోవడమె "జ్ఞానం "
"మమాత్మ సర్వ భూతాత్మ ..నాలో ఉన్న ఆత్మే అందరిలోనూ ఉంది-జ్ఞాన యోగం "
"బుద్ధి "..అంటే ఏది ధర్మం ,ఏది అధర్మం చెప్పేది."
"ధ్యానాని కి ఎంత సెక్తి ఉందంటే,అది రాయిని కూడా రత్నంగా మార్చగల దు".
"ఈ ప్రపంచం లో కల్తీ లేనిది ధ్యానం మాత్రమే .అది దేవుడి గుణాలను అందిస్తుంది."
"నీవు ఈ నాడు అనుభవించే భోగం నిన్న వేరొకరిది.రేపు మరొకరిది.".
"నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ,ఆ ధర్మమే నిన్ను ఏదో రూపం లో నిన్ను రక్షిస్తుంది."
"సర్వ  చింతలు ,సంకల్పాలు ఎవరైతే విడిచి పెడతారో వారే "ముక్తులు".
"నువ్వు పోయేంత వరకు ఇష్టంగా వాడిన వస్తువులు ,మమకారం చూపిన మనుషులు రారు.కానీ నువ్వు చేసిన పుణ్యఫలమే నీతో వస్తుంది."
"మనసు దేని  మీదా లేకుండా ఉండటమే "ఇంద్రియ నిగ్రహం".
"బుద్ధి "..అంటే ఏది ధర్మం ,ఏది అధర్మం చెప్పేది."
"సత్యాన్ని తెలుసుకోవటానికి ఆటంకాలుగా ఉన్న విగ్రహాలను సృష్టించాలనుకుంటున్న నీ మనసును విసిరి పారేయాలి."
"యుక్తాయుక్త విచక్షణతో జీవించడమే "ఆధ్యాత్మికత".
"మనిషి తన లో ఉన్న దైవాన్ని ధ్యాన సాధన తో చూడగలరు."
"రాత్ గఈ తో ,బాత్ గఈ.సోక్షమించడం మీన్స్ మర్చిపోవడం."