21, మార్చి 2024, గురువారం

*ఓం అనేది విశ్వ ప్రకంపన*.

*ఓం అనేది విశ్వ ప్రకంపన*.....

*ఓం శబ్దం అనడం కంటే ఒక కంపనం అనడమే సమంజసం. శబ్ధానికి మరియు కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తికి శబ్దానికి కూడా వ్యత్యాసం ఉన్నట్లే, శబ్దానికి కంపనానికి మధ్య వ్యత్యాసం ఉంది. శక్తి శబ్దంలా వ్యక్తం అవగలదు. అలాగని రంగులా, రుచిలా, వాసనలా, ఇలా ఎలాగైనా వ్యక్తం అవగలదు. ఎలాగైతే విద్యుచ్ఛక్తి కదలికలా, వేడిలా, కాంతిలా వ్యక్తమవుతోందో, అలాగే మీరు చూసి విని, గ్రహించే ఈ భౌతిక శరీరాలు, పదార్థాలు, విశ్వంలోని సృజనాత్మతకు, సృష్టించే క్రియాశీలకమైన శక్తి యొక్క భౌతిక వ్యక్త రూపాలు. ఇదే భగవంతుని సంకల్ప శక్తి.* 
*ఓం అనేది ఈ విశ్వ శక్తికి చిహ్నం. ఒక బిందువు నుండి అది అంతరిక్షం మరియు సమయాలలో ఈ విశ్వం యొక్క పరిమాణంలోకి విస్తరిస్తుంది. అది కేవలం రూపం లేని, ఊహించలేని, అతీంద్రియ శక్తి లేదా కంపనం నుండి, అది కళ్ళకు కనిపించేదిగా, ప్రత్యక్షమైనదిగా, తెలివైనదిగా, ఆలోచించ దగినదిగా మరియు సహేతుకమైనదిగా ఈ స్థూల విశ్వం మరియు మన స్వంత శరీరాలలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఓం అనే మంత్రం కేవలం పదం మాత్రమే కాదు, దాని కారణాలలో వ్యక్తిత్వాన్ని కరిగించడంలో మనస్సు యొక్క ప్రయత్నం కూడా.*........🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి