5, జులై 2025, శనివారం

తులాభారం:-

 

తులాభారం:-


తమ కష్టాలు తీరి నప్పుడు, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు తులాభారం ఇస్తామని మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.


తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైనవి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.


గతంలో బరువుకు తగ్గ వస్తువును మోసుకుని వెళ్ళి సమర్పించేవారు. ఇప్పుడు తులాభారంలో కూర్చోబెట్టి కిలో చొప్పున ఆ వస్తువు రేటు చెల్లిస్తే మీకు రసీదు ఇస్తారు.అది హుండీలో వేస్తారు.


ఇప్పుడు రేట్లు :-

రూపాలు నాణేలు kg 202/-

రెండు రూపాయల నాణేలు kg 332/-

ఐదు రూపాయల నాణేలు kg 555/-

పంచదార kg 40/-

పటికబెల్లం kg 30/-

బెల్లం kg 38/-

బియ్యం kg 41/-(చివరి నాలుగు రేట్లు మార్కెట్ ని బట్టి మారుతుంటాయి)

ఉదాహరణకు మీరు 58 kgలు ఉంటే..మీరు ఐదు రూపాయల నాణేలు మొక్కుకుంటే 58*555=32,190/


**ఈ తులాభారం మహాద్వారం నుండి లోపలకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఎడమ చేతి వైపు ఉంటుంది. దీనిని ఎటువంటి టిక్కెట్ అవసరం లేదు.తులాభారం తరువాత మీరు దర్శనానికి వెళ్ళడమే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి