8, నవంబర్ 2018, గురువారం

ధ్యానం అంటే ఏమిటి? ఎలా చేయాలి :



ధ్యానం, ధ్యానం, ధ్యానం ఎందుకు చేయాలి? నా పనులన్నీ పక్కన పెట్టి చేయవలసిన అవసరం నాకేమి ఉంది. ఇప్పుడే నాకు వచ్చిన తొందర ఏముంది. నా వయసు ఇంకా 25+ కదా. ఇప్పుడు బాగా enjoy చేయాల్సిన వయస్సు. బాగా సంపాదించాల్సిన వయస్సు. ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వాటిని అన్నిటిని పక్కన పెట్టి ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత తొందర ఏమొచ్చింది? పైగా ఇంకా ఎన్నో భోగాలను అనుభవించవలసిన వయస్సు. ఇప్పుడే అన్ని వదులుకొని నా సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం నాకేమి వుంది. పైగా ధ్యానం లో కూర్చుంటే ఆలోచనల మీద ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇది మన వల్ల అయ్యే పని కాదు. అయిన నాకేమి అంత మించి పోయే వయసేమి రాలేదు కదా. అవును అండి. మీరు అలోచించినవి అన్నియు నిజాలు. పచ్చి నిజాలు.

కాని ధ్యానం ఒకప్పుడు (అంటే పూర్వ కాలంలో) చేసుకునే వాళ్ళు, వాళ్ళంతా అప్పుడు భగవంతుని దివ్య దర్శనాన్ని హృదయంలో దర్శించుకోవడం కోసం. కాని ఈ కాలంలో కూడా ధ్యానం చేసుకుంటున్నారు అయితే ఎప్పుడు అంటే ఆరోగ్యం బాగాలేక doctor దగ్గరికి వెళితే, అప్పుడు doctor గారు చెపితే  (లేక) చదువు మీద శ్రద్ధ నిలువలేక ఏకాగ్రత కోల్పోతుంటే (లేక) ఎవరో విదేశస్తులు మనకు సలహాలు ఇస్తే ఎందుకటే ఇప్పుడు మనం అంతా విదేశీ సాంప్రదాయాల మీద ఆధారపడివున్నాము కదా అందుకు ఎవరో చెపితే అప్పటి వరకు మనం దాని మీద concentrate చెయ్యం. ఇవి కూడ నిజాలే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన. కాని ధ్యానం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు చాలానే వున్నాయి, అవి శారీరకంగా మరియు మానసికంగా, రెండు విధాల ఉపయోగమే.  ఇప్పుడు చూడండి..35 సంవత్సరాల వయస్సుకే BP,షుగర్ మరియు గుందేపోట్లు వస్తుండడం చూస్తున్నాము.ఇదంతా మన మెదడు నుండి వచ్చే తప్పుడు సంకేతాల వల్లనే,.మన మెదడు సానుకూలంగా మనం పూర్తి ఆరోగ్యంగా జీవిత చరమాంకం వరకు మంచం లో పడకుండా ఆఖరి వరకు ఆరోగ్యంగా ఉండగల అద్భుత శక్తిని శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రక్రియ ద్వారా పొందవచ్చును.ఇదే కాకుండా ఆధ్యాత్మిక లాభాలను గూడ పొందవచ్చు. శరీరం క్రుంగి పోయి మనకు జబ్బులు వచ్చినప్పుడు కూర్చోవడానికే శక్తి లేనప్పుడు ధ్యానం ఏమి చేయగలం. కాబట్టి చిన్న వయస్సు నుండే ధ్యానం అలవాటు చేసుకోవాలి.అనగా మన దినచర్యలో భాగం చేసుకోవాలి.గుర్తుంచుకోండి.. ఒక గంట సేపు ధ్యానం 4 లేక 5 గంటల సేపు నిద్ర కు సమానం. ధ్యానం చేయడానికి సమయం లేదని ఎప్పటికి అనకండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి