7, జూన్ 2020, ఆదివారం

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *-మాస్టర్ E.K.*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪2
                  
పౌర్ణమి రోజుల్లో మనస్సు వికలం కాకుండా ప్రశాంత స్థితిని పొందేలా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య రెండూ కూడా ధ్యాన సాధకులకు విశేషంగా శక్తి సమీకరణ సమయాలు ! నిర్మలమైన సమస్థితినీ, నిశ్చలధ్యానస్థితిలో స్థితమైనప్పుడు లోపల ఉండేది *"నేను"* మాత్రమే ! అదే ధ్యానం అంటే ! దీనినే *"ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి"* అంటారు.

పౌర్ణమి రోజుల్లో అల్పమైన పనులలో నిమగ్నం అవ్వడం అంటే .. అది మృత్యువు కన్నా హేయమైనది అని గ్రహించాలి. పౌర్ణమిరోజున ఉబుసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం వివేకవంతుల లక్షణం కాదు. ముఖ్యంగా పౌర్ణమిరోజునే అంతర్యామి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మస్వరూపం మనలోనూ, అందరిలోనూ పౌర్ణమి రోజు విశేషంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇతరులతో మనకు మనోహరమైన, లయ బద్ధమైన ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది.

పౌర్ణమి ధ్యానప్రభావం వల్ల నిత్యజీవితంలోని తొందరపాటు, గజిబిజి, గందరగోళం వంటి వాటిని అవలీలగా అధిగమించగలం.

పౌర్ణమి రోజున మీతో మీరు కూడీ వుండగలరు. మీతో మీరు కూడి వుండాలన్న ఆలోచనలతో అప్రయత్నంగా అవలీలగా సూక్ష్మశరీరయానం చెయ్యగలం. దివ్యలోకాలను సందర్శించగలం. విజ్ఞానమయకోశం పైనా, ఆనందమయకోశం పైన పూర్తిస్థాయి ప్రజ్ఞను సంపాదిచగలుగుతాం.

పౌర్ణమి ధ్యానసాధన వల్ల ముఖ్యంగా నాడీమండల శుద్ధీ, కుండలినీ జాగృతి అవలీలగా జరుగుతుంది. పౌర్ణమి రోజున మౌనం పాటించడం వల్ల *"టెలీపతీ"* పురోగతి సాధిస్తుంది.

ముఖ్యంగా ప్రతి ఒక్క ధ్యానసాధకుడు గుర్తించుకోవలసిన విషయం పౌర్ణమి రోజు రాత్రి ద్రవాహారం మాత్రమే తీసుకుంటే భౌతిక శరీరం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.🔺

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి