8, నవంబర్ 2018, గురువారం

🙏 నా చేతిని సద్గురువు పట్టుకున్నాడు 🤝

ఒకసారి ఒక సాధువు తన శిష్యుడితో కలిసి తన/కుటీరానికి తిరిగి వెళుతున్నాడు. ఒక్కసారిగా బాగా వర్షం కురిసింది. నదిలో నీరు (మట్టం) పెరిగింది. తిరిగి వెళ్ళటానికి ఒకే మార్గం ఉన్నది. ఆ ఒక చిన్న వంతెన కూడా నీటిలో మునిగింది. గురువు శిష్యుడితో- “నీవు నా చేతిని పట్టుకో. దాటుదాము." అన్నాడు. కానీ శిష్యుడు పట్టుకోలేదు. గురువు మాటిమాటికీ చెప్పినా శిష్యుడు ఆ విధంగా చేయలేదు. అప్పుడు గురువే శిష్యుని చేతిని పట్టుకుని లాగుతూ నదిని ఆవలికి తీసుకొని వెళ్ళాడు. గురువు - “నా చేతిని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను! ఎందుకు పట్టుకోలేదు నువ్వు?” అని అన్నాడు. అప్పుడు శిష్యుడు- “ఓ గురుదేవా, నేను శక్తిహీనుడిని. దుర్బలుడిని. నాపై నాకు విశ్వాసం లేదు. ఒకవేళ నేను నీ చేతిని పట్టుకుంటే వదిలేసేవాడిని. కానీ నాకు నీ పై పూర్తి విశ్వాసం ఉంది. నీవు పట్టుకుంటే ఎప్పుడూ వదిలిపెట్టవు. అందువల్లే నేను నీ చేతిని పట్టుకోలేదు.” అన్నాడు.

గురువు ఒకసారి చేతిని పట్టుకుంటే గమ్యాన్ని చేరిన తర్వాత వదిలిపెడతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి