*మంచి నిద్ర…*
*మీ సొంతం..!*
➖➖➖✍️
*రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా?
````
*నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?
లేదా
*పీడకలలు భయపెడుతున్నాయా?
అయితే మన పురాణాలు చెప్పిన
ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..
పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే... ఎంతటి ఒత్తిడి అయినా మాయమై, వెంటనే గాఢ నిద్ర పడుతుంది!
ఆ శ్లోకం ఇదే:👇````
*"అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహాబలమ్ |*
*కపిలో మునిరాస్తీకః పంచైతే సుఖశాయినః ||"*````
*ఈ ఐదుగురి పేర్లే ఎందుకు తలచుకోవాలి?
(సింపుల్ లాజిక్):
*అగస్త్యుడు:
ఈయనను తలచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలికపడుతుంది. నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం అన్నం అరగక పోవడం, అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధులు తొలగిస్తుంది, వారు వాతాపి లాంటి రాక్షసుణ్ణే అరిగించుకున్నారు.
*మాధవుడు (విష్ణువు): పాలకడలిలో ప్రశాంతంగా యోగనిద్రలో ఉండే విష్ణువును తలచుకుంటే, మన మనస్సులోని అలజడులు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది.
*ముచుకుందుడు:
ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ నిద్రపోయిన రాజు ఇతను. ఇతన్ని తలచుకుంటే నిద్ర మధ్యలో అస్సలు మెలకువ రాదు.
*కపిల మహాముని:
ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన ధ్యాన నిద్ర. ఈ పేరుతో మనకు కూడా అలాంటి సుఖ నిద్ర పడుతుంది.
*ఆస్తీకుడు:
ఈ మునిని తలచుకుంటే పాములు, విష పురుగుల భయం ఉండదు. మనకు ఒక భద్రతా భావం కలుగుతుంది. నిద్ర పట్టక పోవడానికి ప్రధాన కారణం భయం, అది వీరి స్మరణ తో పోతుంది.
కాబట్టి భయాన్ని పోగొట్టి, ఆరోగ్యాన్ని,రక్షణను మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ ఐదుగురిని తలుచుకొని పడుకోవాలని పురాణ వచనం...✍️````
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀